ap tet psychology Motivation – ప్రేరణ
ఒక వ్యక్తి తన గమ్యం చేరుకోవడానికి అతనిని ప్రోత్సహించే మానసిక శక్తి ప్రేరణ. అభ్యసనము లో ప్రేరణ ముఖ్య పాత్ర వహిస్తుంది. ప్రేరణ వ్యక్తిని ఎలాంటి పరిస్థితుల్లోనూ గమ్యం వైపు నడిపిస్తుంది.
Motivation అనే ఆంగ్ల పదం “మూవర్” అనే లాటిన్ పదం నుంచి గ్రహించబడినది. Movere అనగా కదలిక లేదా చలనం అని అర్థం.
ఫిషర్ : ప్రేరణ అంటే ఉద్రేకంతో చర్యవైపు మొగ్గుచూపే దిశా నిర్దేశమైన చర్య.
గిల్ ఫర్డ్ : జీవి ఒక పనిని ప్రారంభింపచేయడానికి కొనసాగించేటట్లు చేసే అంతర్గత శక్తి ప్రేరణ.
మేయర్ : ప్రకారం ప్రేరణ అనేది “గమ్యనిర్దేశక చర్య
కోల్ మాన్ : ఒక నిర్దిష్ట గమ్యం వైపు జీవి ప్రవర్తనను నిర్దేశించే అంతర్గత స్థితి ప్రేరణ.
కరోల్ : ఒక లక్ష్యం దిశగా పయనించుటకు అభ్యసించే ఒక స్పష్టమైన ప్రక్రియ ప్రేరణ.
మాస్లో : ప్రేరణ వ్యక్తి అవసరాలననుసరించి ఉంటుంది. వీటిని సంతృప్తి పరచుకొనే ప్రక్రియే ప్రేరణ.
క్రో&క్రో :ప్రేరణ అభ్యసనకు మూలాధారం.
ఉడ్వర్త్ : అన్ని ప్రవర్తనకు ప్రేరణ మూలాధారం
డెస్సికో : ఒక వ్యక్తి తన కృత్య నిర్వహణలో చూపించే ఉత్సాహాన్ని పెంచుటకు తగ్గించుటకు దోహదపడే కారకమే ప్రేరణ
బెర్నార్డ్ : ప్రత్యేక లక్ష్యాల వైపు చర్యను ఉత్తేజపరిచే దృగ్విషయమే ప్రేరణ.
2. ప్రేరణ రకాలు
1. అంతర్గత ప్రేరణ : ఒక పని చేయాలంటే ఎవరి బలవంతం లేకుండ చేయడాన్ని అంతర్గత ప్రేరణ అని చెప్పవచ్చు. ఉదా: విద్యార్థి తనంతట తానే పాఠశాలకు వెళ్ళడం అంతర్గత ప్రేరణగా చెప్పవచ్చు.
2. బహిర్గత ప్రేరణ : విద్యార్థి అవసరాలకుగాని, అభిరుచులకు గాని సంబంధం లేకుండా ఒక పని చేయడానికి సహకరించే ప్రతి ప్రోత్సాహకాన్ని బహిర్గత ప్రేరణ లేదా కృత్రిమ ప్రేరణ అంటారు.
ఉదా : విద్యార్థిని పొగడటం ద్వారా, అభినందిచడం ద్వారా ,గౌరవించడం ద్వారా అతన్ని లక్ష్యసాధనకు ప్రేరేపించవచ్చు
4.సాధన ప్రేరణ
2.సాధన ప్రేరణ :-మెక్లిలాండ్, అట్కిన్సన్లు సాధన ప్రేరణ మీద అనేక పరిశోధనలు నిర్వహించారు. ప్రముఖ సామాజిక విద్యా శాస్త్రవేత్త మైకెవర్ “ఈనాడు నేను ఈ స్థాయిలో ఉండటానికి కారణం రేపు ఏ స్థాయిలో ఉండాలో నేను నిన్ననే ఆలోచించుకొని ఉండటమే” అని అంటారు. ఈ వాక్యం నిజానికి సాధన ప్రేరణకు ఒక మంచి ఉదాహరణ.
సాధన ప్రేరణ – నిర్వచనం (TAT పరీక్ష ద్వారా సాధన ప్రేరణను అంచనా వేస్తారు)
లక్ష్యాన్ని సాధించేందుకు వ్యక్తికి అవసరమైన పట్టుదలను కలిగించే మానసిక శక్తిని సాధన ప్రేరణ అని చెప్పవచ్చు.
మెక్లిలాండ్, అట్కిన్సన్స్ ప్రకారం అనేక లక్ష్యాలతో సంబంధం ఉండి సాధారణంగా కొన్ని ఉన్నత ప్రమాణాలను సాధించాల ధ్యేయం వైపుగా కొనసాగింపజేసే చర్యలతో కూడిన ప్రవర్తనే సాధన.
ఇర్వింగ్ సార్నోక్స్ ప్రకారం వ్యక్తి తనకు వీలుకాని వస్తువులకు, పరిస్థితులకు సరైన విలువలు గుర్తించి ఎలాగైనా వాటిని తప్పక సాధించాలనే ప్రేరణ పొందడంమే సాధన ప్రేరణ.
5.ప్రేరణను పెంపొందించడం
విద్యార్థులలో సాధన ప్రేరణను పెంపొందించడం : –
విద్యార్థులు సాధించవలసిన లక్ష్యాలను ముందుగానే తెలియచేయాలి.
a) లక్ష్యసాధనకు అవసరమైన శక్తి సామర్థ్యాలను తెలుసుకొని తమ కాంక్షాస్థాయిని తగిన విధంగా పెంచుకొనేట్లు చేయాలి.
b) స్థిరమైన లక్ష్యాలను సాధించే సామర్థ్యాన్ని పెంపొందించాలి. ఆత్మ పరిశీలన, ఆత్మ విమర్శన శక్తిని పెంపొందించాలి.
c) సమాజంలో జరిగే సంఘటనలను వివరిస్తూ విద్యార్థులలో ఆత్మసైర్యాన్ని పెంపొందించాలి.
d) ప్రోత్సాహకాలు/ పునర్బలనాలు, (పొగడ్త- నింద) ఎక్కువగా పరిశోధన చేసిన వ్యక్తి ఎలిజబెత్ హార్లాక్.
పొగడ్త – నింద : రెండు సమర్ధవంతమైన ప్రోత్సాహకాలేనని ఎలిజబెత్ హర్లాక్ పేర్కొన్నాడు.
బహుమతి – శిక్ష: పొగడ్త – నింద మానసిక సంబంధమైనవి – బహుమతి – దండన, శారీరక సంబంధమైనవి.
పోటీ – సహకారం: పోటీ విద్యార్థుల మధ్య ఉన్న పోటీతత్వం ప్రేరణను కలిగిస్తుంది. అంతేకాదు ఉపాధ్యాయుల సహాయ సహకారాలు కలిగిస్తాయి
సాఫల్యం – వైఫల్యం :ఒక పరీక్షలో సాధించిన విజయం వేరే పరీక్షలలో రాణించడానికి ప్రేరణ కలిగిస్తుంది. వైఫల్యం ప్రేరణను తగ్గిస్తుంది.
కాంక్షస్థాయి :విద్యార్థి తన సామర్థ్యాలను బట్టి సాధించవలసిన లక్ష్యాలను నిర్దేశించుకోవడం వల్ల “సాధనా ప్రేరణను” పెంపొందించవచ్చు.
ఫలితాల జ్ఞానం :విద్యార్థుల ప్రగతిని ఎప్పటికప్పుడు తెలియజేయడం వలన వారిలో ప్రేరణ కలిగించవచ్చు.
దృశ్య – శ్రవణ పరికరాలు : ఉపాధ్యాయుడు ప్రక్షేపక పరికరాలు, దృశ్య – శ్రవణ పరికరాలు ఉపయోగించడం వల్ల ప్రేరణ కల్గి ఉంటాడు.
ఒత్తిడిని తగ్గించడం: విద్యార్థులను మానసిక వేధింపులకు గురిచేయకుండా ఒత్తిడి తగ్గించడం వల్ల ప్రేరణ కలిగించవచ్చు.
తరగతి గది – వాతావరణం: విద్యార్థులకు ఆహ్లాదకరంగా ఉన్నప్పుడు ప్రేరణ కలుగుతుంది.
శిశుకేంద్రిత విద్య: విద్యార్థుల సామర్థ్యాలు, అభిరుచులకు అనుగుణంగా శిశుకేంద్రిత బోధనా పద్ధతులు ఉపయోగించినపు విద్యార్థులలో ప్రేరణను కలిగించవచ్చు.
Also read : శాస్త్రీయ నిబంధన సిద్ధాంతం