APTET PSYCHOLOGY SYLLABUS IN TELUGU – మానవ వికాశ దశలు

YouTube Subscribe
Please Share it

APTET Psychology Syllabus in Telugu – మానవ వికాశ దశలు

మానవ వికాస దశలను ఎలిజబెత్ హర్లాక్ 10 దశలుగా వర్గీకరించడం జరిగింది. ఈయన Developmental Psychology అనే గ్రంథంలో ఈ దశల గురించి వివరించాడు.

1. 1.జనన పూర్వ దశలు : (Pre-Natul Stages): ( తల్లి గర్బంలోని మొదటి 9 నెలలు)

1)  జైగోట్ దశ/ బీజ దశ :(Zygote Stage):-

a).ఫలదీకరణ నుండి రెండు వారాల వరకు ఉంటుంది.

b), ఈ రెండు వారాల కాలంలో బాహ్య పోషణ లేని కారణంగా Zygote పరిమాణంలో మార్పు ఉండదు.

c) .Zygote పైపొర జరాయువు అమ్నియోటిక్ సంచిగా మారుతుంది.లోపలి పొర పిండంగా మారుతుంది.

2. ఎంబ్రియో దశ (Embrio):

a). ఈ దశలో పిండం చిన్న మనిషి ఆకారంలో ఉంటుంది. రెండు వారాల లోని రెండు నెలల వరకు ఎంబ్రియో దశ ఉంటుంది.

b). తల భాగంలో పెరుగుదల ఎక్కువగా జరిగి తరువాత ఇతర భాగాలలో జరుగుతుంది.

3. పిటస్ దశ: (PETUS)/బ్రూణ దశ:

b).ఈ దశ రెండు నెలల నుండి జననము వరకు ఉంటుంది. ఎంబ్రియో దశలో ఏర్పడిన భాగాలు బాగా అభివృద్ధి చెందుతాయి.

c). 7 నెలల నాటికి  పరిపక్వత చెందకుండా శిశువు జన్మించినప్పటి కీ బ్రతక గలిగినంత అభివృద్ధి జరుగుతుంది. సుమారుగా 9 నెలల 20 రోజులకు నవజాత శిశువు జన్మించడం జరుగుతుంది.

నవజాత శిశువు(0-2 వారాలు):-

a). జననం నుండి రెండు వారాల వయస్సు వరకు. అప్పుడే పుట్టిన శిశువు 18 లేదా 20 అంగుళాల పొడవు అనగా సగటున 19 అంగుళాల పొడవు ఉంటుంది.

b). పుట్టిన శిశువు 21/2 – 31/2 కి. గ్రాల బరువు అనగా సగటున 3 కిలోల బరువు

ఉంటుంది.పుట్టిన శిశువు సుమారుగా 6 నుంచి 8 పౌండ్ల బరువు ఉంటుంది.

c). నవజాత శిశువు దశలో పెరుగుదల కంటే “సర్దుబాటు” చేసుకోవడం జరుగుతుంది. పుట్టినప్పుడు శిశువు మెదడు వయోజననుని మెదడు బరువులో నాలుగో వంతు ఉండి సంవత్సరానికి సగం బరువు వరకు పెరుగుతుంది.APTET PSYCHOLOGY SYLLABUS IN TELUGU

1) శైశవ దశ:-(Infancy):

a) 3వ వారం నుండి 2 సంవత్సరాల వరకు శైశవ దశ ఉంటుంది. శైశవ దశ లోని మొదటి రెండు వారాల కాలాన్ని నవజాత శిశువు అంటారు.

b), ఈ దశలో పెరుగుదల ఎక్కువగా వేగంగా జరుగుతుంది. శిశువు పుట్టిన నాటికే మొదటి స్పర్శ అనే జ్ఞానేంద్రియం పూర్తిగా అభివృద్ధి చెంది ఉంటుంది. మొదటి రెండు వారాల కాలంలో శిశువు బరువు కోల్పోతాడు.

c). ఈ దశలో పాలదంతాలు ఏర్పడుతాయి. ఈ దశలో రోగాలు వచ్చే అవకాశం ఉంటుంది. ఈ దశలో బాల్య మరణాలు ఎక్కువగా సంభవిస్తాయి.

c). ఇక మానసిక వికాసానికి వస్తే ఈ దశలో వస్తువు శాశ్వతమైనది అని తెలియదు.

d). భాషా వికాసం లో భాగంగా ప్రాక్ భాషా రూపాలు (ఇంగితాలు, ముద్దు పలుకులు, సైగలు). ఈ దశలో యత్నదోష పద్ధతులు శిశువు ఉచ్చారణ నేర్చుకుంటాడు.

e).Emotion అనే ఆంగ్ల పదము Emovere అనే Latin అనే పదము నుంచి గ్రహించబడింది.Emover అనగా మనసు కలియ బెట్టబడిన స్థితి. శైశవ దశలో మొదట ఏర్పడే వికాసము ఉద్వేగ వికాసము.

f). నైతిక వికాసము :-ఈ దశలో అంతరాత్మ ఏర్పడదు ఏది తప్పు ఏది ఒప్పు తెలియదు.

2. పూర్వ బాల్య దశ:-

a).ఈ దశ 3 సంవత్సరాల నుండి 5 సంవత్సరాల వరకు ఉంటుంది. విద్యావేత్తల ప్రకారం పూర్వ బాల్య దశ ను, పూర్వపాఠశాల దశ అంటారు. మనోవిజ్ఞాన శాస్త్రవేత్తలు ఈ దశను పూర్వ ముఠా దశ అని అంటారు. అంతేకాదు ఈ దశను వాగుడుకాయ దశ అంటారు ఎందుకంటే ఈ దశలో పిల్లలు ఎక్కువగా మాట్లాడుతుంటారు. అంతేకాదు ఈ వయస్సును ప్రశ్నించే వయస్సు అంటారు.

b). ఈ దశలో చివరి నాలుగు పాలదంతాలు వచ్చేస్తాయి. అనగా మొత్తం 20 పాల దంతాలు ఏర్పడతాయి. ఈ దశలో మొదట ఏర్పడిన పాలదంతాలు ఊడిపోతూ, శాశ్వత దంతాలు రావటం ప్రారంభమవుతాయి.

c). స్వయం పోషక కౌశలాలు/చలనాత్మక నైపుణ్యాలు నేర్చుకోవడానికి ఈ దశలో సహజసిద్ధంత  ఏర్పడుతుంది. అనగా స్వయంగా తినడం, స్థానం చేయడం, బట్టలు వేసుకోవడం, లాంటి స్వయం పోషక కౌశలాలు అలవడుతాయి. ఈ దశలో కండరాల నియంత్రణ ఏర్పడటం వల్ల పిల్లలు సాహసాలు చేస్తుంటారు.

d). ఒక పని తప్ప, ఒప్పు, అనేది దండన వల్ల తెలుసుకుంటారు. ఈ దశలో అంతరాత్మ ఇంకా ఏర్పడదు. శిక్ష నుండి తప్పించుకోవడానికి శిశువు తన ప్రవర్తనను సమర్థించుకునే ప్రయత్నం చేస్తాడు.

c) బాలురు తల్లి యొక్క, బాలికలు తండ్రి యొక్క ప్రేమాభిమానాలు కోరుకుంటారని ఫ్రాయిడ్ తెలియచేశారు.

3. ఉత్తర బాల్య దశ (Late Childhood):-ఈ దశ 6 నుండి 12 సంవత్సరాల వరకు ఉంటుంది. ఈ దశ ను మనోవిజ్ఞాన శాస్త్రవేత్తలు”పాఠశాల దశ” అని పిలుస్తారు. మనోవిజ్ఞాన శాస్త్రవేత్తలు “ముఠా దశ” అని పిలుస్తారు. అంతేకాదు ఈ దశను బడాయిలు అనగా గొప్పలు చెప్పుకునే దశ అని అంటారు.

b). ఈ దశలో శాశ్వత దంతాలు ఏర్పడతాయి శరీర పెరుగుదల నెమ్మదిగా కొనసాగుతుంది.

c). ఈ దశలోని పిల్లల భాషా వికాసం లో అహం కేంద్రీకృతం ఎక్కువ.

c). మానవ దశ లన్నిటిలో కెల్లా సంతోషం ఎక్కువగా ఉండే దశ ఈ దశ. ఈ దశలో బహుమతులు ఆశించి కొద్ది వరకు నైతిక విలువలు పాటిస్తారు. ఏది ఒప్పు, ఏది తప్పు అనేది సందర్భాన్ని బట్టి నిర్ణయిస్తారు.

4) యవ్వనం ఆరంభ దశ :-

a) Puberty అనే ఆంగ్ల పదము puberitas అనే లాటిన్ పదం నుంచి గ్రహించబడినది. Puberitas అంటే మగాడు కావడం అని అర్థం. Pube అంటే Hair.

b). శైశవ దశ తర్వాత మానవ జీవితంలో అత్యంత పెరుగుదల గల దశ. ఉద్వేగ అస్థిరత ఎక్కువగా ఉండు దశ.

c). అమ్మాయిల్లో ఈస్ట్రోజన్, ప్రొజెస్టిరాన్, అనే హార్మోన్ ఉత్పత్తి అవుతాయి.

c). అబ్బాయిల్లో టెస్టోస్టిరాన్,యండ్రోజన్ అనే హార్మోను ఉత్పత్తి అవుతాయి.

b). పూర్వ యవ్వనారంభ దశలో గౌణ లైంగిక లక్షణాలు కనిపించడం ప్రారంభమవుతుంది. కానీ పునరుత్పాదక వ్యవస్థలో పూర్తిగా పరిపక్వత చెందదు.

d). యవ్వనారంభ దశలో లైంగిక పరిపక్వత వల్ల ఆడపిల్లలలో రుతుస్రావం, మగపిల్లలలో రాత్రి వేళలో వీర్యస్కలనం ప్రారంభమవుతాయి.

e). ఉత్తర యవనారంభ దశలో గోన లైంగిక లక్షణాలు బాగా అభివృద్ధి చెంది లైంగిక భాగాలు పూర్తి పరిపక్వత చెంది పని చేయడం ప్రారంభిస్తాయి.

e). యవ్వనారంభ  దశ అందరిలో ఒకే వయసులో ప్రారంభం కాదు. ఈ దశ వివిధ సంస్కృతుల ఆధారంగా వివిధ ప్రాంతాలలో వివిధ వయసులలో ప్రారంభమవుతుంది.

5). కౌమారదశ:- 

a).కౌమార దశ 13 సంవత్సరాల నుండి 21 సంవత్సరాల వరకు ఉంటుంది. ఈ వయస్సుని టీనేజ్ వయసు అంటాము. ఈ దశను Adolescence అని కూడా పిలుస్తారు. అంతేకాదు ఈ దశను కిషోరప్రాయ దశ అని కూడా పిలుస్తారు. ఈ దశను సందిగ్ద వయస్సు అని కూడా అంటారు.

b). కోహ్లేర్ ప్రకారము శారీరక, మానసిక, ఉద్వేగ, సాంఘిక, లైంగిక సమస్యలను అధిగమిస్తూ సర్దుబాటు చేసుకునే దశ ఈ కౌమారదశ.

c).స్టాన్లీ హాల్ ప్రకారం కొమర దశ ఒత్తిడి, ప్రయాస, కలత, జగడాలతో కూడుకున్న దశ. ఈ దశలో పిల్ల వాని వలే, లేదా వయోజనుల వలె ఉండవలెనా, అనే సందిగ్ధ స్థితిలో శిశువు కౌమారదశలో ఉంటాడు.

d). నాయకారాధన గల దశ, తను అభిమానించే వ్యక్తులను హీరోలు గ భావించి, వారిని ఆరాధిస్తారు. వ్యక్తి పూజ కనిపించే దశ ఈ దశ.

e). తీవ్ర నిరసన భావాలు కలిగి ఉండి సంఘాన్ని విమర్శించే దశ. ఈ దశలో సాంఘిక కార్యక్రమాలలో చురుగ్గా పాల్గొంటారు.

f). కౌమారదశ సమగ్రమైనది, ఎందుకంటే అన్ని వికాస అంశాలను సూచిస్తుంది. ఐతే యవ్వనారంబ  దశ సంకుచిత మైనది. ఎందుకంటే కేవలం శారీరక మార్పులను మాత్రమే సూచిస్తుంది.

Also read : భోదన పద్దతులు


Please Share it

Leave a Comment

error: Content is protected !!