Continuous Comprehensive Evaluation Telugu

YouTube Subscribe
Please Share it

నిరంతర సమగ్ర మూల్యాంకనం

నిరంతరం అనగా పిల్లల ప్రగతిని ఒక సంఘటసకో, సందర్భానికో పరిమితి చేయకుండా ఎల్లప్పుడు పరిశీలించట అని అర్థం. అనగా నిరంతరం పాఠశాల లోపల, వెలుపల ‘పిల్లల శారీరక, మానసిక వికాసాలను పిల్లల తెలియకుండానే పరిశీలించుట నే నిరంతరంగా మనం చెప్పవచ్చు.

సమగ్రం అనగా పిల్లల సర్వతోముఖాభివృద్ధి. అంటే పిల్లల శారీరక, మానసిక, నైతిక, ఉద్వేగ, సాంఘిక (జ్ఞానాత్మక భావావేశ + మానసిక చలనాత్మక రంగాలలో) అభివృద్ధి సాదించటం అని అర్థం. ఇది పిల్లల పెరుగుదల, వికాసాలు పాఠ్యాంశాల దృష్టితోనే కాకుండా వారి అభిరుచులు, వైఖరులు, వివిధ సామర్థ్యాలను కూడా పరిగణనలోకి  తీసుకుంటుంది.  

నిరంతర సమగ్ర మూల్యాంకనం అనగా ఇంగ్లిష్ లో  CCE  – Continuous Comprehensive Evaluation. అంటారు.

NCF అనగా National Curriculum Frame work 2005, 

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 2012-2013 విద్యా సంవత్సరం నుండి CCE ను అమలుపరుస్తున్నారు.

NCF మూల్యాంకనంలో భాగంగా ‘నిరంతర సమగ్ర మూల్యాంకనం’ (CCE) ను ప్రవేశపెట్టాలని సూచించినది.

CCE లో భాగంగా ప్రస్తుతం, ప్రాథమిక, ఉన్నత పాఠశాలల్లో జరుగుతున్న మూల్యాంకనాలు 2 రకములు.

అవి 1) నిర్మాణాత్మక మూల్యాంకనము (Formative Evaluation) / రూపణ మూల్యాంకనము

2) సంగ్రహణాత్మక మూల్యాంకనము (Summative Evaluation) / సంకలన మూల్యాంకనము. 

1).ప్రతి పాఠశాలలో ఒక విద్యా సంవత్సరంలో 4 నిర్మాణాత్మక మూల్యాంకనములు మరియు 3 సంగ్రహణాత్మక మూల్యాంకనము జరుగుతాయి.

2).ఈ విద్యా ప్రమాణాలను నిర్మాణాత్మక మరియు సంగ్రహణాత్మక మూల్యాంకనముల ద్వారా అంచనా వేస్తున్నారు.

3).తెలుగు, హిందీ, ఆంగ్లములలో 6 విద్యా ప్రమాణాలు, గణితంలో 5 విద్యా ప్రమాణాలు, విజ్ఞానశాస్త్రం (పరిసరాల విక సాంఘిక శాస్త్రములలో 6 విద్యా ప్రమాణాలను అంచనా వేస్తారు. ఇవికాక పాఠ్యేతర కార్యక్రమాలు అయిన కళలు – సంస్రుతిక విద్య, ఆరోగ్యము – వ్యాయామ విద్య, పని కంప్యూటర్ విద్య మరియు విలువల విద్య – జీవన నైపుణ్యాలలో ఒక్కొక్క దా ప్రమాణాలను అంచనా వేస్తారు.

4).ఇందులో ప్రాథమిక స్థాయిలో 8 అంశాలు (4 పాఠ్య + 4 పాఠ్యేతర) మరియు

5).ఉన్నత స్థాయిలో 10 అంశాలను  (6 పాఠ్య – 4 పాఠ్యేతర) మూల్యాంకనం చేస్తారు.

నిరంతర సమగ్ర మూల్యాంకన లక్ష్యాలు:

a).పిల్లల జ్ఞానాత్మక, మానసిక, చలనాత్మక, భావావేశ నైపుణ్యములను పెంపొందించటం మరియు మూల్యాంకనం చేయట, 

b).బట్టీ పద్దతిని నిరుత్సాహపరచి, విశ్లేషణాత్మక ఆలోచనలతో సొంతంగా అనుభవం ద్వారా జ్ఞాన నిర్మాణం చేసుకవటాన్ని ప్రోత్సహించటం.

c).మూల్యాంకనాన్ని బోధనాభ్యసన ప్రక్రియల్లో భాగంగా పరిగణించటం.

d).నిరంతరం మూల్యాంకనం చేస్తూ బోధన, అభ్యసన విధానాలను మెరుగుపరుచుకోవటం.

e).బోధన, అభ్యసన ప్రక్రియ విద్యార్థి కేంద్రీకృతంగా సాగేందుకు తోడ్పడటం.

f).పాఠ్య, సహపాఠ్య అంశాలు అన్న భేదం లేకుండా అన్నింటిని సమాన ప్రాధాన్యాలుగా గుర్తించుటము.

g).మూల్యాంకనం కేవలం రాత పరీక్షలకు మాత్రం పరిమితం కాదు. ఇది సామర్థ్య ఆధారితంగా విద్యా ప్రమాణాల పరిశీలించేదిగా ఉండాలి. మూల్యాంకనంలో మౌఖిక పరీక్షకు కూడా స్థానముండాలి. – రాష్ట్ర విద్యా ప్రణాళిక పరిధి పత్రం 2011 . Continuous Comprehensive Evaluation Telugu

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 8వ తరగతి వరకు ప్రవేశపెట్టిన CCE గ్రేడులు ఇచ్చి  విధానం ఇలా ఉంది.

100-91> A*

90-71 >  A

70-51 > B*

50-41> B

40-0 > C 

CCEలో నిర్మాణాత్మక మూల్యాంకనంలో భాగంగా 4 రకాల సాధనాలను ఉపయోగిస్తారు.

1. పిల్లల భాగస్వామ్యం – ప్రతిస్పందనలు – 10 మార్కులు 

2. రాత అంశాలు (నోటు పుస్తకాలు, ఇంటి పని మొ..నవి) – 10 మార్కులు

3. ప్రాజెక్ట్ పనులు – 10 మార్కులు.

4. లఘు పరీక్ష (Slip Test) – 20 మార్కులు 

నిర్మాణాత్మక మూల్యాంకనంలో వచ్చిన 50 మార్కులను 20 కి కుదించి సంగ్రహణాత్మక మూల్యాంకనంలో వచ్చిన 80 మార్కులకు కలుపుతారు. 

మూల్యాంకనం రకాలు:-

1).లోప నిర్థారణ మూల్యాంకనం (Diagnostic Evaluation ):-లోప నిర్ధారణ మూల్యాంకనం బోధన అభ్యసన ప్రక్రియకు ముందు నిర్వహిస్తారు. ఈ మూల్యాంకనం ద్వారా తరగతిలోని విద్యార్థుల బలాలు, బలహీనతలను తెలుసుకోవచ్చు.పాఠ్య పథకంలో విద్యార్థుల పూర్వ జ్ఞానాన్ని పరిశీలించడం. ఒక కోర్సు ప్రవేశ పరీక్ష లోప నిర్ధారణ మూల్యాంకనానికి ఉదాహరణగా చెప్పవచ్చు.

గమనిక : నిరంతర సమగ్ర మూల్యాంకనం

ఉపాధ్యాయుడు మౌఖిక పరీక్షలు, యూనిట్ టెస్ట్, త్రైమాసిక, అర్ధ సంవత్సర, వార్షిక పరీక్షలైన రాత పరీక్షల ద్వారా ఇంటర్ వ్యూ, చెక్ లిస్ట్ రేటింగ్ స్కేల్ మొదలైన పరిశీలన ఆధార పరీక్ష ద్వారా సెమినార్లు, ప్రాజెక్టుల ద్వారా విద్యార్థుల ప్రగతిని ప్రవర్తన అంశాలను అంచనా వేయడాన్ని, నిరంతర సమగ్ర మూల్యాంకనం అని అంటారు.

2).నిర్మాణాత్మాక మూల్యాంకనం:-(Formative Evaluation)

1.బోధన అభ్యసన ప్రక్రియ జరుగుతున్నప్పుడు ఒక పాఠ్యాంశాన్ని బోధించేటప్పుడు మధ్యలో ఉపాధ్యాయుడు నిర్వహించు మూల్యాంకనం నిర్మాణాత్మాక మూల్యాంకనం అంటారు. 2.నిర్మాణాత్మక మూల్యాంకనం ఉపాధ్యాయుడు పాఠ్యాంశం మధ్యలో విద్యార్థులను ప్రశ్నిస్తూ ఎప్పటికప్పుడు వారి సందేహాలను నివృత్తి చేస్తాడు.

3. విద్యార్థులకు నిరంతర పరిపక్షి (ఫీడ్ బ్యాక్) అందించడానికి నిర్మాణాత్మక మూల్యాంకనం తోడ్పడుతుంది.అంతే కాదు నిర్మాణాత్మాక మూల్యాంకనం ద్వారా విద్యార్థుల అభ్యసనాన్ని అంచెలంచెలుగా తెలుసుకోవచ్చు.

3).సంకలన మూల్యాంకనం ( Summative Evaluation ):-

బోధన అభ్యసన ప్రక్రియ పూర్తయిన తర్వాత నిర్వహించు మూల్యాంకనంను సంకలన మూల్యాకంనం అంటారు.బ్రిటిష్ వారి కాలం నుండి సంకలన మూల్యాంకనాన్ని ఉపయోగిస్తున్నారు.

ఒక పాఠ్యాంశం యూనిట్‌ను బోధించిన తర్వాత నిర్వహించే మూల్యాంకనాన్ని సంకలన మూల్యాంకనం అంటారు.సంకలన మూల్యాంకనం ద్వారా ఒక బోధన అభ్యసన ప్రక్రియ తుది ఫలితం తెలుసుకోవచ్చు.

ఒక యూనిట్ పాఠ్యాంశం బోధించిన తర్వాత ఉపాధ్యాయుడు లక్ష్యాలు సాధించాడో లేదో తెలుసుకోవడానికి సంకలన మూల్యాంకనం తోడ్పడుతుంది.సంకలన మూల్యాంకనం ద్వారా విద్యార్థులను పై తరగతులకు పంపవచ్చు.

ఉదా :- యూనిట్ పరీక్షలు, త్రైమాసిక పరీక్షలు, అర్థసంవత్సర, వార్షిక పరీక్షలు సంకలన మూల్యాంకనం ఉదాహరణలు.

నిరంతర, సమగ మూల్యాంకనం:-

(Continuous Comprehensive Evaluation):

విద్యా ప్రణాళిక చట్టం ప్రకారం National Curriculum Frame Work ప్రకారం ఉపాధ్యాయులు నిరంతర సమగ్ర మూల్యాంకనానికి ప్రాధాన్యత ఇవ్వాలి.

నిరంతర సమగ్ర మూల్యాంకనంలో రెండు పదాలు ఉన్నాయి.

నిరంతర: విద్యాసంవత్సరం ప్రారంభం నుండి విద్యాసంవత్సరం ముగియు వరకు నికషల ద్వారా, పరీక్ష ద్వారా, ఇంటర్వ్యూ ద్వారా, సెమినార్ ద్వారా ప్రాజెక్ట్ ద్వారా, రేటింగ్ స్కేల్స్, చెక్ లిస్ట్ ద్వారా విద్యార్థులను నిరంతరం మూల్యాంకనం చేయడం.

సమగ్ర అంటే జ్ఞానాత్మక, భావావేశ, మానసిక చలనాత్మక రంగానికి సంబంధించిన ప్రవర్తనాంశాలను మరియు పాఠ్య కార్యక్రమాలనే కాకుండా సహపాఠ్య కార్యక్రమాలను మూల్యాంకనం చేయడం.

అభ్యసన వనరులు:-అభ్యసించేవారు ఏ ఏ వనరులద్వారా నేర్చుకుంటారో వాటిని అభ్యసన వనరులు అంటారు. ఒక విద్యార్థి తన చుట్టూ ఉన్నటువంటి పరిసరాలను పరిశీలిస్తూ నేర్చుకుంటారు. ఈ సందర్భంలో ప్రతి విషయం విద్యార్థికి ఒక కొత్త విషయాన్ని నేర్పిస్తుంది.

స్వీయ వనరులు: (Self Resources):-ఇక్కడ మనం గుర్తుంచుకోవాలి ప్రతి విద్యార్థి ప్రత్యేకమైన వ్యక్తి. ప్రజ్ఞ, జ్ఞాపకశక్తి, అభిరుచులు, అవధానం, వైఖరులు, సహజ సామర్థ్యాలు, సృజనాత్మకత వంటి మానసిక సామర్థ్యాలు ద్వారా విద్యార్థులు అభ్యసిస్తారు.

b).స్వీయ వనరులలో ప్రధానమైనటువంటిది మెదడు జ్ఞానేంద్రియాలు పరిపక్వత చెంది ఉండటం. నూతన విషయాలు నేర్చుకునే ముందు పాత విషయాలకు సంబంధించినటువంటి, సంజ్ఞానాత్మక ప్రాకార్యాలను ఉపయోగించుకునే అవగాహన చేసుకుంటారు.

గృహ వనరులు (Home resources):-ఇంటిలోని పెద్దలు వారు పాటించే కుటుంబ నియమాలు బాధ్యతలను కుటుంబ వ్యవస్థ గురించి నేర్చుకుంటారు. మత విషయాలు పండగలు, ఆరోగ్య సూత్రాలు పరిశుభ్రత వంటి విషయాలను తెలుసుకుంటారు.

సామాజిక వనరులు:-( Community Resources ): చుట్టూ ఉన్న పరిసరాలు సంఘం యొక్క నీతినియమాలు సాంఘిక సర్దుబాట్లు ఇతరులతో సంబంధ బాంధవ్యాలు, వివిధ మతాల కులాల కట్టుబాట్ల యొక్క తేడాలను కూడా తెలుసుకుంటారు.  ప్రభుత్వ ఇతర ఆస్తులు గురించి సహజ వనరులు గురించి ఉపయోగాలు, వ్యవస్థల నియమాలు, సాంఘిక, ఆర్థిక, సామాజిక పాలనా సంబంధ విషయాలను కూడా తెలుసుకుంటారు.

సామూహిక ఉత్సవాల నిర్వహణను పరిశీలిస్తారు. ప్రాకృతిక అంశాలను పరిశీలిస్తాడు.

ఈ సామాజిక వనరులు మూడు రకాలుగా వర్గీకరిస్తారు :-1).భౌతిక పరిసరాలు, 2).సజీవ పరిసరాలు, 3).బౌద్ధిక వనరులు.

పాఠశాల వనరులు:

పాఠశాలలోని తరగతి గది, బ్లాక్ బోర్డు, ఉపాధ్యాయులు, ల్యాబ్ మొదలయినవి అభ్యసనం ను సమకూర్చే వనరుగా చెప్పవచ్చు. సహ విద్యార్థుల సమవయస్కులు స్నేహం సాంఘికీకరణము భావాన్ని పొందుతారు. పాఠ్యపుస్తకాలు చార్టులు సాంకేతిక వనరులు, రేడియో రికార్డింగ్ చలనచిత్రాలు టెలివిజన్ ఇంటర్నెట్ ప్రదర్శనలు మొదలైనవి.

ఈ విధంగా ఒక విద్యార్థి వివిధ రకాలుగా తన చుట్టూ ఉన్నటువంటి పరిసరాలు చూసి కూడా వాటి నుంచి కూడా నేర్చుకోగలుగుతాడు.

Also read : హోవార్డ్ గార్డినర్ బహుళ  ప్రజ్ఞా సిద్ధాంతం


Please Share it

1 thought on “Continuous Comprehensive Evaluation Telugu”

  1. 1st video only bits sir.CCE….remaining no-class,no-video sir.How it check sir? Please tell me sir.

    Reply

Leave a Comment

error: Content is protected !!