Heridity – అనువంశికత నియమాలు

YouTube Subscribe
Please Share it

Heridityఅనువంశికత నియమాలు

ఆస్ట్రియా దేశానికి చెందిన జన్యుశాస్త్ర పితామహుడైన గ్రెగర్ మెండల్ మూడు  అనువంశిక సూత్రాలను పేర్కొన్నాడు.

1.సారూప్య నియమము:- తల్లిదండ్రుల లక్షణాలు యథాతథంగా పిల్లలు కలిగి ఉండటం.

సాధారణంగా అందమైన తల్లిదండ్రులు పిల్లలు, అందమైన వారుగా, ప్రజ్ఞా వంతుల పిల్లలు ప్రజ్ఞావంతులు గా ఉండటానికి కారణం సారూప్య సూత్రము.

2. ప్రతిగమన నియమము:- పుట్టిన శిశువు యొక్క రూపురేఖలు ప్రజ్ఞ పాటవాలు వారి తల్లిదండ్రులకు పూర్తి వ్యతిరేకంగా లేదా తిరోగమనం గా ఉండటాన్ని ప్రతి గమన నియమం అంటారు.

ఉదాహరణకు పొడవైన ప్రజ్ఞ వంతులైన తల్లిదండ్రులకు పొట్టి వారైనా ప్రజ్ఞ హీనులు జన్మించడం.

3.వైవిద్య నియమము:-ఒకే తల్లిదండ్రులకు జన్మించిన పిల్లల్లో వ్యత్యాసాలు ఉండటము. పుట్టిన శిశువుల రూపురేఖలు ప్రజ్ఞాపాటవాలు కొన్ని లక్షణాలు తల్లిదండ్రులను పోలి ఉంటాయి మరికొన్ని లక్షణాలు తల్లిదండ్రులకు విరుద్ధంగా ఉంటాయి దీనినే వైవిద్య నియమం అంటారు.

ఉదాహరణకు:-ఆరోగ్యవంతమైన దంపతులకు అంగవైకల్యం గల పిల్లలు జన్మించడం. అధిక ప్రజ్ఞ వంతమైన తల్లిదండ్రులకు, అల్ప ప్రజ్ఞ వంతులైన పిల్లలు జన్మించడం.Heridity

అనువంశిక వాదులు:-

వ్యక్తి వికాసం పై అనువంశికత  ప్రధాన కారణమని వాదించిన మనోవిజ్ఞాన శాస్త్రవేత్తలును, అనువంశిక వాదులు అని చెప్తాం. 

గాల్టన్:- గాల్టన్ తన heriditary జీనియస్ అనే గ్రంథంలో ఇలా రాశాడు. ఈయన ఇంగ్లాండు లోని 997 ప్రముఖ కుటుంబాలకు చెందిన వ్యక్తులను, మరియు 997 సాధారణ కుటుంబాలకు చెందిన వ్యక్తులను, పరిశీలించాడు ఈ పరిశీలనలో ప్రముఖ కుటుంబానికి చెందిన వారసులలో, 535 మంది ప్రజ్ఞావంతులు ఉండగా, సాధారణ కుటుంబానికి చెందిన వారసులలో,కేవలం 5 మంది మాత్రమే ప్రజ్ఞావంతులు ఉండటానికి కారణం అనువంశికత అని తేల్చాడు. 

గొడార్డ్  : ఈయన మార్టిన్ కల్లికాక్ అనే కుటుంబం మీద పరిశోధనలు చేశాడు. ఈయన పరిశోధన లో అతనికి ఉన్న ఇద్దరు భార్యలలో , మొదటి భార్య ప్రతిభావంతురాలైన భార్య పిల్లలు వారి సంతానం మొత్తం 480 మంది లో ఎక్కువ మంది ప్రజ్ఞావంతులు గా జన్మించారు. మంద బుద్ధి కలిగిన రెండవ భార్యకు పుట్టిన సంతానం, వారి పిల్లలు మొత్తం 496 మంది లో ని ఎక్కువ మంది మంద బుద్ధులు గా, ప్రజ్ఞ హీనులుగా జన్మించారు.

ఫ్రీమన్:- ఈయన ఎక్కువగా కవల పైన / దాయాదుల పైన (అన్నదమ్ముల పిల్లలు) పరిశోధనలు చేశాడు. ఈయన కవలలకు కవల పిల్లలు జన్మిస్తారు, అన్నదమ్ములు ఎలాంటి వ్యక్తిత్వాన్ని కలిగి ఉంటే, వారి తమ్ముళ్ళు కూడా అలాంటి వ్యక్తిత్వాన్ని కలిగి ఉంటారు. అనువంశికత కు ప్రజ్ఞ కు సంబంధం ఉంది, ఇది కవల పిల్లల్లో ఎక్కువగా ఉంటుంది కవల పిల్లలు ఎక్కువగా ఒకే స్వభావం కలిగి ఉంటారు ఒకే ప్రవర్తనను ఒకే ప్రజ్ఞ లబ్ది కలిగిఉంటారు.

 డగ్ డెల్:- ఈయన జూక్స్ అనే కుటుంబములోని 709 మందిలో ఎక్కువ మంది నేరస్తులు, చట్టవ్యతిరేక వ్యవహారములు చేయువారు, దొంగలు, వేశ్యలు ఉన్నారని తెలిపారు.

పియర్ సన్:– తాతముత్తాతల తల్లిదండ్రులు ఆకారం, శరీర లక్షణాలే కాక ప్రజ్ఞ లక్షణాలు కూడా అనువంశికంగా సంక్రమిస్తాయి అని చెప్పారు. ఈయన హోమిని మరియు డార్విన్ వంశవృక్షాలను పరిశీలించారు. చార్లెస్ డార్విన్ వంశం లో ఎంతోమంది మేధావులు శాస్త్రవేత్తలు ఉన్నట్లుగా అలాగే బుద్ధి హీనుడైన హో మినీ, బలహీన మనస్కులు రాలైన అతని భార్య వంశవృక్షాన్ని పరిశీలించినప్పుడు, వారి వారసులు లో ఎక్కువమంది బుద్ధి మంద్యులుగా, ప్రజ్ఞ హీనులుగా వుండటం గుర్తించాడు.

ఆల్ పోర్ట్:- ఈయన ప్రకారం “వ్యక్తుల సుఖదుఃఖాలకు వారి మధ్య వైవిధ్యాలకు పరిసరాలు కారణం కాదని, జన్యువుల ప్రభావం అధికంగా ఉంటుందని” ఆల్ పోర్ట్ అభిప్రాయపడ్డాడు.

విన్ షిప్ :- ఈయన ఎడ్వర్డ్ కుటుంబాన్ని పరిశోధించి, అధిక ప్రజ్ఞావంతురాలైన మొదటి భార్య ఏలిజి బెత్ కు కలిగిన సంతాన వృక్షం అందరూ చాలా ప్రజ్ఞావంతులు గా గుర్తించబడ్డారు. అయితే మందమతి అయిన రెండవ భార్య మేరీ కి పుట్టిన సంతానం, వారి వంశ వృక్షము తెలివి తక్కువ వారిగా గుర్తించబడ్డారు. ఈ విధంగా తన పరిశోధన ద్వారా అనువంశిక ప్రభావాన్ని తెలియజేశారు. 

పరిసర వాదులు:-

వ్యక్తి వికాసం పై పరిసరాల ప్రభావమే ఎక్కువగా ఉంటుంది అని వాదించిన మనో విజ్ఞాన వేత్తలును “పరిసర వాదులు” అంటాం.

J.B వాట్సన్ :- పరిసరాలకు అమిత ప్రాధాన్యమిచ్చారు ఈయన. అనువంశిక వాదులను తీవ్రంగా వ్యతిరేకించారు. నాకు ఒక డజను శిశువులను ఇవ్వండి అనువంశిక తో సంబంధం లేకుండా మీరు కోరుకున్న విధంగా వారిని తీర్చిదిద్ది ఇస్తాను అని ఈయన చాలెంజ్ చేశాడు. ఈయన మనోవిజ్ఞాన మును, ప్రవర్తనను వివరించే శాస్త్రం గా మొదట చెప్పిన వ్యక్తి వాట్సన్.

W.C.  బాగ్లే :– పాఠశాల వసతులకు వ్యక్తుల వికాసానికి మధ్య సహసంబంధం ఉంటుందని మంచి పాఠశాల పరిసరాలు వ్యక్తి వికాసం లో గొప్ప మార్పును తీసుకొస్తాయి అని  Educational Determinism అనే గ్రంథంలో రాశారు. పాఠశాల పోని పిల్లలకు, పాఠశాల పరిసరాల్లో చదివిన పిల్లలకు ప్రజ్ఞ లో చాలా తేడా ఉన్నట్లు గుర్తించాడు.

న్యూ మెన్:-

19 జతల సమరూప కవల మీద పరిశోధన చేసి, వారు వేరు వేరు పరిసరాలలో పెరగటం వల్లనే సమరూప కవలలు అయినప్పటికీ వారి ప్రజ్ఞతో చాలా తేడా ఉన్నట్లు గా న్యూమెన్ గుర్తించాడు. 

గోర్ధన్:- ఈయన పడవలు, జిప్సీలు, నడిపే పిల్లలను పరిశీలించి, పాఠశాలలో చదువుకునే పిల్లలకు, పాఠశాల వెళ్లకుండా పడవ నడుపుకునే పిల్లల మధ్య IQ లో చాలా తేడాలు ఉన్నట్లు గుర్తించాడు. 

F.N ఫ్రీమన్:–  వివిధ పరిసరాలలో పెరిగిన మిలెడ్ మరియు రూత్ అనే కవల పిల్లల ప్రజ్ఞాపాటవాలులో చాలా తేడాలు ఉన్నట్లు తన పరిశోధనలో  గుర్తించాడు. కావున పరిసరాల ప్రభావం అధికంగా ప్రజ్ఞ పై ఉంటుందని తెలియజేశాడు.

స్కొడాక్:- ఈయన పెంపుడు శిశువులపై పరిశోధన జరిపాడు. ఈయన పరిశీలించిన పెంపుడు శిశువుల అసలు తల్లుల సరాసరి IQ 87.7 కాగా, శిశువుల సరాసరి IQ 116 గా వుంది.  అనువంశికత IQ ను ప్రభావితం చేసినట్లు అయితే ఇలాంటి ఫలితం రాదు అని గుర్తించాడు.

Also read : భోదన పద్దతులు


Please Share it

Leave a Comment

error: Content is protected !!