Methods of Teaching – భోదన పద్దతులు
పెడగాజీ అనే ఆంగ్ల పదము ( paidos+ago = Padagogy ) అనే రెండు గ్రీకు పదాల నుంచి గ్రహించబడినది. Paidos అనగా శిశువు, ago అనగా దారి చూపడం, లేదా మార్గం చూపడం అని అర్థం. శబ్ద పరంగా పెడగాజి అనగా శిశువుకు దారి చూపడము అని అర్థం.
పెడగాజి అనగా ఈనాడు Science of teaching and learning for the children.
Androgogy అనగా science of teaching for the adult. వయోజన విద్యలో భాగంగా వాడే పదం Androgogy.
Androgogy అనగా వయోజనులకు శాస్త్రీయంగా బోధించు శాస్త్రము. మరి Padagogy అనగా శిశువుకు శాస్త్రీయంగా ఎలా బోధించాలి, మరియు వారు ఎలా అభ్యసిస్తారు చెప్పే శాస్త్రము.
మొత్తం మీద పెడగాజి అనగా శిశువుకు శాస్త్రీయంగా బోధించే బోధన అభ్యసన శాస్త్రము అని చెప్పవచ్చు.
బోధన లోని దశలు:-
బోధన అనేది ఉపాధ్యాయుడు చేపట్టే ప్రక్రియ. బోధన అర్థవంతంగా ఉంటేనే అభ్యాసకుడు తగిన శ్రద్ధతో విషయమును నేర్చుకో గలుగుతాడు.
బోధనా దశలు :
ఫిలిప్స్ జాక్సన్ అనే విద్యావేత్త ప్రకారం బోధనా దశలను 3 రకాలుగా వర్గీకరించాడు.
1). బోధన పూర్వక దశ:- (or):-పూర్వ చర్యా దశ:-(Pre Teaching Phase):–
బోధన పూర్వక దశను ప్రణాళికను రచించుకొనే దశ లేదా తయారీ దశ అని అంటారు. ఈ దశలో ఉపాధ్యాయుడు తాను చెప్పదలుచుకున్న పాఠ్యాంశము సంబంధించి పాఠ్యప్రణాళికను రూపొందించుకోవడం జరుగుతుంది. ఈ దశలో ఉపాధ్యాయుడు బోధించే పాఠ్యాంశం ద్వారా విద్యార్థి చేసుకోబోయే ఆశించ బోయే మార్పులను నిర్దిష్ట లక్ష్యాలను లిఖితపూర్వకంగా రాసుకునే దశ.
ఈ దశలో పాఠ్యప్రణాళిక కు తగిన బోధనా పద్ధతిని ఎంపిక చేసుకుంటాడు. అంతేకాదు తగిన బోధనోపకరణాలను, సిద్ధం చేసుకుంటాడు. సమయ ప్రణాళిక చేసుకుంటాడు. అంతే కాదు బ్లాక్ బోర్డు ను రాయటానికి చాక్ పీస్ లను ఇతర అనుబంధ సామాగ్రిని తయారు చేసుకుంటాడు.
2). బోధన నిర్వహణ దశ (లేద) పరస్పర చర్య దశ:-(Teaching Phase):-
ఈ దశలోనే బోధనాభ్యసన జరుగుతుంది. ఉపాధ్యాయుడు తయారుచేసుకున్న పాఠ్యప్రణాళికను, చక్కటి ప్రణాళిక ద్వారా కార్యరూపంలోకి తీసుకువచ్చే దశ ఇది. దీనిలో విద్యార్థులు ఉపాధ్యాయులు మధ్య పరస్పర చర్చలు జరిగి విద్యార్థికి జ్ఞాన నిర్మాణం జరుగుతుంది.
ఈ దశలో ఉపాధ్యాయుడు క్రింది విధులను నిర్వహిస్తాడు.
ఎ) లోప నిర్ధారణ : ఉపాధ్యాయుడు విద్యార్థుల పూర్వ జ్ఞానాన్ని, బల, దుర్భలాలను అంచనావేస్తాడు. ఉపాధ్యాయుడు తరగతిని పరిశీలించి వారి సామర్థ్యాలకు తగ్గట్టుగా తన సామర్థ్యాన్ని అంచనా వేసుకొని బోధన చేస్తాడు. ఇక్కడ విద్యార్థులు ఉపాధ్యాయుని సామర్థ్యం తెలుసుకునే అవకాశం ఉంటుంది.
బి) సమర్పణ : విద్యార్థులలో తగిన ప్రేరణను కలుగజేస్తూ పాఠ్యాంశంను బోధనోపకరణాల ద్వారా బోధించడం.
సి) ప్రతి చర్య : ఉపాధ్యాయుని బోధనలో కలిగించే ఉద్దీపనలకు విద్యార్థులు ప్రతిస్పందన చూపుతారు. ఉపాధ్యాయుడు విద్యార్థులను ప్రశ్నలడగడం ద్వారా పరస్పర చర్చ జరుగుతుంది. ఈ విధమైన చర్య, ప్రతి చర్యలు బోధనను విజయవంతం చేస్తాయి. విద్యార్థులు కూడా అనుమానాలను నివృత్తి చేసుకుంటారు.
3. బోధనానంతర మూల్యంకన దశ (లేదా) చర్యాంతర దశ (Post Active):-
ఉపాధ్యాయుడు ఈ దశలో తాను అనుకున్న లక్ష్యాలు సాధించాడా ? లేదా ? అని మూల్యంకనం చేసుకొని దానికనుగుణంగా తన బోధన పద్ధతుల్ని మార్పులు చేస్తారు. పాఠ్యాంశాన్ని బోధన పద్ధతుల్ని, బోధనోపకరణాలు కూడా మూల్యాంకనం చేయవచ్చు. విద్యార్థులలో ఆశించిన మార్పులను మాపనం చేయుటకు ఉపాధ్యాయుడు వ్రాత పరీక్షలను నిర్వహిస్తాడు.
పరీక్ష ఫలితాల పరిపుష్టి ఆధారంగా తగిన పునర్భలనాన్ని పొందడం జరుగుతుంది.
ఈ మూడు దశలు ఒకదానితో ఒకటి అవినాభావ సంబంధాన్ని కలిగి ఉంటాయి. ఈ మూడు దశలను ప్రణాళికాబద్ధంగా అమలు చేసిన ఉపాధ్యాయుడు బోధనలో రాణిస్తాడు.
బోధనా పద్ధతులు:-
బోధన : బోధన అంటే తెలిసిన వ్యక్తికి తెలియని వ్యక్తికి మధ్య జరిగే ఒక పరస్పర చర్య. బోధన ఒక శాస్త్రం (Science) మరియు ఒక కళ (Art) అని పిలువవచ్చు.
ఆధునిక బోధనా పద్ధతులకు మూలపురుషుడు – జాన్ అమోస్ కొమినియస్
బోధన అభ్యసన ప్రక్రియలు :
బోధన అభ్యసన ప్రక్రియలో కొన్ని మౌళిక అంశాలు ఉంటాయి
1. ఎవరు బోధించాలి – ఉపాధ్యాయుడు
2. ఎవరికి బోధించాలి – విద్యార్థి
3. ఎందుకు బోధించాలి – ఆశయాలు, లక్ష్యాలు సాధించడానికి
4. ఎప్పుడు బోధించాలి – విద్యార్థికి ప్రేరణ ఉన్నప్పుడు
6. ఎక్కడ బోధించాలి – తరగతి గదితోపాటు సమాజంలోని వనరులను ఉపయోగించాలి.
6, ఎలా బోధించాలి – ఎలా బోధించాలి అనే ప్రశ్నకు సమాధానం ఇచ్చేవి బోధన పద్ధతులు
బోధనలు అనేకమంది విద్యావేత్తలు వివిధ పద్ధతులను రూపొందించారు.
జర్మనీ దేశానికి చెందిన ప్రోబెల్ క్రీడా పద్ధతిని రూపొందించారు.
ఇటలీ దేశానికి చెందిన మరియా మాంటిస్సోరి జ్ఞానేంద్రియ ప్రత్యక్షం
అమెరికా దేశానికి చెందిన విద్యా వేత్త జాన్ డూయి అనుభవం ద్వారా విద్య
రష్యా దేశానికి చెందిన వైగాట్ స్కి నిర్మాణాత్మక అభ్యసనము ను రూపొందించారు.
శిశు కేంద్రికృత పద్డతలు
1).అన్వేషణ పద్ధతి:-( Heuristic Method ):-
అన్వేషణ పద్ధతిని ఆంగ్లంలో Heuristic Method tooటారు.Heuristic అనే ఆంగ్ల పదం Heurisco అనే గ్రీకు పదం నుండి గ్రహించబడింది, Heurisco అంటే నేను కనుగొంటాను అని అర్థము. Heristic అనే ఆంగ్లపదం Heuris అనే మరో గ్రీకు పదం నుండి కూడా గ్రహించబడింది, Heuris అంటే మంచిగా వాసన పసిగట్టకలగడం
రసాయన శాస్త్ర ఆచార్యుడైన H.E. ఆర్న్ స్ట్రాంగ్ అన్వేషణ పద్ధతికి మూల పురుషుడు, ఈ పద్ధతిని రూపొందించాడు. ప్రొఫెసర్ ఆర్మ్ స్ట్రాంగ్ సైన్స్ బోధనలో లోపాలను గుర్తించి సైన్స్ ను చేయడం ద్వారా అభ్యసించాలని లండన్‌లోని 40 పాఠశాలలో ఈ పద్ధతిని ప్రవేశపెట్టాడు.
అన్వేషణ పద్ధతిలో విద్యార్థులను సమస్యలను పరిష్కరించే అన్వేషకుడుగా తయారుచేయడానికి ముఖ్య ఉద్దేశ్యము. అందుకే అన్వేషణ పద్ధతిని పరిశోధన పద్ధతి అని కూడా అంటారు.
కొన్ని ప్రాధాన్యత కలిగిన సమస్యలను విద్యార్థులకు ఇచ్చి పరిష్కార మార్గము లను వారే కనుగొనే టట్లు, ప్రోత్సహిస్తారు అందుకు అవసరమైన మార్గదర్శకత్వం ను అందిస్తారు. విద్యార్థులును అన్వేషకులు గా రూపొందిస్తారు. సమస్య పరిష్కారము స్వయంగా కనుగొన్న ఆనందమును విద్యార్థికి కలిగేటట్టు చూస్తారు.
2).ప్రాజెక్ట్ పద్ధతి:-(ఎత్తుగడ పద్ధతి /ఉద్యమ పద్ధతి/ప్రకల్పన పద్ధతి):-
ఈ పద్ధతి ఆచరణ ద్వారా అభ్యసనం అనే సూత్రంపై ఆధారపడుతుంది. ఈ ప్రాజెక్టు పద్ధతి అమెరికా దేశానికి చెందిన జాన్ డ్యూయి యొక్క వ్యవహారిక సత్తావాదం పై ఆధారపడి ఉన్నాయి. తరగతి బోధనలో మొదటిసారిగా అమెరికాలో దీనిని డాక్టర్ కిల్ పాట్రిక్ అనే విద్యావేత్త ఆచరణలో పెట్టారు. ఈ పద్ధతిని పటిష్ట పరిచినది స్టీఫెన్ సన్
ప్రాజెక్టు ఎందుకు :-
a).బోధనాభ్యసన ఫలితాలు కేవలం తరగతి గదికి పరిమితం కాకుండా, భౌతిక, సాంఘిక అవసరాలు తీర్చడానికని నమ్మడం
b).పిల్లల్లో ఉండే సహజ అంతర్గత శక్తుల వినియోగానికి అభ్యసన సహజ వాతావరణంలో, ఆనందంగా, స్వేచ్ఛగా, ఆహ్లాద వాతావరణంలో జరగాలని –
c).వివిధ జ్ఞానమార్గాలను పిల్లలకు తెలియపర్చటానికి
d).వివిధ విషయాలను (సమన్వయంతో) అభ్యసన గావించటానికి
e).భావవ్యక్తీకరణ, నైపుణ్యాలు అభివృద్ధి పర్చటానికి ప్రజాస్వామిక లక్షణాలు, పనిపట్ల గౌరవం మొదలైన విలువలు, వైఖరులు అలవడటానికి.
3).కృత్య పద్ధతి:-
విద్యార్థులు రకరకాల కృత్యాలలో చురుకుగా పాల్గొని, ఆ కృత్యాలను వారే స్వయంగా పూర్తి చేసి, వానినుండి పొందిన అనుభవాలను స్థిరీకరణ చేసుకొని పొందే జ్ఞానమును, అవగాహననే కృత్యాధార అభ్యసనము అంటారు. ఇది పూర్తిగా విద్యార్థి కేంద్రీకృతమయినది. ఆచరణ ద్వారా అభ్యసనం (learning by doing) అనే సూత్రం ఆధారంగా రూపొందించబడింది.
కృత్య అనుభవాలను విద్యార్థికి పాఠశాలలో, తరగతి గదిలో, గ్రంథాలయంలో, ప్రయోగశాలలో, సమాజంలో, గృహంలో ఎక్కడయినా పొందేటట్లు ఏర్పాటు చేయవచ్చు.
కృత్యాధార పద్ధతి యొక్క ముఖ్య లక్ష్యం పిల్లలకు నేరుగా సమాచారంను అందించకుండా తమ తోటివారితో, ఉపాధ్యాయులతో, తల్లిదండ్రులతో, సమాజ సభ్యులతో చర్చించేలా చేసి జ్ఞానమును, అవగాహనను సొంతంగా గ్రహించేటట్లు చేయటం. ఇది నిర్మాణాత్మక వాదమును పూర్తిగా సమర్థించే బోధన అభ్యసనా పద్ధతిగా చెప్పుకోవచ్చు.
విద్యార్థులలో జ్ఞాన నిర్మాణము అనేది వారు స్వయంగా కృత్యాలలో పాల్గొని, స్వీయ అనుభవాల నుండి ఏర్పాటు చేసుకోవాలి, పాఠశాల వెలుపలి జీవితానికి జ్ఞానరాశిని అన్వయించాలి అని NCF-2005 సూచించిన సూత్రాలను ఈ కృత్యాధార పద్ధతి పూర్తిగా సమర్ధిస్తుంది.
కృత్యాధార అభ్యసనను మొదటగా ఇండియాలో రిషీవ్యాలీ పాఠశాలలో డేవిడ్ హోర్స్ బర్గ్ అనే బ్రిటన్‌కు చెందిన ఉపాధ్యాయుడు ప్రవేశపెట్టినాడు.
కృత్యాలు – రకాలు:
ప్రస్తుత పాఠ్యపుస్తకాలన్నీ కూడా కృత్యాధార అభ్యసనకు అనువుగా రూపొందించబడ్డాయి. ఈ కృత్యాలను నిర్వహణ దృష్ట్యా మూడు రకాలుగా వర్గీకరించినారు. అవి :
a) పూర్తి తరగతి కృత్యాలు : తరగతిలోని అందరిచే ఒకే కృత్యము నిర్వహించబడుతుంది.
ఉదా : ఒక పాఠంలోని 4 అక్షరాల పదములను అన్నింటిని విద్యార్థులందరిని రాసుకొని రమ్మనుట.
b) జట్టు కృత్యాలు : ఒక్క జట్టులో 4,5 గురు విద్యార్థులుండాలి. జట్టుకొక కృత్యం ఇవ్వబడుతుంది.
ఉదా : కథను చూచి ఒక జట్టు 2 అక్షరాల పదాలు, మరో జట్టు 3 అక్షరాల పదాలు ఇంకొక జట్టుకు 4 అక్షరాల పదాలు తయారు చేయమని పని అప్పగించుట.
c) వ్యక్తిగత కృత్యాలు : ఒక్కొక్క విద్యార్థికి విడి, విడిగా ఒక్కో కృత్యము ఇవ్వబడుతుంది.
ఉదా : విడి, విడిగా ఒక్కొక్క విద్యార్థికి ఒక్కొక్క అక్షరము ఇచ్చి, కథలోని వారికిచ్చిన అక్షరం ఉన్న పదములన్నింటిని రాసుకొని రమ్మనుట.
ఉపాధ్యాయ కేంద్రీకృత పద్ధతులు
1). ఉపన్యాస పద్ధతి:-(Lecture Method):
ఈనాడు KG నుండి PG వరకు అనుసరిస్తున్న పద్ధతి ఉపన్యాస పద్ధతి. Lecture అనే ఆంగ్ల పదం lectare అనే లాటిన్ పదం నుంచి గ్రహింపబడినవి.Lectare అనగా బిగ్గరగా చదవటం అని అర్థం. ఈ పద్ధతి అతి పురాతనమైన పద్ధతి. భావవాదం ఐడియలిజంను సమర్థించిన పద్ధతి.
దీనినే చెప్పే పద్ధతి (Telling Method) అని కూడా అంటారు. ఏదైనా ఒక ఉపాధ్యాయుడు తరగతిగది బోధనకు ముందు తాను తయారు చేసుకున్న ప్రసంగమును విద్యార్థులకు మౌఖికంగా, సాబ్దికంగా వ్యక్తం చేయడమే ఉపన్యాస పద్ధతి. ఇందులో 3 ఉపదశలు ఉన్నాయి.
1). ప్రవేశక చర్య 2). అభివృద్ధి దశ 3). ముగింపు దశ.
ఉపన్యాస పద్ధతి లో తక్కువ సమయంలోనే ఎక్కువ సిలబస్ బోధించవచ్చు. అంతేకాదు అన్ని పాఠాలు ఈ పద్ధతిని ఉపయోగించి చెప్పవచ్చు. తరగతి గదిలో విద్యార్థుల సంఖ్య ఎక్కువగా ఉన్నప్పుడు ఉపన్యాస పద్ధతి చాలా ఉపయోగపడుతుంది.
2). ఉపన్యాస ప్రదర్శనా పద్ధతి:-ఉపన్యసిస్తూ ప్రదర్శనల ద్వారా విషయములను బోధించే పద్ధతిని ఉపన్యాస ప్రదర్శన పద్ధతి అంటారు.
ఈ ఉపన్యాస ప్రదర్శన పద్ధతిలో నాలుగు సోపనాలు ఉన్నాయి.
1). ప్రణాళిక రచన 2). ఉన్ముఖీకరణం/ప్రేరణ 3). ప్రదర్శన 4). మూల్యాంకనము.
ఈ ఉపన్యాస ప్రదర్శన పద్ధతి పెద్ద తరగతులకు ఉపయోగపడదు అయితే చిన్న తరగతులకు ఉపయోగపడుతుంది. దీని ముఖ్య ప్రయోజనం భావనలను మూర్తరూపంలో చెప్పుటకు ఉపయోగపడుతుంది.
3). చారిత్రక పద్ధతి:-చారిత్రిక అంటే గత మనకు సంబంధించిన ది అనగా మనం బోధించే సైన్సు సోషియల్ గాని గణితం గాని గతానికి సంబంధించిన సంఘటనలు గతానికి సంబంధించిన వ్యక్తులు గతంలో ఉండే సాంఘిక, ఆర్థిక, అంశాల గురించి నాటి నుంచి నేటి వరకు సిద్ధాంతాలు భావనలు ఎలా మార్పు చెందాయో చెప్పటానికి ఉపయోగించే పద్ధతి చారిత్రక పద్ధతి. చారిత్రక పద్ధతిలో నాలుగు ఉప పద్ధతులు ఉన్నాయి.
1).Biographic : జీవిత చరిత్ర పద్ధతి
2).Anecdotal Method : సంఘటన రచనా పద్ధతి
3). Social Method : సాంఘిక పద్ధతి
4). Evolution Method : పరిణామ పద్ధతి
Also read : వ్యక్తి అధ్యయన పద్ధతులు