Pshycho Analysis Theory – మనో విశ్లేషణ సిద్ధాంతము

YouTube Subscribe
Please Share it

Pshycho Analysis Theory – మనో విశ్లేషణ సిద్ధాంతము 

సిగ్మండ్ ఫ్రాయిడ్ ఆస్ట్రియా దేశానికి చెందిన ఒక యూదుడు. మరియు వైద్య శాస్త్రంలో పట్టభద్రుడు మనో విశ్లేషణ సిద్ధాంతాన్ని ప్రతిపాదించాడు. ఇతనికి మనో రోగ చికిత్స లో ఆసక్తి ఎక్కువ. అందువలన పారిస్ నగరంలో పేరు పొందినటువంటి, చార్కట్ అనే వాడి యొక్క శిష్యుడై, హిస్టీరియా వ్యాధికి చికిత్స చేయడానికి సమ్మోహనం అనే పద్ధతిని మొదట అవలంబించాడు.,,(సమ్మోహనం అనగా హిప్నాటిజం).

ఐతే హిప్నాటిజం పై క్రమేణా ఇతనికి నమ్మకం సడలింది. అందువలన ఈయన హిస్టీరియా వ్యాధికి కారణాలు అన్వేషించి, చివరకు మనో విశ్లేషణ సిద్ధాంతాన్ని ఆయన ప్రతిపాదించాడు. ఈ మనో విశ్లేషణ సిద్ధాంతం మానసిక వ్యాధులకు చికిత్స చేసే ఒక పద్ధతే కాక, మూర్తిమత్వాన్ని వర్ణించే ఒక సిద్ధాంతం కూడా. మనో విశ్లేషణ సిద్ధాంతం అచేతన ప్రేరణ ద్వారా ప్రవర్తనను తద్వారా, మూర్తిమత్వాన్ని వివరించడానికి ప్రయత్నం చేస్తుంది.

సిగ్మండ్ ఫ్రాయిడ్ మానసిక రోగాలను నయం చేయడానికి, స్వేచ్ఛ సంసర్గం, (Free Association) అనే చికిత్సా విధానాన్ని ఉపయోగించేవాడు.

సిగ్మండ్ ఫ్రాయిడ్ రాసిన గ్రంధాలలో ముఖ్యమైనది స్వప్న విశ్లేషణము The interpretation of Dreams.

మనో విశ్లేషణ సిద్ధాంతం లో మూడు అంశాలు కలవు Pshycho Analysis Theory

1). మూర్తిమత్వ నిర్మాణము

మూర్తిమత్వం నిర్మాణంలో మనకు మూడు ఉప అంశాలు ఉన్నాయి.

1). అచిత్తు (ID) :- ఇది మనిషి మనసులో అచేతనావస్థలో ఉంటుంది. ఇది మనిషి సహజ ప్రవృత్తి అని చెప్పవచ్చు. నైతిక విలువలు పాటించదు. నియమాలు, తప్పొప్పులు అసలు పట్టించుకోదు. స్వార్థపర మైనటువంటి భావనను కలిగి ఉంటుంది.మనసులో కలిగే కోరికలను తీర్చుకోవడానికి ఎక్కువగా మనిషి ని తొందర పెడుతుంది.ముఖ్యంగా చెప్పాలంటే ఈ అచిత్తు అనేది ఆనంద సూత్రంపై ఆధారపడి పనిచేస్తుంది అని చెప్పవచ్చు. ఆనందాన్ని అవసరాలను మాత్రమే చూసుకునే స్వార్థ మైన ఆలోచనలు కలది.

2). అహం (Ego):- : అహం చేతనంలో ఉంటుంది. ఇది వాస్తవిక సూత్రాన్ని పాటిస్తుంది. అహం అనైతిక ఆలోచనలను కట్టడి చేస్తుంది. వాస్తవాలను గ్రహించి సమయానుకూలంగా, తెలివిగా నిర్ణయాలు తీసుకునే టట్లుగా చేస్తుంది. 

3). ఆద్యహం (Super Ego):- ఆద్యహం వ్యక్తి యొక్క అంతరాత్మ. నైతిక సామాజిక విలువలను పాటిస్తుంది.ఆద్యహం మంచి చెడ్డలను గుర్తించి సాంఘిక ఆచారాలను పాటించే టట్లు చేస్తుంది. శిశువు తల్లిదండ్రులతో, గురువులతో, స్నేహితులతో, పాఠశాలలో సమాజంలో జరిపే చర్యలవల్ల, ఇది వికసిస్తుంది అని చెప్పవచ్చు. సూపర్ ఇగో అనేది మంచి చెడ్డలను గుర్తించి, సాంఘిక ఆచారాలను పాటించేలా చేస్తుంది. ఇది ఎక్కువగా నైతిక సూత్రంపై ఆధారపడి పనిచేస్తుంది.

ఉదాహరణకు దొంగతనం చేసిన సినిమాకు వెళ్ళమని ప్రోత్సహించేది ID అయితే, దొంగతనం చేసే అవకాశాలను నిర్ణయించేది ఇగో (Ego) , దొంగతనం చేసేది తప్పు అని చెప్పేది సూపర్ ఇగో ( Super Ego) గా మనం చెప్పవచ్చు. 

2). మూర్తి మత్వ గతిశీలత

ఇందులో 3 ఉప అంశాలు ఉన్నాయి.

1).చేతనం :-వ్యక్తి చైతన్యవంతులుగా ఉన్నప్పుడు తన జ్ఞానేంద్రియాల ద్వారా స్వీకరించే అనుభవాలు అన్నిటినీ, చేతనం అని అంటారు. అనగా తక్షణం గుర్తించుకునే విషయాలన్నీ, చేతనం ద్వారానే మనకు జరుగుతాయి. ఉదాహరణకు తరగతి గదిలో ఉపాధ్యాయుడు చెప్పే పాఠాన్ని శ్రద్ధగా వినటం. అలాగా శ్రద్ధగా వినే ఈ సమయంలోనే మనం చేతనం లో ఉంటాము. దీనినే చేతనం అని చెప్పవచ్చు.

2). ఉప చేతనం:ఇది చేతనం కన్నా కాస్త లోతైనది. అచేతన అనుభవాలను ఇది దాచుకుంటుంది. అవసరమైనప్పుడల్లా తన అనుభవాలను గుర్తు చేసుకునేందుకు, ఉపయోగపడేదే ఈ ఉపచేతనం.

అనగా మనం పరీక్ష రాసేటప్పుడు, ఎప్పుడో చదివిన జవాబులు కొద్ది కొద్దిగా గుర్తుకు రావటమే ఉప చేతనంగా మనం చెప్పుకోవచ్చు ఉదాహరణగా.

3). అచేతనం:-అచేతనంగా మనసులోని అతి లోతైన భాగము. వ్యక్తి తనను తాను నియంత్రించుకోలేని  మానసిక స్థితి.

3). మనో లైంగిక వికాసం:

సిగ్మండ్ ఫ్రాయిడ్ ప్రకారం ప్రతి శిశువులో కొంత మోతాదులో లైంగిక శక్తి అనేది ఉంటుంది దానిని లిబిడో ( LIBEDO) అని అంటాము శిశువు పుట్టుకతోనే లైంగిక సహజాతం అనగా లిబిడోని కలిగి ఉంటాడని, అది వివిధ లైంగిక దశల గుండా ప్రయాణిస్తూ, సంతృప్తి చెందితే మంచి మూర్తిమత్వ లక్షణాలును కలిగి ఉంటాడని, లేకపోతే అసంతృప్తికి లోనైతే మూర్తిమత్వం లో లోపాలు ఏర్పడతాయి అని భావించాడు 

మనోలైంగిక వికాసంలో 5 పదాలు ఉన్నాయి.

1.) మౌఖిక దశ :- (Oral Stage):- ఈ దశ పుట్టినప్పుడు నుంచి మొదటి సంవత్సరం వరకు ఉంటుంది. మౌఖిక దశలో నోరు కామోద్దీపన కేంద్రంగా పనిచేస్తుంది. ఈ దశలో పిల్లలు అందిన ప్రతి వస్తువును నోట్లో పెట్టుకొంటారు.

2). ఆసన దశ :- ఈ దశ 2 నుంచి 3 సంవత్సరాల వరకు ఉంటుంది. పాయువు కామోద్దీపన కేంద్రంగా ఉంటుంది. ఈ దశలో పిల్లలు మల విసర్జన ద్వారా ఆనందాన్ని పొందుతారు. ఈ దశలో తల్లిదండ్రులు పిల్లలకు టాయిలెట్ ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది.

3).సిశ్నదశ :- ఈ దశ మూడు నుంచి ఐదు సంవత్సరాల వరకు ఉంటుంది. ఈ దశలో పిల్లలకు జననేంద్రియాల పట్ల ఆసక్తి పెరుగుతుంది. జననేంద్రియాలను తాకడం ద్వారా శిశువు సంతృప్తి చెందుతాడు.

మగ పిల్లలు తండ్రిని ప్రత్యర్థిగా భావించి తల్లి ప్రేమ అనురాగాలు కోరుకోవడం జరుగుతుంది దీనిని ఇడిపస్ కాంప్లెక్స్ అని అంటారు.

ఆడపిల్లలుతల్లిని ప్రత్యర్థి గా భావించి తండ్రి ప్రేమ అనురాగాలు కోరుకుంటారు. దీనిని  ఎలక్ట్రా కాంప్లెక్స్ అంటారు.

3). గుప్త దశ:-ఈ దశ 6 నుంచి 12 సంవత్సరముల వరకు ఉంటుంది. ఈ దశలో మంచి చెడుల మధ్య  విచక్షణ చూసుకుంటారు. ఈ దశలో స్వలింగీయుల పట్ల ఆకర్షణ ఉంటుంది.మగ పిల్లలు తండ్రితోను, ఆడ పిల్లలు తల్లితోను తాదాత్మీకరణము చెందుతారు.

4. జననాంగ దశ:-ఈ దశ 12 సంవత్సరాల నుండి కౌమారదశ వరకు ఉంటుంది. ఈ దశలో బిన్న లింగీ యుల పట్ల ఆకర్షణ ఉంటుంది. ఈ దశలో ప్రాథమిక గౌన, లైంగిక లక్షణాలు, వికాసం చెందుతాయి. ఫ్రాయిడ్ ప్రకారం లైంగిక వికాసానికి మూర్తిమత్వ వికాసానికి పరస్పర సంబంధం ఉంటుంది.

నిర్మితి సిద్ధాంతాలలో ముఖ్యమైనటువంటి సిద్ధాంతాలు

1). మనో విశ్లేషణ సిద్ధాంతం

2). మనో సాంఘిక వికాస సిద్ధాంతం  


Please Share it

Leave a Comment

error: Content is protected !!