TET Psychology – 2021 – మనోవిజ్ఞాన శాస్రం

YouTube Subscribe
Please Share it

TET Psychology – మనోవిజ్ఞాన శాస్రం

మనోవిజ్ఞాన శాస్త్రాన్ని ఆంగ్లంలో సైకాలజీ అని పిలుస్తారు. ఈ సైకాలజీ అనే పదం సైకే, లోగోస్ అనే రెండు గ్రీకు పదాల నుంచి ఉద్భవించింది. సైకే అనే పదాన్ని గ్రీకు తత్వవేత్తలు, ఆత్మ లేదా మనస్సు అనే అర్ధాలతో ఉపయోగించేవారు.మనోవిజ్ఞానశాస్త్రము ఆత్మను అధ్యయనం చేసే శాస్త్రం గా గుర్తించి తత్వశాస్త్రం లోనూ, వేదాంత శాస్త్రంలోనూ, ఒక భాగంగా భావించారు శాస్త్రవేత్తలు.TET Psychology

మరి ఆత్మ అనేది మూర్త పదార్థం కాదు ఇది అమూర్తమైనది. అనగా ఆత్మ అనగా ఏమిటో వివరించడం చాలా కష్టం. ఆత్మను పరిశీలించటం ఎవరికీ సాధ్యం కాదు. ఆత్మను మనం చూడలేము కనీసం తాకలేము. దీని స్వభావము ఇది అని నిర్దిష్టంగా కూడా చెప్పలేము. కావున మనోవిజ్ఞానశాస్త్రము ఆత్మను అధ్యయనం చేసే శాస్త్రం అనే నిర్వచనాన్ని తోసిపుచ్చారు శాస్త్రవేత్తలు. ఎందుకనగా ఆత్మ అనగా ఏమిటి దానిని అధ్యయనం చేయుట ఎట్లా అనే ప్రశ్నలకు సమాధానాలు రాబట్టే లేకపోయారు శాస్త్రవేత్తలు.

మరి కొద్ది కాలం తర్వాత అరిస్టాటిల్ ఆత్మను రెండు విభాగాలుగా గుర్తించాడు. అందులో ఒకటి నిష్క్రియాత్మక మైంది రెండవది క్రియాత్మక మైంది. క్రియాత్మక మైనటువంటి మనస్సు వ్యక్తిని చైతన్య పరుస్తుందని, కృత్యాలు చేయడానికి ప్రేరణ ఇస్తుందని, మానసిక శక్తిని ఉత్పత్తి చేస్తుందని అరిస్టాటిల్ పేర్కొన్నాడు.

మరి కొద్ది కాలం తర్వాత సెయింట్ అగస్టీన్ అనే తాత్వికుడు వ్యక్తి చైతన్యపురితుడుగా ఉన్నప్పుడు అతని మనసును అంతః పరిశీలనా పద్ధతులు ద్వారా అధ్యయనం చేయవచ్చునని అభిప్రాయపడ్డాడు.

మరి కొద్ది కాలం తర్వాత పద్దెనిమిది వందల 1879 లో, జర్మనీలోని లీఫ్ జిక్ నగరంలో, wilhelm wundt అనే శాస్త్రవేత్త, మొట్టమొదటిసారిగా ప్రయోగశాల ను ప్రారంభించి, అంత పరిశీలన పద్ధతి ద్వారా చేతనత్వాన్ని, అధ్యయనం చేశాడు. విలియం జేమ్స్, విలియం ఊట్ అనే శాస్త్రవేత్తలు మనోవిజ్ఞాన శాస్త్రం మనసులోని చేతనత్వాన్ని అధ్యయనం చేసే శాస్త్రం గా నిర్వహించారు.

కానీ సిగ్మండ్ ఫ్రాయిడ్ అనేటువంటి శాస్త్రవేత్త కొన్ని వేల మంది పై పరిశోధనలు జరిపి, వ్యక్తుల ప్రవర్తన కు అచేతనం కూడా కారణమని తన అచేతన ప్రేరణ సిద్ధాంతాన్ని ప్రతిపాదించాడు.

చివరకు ప్రవర్తన వాదులైన జి పి వాట్సన్ తదితరులు మనోవిజ్ఞానశాస్త్రము అన్ని రకాల ప్రవర్తనను అధ్యయనం చేసే శాస్త్రం గా పేర్కొన్నారు. మనో విజ్ఞాన శాస్త్రము అనగా మానవుల యొక్క ప్రవర్తనను శాస్త్రీయంగా అధ్యయనం చేసే శాస్త్రం గా, మనోవిజ్ఞాన శాస్త్రం అని నిర్వచించవచ్చు.

ఇప్పుడు ప్రవర్తన అనగా ఏమిటో తెలుసుకుందాం. ప్రవర్తన రెండు విధములు 1 బాహ్య ప్రవర్తన 2 అంత ప్రవర్తన. మనోవిజ్ఞాన శాస్త్రవేత్తలు జీవి ప్రవర్తనను 3 రంగాలకు అన్వయించారు.

1. ఒకటి జ్ఞానాత్మక రంగం

1.జ్ఞానాత్మక రంగం అనగా గుర్తించడం, గుర్తించడం,జ్ఞప్తికి తెచ్చుకోవడం. వర్గీకరించడం, ఉదాహరణలు ఇవ్వడం, భేదాలను గుర్తించడం, సారూప్యాలను గుర్తించడం, విశ్లేషించడం, సంశ్లేచించడం, మదింపు చేయడం, మూల్యాంకనం చేయడం, సమైక్యంగాను, విభిన్నంగాను ఆలోచించడం, ఊహించడం స్మృతి, విస్మృతి, ధారణ ప్రజ్ఞ మొదలైన ప్రవర్తన వీటన్నిటిని జ్ఞానాత్మక రంగ  విభాగంలో మనోవిజ్ఞాన శాస్త్రము అధ్యయనం చేస్తుంది.

2. భావావేశ రంగం

2.భావావేశ రంగానికి సంబంధించినంత వరకు వారి యొక్క అభిరుచులు,వైఖరలు, వ్యక్తి యొక్క సహజ సామర్థ్యాలు, విలువలు, ఉద్వేగాల అయినా సంతోషం, ఆనందం, దయ, జాలి, ప్రేమ, వాత్సల్యం, బాధ, ఈర్ష్య మనిషి లో ఉన్నటువంటి అసూయ, పగ, సాంఘిక ప్రవర్తన, వ్యక్తి లో ఉన్నటువంటి నాయకత్వ లక్షణాలు, మొదలైన వాటిని ఈ భావావేశ రంగానికి సంబంధించిన మనోవిజ్ఞాన శాస్త్రం అధ్యయనం చేస్తుంది.

3. మానసిక చలనాత్మక రంగం

3.అలాగే మానసిక చలనాత్మక రంగం అనగా, ఒక వ్యక్తి నడవటం, పరిగెత్తటం చక్కగా పాడటం, ఆడటం చక్కగా గీయటం, రాయటం సేకరించడం భద్రపరచడం, పరికరాలను యంత్రాలను ఉపయోగించడం, నాట్యం చేయడం మొదలైనటువంటి మానసిక చలనాత్మక రంగానికి సంబంధించి నటువంటి మనోవిజ్ఞాన శాస్త్రం అధ్యయనం చేస్తుంది. అనగా జీవికి సంబంధించినంతవరకు అంతర్గత బహిర్గత,ప్రవర్తనలన్నింటినీ మనోవిజ్ఞాన శాస్త్రం అధ్యయనం చేస్తుంది.

ప్రవర్తనా వాదం/సంసర్గ వాదం:

మనోవిజ్ఞానశాస్త్రము వ్యక్తి ప్రవర్తనను శాస్త్రీయంగా అధ్యయనం చేయాలని చెబుతుంది. వ్యక్తి ప్రవర్తన ఐనటువంటి స్మృతి, విస్మృతి అభ్యసన, వైయుక్తిక భేదాలు, ఆలోచన చింతన లాంటి విషయాలను శాస్త్రీయ దృక్పథంతో ఆలోచించి పరిశోధించి సిద్ధాంతీకరించ వచ్చునని ప్రవర్తనా వాదులు చెబుతారు. మరి ఈ ప్రవర్తనా వాదం జంతువుల మీద పరిశోధన చేయడానికి కూడా దోహదం చేసింది. ఇవాన్ పావలవ్, Edward thorndike,స్కిన్నర్ మొదలైన వారి పరిశోధనలు ఎక్కువ బలాన్ని ఇచ్చాయి అని చెప్పవచ్చు. సంసర్గం అనగా సంబంధం ఏర్పడటం అని చెప్పవచ్చు. ఉద్దీపన ప్రతిస్పందన మధ్య బంధం ఏర్పడడం వలన అభ్యసనం జరుగుతుందని తెలిపేది ఈ సంసర్గ వాద సిద్ధాంతాలు. వీటికి ఆద్యుడిగా మనం ఇవాన్ పావ్లోవ్ ను చెప్పవచ్చు. ఈయన యొక్క సిద్ధాంతం శాస్త్రీయ నిబంధన సిద్ధాంతం.

2.గేసాల్డ్ వాధం “అభ్యసనంలో మానసిక అంశాల ప్రాధాన్యతను ఈ వాదం తెలుపుతుంది”. గేస్తల్ జర్మనీ పదానికి అర్థం ఆకృతి అని. ఒక అంశాన్ని విడివిడిగా కాకుండా మొత్తంగా అధ్యయనం చేస్తేనే సమగ్ర జ్ఞానం వ్యక్తిలో సంభవిస్తుందని, వీళ్ళు భావించారు 

గేసాల్డ్ వాదులు ఎక్కువగా అవధానం, ప్రత్యక్షం అభ్యసనం ప్రధాన రంగాలుగా వీళ్లు అధ్యయనం చేశారు. ఈ గెస్ట్ హౌస్ ఓల్డ్ వాదులు అంతర్దృష్టి అభ్యసన మీద చేసిన ప్రయోగాలు చాలా ప్రాముఖ్యతను సంతరించుకున్నాయి. అంతర్దృష్టి అభ్యసన సిద్దాతం – కోహేలర్ (Gestalt Psychologists)

3. నిర్మాణాత్మక వాదం :-శిశువు ఎంత నేర్చుకున్నాడు ఏమి నేర్చుకున్నాడు అని కాకుండా, ఎలా నేర్చుకున్నాడు అన్న అంశం మీద అ తెలిపేదే ఈ నిర్మాణాత్మక వాదము. అభ్యసనం తరువాత కలిగిన ఫలితం కంటే అభ్యసనం జరిగిన విధానమే చాలా ముఖ్యమని ఈ వాదం తెలుపుతుంది. పిల్లలలో జ్ఞాన నిర్మాణం జరగడం ద్వారా అభ్యసనం జరుగుతుందని ఈ వాదం తెలుపుతుంది.

4. పరిశీలనా వాదము : వ్యక్తి ఇతరులను పరిశీలించడం, ఇతరుల ల ప్రవర్తనను ఆదర్శంగా తీసుకొని అనుకరించడం ద్వారా నేర్చుకుంటారు, అని ఈ వాదం తెలియజేస్తుంది. ఉదాహరణకు సాంఘిక అభ్యసన సిద్ధాంతం దీనిని ప్రతిపాదించింది బండురా. ఈయన ప్రకారం వ్యక్తి పుట్టినప్పుడు నుంచి మరణించే వరకు ఎన్నో విషయాలను కేవలం పరిశీలించి నేర్చుకుంటానని ఈ వాదం తెలుపుతుంది. 

Also read : ప్రజ్ఞా సిద్దాంతాలు 

సంజ్ఞానాత్మక వికాస సిద్ధాంతం


Please Share it

1 thought on “TET Psychology – 2021 – మనోవిజ్ఞాన శాస్రం”

Leave a Comment

error: Content is protected !!