TET Study Material Psychology – అంతర్ దృష్టి అభ్యసనం

YouTube Subscribe
Please Share it

TET Study Material Psychology – అంతర్ దృష్టి అభ్యసనం 

జర్మన్ దేశానికి చెందిన  కొహిలర్ అంతర్ దృష్టి అభ్యసనంపై ప్రయోగాలు చేశాడు.  అంతర్ దృష్టి అనగా తటాలున అనగా అకస్మాత్తుగా మెదడులో మెరుపులాంటి ఆలోచన రావడం.

గెస్టాల్ట్  వాదులు:-(సంజ్ఞానాత్మక వాదులు): మాక్స్ వర్థిమీర్, ఉల్ఫ్ గాంగ్ కొహెలర్, కర్ట్ కోఫ్లా అంతర్ దృష్టి అభ్యసన సిద్ధాంతాన్ని ప్రతిపాదించారు.

గెస్టాల్ట్ వాదానికి మూల పరుషుడు- మాక్స్ వర్థిమీర్ (ఈయనను ఫాదర్ ఆఫ్ గెస్టాల్ట్  అని పిలుస్తారు). 

సమస్య పరిష్కార పద్ధతి, ప్రాజెక్టు పద్ధతి, అన్వేషణ పద్ధతి , ప్రయోగ పద్ధతుల వల్ల అంతర్ దృష్టి అభ్యసన జరుగుతుంది.

గెస్టాల్ట్ అనేది జన్మని భాషా పదం అనగా సమగ్ర కృతి వ్యవస్థీకృత మొత్తం. సమగ్ర కృతి అంటే వస్తువులను విషయాలను సన్నివేశాలను సంఘటనలను అర్థం చేసుకునే టప్పుడు మొత్తం పరిస్థితిని అవలోకించడం.

TET Study Material Psychology

2.గ్రంథాలు :-

కోహిలర్ వ్రాసిన గ్రంధం :  – The Mentality of Apes, Gestalt Psychology

కోఫ్కా వ్రాసిన గ్రంధం :      – Principles of Gestalt Psychology, The Growth of the Mind

వర్గమీర్ వ్రాసిన గ్రంధం: –  The History of early Reminiscences, Productive Thinking

కొహిలర్  1914 సంవత్సరంలో టెనరీఫ్ దీవులలో సుల్తాన్ అనే చింపాంజీతో పాటు ఇతర చింపాంజీల మీద కూడా ప్రయోగాలు జరిపాడు. పై ప్రయోగాలను గురించి వివరించేందుకు ‘ది మెంటాలిటీ ఆఫ్ ఏప్స్ (The mentality of apes)’ అనే గ్రంథాన్ని రాశాడు.

చింపాంజీలకు, మానవులకు మెదడు పరిమాణం, నిర్మాణంలో చాలా దగ్గరి సంబంధం ఉంది.

కోహెలర్ చింపాంజీలకు అనేక సమస్యలనిచ్చి అవి సమస్యా పరిష్కారమెట్లా చేసింది గమనించాడు

౩.ప్రయోగం :-

ఒక ప్రయోగంలో కోహెలర్ ఒక చింపాంజీని ఒక గదిలో ఉంచి ఆ గది కప్పుకు ఒక అరటి పండ్ల గెలను వేలాడదీశాడు. ఆ గదిలో రెండు కర్రలనుంచాడు. ఆ కర్రలను ఒకదానికొకటి అమర్చడానికి వీలుంది. చింపాంజి మొట్టమొదట ఒకే కర్రతో అరటిపండ్లను అందుకోవడానికి ప్రయత్నం చేస్తుంది. కాని విఫలమవుతుంది. రెండు కర్రలలో ఏదీ కూడా విడివిడిగా వాడినపుడు పండ్లనందుకోవడానికి వీలుగా లేదు. ఉన్నట్లుండి చింపాంజీకో సమస్యా పరిష్కార మార్గం అవగతమైంది. అది మొత్తం సన్నివేశాన్ని గ్రహించగలిగింది. – రెండు కర్రలు కలిపినప్పుడే పండ్లనందుకోవడానికి వీలవుతుందని గ్రహించింది. అంటే చింపాంజీలో ప్రత్యక్ష పునర్వ్యవస్థీకరణ  జరిగిందన్నమాట.

అంతర్ దృష్టి అభ్యసనంలో సమస్యకు పరిష్కార మార్గం ఉన్నట్లుండి అవగత మవుతుంది. పరిష్కార మార్గం మెరుపులాగా (Like a flash) వస్తుంది.

కోహెలర్, కోకా, వెర్డినర్ అనే ముగ్గురు శాస్త్రజ్ఞులను గెస్టాల్టు సునోవిజ్ఞానవేత్తలుగా పేర్కొంటారు. గెస్టాల్టు అనే జర్మను పదానికి అర్థం సమగ్రాకృత్రి (Configuration). గెస్టాల్టు మనోవిజ్ఞానవేత్తలు మొత్తానికి ప్రాముఖ్యత నిచ్చారు. అంటే మొత్తం సనుస్యను అవగాహన చేసుకున్నపుడు అభ్యసనం సక్రమంగా జరుగుతుంది.

అంతర్ దృష్టి అభ్యసనం గణిత సమస్యల సాధనకు Puzzles పూర్తి చేయుటకు ఉపయోగపడుతుంది. దీనిలో అభ్యసకుడు ‘యురేకా’ ను కనుగొన్నాడు. ఆహా అనే పదాలు అభ్యసించేటప్పుడు వ్యక్తం చేస్తాడు.అందుకే అంతర్ దృష్టి అభ్యసనాన్ని “ఆహా అనుభవం” అంటారు.ఈ రకం అభ్యసనం వల్ల విద్యార్థులలో జ్ఞాన నిర్మాణం జరుగుతుంది మానసిక, శాబ్దిక వికాసానికి తోడ్పడుతుంది.

4.విద్యా ప్రాముఖ్యత :

విద్యా రంగంలో అంతర్దృష్టి అభ్యసనం ప్రముఖ స్థానమాక్రమించు కుంటుంది. 

(ఎ) సమస్యా పద్ధతిలో విద్యార్థులకు సమస్యల నిచ్చి వాటికి పరిష్కారం కనుక్కోమన్నప్పుడు వారిలో సృజనాత్మకత పెంపొందుతుంది. ప్రాజెక్టు పద్ధతిలో అంత దృష్టి అభ్యసనం ఉపయోగపడుతుంది. ప్రాజెక్టు అంటే ఒక ఉద్దేశంతో కూడిన కార్యక్రమం ఏర్పాటు చేయడం. విద్యార్థులకు విషయాలు బోధించేటప్పుడు అర్ధసహితంగా (Meaningful) గా బోధించి నపుడు వారావిషయాన్ని సులభంగా అభ్యసిస్తారు.

డి. విద్యార్థులకు విషయాలు బోధించేటప్పుడు ఉపాధ్యాయుడు వ్యవస్థాపనం మీద దృష్టి కేంద్రీకరించాలి. అప్పుడు విద్యార్థులకు బోధనాంశాలు సక్రమంగా అవగత మవుతాయి.

  • అభ్యసన పరిసరాలు అంటే వివిధ భౌతిక స్థానాలు, సందర్భాలు, సంస్కృతుల మధ్య విద్యార్థులు నేర్చుకోవడం.
  • వ్యక్తిగత అభ్యసనం అంటే పరిసరాలతో ప్రతిచర్యనొంది, బాహ్య ఉద్దీపనలు, వనరులు, వ్యక్తిగత అనుభవాలను పునర్వ్యవస్థీకరించే జ్ఞానాన్ని పొందే సామర్థ్యం.
  • సామూహిక అభ్యసనం అంటే మానసికంగా, ఆలోచనాపరంగా సమస్యలను పరిష్కరించడం, ప్రతి వ్యక్తి స్వతంత్రంగా ఇతరులు తెలుసుకున్న మార్గాల ద్వారా నేర్చుకోవడం కోసం ఏర్పడే వ్యక్తుల
  • సమాహారం.అధ్యయన అలవాట్లు సాధారణంగా విద్యార్థులు నేర్చుకొనే విధానాలను సూచిస్తాయి. ఉత్తమమైన అధ్యయన అలవాట్లలో ఇమిడి ఉన్న అంశాలు సమయ నిర్వహణ, స్వీయక్రమశిక్షణ, ఏకాగ్రత, ప్రయత్నాలు.అధ్యయన నైపుణ్యాలు, విద్యార్థులు ఎప్పుడు చదవాలి? ఎలా చదవాలి? ఎక్కడ చదవాలి? లాంటి అంశాలను తెలుపుతాయి.
  • ఒక వ్యక్తి తన స్వీయ అభ్యసనాన్ని కొనసాగించడానికి, నిర్వహించడానికి అంటిపెట్టుకొని ఉండే సామర్థ్యమే నైపుణ్యాలను నేర్చుకోవడం.
  • ఉపాధ్యాయ కేంద్రిత పరిసరాల్లో ఉపాధ్యాయుడే ప్రాథమిక భావ ప్రసారకుడు. అన్నీ తానై తరగతి బోధనాభ్యసన ప్రక్రియను నిర్వహిస్తాడు.
  • విద్యార్థి కేంద్రిత అభ్యసన సన్నివేశంలో అభ్యాసకుడి అనుభవాలు, దృక్కోణాలు, నేపథ్యాలు, ఆసక్తులు, సామర్థ్యాలు, అవసరాలను పరిగణనలోకి తీసుకుంటారు. ఇందులో విద్యార్దే ప్రధానం. భాగస్వామ్య అభ్యసనంలో, విద్యార్థులు జట్టుగా ఏర్పడి ముఖ్యమైన ప్రశ్నలకు జవాబులు కనుగొనడం లేదా అర్ధవంతమైన ప్రాజెక్టును నిర్వహించడం చేస్తారు.
  • సహకార అభ్యసనం అంటే సామాజిక అభ్యసన అనుభవాలను తరగతి గది బోధనాభ్యసన ప్రక్రియలో ఉపయోగించి వ్యక్తిగత అభ్యసనను మెరుగుపరచుకోవడం.అభ్యసన వనరులు అంటే పాఠ్యపుస్తకాలు, వీడియోలు,
  • కంప్యూటర్ సాఫ్ట్వేర్లు, బోధనాభ్యసన కృత్యాలు మొదలైన వాటి సమాహారం.సమస్యలు, ప్రశ్నలను విద్యార్థుల ముందుంచుతూ వారిలో ఆలోచనను రేకెత్తిస్తూ బోధించడమే విచారణ అభ్యసనం.
  • సమస్య సాధన అభ్యసనలో విద్యార్థులు తాము అనుభవపూర్వకంగా తెలుసుకున్న విషయాలద్వారా, అభ్యసనంలో సమస్యలు ఎదురైనప్పుడు తమకు తామే పరిష్కార మార్గాలను కనుక్కొంటారు.
  • సమ్మిళితం అంటే ప్రత్యేక అవసరాలు కలిగిన పిల్లల అవసరాలను తీర్చడంతోపాటు సాంఘిక, సాంస్కృతిక, ఆర్థిక సాంస్కృతికపరమైన పిల్లల వైవిద్య అవసరాలను తీర్చేది. ప్రతి అభ్యాసకుడు ఒక ప్రత్యేకమైన వాడని, భిన్న అభ్యసన అవసరాలు ఉంటాయని ఉపాధ్యాయుడు భావించి తదనుగుణంగా అభ్యసన వ్యూహాలు రూపొందించుకోవాలి.
  • అభ్యాసకుల సంస్కృతి, భాష, ఆచార వ్యవహారాలకు పాఠశాలలో సముచిత ప్రాధాన్యం కల్పిస్తూసమ్మిళిత వాతావరణం ఏర్పడేలా చూడాలి.
  • మూల్యాంకనం వ్యక్తిగత అభ్యసనం, సామూహిక అభ్యసనంతో ఏవిధంగా విభేదిస్తుందో చర్చించండి. ఉపాధ్యాయ శిక్షకుడిగా విద్యార్థి కేంద్రిత అభ్యసనను అమలుపరచడం ఎదుర్కొన్న సవాళ్ళను తెలపండి.భాగస్వామ్య, సహకార అభ్యసనల మధ్యగల పోలికలు, భేదాలను గుర్తించి, ఈ రెండింటిలో ఏది ఉత్తమమైన పద్ధతో తెలపండి.విచారణ అభ్యసనను అనుప్రయుక్తం చేయగలిగే సన్నివేశాలను ఉదాహరణ సహితంగా వివరించండిసమ్మిళిత భావనను వివరించి, అభ్యాసకుల వైవిద్య అవసరాలను ఏ విధంగా సంబోధిస్తారో తెలపండి.

తరగతి గది నిర్వహణ : ఉపాధ్యాయుడు అభ్యాసకులను సందర్భానుసారంగా సజాతీయ లేదా విజాతీయ సమూహాలుగా విభజించిగాని, తరగతి మొత్తంగా గాని లేదా వైయక్తికంగా అభ్యసన ప్రక్రియలు జరిగేలా చూడాలి. సమూహంలోని అభ్యాసకులను విషయం, కృత్యం ఆధారంగా మారుస్తూ ఉండాలి.

సమవయస్కుల ద్వారా అభ్యసన : అభ్యాసకులు ఉపాధ్యాయుడి నుంచే కాక సమవయస్కుల నుంచి అభ్యసన పొందుతారు. కొన్ని సందర్భాలలో ఉపాధ్యాయుడి నుంచి పొందే అభ్యసన కంటే సమవయస్కులతో అభ్యసన పొందే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఎందుకంటే సంకోచం, భయం లేకుండా సందేహాలను ఒకరికొకరు నివృత్తి చేసుకొనే వీలు ఉంటుంది. దీని ద్వారా అభ్యసనలో పాల్గొనే వారికి విషయావగాహనతో పాటు మాట్లాడే నైపుణ్యాలు కూడా పెంపొందుతాయి.

సహకార అభ్యసనం : అభ్యాసనను ఎవరికి వారు ఒంటరిగా నేర్చుకోవడం కాకుండా, అంశాన్ని అందరు కలిసి ఒకరికొకరు సహకరించుకొంటూ అభ్యసనలో ఎదురయ్యే సందేహాలను తీర్చుకుంటూ ముందుకు సాగితే ఫలవంతమైన అభ్యసన కొనసాగుతుంది. దీని ద్వారా సాంఘికీకరణ జరిగి అభ్యాసకులు పాఠశాలకు సర్దుబాటు అయ్యే అవకాశం ఉంది.

Also read : శాస్త్రీయ నిబంధన సిద్ధాంతం

అభ్యసనం 

యత్నదోష అభ్యసన సిద్దాంతం 

స్మృతి – విస్మృతి

అభ్యసన రంగాలు

అభ్యసన బదలాయింపు

ప్రేరణ

సాంఘిక-సాంసృతిక సిద్దాంతము

పరిశీలన అభ్యసన సిద్దాంతము 

కార్యసాధక నిబందనం


Please Share it

Leave a Comment

error: Content is protected !!