Vygotsky Sociocultural Theory Telugu – సాంఘిక-సాంసృతిక సిద్దాంతము

YouTube Subscribe
Please Share it

Vygotsky Sociocultural Theory Telugu – సాంఘిక-సాంసృతిక సిద్దాంతము

రష్యా దేశానికి చెందిన లైవ్  వైగాట్ స్కీ సాంఘిక సాంస్కృతిక అభ్యసనా సిద్ధాంతం ను ప్రతిపాదించారు. ఉద్దీపన ప్రతిస్పందనల మధ్య బంధం ఏర్పడడం ద్వారా అభ్యసనం జరుగుతుందని తెలిపిన ప్రవర్తన వాదులను వ్యతిరేకించి, అనుభవం ద్వారానే జ్ఞాన నిర్మాణం జరుగుతుందని, పియాజే, వైగాట్ స్కీ తెలిపారు. వైగాట్ స్కీ సాంఘిక సాంస్కృతిక అభ్యసనా సిద్ధాంతం సంజ్ఞానాత్మక అభ్యసనముకు సంబంధించినది.

వైగాట్ స్కీ నిర్మాణాత్మక వాదాన్ని అనుసరిస్తూ తన సిద్ధాంతమును ప్రకటించాడు. నిర్మాణాత్మక వాదం ప్రకారం అభ్యసనం అంటే “జ్ఞాన నిర్మాణం”. నిర్మాణాత్మక వాదం ప్రవర్తన వాదాన్ని పూర్తిగా వ్యతిరేకించింది.

నేటి పాఠ్య గ్రంథాల రూపకల్పనలో NCF -2005 నిర్మాణాత్మక వాదం పైన ఆధారపడినది. అనగా 1 నుంచి 10 తరగతుల పాఠ్యపుస్తకాలను నిర్మాణాత్మక  వాదన ఆధారంగా నిర్మించబడ్డాయి.

వైగాట్ స్కీ అతని సమకాలికుడైన పియాజే ఇద్దరు కూడా నిర్మాణాత్మక వాదానికి చెందిన వారే.

పియాజే శిశువు స్వయంగా అన్వేషిస్తూ జ్ఞానాన్ని నిర్మించుకుంటాడు అని ఆయన భావించాడు.ఐతే వైగాట్ స్కీ అధిక సామర్థ్యం ఉన్న ఇతరుల సహాయ సహకారం తో శిశువు జ్ఞాన నిర్మాణం చేసుకుంటాడు అని ఈయన భావించాడు.

అభ్యసనం వికాసాన్ని అనుసరిస్తోందని, పీయాజే వికాసానికి అధిక ప్రాధాన్యత ఇచ్చారు.

ఐతే వికాసమే అభ్యసనాన్ని అనుసరిస్తోందని వైగాట్ స్కీ అభ్యసనానికి అధిక ప్రాధాన్యత ఇచ్చారు.

Vygotsky Sociocultural Theory Telugu

2.వైగాట్ స్కీ రచించిన గ్రంధాలు:-

1). Thought & Language.

2). Psychology of Art. 

వైగాట్ స్కీ మానవుడి లో జరిగే మానసిక ప్రక్రియలను రెండు రకాలుగా వర్గీకరించాడు.

1) దిగువ స్థాయి మానసిక ప్రక్రియలు:-వీటిని అంతర్గత సామర్థ్యాలను అని కూడా చెప్పవచ్చు. ఈ వ్యక్తికి జన్మత పుట్టకతో సహజసిద్ధంగా సంక్రమించే మానసిక అంశాలు.

ఉదాహరణకు గుర్తించడం, గుర్తుకు తెచ్చుకోవడం, పరిశీలించడం, ప్రశ్నించడం, పోల్చడం తెలుసుకోవడం మొదలైనవి.

2). ఉన్నతస్థాయి మానసిక ప్రక్రియలు:-వ్యక్తి సమాజంలో పాల్గొనడం వల్ల వ్యక్తిలోని ఆలోచనలు ఉన్నతంగా వికసిస్తాయని, ఈ మానసిక ప్రక్రియలు తన ప్రవర్తనను తనకు తానుగా నియంత్రించుకునేటట్లు, మరియు దూకుడు ప్రవర్తనను తగ్గించుకునేందుకు ఈ ప్రక్రియలు ఉపయోగపడతాయని తెలిపారు. ఉదాహరణకు :-సాంఘిక విషయాలను విశ్లేషించడం, సంశ్లేషచించడం, సృజనాత్మకంగా ఆలోచించడం, వివెచించడం, విచక్షణ చేయడం మొదలగునవి.

వైగాట్ స్కీ ప్రకారం పిల్లవాని జ్ఞాన నిర్మానానికి దోహదపడే ప్రధాన అంశాలలో

మొదటిది :- సాంఘిక సాంస్కృతిక అనుభవాలు 

రెండవది :-  భాష

వైగాట్ స్కీ ప్రకారం ప్రతి శిశువు పుట్టుకతోనే ఈ ప్రపంచాన్ని అర్ధం చేసుకోవడానికి పరిసరాలతో ప్రతి చర్యలు జరపడానికి కొన్ని ప్రాథమిక మానసిక శక్తులను కలిగి ఉంటాడు. వాటినే వైగాట్ స్కీ “అంతర్గత సామర్థ్యాలు” అన్నాడు .

3.అంతర్గత సామర్థ్యాలు

వైగాట్ స్కీ గుర్తించిన అంతర్గత సామర్థ్యాలు – 4.

1. అవధానం 2. ప్రత్యక్షము

3. సంవేదన 4. స్మృతి

వీటివల్లనే శివువు ఒక విషయాన్ని చిన్నప్పటి నుండి ఏకాగ్రతతో పరిశీలించడం, ఉత్సుకతతో వాటి గురించి ప్రశ్నించడం, వాటి పరోక్షంలో కూడా వాటిని ప్రత్యక్షం చేసుకోగలగడం. వివిధ అనుభవాలను అనుభూతులను పొందుతూ వాటి గురించి ఆలోచించడం. నేర్చుకున్న విషయాలను గుర్తు పెట్టుకోవడం, గుర్తించగలగడం లాంటి ప్రక్రియలను చిన్నతనం నుండే కనబరుస్తుంటాడు.

4.సాంఘిక సాంస్కృతిక అనుభవాలు :

సమాజంలోని శిశువు కంటే అధిక జ్ఞానం ఉన్న / అధిక సామర్థ్యం ఉన్న ఇతర వ్యక్తులతో వివిధ కృత్యాలలో పాల్గొంటూ పరస్పర చర్యలు జరపడం ద్వారా పొందు అనుభవాలను “సాంఘిక అనుభవాలు” అంటారు.

1). MKO:- (more knowledge other):- ఒక భావన లేదా నైపుణ్యము నేర్చుకునే క్రమంలో ఆ రంగంలో మరింత జ్ఞానం కలవారి, నుండి శిశువు ఉన్నత శ్రేణి మానసిక చర్యలను అభివృద్ధి చేసుకుంటాడు.

ఉదాహరణకు తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, వయసులో పెద్దలు, కంప్యూటర్లు, పుస్తకాలు, ఇంటర్నెట్. మొదలైనవి.

2).ZPD :- (Zone of Proximal development) (సామీప్య వికాస మండలం):– శిశువు ఏదైనా ఒక కృత్యము ఎవరి సహకారం లేకుండా తన సామర్థ్యం మేరకు, కొంతవరకు నేర్చుకో గలుగుతాడు.  ఐతే అదే కృత్యము ఎక్కువ సామర్థ్యం ఉన్న ఇతరుల (MKO) సహకారంతో పూర్తిగా నేర్చుకో గలడు. ఇలా తను స్వయంగా నేర్చుకునే దానికి ఇతరులు సహకారంతో నేర్చుకునే దానికి మధ్య ఉండే తేడానే ZPD అంటారు.

3). స్కఫోల్డింగ్/సారువ : ఒక కృత్యం లో శిశువు కంటే అధిక జ్ఞానం ఉన్న మరొక వ్యక్తి శిశువుకు అందించే సహకారం/సహాయం/మార్గదర్శకత్వం/శిక్షణననే స్కఫోల్డింగ్ అంటారు.

స్కఫోల్డింగ్ వల్లనే శిశువు తన ZPD ని తన పూర్తి సామర్థ్యం మేరకు విస్తృత పరచుకో గలుగుతాడు.

5.జ్ఞానాత్మక వికాసం- భాష పాత్ర

వైగాట్ స్కీ పిల్లల జ్ఞానాత్మక వికాసానికి భాష ముఖ్యపాత్ర వహిస్తుందని భావించాడు.

పెద్దలతో ఉపాధ్యాయులతో సమవయస్కులు లతో మాట్లాడటానికి భాష ప్రక్రియలను అంతర్లికరణం చేసుకోవడానికి ఉపయోగిస్తారు.

సాధారణంగా చిన్నపిల్లలను గమనించిన్దయితే ఆటలలో ఉన్నప్పుడు తరచుగా వారు తమకు తామే పెద్దగా/గట్టిగా మాట్లాడుకోవడాన్ని గమనిస్తాం. వైగోట్ స్కీ ప్రకారం వీరు స్వీయమార్గదర్శకత్వం కోసం తమకు తామే మాట్లాడుకుంటారు.

పిల్లలు పెరగడం వల్ల క్రమంగా వాని మానసిక సామర్థ్యాలు అభివృద్ధి చెంది, కృత్యాలు సులభంగా చేయగలగడం వల్ల వరి స్వీయ నిర్దేశిత భాషణ, అంతర్లీనమై, నిశ్శబ్దకరమైన అంతర్భాషణంగా మారుతుంది.

పిల్లలు పెరిగి పెద్దవారైన తరువాత వారు కొన్ని పరిస్థితులలో ఆలోచించుకొనేటప్పుడు కృత్యాలు నిర్వహించేటప్పుడు తమలో తామే లేదా లోలోపల మాట్లాడుకోవడన్ని గమనించవచ్చు.

బాల్యదశలో మొదలయ్యే వ్యక్తిగత భాషణం (private Speech) వ్యక్తి పెద్దవాడయ్యే నాటికి అనుభవాలు, మానసిక ప్రక్రియల వల్ల అంతర్భాషణం (Inner Speech) గా మారుతుందని వైగోట్ స్కీ చెప్పాడు.

పిల్లలు ఆలోచించడానికి, ప్రవర్తనకు, చర్యలను ఎన్నుకోవడానికి భాష తోడ్పడుతుంది కాబట్టి భాష అన్ని ఉన్నత సంజ్ఞానాత్మక ప్రక్రియలకు మూలం అని వైగోట్‌స్కీ భావించాడు.

Also read : శాస్త్రీయ నిబంధన సిద్ధాంతం

అభ్యసనం 

యత్నదోష అభ్యసన సిద్దాంతం 

స్మృతి – విస్మృతి

అభ్యసన రంగాలు

అభ్యసన బదలాయింపు

ప్రేరణ

పరిశీలన అభ్యసన సిద్దాంతము 

అంతర్ దృష్టి అభ్యసనం 

కార్యసాధక నిబందనం


Please Share it

Leave a Comment

error: Content is protected !!