Abhyasanam – అభ్యసనం

YouTube Subscribe
Please Share it

Abhyasanam – అభ్యసనం

అనుభవం లేదా శిక్షణ వల్ల వ్యక్తి ప్రవర్తనలో కనిపించే శాశ్వతమైన మార్పునే అభ్యసనం అంటారు.

అభ్యసనం అనేది వ్యక్తి పుట్టకతో ప్రారంభమై అతను మరణించే వరకు కొనసాగే నిరంతర ప్రక్రియ. సహజంగా వ్యక్తిలో మార్పులు అనేవి రెండు రకాలుగా సంభవిస్తాయి.

1). పెరుగుదల వల్ల

2). అనుభవం వల్ల

పెరుగుదల వల్ల కలిగే మార్పులు అభ్యసనం కావు ఈ విషయం గుర్తుంచుకోవాలి, ఐతే అనుభవం వల్ల సంభవించే ప్రతి మార్పు అభ్యసనమే అవుతుంది. అనుభవం శిక్షణ లేకుండానే వ్యక్తి ప్రవర్తనలో కొన్ని మార్పులు వస్తుంటాయి. ఇవి అభ్యసనాలు కావు. 

1.అభ్యసనాలు కానివి:- Abhyasanam 1

1). సహజాతాలు :- పుట్టుకతోనే ప్రతి శిశువుకి ఏడ్వటం, నవ్వటం, విస్మయం చెందడం, లాంటి సహజసిద్ధ ఉద్వేగాలను సహజాతాలు అంటారు.ఇవి అభ్యసనాలు కావు.

2). పరిపక్వత ద్వారా వచ్చే మార్పులు:-

అనుభవం /శిక్షణ అవసరం లేకుండానే జెనటిక్ కోడ్ వల్ల ఆయా వయస్సు వచ్చేసరికి శిశువులో కొన్నిసహజ భౌతిక మానసిక శక్తులు వాటికవే వికసించడాన్ని పరిపక్వత /పరిణితి అంటారు. ఈ మార్పులు అభ్యసనాలు కావు. ఉదాహరణకు :-

3 నెలలు నిండే సరికి శిశువు తలను నిలపగలగడం.

6 నెలలు నిండేసరికి శిశువు కూర్చో గలగడం.

9 నెలలు నిండేసరికి నిలబడగ గలగడం.

3). ప్రతిక్రియలు:- వీటినే అసంకల్పిత ప్రతీకార చర్యలు/నిబంధన రహిత ప్రతిచర్యలు అంటారు. వీటికి ఎలాంటి శిక్షణ అవసరం ఉండదు. ఇవి స్వయం చోదిత నాడీ వ్యవస్థ ఆధీనంలో ఉంటాయి.

ఉదాహరణకు ఉఫ్ అనగానే కళ్ళు మూయుట.

వేడి వస్తువు తాకగానే వెంటనే చెయ్యి వెనకకు తీసుకొనుట.

5). గుడ్డి అనుకరణలు:-ఆలోచన లేకుండా ఒక ప్రవర్తనను అనుకరించడం గుడ్డి అనుకరణ అంటారు. ఇలాంటివి అభ్యసనా లు అనిపించుకోదు ఎందుకంటే ఈ ప్రవర్తన తాత్కాలికమైనది. ఉదాహరణకు మూడు లు తల్లిదండ్రుల ప్రవర్తనను గుడ్డిగా అనుకరించడం.

2.అభ్యసనం యొక్క లక్షణాలు:-

 a). అభ్యసనం సార్వత్రిక మైనది:-

అనగా జీవమున్న ప్రతి జీవిలో అభ్యసనము జరుగుతుంది. అభ్యసనానికి జాతి, మతం, కులం, లింగం, భాషా భేదాలు ఉండక ప్రతి ఒక్కరూ అభ్యసించగలరు.

b). అభ్యసనం జీవిత పర్యంతం జరిగే పక్రియ:-

అనగా జీవి చనిపోయేంతవరకు అతనిలో నిరంతరాయంగా అభ్యసన ప్రక్రియ కొనసాగుతుంది. అనగా పుట్టినప్పటి నుంచి చనిపోయేంత వరకు ఏదో ఒక విషయాన్ని నేర్చుకుంటూనే ఉంటాము.

C). అభ్యసనం ఫలితం కాదు ప్రక్రియ:-

ఎందుకనగా అభ్యసనం అనేది ఆగిపోయేది కాక ఎప్పుడు కొనసాగుతుంటుంది. ఫలితం అనగా అంతటితో ఆగిపోయేది అని అర్థం. అందువలన అభ్యసనం ప్రక్రియే గాని ఫలితం కాదు అని దీని అర్థం.

D). అభ్యసనం వల్ల ప్రవర్తనలో మార్పు వస్తుంది:-

అభ్యసనం జరిగిన తర్వాత మనిషి ప్రవర్తనలో మార్పు సంభవిస్తుంది.

E). అభ్యసనానికి సంచిత స్వభావము ఉంటుంది:-

ఏదైనా ఒక మార్పు హఠాత్తుగా సంభవించక, వేరు వేరు దశలలో జరిగిన మార్పుల యొక్క ఫలితము. అనగా ఏ మార్పు జరిగినా అది హఠాత్పరిణామం కాదు, అది అనేక దశలలో జరిగిన మార్పుల ఫలితం అని తెలుసుకోండి.

F). అభ్యసన ఫలితం మంచి కావచ్చు చెడు కావచ్చు:-సమ యోజనం /విషమ యువజనం :-

ధనాత్మక మైనది/రుణాత్మక మైనది కావచ్చు :-

మనం ఏది నేర్చుకున్న అది అభ్యాసమే అది చెడు కావచ్చు మంచి కావచ్చు.

ఉదాహరణకు మీరు పేకాట నేర్చుకున్నారు అది కూడా ఒక అభ్యాసనమే కానీ అది ఒక చెడ్డ అభ్యసనం.

మీరుమంచి మంచి వంటలు నేర్చుకున్నారు, ఇది ఒక ఒక అభ్యాసన మే, కానీ ఇది ఒక మంచి అభ్యసనం.

G). అభ్యసనం శారీరక పెరుగుదల, మానసిక పరిణితి పై ఆధారపడి ఉంటుంది:-

ఏదైనా నేర్చుకోవాలంటే శారీరక పెరుగుదలతో పాటు, మానసిక పరిణితి  ఉంటేనే నేర్చుకో గలుగుతాము. అనగా అభ్యసనం జరుగుతుంది.

H). అభ్యాసము వల్ల సాధనవల్ల సిద్ధించేది అభ్యసనం:-

I). అభ్యాసము జీవి జ్ఞాన, మానసిక, చలనాత్మక రంగాలపై ఆధారపడుతుంది:-

J). అభ్యాసము గతిశీలకమైనది:-

మనం నిరంతరం ఎప్పుడూ ఏదో ఒకటి నేర్చుకుంటూనే ఉంటాము అనగా ఈ రోజు టైపు రైటింగ్ నేర్చుకున్నాము అనుకోండి  కొద్దిరోజుల తర్వాత కంప్యూటర్ నేర్చుకుంటాము ఆ తర్వాత మరొకటి నేర్చుకుంటాము, అనగా నేర్చుకోవడం అనేది నిరంతరం జరుగుతూ ఉంటుంది గతిశీలక మైనది. అనగా ఈ రోజు నేర్చుకున్న అంశం రేపు ఉండదు, రేపు నేర్చుకున్న అంశం తర్వాత ఉండదు. ఎప్పుడూ ఏదో ఒక అంశాన్ని కొత్తగా నేర్చుకుంటూ ఉంటారు. అనగా అభ్యసన అంశం మారుతూ ఉంటుంది.

K). అభ్యసనం బదలాయించబడే ప్రక్రియ:

ఉదాహరణకు:- సైకిల్ నేర్చుకున్న తర్వాత మోటారు సైకిల్ నేర్చుకోవడం.

L). మత్తు పదార్థాల వల్ల అలసట వల్ల వచ్చే మార్పు అభ్యసనం కాదు.

M). అభ్యసన వేగం అన్ని దశలలో ఒకేలా ఉండదు.

O). అభ్యసన ప్రక్రియ గమ్యం నిర్దేశిత మైనది :-

అనగా అభ్యసనంలో గమ్యం, ఆశయం, లక్ష్యం ఉంటుంది.

3.అభ్యసనం నిర్వచనాలు:-

డేస్సికో & క్రాపర్ట్ :- పునర్బలనం చెందిన ఆచరణ వల్ల వ్యక్తి ప్రవర్తన రీతిలో వచ్చే దాదాపు శాశ్వతమైన మార్పు అభ్యసనం. 

కింబ్లే (కింబల్):-పునర్బలనం చెందిన ఆచరణ వల్ల వ్యక్తి ప్రవర్తన శక్తి సామర్థ్యం లో ఏర్పడే సాపేక్షంగా కలిగే సర్వసాధారణమైన శాశ్వతమైన మార్పు అభ్యసనం.

గేట్స్ & జర్ షీల్డ్:-అనుభవం వల్ల శిక్షణ ద్వారా వ్యక్తి ప్రవర్తనలో కలిగే పరివర్తనే (మార్పు) అభ్యసనం.

బెర్న్ హార్డ్:- అనుభవ ఫలితంగా వ్యక్తి ప్రవర్తనలో సాపేక్షంగా కలిగే స్థిరమైన శాశ్వతమైన మార్పే అభ్యసనం.

గార్డినరి మర్పీ:-  పరిసర అవసరాలను ఎదుర్కోవడానికి వీలుగా వ్యక్తిలో కలిగే ప్రతి ప్రవర్తన మార్పే అభ్యసనం.

జి. డి.బోజ్:-ప్రేరణ ప్రతిచర్యల మధ్య దృఢమైన బంధం ఏర్పరిచే ప్రక్రియే అభ్యసనం.

హిల్ గార్డ్:-వ్యక్తిలో అంతర్గత  ప్రవృత్తలలో సహజమైన పరిణితితో, తాత్కాలిక స్థితుల్లో సంబంధం లేకుండా ఏర్పడే దాదాపు స్థిరమైన ప్రవర్తన మార్పులే అభ్యసనం.

హెర్జన్ హాన్:-అభ్యసనం అనేది ప్రవర్తన శక్తి సామర్థ్యం లో ఇంచుమించు శాశ్వతమైన మార్పు .కానీ జబ్బు, అలసట,మత్తు పదార్థాల వల్ల తాత్కాలికంగా జరిగే ప్రవర్తన మార్పులు అభ్యసనం కాదు.

హెన్రి.పి. స్మిత్:-అనుభూతుల ఫలితంగా గత ప్రవర్తనలో దృఢతరం అయినా లేదా బలహీనపడిన మార్పులను గడించిన కొత్త ప్రవర్తనను అభ్యసన అంటాడు. 

స్మిత్:-సరికొత్త ప్రవర్తనను మనలో కలిగించడం, పాత ప్రవర్తనను మరింత బలపరచడం, బలహీనపరచడం వంటివి అనుభవం వల్ల సాధ్యమని, ఆ అనుభవం వల్ల మన ప్రవర్తనలో సంభవించే మార్పును అభ్యసనం అంటారు. 

క్రో &క్రో:-అభ్యసన విషయ జ్ఞానాన్ని, ధోరణులను పెంచే ప్రక్రియను అవరోధాలను అధిగమించే ప్రయత్నం లో మనం చూపే సర్దుబాటు చర్య అని, లక్ష్యాలు సాధించడానికి అభిరుచులను పెంచే అనుభవం ద్వారా ఏర్పడే ప్రవర్తన మార్పును అభ్యసనం అంటారు.

Results

-
Please Share it


Please Share it
Please Share it


Please Share it

#1. పోలీసులంటే భయపడే పవన్ పోలీసు స్టేషన్ కన్పించినా, పోలీసు జీపు చూసినా పోలీసులను పేపర్లో చూసినా, పోలీసులను టీ.విలో చూసిన భయపడటం?

#2. కొహిలర్ అంతర్ ద్రుష్టి అభ్యసన సిద్ధాంతాన్ని ప్రశంసించిన వ్యక్తి?

#3. సాంసంగ్ కంపెని సెల్ ఫోన్ రిపేరి మాత్రమే నేర్చుకున్న సతీష్ రెడ్ మి, నోకియా, ఐ -ఫోన్ కంపెనీల సెల్ ఫోన్లు కూడా రిపేరు కూడా చేయగలడం ఏ సిద్ధాంతం?

#4. వ్యక్తి వ్యక్తిగతంగా నేర్చుకునే కంటే సమాజం ద్వారా శిక్షకుల ద్వారా చక్కగా నేర్చుకుంటాడు అని చెప్పింది ఎవరు?

#5. బడిగంట విని బడికి, గుడిగంట విని గుడికి మాత్రమె బయలుదేరే గణేష్ లో కనిపించే నియమం?

#6. కొత్త మొబైల్ కొన్న మనిషా ఆ సెల్ ఫోన్ ను ఉపయోగిస్తున్న ప్రతిసారి పాత సెల్ ఫోన్ లాగా ఆప్షన్లు వెతుకుతుంటే ఇది ఏ బదలాయింపు?

#7. క్రింది వానిలో దేనికి అభ్యాస నియమము తప్పనిసరి కాదు?

#8. అభ్యసనంలో హెచ్చు, తగ్గులను రెండింటిని సూచించే వక్రరేఖ?

#9. అభ్యసనానికి సంబంధించి భిన్నమయినది ?

#10. 'ది సైకాలజీ ఆఫ్ లర్నింగ్ అండ్ ఇన్ స్ట్రక్షన్స్" గ్రంథ రచయిత ?

#11. అభ్యసనమునకు సంబంధించి సరికానిది ?

#12. అభ్యసనం లక్షణం కానిది ?

#13. అభ్యసనానికి సంబంధించి సరైన ప్రవచనము ?

#14. అభ్యసన సోపానాలలో మొదటిది ?

#15. The Phychology of learning and instructions గ్రంథ రచయిత ?

#16. అభ్యసనంకు అత్యంత తగిన అర్థము ?

#17. శిశువులో కలుగు ఈ మార్పు అభ్యసనం ?

#18. సరికాని ప్రవచనము ?

#19. అభ్యసనానికి సంబంధించి అసత్య ప్రవచనము ?

Finish

Also read : శాస్త్రీయ నిబంధన సిద్ధాంతం

యత్నదోష అభ్యసన సిద్దాంతం 

స్మృతి – విస్మృతి

అభ్యసన రంగాలు

అభ్యసన బదలాయింపు

ప్రేరణ

సాంఘిక-సాంసృతిక సిద్దాంతము

పరిశీలన అభ్యసన సిద్దాంతము 

అంతర్ దృష్టి అభ్యసనం 

కార్యసాధక నిబందనం


Please Share it

1 thought on “Abhyasanam – అభ్యసనం”

Leave a Comment

error: Content is protected !!