Theories Of Intelligence – ప్రజ్ఞా సిద్దాంతాలు

YouTube Subscribe
Please Share it

Theories Of Intelligence – ప్రజ్ఞా సిద్దాంతాలు

ప్రజ్ఞను నిర్వచించడంలో మనోవిజ్ఞానశాస్త్రజ్ఞుల మధ్య ఏకాభిప్రాయం లేదు. వారివారి పరిశీలనల, పరిశోధనల, అనుభవాల ప్రాతిపదికగా ప్రజ్ఞను వివిధ రకాలుగా నిర్వచించారు. అట్లాగే ప్రజ్ఞా సిద్ధాంతాలు కూడా అనేకం వాడుకలోకి వచ్చాయి. వాటిలో ముఖ్యమైనవి. 

1. ఏకకారక సిద్ధాంతం (Uni factory theory)

2. ద్వికారక సిద్ధాంతం (Two-factor theory)

3. బహుకారక సిద్ధాంతం (Multi-factor theory)

4. సామూహిక కారక సిద్ధాంతం (Group factor theory)

5. ప్రజ్ఞా స్వరూప సిద్ధాంతం (Theory of structure of intelligence)  Theories Of Intelligence

1.ఏకకారక  సిద్ధాంతం:-

ఈ సిద్ధాంతాన్ని సాంప్రదాయిక కారక సిద్ధాంతం,సాధారణకారక సిద్ధాంతం, సామాన్య కారక సిద్ధాంతం,నియంతృత్వ సిద్ధాంతం అని కూడా పిలుస్తారు.

ఈ సిద్ధాంతాన్ని ఫ్రాన్స్ దేశస్థుడు బినే (1857-1911) అభివృద్ధి పరిచాడు. స్టెర్న్, టెర్మన్, ఎబ్బింగ్ హాస్ పటిష్ట పరిచారు.

ఒక వ్యక్తికి ఒక రంగంలో ప్రావీణ్యం ఉన్నట్లయితే మిగిలిన అన్ని రంగాలలో అదే విధమైన ప్రావీణ్యం ఉంటుందని ఏక కారక సిద్ధాంతం తెలియజేస్తుంది.  గణితంలో ప్రావీణ్యం గల వ్యక్తి అన్ని సబ్జెక్టుల్లో అంతే ప్రావీణ్యత చెబుతాడని ఈ సిద్ధాంతం తెలుపుతుంది.ఐతే ఈ భావన సరైనది కాకపోవడం వలన చాలామంది ఇది అంగీకరించలేదు. అందుకనే దీనిని సాంప్రదాయిక ప్రజ్ఞ సిద్ధాంతం అంటారు.

2.ద్వి కారక సిద్ధాంతం:-  

చార్లెస్ స్పియర్ మెన్ ఈ సిద్ధాంతాన్ని ప్రతిపాదించాడు. ఈయన రచించిన గ్రంథం The abilities of man. ఈయన ప్రకారం

వ్యక్తిలోని ప్రజ్ఞ –

సాధారణ కారకం (General Factor),

ప్రత్యేక కారకం (Specific factor) ల కలయిక.

ప్రతి వ్యక్తి మానసిక చర్యలో ఈ రెండు కారకాలు ఉంటాయని రెండు ప్రాధాన్యతగల కారకాలని ఈ సిద్ధాంత భావన.

1).సాధారణ కారకం (General Factor):- దీనిని వ్యక్తిలో వుండే సాధారణ ప్రజ్ఞగా చెప్పుకోవచ్చు, ఇది అనువంశికంగా సంక్రమిస్తుంది, ఇనువంశికత వల్ల ప్రభావితమవుతుంది,ఇది అన్ని సామర్థ్యాల్లో కేంద్రకంగా పనిచేస్తుంది.ఇది అన్ని సామర్థ్యాల్లో సమానంగా ఉంటుంది.దీనిని శిక్షణ ద్వారా మెరుగు పరచుకోలేము.దీనిని సాధారణ ప్రజ్ఞా పరీక్షల ద్వారా మాపనం చేయవచ్చు.

2).ప్రత్యేక కారకం (Specific factor):-దీనిని వ్యక్తిలో వుండే నిర్దిష్టమైన ప్రత్యేకమైన ప్రజ్ఞుగా గుర్తిస్తారు.ఇది పరిసరాల వల్ల ప్రభావితమవుతుంది. ఇది అన్ని సామర్థ్యాలలో వేరువేరుగా ఉంటుంది.  ఇది సామర్థ్యానికి, సామర్థ్యానికి మారుతూ ఉంటుంది.  దీనిని శిక్షణ ద్వారా మెరుగుపరచుకోవచ్చు. దీనిని నిర్దిష్ట / ప్రత్యేక పరీక్షల ద్వారా మాపనం చేయవచ్చు. 

ఈ సిద్ధాంతం ప్రకారం ప్రతి సామర్థ్యంలో G కారకం మరియు S-కారకం రెండూ ఉంటాయి.

G కారకం:- కారకం వ్యక్తి యొక్క అన్ని సామర్థ్యాల్లో కేంద్రకంగా పనిచేస్తూ అన్నింటిలోను ఒకే రకమైన సాధారణ ప్రదర్శనను ఇస్తుంది.

S-కారకం:- ఈ కారకం వ్యక్తి యొక్క ఏ సామర్థ్యంలో ఎక్కువగా ఉంటుందో ఆ సామర్థ్యం మిగిలిన సామర్థ్యాల కంటే ఎక్కువ స్థాయిలో కనబరుస్తాడు. ఆ సామర్థ్యానికి సంబంధించిన రంగంలో వ్యక్తి విశేషమైనటువంటి ప్రతిభను కనబరుస్తుంటాడు. అని ఈ సిద్ధాంతం వివరిస్తుంది.

3.బహుకారక సిద్ధాంతం:

ఈ సిద్ధాంతాన్ని అమెరికాకు చెందిన థార్నడైక్ ప్రతిపాదించారు. థార్నడైక్ ని Father of animal Psychology గా పిలుస్తారు. ఈయన అబ్యాసనం, ప్రజ్ఞ పై విస్తృతమైన పరిశోధనలు చేసారు. థార్నడైక్ రచించన గ్రంధం Measurement of Intelligence. 

వ్యక్తిలో ఉన్న అనేక నిర్దిష్ట సామర్థ్యాల మొత్తమే ప్రజ్ఞ – థార్నడైక్.

థార్నడైక్ నిర్దిష్ట సామర్థ్యాలలో వాటి మధ్య కొన్ని సామాన్య అంశాలు ఉంటాయని, అవి వేటికవే స్వతంత్రంగా పనిచేస్తాయని తెలియజేశాడు.బహుకారక సిద్ధాంతం ప్రకారం వ్యక్తికి ఒక రంగంలో ఉన్న సామర్థ్యం వేరొక రంగంలో అదే సమాన స్థాయిలో ఉండదు.సామర్థ్యాలను అంచనా వేయడంలో ఒక రంగంలోని ప్రావీణ్యత వేరొక రంగంలోని ప్రావీణ్యాన్ని నిర్ధారించలేదనేది ఈ సిద్ధాంత భావన.

ఉదా: భౌతికశాస్త్రంలో ఒకరికి గల ప్రావీణ్యత, అతనిలో గల సంగీత ప్రావీణ్యత లేదా చిత్రలేఖనా ప్రావీణ్యం ఎంత ఉంది అనే అంశం మనం తెలుపలేము. మరియు అంతే ప్రావీణ్యత ఉండదు.

4.సామూహిక కారక సిద్ధాంతం:-

సిద్ధాంతాన్ని 1940లో థర్ స్టన్ ప్రతిపాదించాడు.ఈ సిద్దాంతాన్ని ?(సామూహిక కారక సిద్ధాంతాన్ని)  ప్రాథమిక మానసిక శక్తుల సిద్ధాంతం (Theory of Primary Mental Abilities) అని కూడా అంటారు.

ఇతడు రాసిన గ్రంథం – Primary Mental Abilities ఈ పుస్తకంలోనే 7 సామర్థ్యాలను తెలియజేయడం జరిగింది. 

స్పియర్ మెన్ విశ్వసించిన సాధారణ ప్రజ్ఞా భావనను థర్స్టన్ పూర్తిగా ఆమోదించలేదు. ప్రజ్ఞకు మూలకారణం 7 ప్రాథమిక మానసిక సామర్థ్యాలేనని థర్ స్టన్ విశ్వసించాడు. అవి:-

1) సంఖ్యా సామర్థ్యం.2) పదధారాళత,3) శాబ్ధిక సామర్థ్యం,4) ప్రాదేశిక సామర్థ్యం,5) జ్ఞాపక శక్తి సామర్థ్యం

6) ప్రత్యేక సామర్థ్యం (or) ప్రత్యక్ష సామర్థ్యం,7) వివేచన సామర్థ్యం .

ఈ సామర్థ్యాలు వాటికవే స్వతంత్ర్యంగా ఉంటాయి. ఏ మానసిక చర్యలోనైనా పైన తెలిపిన 7 సామర్థ్యాలలో ఏదో ఒకటిగాని, అంతకంటే ఎక్కువగాని, ఉమ్మడిగాని ఈ మానసిక సామర్థ్యాలు ఉపయోగించడం జరుగుతుంది.

ఉదా: 1) .గణితానికి సంబంధించిన అంశంలో సంఖ్యా సామర్థ్యం, జ్ఞాపకశక్తి, వివేచనం సహకరిస్తాయి.

2). భాష విషయంలో పద ధారాళత, జ్ఞాపకశక్తి, వివేకం సహకరిస్తాయి.

Note: కొన్ని పాత తెలుగు అకాడమీ పుస్తకాలలో శాబ్దిక సామర్థ్యం బదులుగా ఆగమన, నిగమన సామర్థ్యం ఇవ్వబడింది గుర్తుపెట్టుకోండి.

5.స్వరూప నమూనా సిద్ధాంతము:- అమెరికాకు చెందిన జె.పి. గిల్ ఫర్డ్ మరియు అతని అనుచరులు 1966 – 67లో సదరన్ కాలిఫోర్నియా యూనివర్సిటీలోని మనోవిజ్ఞాన ప్రయోగశాలలో బుద్ధి లేక ప్రజ్ఞ నిర్మాణాన్ని రూపొందించారు. ప్రజ్ఞలోని విశేషకాలను అంశ విశ్లేషణ అను సాంఖ్యక శాస్త్ర పద్ధతిలో పరిశీలించి, 5 విశేషకాలను ప్రతిపాదించారు.

గిల్ ఫర్డ్ ప్రకారం మనస్సు మూడు ప్రజ్ఞా విశేషాంశాలతో (మితులు లేదా పారా మీటర్స్) లేదా విశేషకాలు కలిగి ఉంటాయని విశేషకాల పరస్పర చర్యా ఫలితమే వ్యక్తి స్వరూపమని గిల్ ఫర్డ్ అభిప్రాయము.ప్రజ్ఞను అర్థం చేసుకోవాలంటే వ్యక్తి ఆలోచనలో ఉండే ఈ మూడు విశేషకాల గురించి పరిగణించాలి.

విశేషకాలు:-

1) విషయాలు (Content): ఏమి ఆలోచన చేయాలని అనునది విషయము తెలుపుతుంది :

1.చిత్రాలు – ( Figures)

2. ధ్వనులు – ( Sounds)

3.చిహ్నాలు లేదా సంకేతాలు- (Symbols)

4.మాటలు -(Semantics)

5.ప్రవర్తన -(Behaviour)

2) ప్రచాలకాలు (Operations): ఎలా లేదా ఏ విధంగా ఆలోచన చేయాలనేది ప్రచాలకాలు తెలుపుతాయి.

1. సంజ్ఞానం – (Cognition)

2.స్మృతి – (Memory)

3. విభిన్న ఆలోచన – ( Divergent thinking)

4. సమైఖ్య ఆలోచన – ( Convergent thinking)

5.మూల్యాంకనం – (Evaluation)

3) ఉత్పన్నకాలు లేదా ఫలితాలు (Products) : ఆలోచనల యొక్క ఫలితాలే ఉత్పన్నకాలు.

1. యూనిట్లు లేదా ప్రమాణాలు : (Units)

2.వర్గాలు – (Classes)

3.సంబంధాలు – (Relations)

4. పద్ధతులు – ( Systems)

5.రూపాంతరాలు – (Transformations)

6. అంతర్భావాలు – (Implications)

Note: గతంలో విశేషకాలు 5x4x6= 120 కారకాలను తెలిపినా ఈ మధ్య కాలంలో తన ప్రజ్ఞా స్వరూప నమూనాను కొద్దిగా మార్పులు చేసి 5x5x6= 150 కారకాలు ఉండేలా విస్తృత పరచారు.

Results

-
Please Share it


Please Share it
Please Share it


Please Share it

#1. ఏ మానసిక చర్యలోనైనా, నైపుణ్యాన్ని ప్రదర్శించడంలో 7 సామర్థ్యాలు ఉపయోగపడతాయని వాటిలో ఎదో ఒకటిగాని లేదా కొన్ని గానీ,అంతకంటే ఎక్కువ గాని ఉమ్మడిగానీ ఉపయోగపడతాయని చెప్పిన సిద్దాంతం ?

#2. ఏకకారక సిద్దాంతాన్ని బీనే మొదటగా ప్రతిపాదిస్తే మిగతా ఏ ముగ్గురు పటిష్టపరచారు?

#3. స్వరూప నమూనా సిద్దాంతంలోని విశేషకాలలోని మూడు అంశాలకు సంబంధించి సరైన అంకె కాని జత?

#4. స్పియర్ మన్ ప్రతిపాదించిన ద్వికారక సిద్దాంతంనకు సంబందించి సరైన ప్రవచనం కానిది?

#5. స్వరూపనమూనా సిద్దాంతం ప్రకారం విషయాలు అనే విభాగంలో లేని అంశం?

#6. స్పియర్ మన్ ప్రతిపాదించిన ద్వికారక సిద్ధాంతంలోని సాదారణ కారకంను ఆమోదించని వ్యక్తి?

#7. సాముహిక కారక సిద్దాంతానికి సంబందించి సరికాని అంశం ?

#8. బహుకారక సిద్దాంతానికి సంబంధించి సరికాని ప్రవచనం?

#9. సైకాలజీ సబ్జెక్టులో ప్రావీణ్యం గల జంగం విశ్వనాథ్ అనే ఆచార్యుడు విద్యాదృక్పథాలు సబ్జెక్టుతో పాటు మెథడాలజీలలో కూడా అంతే ప్రావీణ్యతను ప్రదర్శిస్తాడు అని నమ్మే సిద్దాంతం?

#10. స్వరూప నమూనా సిద్దాంతంలోని విషయాలు అనే అంశం దేని గురించి తెలియజేస్తుంది?

#11. స్వరూప నమూనా సిద్దాంతానికి సంబందించి సరియైన ప్రవచనం కానిది ?

#12. స్పియర్ మన్ ప్రతిపాదించిన ప్రత్యేక కారకమునకు సంబందించి సరి కాని అంశం ?

#13. ప్రజ్ఞలోని 3 విశేషకాలను అంశ విశ్లేషణ అను సాంఖ్యక శాస్త్ర పద్దతిలో పరిశీలించి చెప్పిన వ్యక్తి ?

#14. కింది వానిలో సరైన జత ?

#15. రమ్య సైకాలజీ 100 ఉచిత టెస్టులను రాయడానికి తన సెల్ ఫోన్ లో జంగం విశ్వనాథ్ సార్ APP ని install చేస్కొని ఒక 10 ని||లలో APP లోని ఆప్షన్స్, పనితీరు త్వరగా తెల్సుకుంది ,అంతే గాక ఆ అమ్మాయి laptop ని కూడా చక్కగా త్వరగా ఉపయోగించడం నేర్చుకుంది, అంతేగాక అమ్మాయి ఏ కొత్త పరికరానైనా త్వరగా అవలీలగా ఉపయోగిస్తే థార్న డైక్ ప్రకారం ఆ అమ్మాయికి గల ప్రజ్ఞ ?

#16. ఈ క్రింది వానిలో ఇంగ్లీష్ పదజాలం ఆధారంగా సరైన సిద్దాంతంగా పిలవబడని సిద్దాంతం ?

#17. స్వరూప నమూనా సిద్దాంతంలోని విశేషకాలలోని 3 అంశాలలో లేని అంశం ?

#18. థార్నడైక్ ప్రజ్ఞా నికషలో CAVDలో "V " దేనిని సూచిస్తుంది .?

#19. ద్వికారక సిద్దాంతం ప్రకారం G - Factor కి సంబందించి సరికాని అంశం ?

#20. ఏకకారక సిద్దాంతానికి సంబంధించి సరికాని అంశం ?

#21. వెన్నెల అనే 7వ తరగతి అమ్మాయికి అన్ని సబ్జెక్టులలో 60% మార్కులు రాగా కేవలం హిందీలో మాత్రం 80 మార్కులు వచ్చాయి. ఈ సబ్జెక్టులో ఎక్కువమార్కులు రావడానికి అవసరమైన ప్రధాన కారకం ?

#22. ప్రచాలకాలలోని ఒక కారకమైన సమైఖ్య ఆలోచనకు మారుపేరు కానిది?

#23. థార్నడైక్ సూచించిన ప్రజ్ఞా లక్షణాలకు సంబంధించి "LRSA" లో " S " దేనిని సూచిస్తుంది

#24. కింది వానిలో సిద్దాంతాలను కనుగొన్న,ప్రతిపాదించిన అంశాల ఆధారంగా సరికాని జత?

#25. ప్రజ్ఞకు సంబంధించి థర్ స్టన్ ప్రతిపాదించిన 7 సామర్థ్యాలలో లేని సామర్థ్యం ?

#26. వ్యక్తిలో ఉండే నిర్దిష్ట సామర్థ్యాల మొత్తమో ప్రజ్ఞ అని మరియు నిర్దిష్ట సామర్థ్యాలలో వాటి మధ్య కొన్ని సామాన్య అంశాలు ఉంటాయని అవి వేటికవే స్వతంత్రంగా పనిచేస్తాయని తెలియజేసే సిద్దాంతం ?

#27. వెష్లర్‌ ‌ప్రజ్ఞామాపనిలో పరీక్షల సంఖ్య ?

#28. ఆర్మీ - బీటా పరీక్ష, రావెన్స్ ‌పొగ్రెసివ్‌ ‌మాత్రికల పరీక్షలు ఎలాంటి పరీక్షలు ?

#29. థారన్‌డైక్‌ ‌ప్రకారం అమూర్తప్రజ్ఞ అనగా ?

#30. ఒకే సమయంలో ఒక పెద్ద సమూహానికి ఉండే చాలామంది వ్యక్తులను పరీక్షించేందుకు ఉపయోగపడే ప్రజ్ఞా పరీక్షలను ఏమంటారు?

#31. నమూనాలను గుర్తించేవారు, తార్కికంగా ఆలోచించేవారు ఏ రకమైన ప్రజ్ఞను కలిగి ఉంటారు?

#32. ఒక పిల్లవాని వయసు 10 సం।।లు. అతని మానసిక వయస్సు 12 సం।।లు అయిన అతని ప్రజ్ఞాలబ్ధి?

#33. 16 సం.రాల పిల్లవాడి ప్రజ్ఞాలబ్ది 75, అతని యొక్క మానసిక వయస్సు ఎంత?

#34. హోవార్డ్ ‌గార్డెనర్‌ ‌బహుళప్రజ్ఞా సిద్ధాంతం ప్రకారం ఎ.ఆర్‌. ‌రెహమాన్‌ ‌మరియు ఉస్తాద్‌ ఏ ‌ప్రజ్ఞను కలిగి ఉంటారు ?

#35. ప్రజ్ఞా లబ్ధి గణనల విస్తరణ?

#36. ఈ కింది వాటిల్లో సరికానిది ?

#37. వ్యక్తుల తెలివితేటలను కొలవడానికి సైకాలజిస్టులు వాడే కొలమానాన్ని ఏమంటారు?

#38. మొదటి ప్రజ్ఞా పరీక్ష ఏ భాషలో రూపొందించారు?

#39. రావెన్స్‌ స్టాండర్డ్‌ ప్రొగ్రెసివ్‌ మాట్రిసస్‌ టెస్ట్‌ను రూపొందించినది?

#40. గార్డెనర్‌ అభిప్రాయలో అంత:పరిశీలన, ఆత్మస్పందన సామర్థ్యాలతో కూడి, వ్యక్తి తన గురించి తాను ఒక అంచనాకు రాగల్గటం ?

#41. ఇతరుల భావాలు, ప్రేరకాలు మొ॥ వాటిని గురించి తెలుసుకోగలిగే సామర్థ్యం ఉండటం అనేది గార్డెనర్‌ ప్రకారం ఏ ప్రజ్ఞను సూచిస్తుంది?

#42. గార్డెనర్‌ అభిప్రాయంలో వస్తువులను వారికి అనుగుణంగా ఉపయోగించడంలో కదలికల ద్వారా భావాలు వట్యక్తీకరించడంలో సిద్ధహస్తులు ఏ ప్రజ్ఞను కల్గి ఉంటారు?

#43. మనచుట్టూ ఉన్న వృక్షజంతుజాలాల్లో అనేక రకాలు గుర్తించి, వర్గీకరించగలిగే సామర్థ్యం గార్డెనర్‌ ప్రకారం ఏ ప్రజ్ఞను సూచిస్తుంది?

#44. నిగమనాత్మక వివేచన చేయగలగడం అనేది గార్డెనర్‌ ప్రకారం ఏ ప్రజ్ఞను సూచిస్తుంది?

#45. ‌గార్డెనర్‌ ‌ప్రకారం శిల్పులు, ఆర్కిటెక్చర్లు ఏ రకమైన ప్రజ్ఞను కల్గి ఉంటారు ?

#46. ఇతరుల మనోభావాలు, కోరికలు, ప్రేరణలు మొ॥ వాటిని గ్రహించి అర్థం చేసుకోగల సామర్థ్యం గార్డెనర్‌ ప్రకారం ఏ ప్రజ్ఞను సూచిస్తుంది?

#47. ఒక విద్యార్థి శారీరక వయస్సు 10 సంవత్సరాలు. అతని మానసిక వయస్సు 4 సంవత్సరాలు. అతని ప్రజ్ఞాలబ్ది ?

#48. వెష్లర్‌ పిల్లల ప్రజ్ఞామాపని (WISC) ఏ వయసు పిల్లలకు ఉపయోగిస్తారు?

#49. ఓటిస్‌ మానసిక సామర్థ్యాల పరీక్ష, ఆర్మీ - ఆల్ఫా పరీక్షలు ?

#50. వెష్లర్‌ వయోజన ప్రజ్ఞా మాపనిలో (WAIS) అంశాలు ?

#51. కదలికల ద్వారా భావవ్యక్తీకరణలో సిద్ధహస్తులైనవారు ఏ రకమైన ప్రజ్ఞను కలిగి ఉంటారు?

#52. రాయడంలో, పదాలను సృష్టించటంలో అమితమైన ఆనందాన్ని పొందేవారు ఏ రకమైన ప్రజ్ఞను కలిగి ఉంటారు?

#53. నాల్గవ తరగతి చదువుతున్న రాము మాటలను, భావాలను, నమూనాలను, సంఖ్యలను అర్థం చేసుకొని నేర్పుగా ఉపయోగిస్తున్నట్లయితే థార్న్‌డైక్‌ ప్రకారం అతను కనబరుస్తున్న ప్రజ్ఞ?

#54. హోవార్డ్‌ గార్డెనర్‌ బహుళప్రజ్ఞా సిద్ధాంతం ప్రకారం ప్రవచనాలు చెప్పే చాగంటి కోటీశ్వరరావ్ గారు ఏ ప్రజ్ఞను కలిగి ఉంటారు?

#55. ఒక పిల్లవాడి మానసిక వయసు 5 సం. మరియు వాస్తవిక వయసు 4 సం॥రాలు అయిన అతడి ప్రజ్ఞా లబ్ధి?

Finish

Also read : రక్షక తంత్రాలు


Please Share it

1 thought on “Theories Of Intelligence – ప్రజ్ఞా సిద్దాంతాలు”

Leave a Comment

error: Content is protected !!