Abraham Maslow theory – అవసరాల అనుక్రమణిక సిద్ధాంతము

YouTube Subscribe
Please Share it

Abraham Maslow theory – అవసరాల అనుక్రమణిక సిద్ధాంతము

అమెరికా దేశానికి చెందిన అబ్రహంమాస్లో “అవసరాల అనుక్రమణిక సిద్ధాంతాన్ని” ప్రతిపాదించారు.మాస్లో అవసరాలను నిచ్చెనలోని మెట్లతో పోచ్చాడు. అబ్రహం మాస్లో మానవతావాది. ఇతడు ప్రవర్తన వాదానికి ఆద్యుడైన వాట్సన్, థార్పడైక్ పర్యవేక్షణలో అమెరికాలోని వివిధ విశ్వవిద్యాలయాలలో పనిచేశారు.

మాస్లో వ్యక్తిలో అవసరాలు అనేవి ఏ విధంగా వరుస క్రమమంలో ఉంటాయో వివరించారు. మానవుడు ఒక అవసరం తీరిన వెంటే మరొక అవసరం తీర్చుకోవడానికి ప్రయత్నిస్తాడు. మాస్లో తన అవసరాల అనుక్రమణికలో చేర్చుటకు ఆత్మ ప్రస్తావన అనే పదాన్ని Kurt- Gold stein నుండి గ్రహించారు.వ్యక్తుల అవసరాల బట్టి మాస్లో ఒక క్రమ పట్టికను తయారు చేశాడు. ఇతను అవసరాలను నిచ్చెనలోని మెట్లతో పోల్చాడు,

Abraham Maslow theory

a).నిమ్నక్రమ అవసరాలు :

1. శారీరక అవసరాలు: నీరు, నిద్ర, ఆహారం,గాలి,లైంగిక అవసరాలు,విశ్రాంతి

2. రక్షణ, భద్రత అవసరాలు: గృహం, ఇతరుల నుండి తోడ్పాటు,తోడు

b).ఉన్నతశ్రమ అవసరాలు:

1.ప్రేమ, వాత్సల్య సంబంధిత అవసరాలు: తల్లిదండ్రుల నుండి, బంధువుల నుండి ప్రేమను పొందటం.

2.గుర్తింపు, ఆత్మ గౌరవ అవసరాలు : ఉద్యోగం, డబ్బు, హోదా.

3.ఆత్మ ప్రస్తావన-ఆత్మ సాఫల్య అవసరం: చేసిన పనిలో సంతృప్తిని పొందడం

1. శారీరక అవసరాలు: మానవుడు భూమి మీద మనుగడ సాగించుటకు అవసరమయ్యే ఆహారము, నిద్ర, విశ్రాంతి, గాలి, లైంగిక జీవనం, మాతృత్వ అవసరం మొదలగునవి శారీరక అవసరాలు. ఈ అవసరాలు తీరినప్పుడే వ్యక్తి రెండవ అవసరమైన రక్షణ అవసరాలను తీర్చుకునే ప్రయత్నాలు చేస్తాడు.

2. రక్షణ, భద్రత అవసరాలు: ఈ అవసరములో పెద్దల తోడుకావాలనుకోవడం, గృహము, ఇతరులతో కలిసి ఉండాలని కోరుకొని తనకు హాని, అపాయాలు కలగకుండా ఉండాలని కోరుకుంటాడు.

3. ప్రేమ, వాత్సల్య సంబంధిత అవసరాలు : విద్యార్థులు ఇంట్లో తల్లిదండ్రులు, అన్నదమ్ములు, అక్క చెల్లెళ్ళ నుండి, పాఠశాలలో స్నేహితుల నుండి, ఉపాధ్యాయుల నుండి ప్రేమను పొందాలని ఆరాటపడతారు.

4. గుర్తింపు, ఆత్మ గౌరవ అవసరాలు : మాస్లో ఈ అవసరంలో 2 ఉప అవసరాలను గుర్తించాడు. అవి

a).స్వయం ఆత్మాభిమానం:  తనలోని ప్రవర్తన అంశాలు, సామర్థ్యాలు, వైఖరులు, విలువలను తనకు తానుగా గౌరవించుకోవడం.

b).ఇతరుల నుండి ఆత్మాభిమానాన్ని కోరుకోవడం : ఈ అవసరం తీర్చుకోవడానికి ఇతరులు తనను గుర్తించాలనుకోవడం, పరువు ప్రతిష్టలు సంపాదించుకోవడం.

5. ఆత్మ ప్రస్తావన-ఆత్మ సాఫల్య అవసరం: ఈ అవసరం వ్యక్తిని ప్రస్తుత స్థితి నుండి ఉన్నత స్థితికి తీసుకెళుతుంది. ఈ అవసరం ద్వారా వ్యక్తి ఇతరులపై జాలి, దయను కనబరిచి ఇతరుల అవసరాలను అర్థం చేసుకోగలుగుతాడు. ఉన్నత లక్ష్యాలను ఏర్పరుచుకొని సాధించే ప్రయత్నం చేస్తాడు. ఇతరుల కంటే తన సంతృప్తికే విలువనిస్తారు.

గమనిక: కొందరు శాస్త్రవేత్తలు సౌందర్య అవసరాలను కూడా ఉన్నత క్రమ అవసరాలలో చేర్చడం జరిగింది. ఉదా: సంగీతం, చిత్రలేఖనం, అందం.

ఉదాహరణలు 
  • ఒక విద్యార్థి తనను అందరూ గుర్తు పట్టాలని అందరిలో  ఒకరిగా కాకుండా వందలో ఒకరిలా ఉండాలని భావిస్తే ఈ అవసరం అబ్రహంమాస్లో ప్రకారం – గుర్తింపు అవసరం.
  • ఆత్మ ప్రస్థావన అనే పదాన్ని ప్రతిపాదించిన వ్యక్తి – కర్ట్ గోల్డ్ స్టీన్
  • నిరుద్యోగం కంటే చిరుద్యోగం ఏదైనా ఒకటి చేయాలని ఆరాటపడితే ఇది ఏ అవసరం – రక్షణ అవసరం
  • ఇతరులకు నచ్చకపోయిన తనకు నచ్చితే ఎలాగైనా బతకవచ్చు, ఒకరి తృప్తి కాదు ఆత్మ సంతృప్తి ముఖ్యము అని భావించే వ్యక్తికి ఆశించే అవసరం – ఆత్మ సంబంధ అవసరం
  • మమత, ఆప్యాయత, అనురాగం పొందాలనుకోవడం మాస్లో ప్రకారం ఎ అవసరం– ప్రేమ అవసరం. 
  • రాఖీ పండగ రోజు రాము తనకు కూడా అక్క ఉంటే రాఖీ కట్టేదని బాధపడితే ఇది ఏ అవసరం – ప్రేమ సంబంధ అవసరం.
  • ఆహారం, నిద్ర ఈ అవసరాలు – శారీరక అవసరాలు.
  • తను సంపాదించిన సొమ్ములో సగం పేదలకోసం దానం చేయటం ద్వారా వ్యక్తి ఆత్మసంతృప్తి చెందటం అనేది మాస్లో ప్రకారం ఎ శ్రేణికి చెందుతుంది ? – 5 వ శ్రేణి 
  • ఇతర పిల్లలు తనతో స్నేహం చేయకుండా తనను దూరంగా ఉంచుతున్నారని మానసికంగా బాధపడుతున్న రాధ మాస్లో ప్రకారం ఎన్నవ శ్రేణి అవసరం ? – 4వ శ్రేణి అవసరం 
 

Results

#1. క్రింది వాటిలో శారీరక అవసరం (Physical need ) కానిది ?

#2. మాతృ ఉత్సుకత అనేది ?

#3. మాస్లోవ్ ప్రకారం “సామాజిక అంతస్థు” అనేది ?

#4. గృహం, బట్టలు అనేవి ?

#5. మాస్లోవ్ ప్రకారం నిమ్న శ్రేణి అవసరం (lower order need) ?

#6. క్రింది వాటిలో గౌణ అవసరం (secondary need) ?

#7. క్రింది వాటిలో ప్రాథమిక అవసరం (Primary need) ?

#8. క్రింది వాటిలో నిమ్న శ్రేణి అవసరం (lower order need) ?

#9. ఆహారం, నీరు,నిద్ర, విశ్రాంతి, లైంగిక జీవనం, మాతృత్వ అవసరం ?

#10. పెద్దల తోడు, బట్టలు, గృహం కావాలనుకోవడం ?

#11. తల్లిదండ్రులు, స్నేహితులు, ఉపాధ్యాయుల నుండి ప్రేమను కోరుకుంటారు ?

#12. ఈ అవసరం తీరకపోతే సంఘ విద్రోహ చర్యలు లేదా ఆత్మహత్యా ప్రయత్నాలు కనబరుస్తారు?

#13. కీర్తి ప్రతిష్టలు, సామాజిక అంతస్తు ?

#14. అందరి పట్ల దయ, జాలి, వాస్తవాలు అర్థం చేసుకోవడం, మానవతా దృక్పథంతో మెలగడం?

#15. మాస్లో నిచ్చెనలో పైభాగాన చివర ఉన్న అవసరం?

#16. మాస్లో పట్టికలో 5వ అవసరం ?

#17. క్రింది వాటిలో గౌణ అవసరం (secondary need) ?

#18. క్రింది వాటిలో ప్రాథమిక అవసరం (primary need) ?

#19. క్రింది వాటిలో గౌణ అవసరం(secondary need) ?

#20. ఏ శాస్త్రవేత్త రాసిన “ఆర్గనిజం” అనే పుస్తకం నుండి “ఆత్మ ప్రస్తావన” అనే పదాన్ని గ్రహించారు?

#21. “అవసరాల అనుక్రమణిక సిద్ధాంతం (The theory of Hierarchy of needs) ప్రతిపాదించినవారు?

Previous
Finish

Also read : Psychology Grand Test – 3

శాస్త్రీయ నిబంధన సిద్ధాంతం

అభ్యసనం 

యత్నదోష అభ్యసన సిద్దాంతం 

స్మృతి – విస్మృతి

అభ్యసన రంగాలు

అభ్యసన బదలాయింపు

ప్రేరణ

సాంఘిక-సాంసృతిక సిద్దాంతము

పరిశీలన అభ్యసన సిద్దాంతము 

అంతర్ దృష్టి అభ్యసనం 

కార్యసాధక నిబందనం


Please Share it

Leave a Comment

error: Content is protected !!