AP TET Pedagogy Classes Telugu

YouTube Subscribe
Please Share it

AP TET Pedagogy Classes Telugu – మంత్రణం

రూత్ స్ట్రాంగ్ : ముఖాముఖి సంబంధాల ద్వారా మంత్రనర్థిలో తీసుకొచ్చే మానసిక అభివృద్ధియే మంత్రణం.

గిల్బర్టన్ : ఇద్దరు వ్యక్తుల మధ్య ఉన్న గతిశీలక సంబంధమే మంత్రణం.

మంత్రణం మార్గదర్శకత్వంలో భాగం,అంతే కాదు,మంత్రణం అనేది ఒక వృత్తి. Counselling లో నిపుణులై Psychologists, సైకియాట్రిస్టు మాత్రమే అందించగలరు.

ప్రవర్తన సమస్యలు, ఉద్వేగ సమస్యలు పరిష్కరిస్తారు మంత్రణ మనోవిజ్ఞాన శాస్త్రము సర్దుబాటు సమస్యలలాంటి తక్కువస్థాయిలోగల సమస్యలను నిర్ధారించి తగిన చికిత్స అందిస్తుంది. మంత్రణం సవ్యంకాని ప్రవర్తన సమస్యలు ఉన్నప్పుడు మాత్రమే అవసరము. కాని మంత్రణంలో వ్యక్తి వికాసం అనువంశికత, పరిసరాలు ఆ వ్యక్తిని ఎలా ప్రభావితం చేసాయో అంచనావేసి సమస పరిష్కారానికి కృషి చేయడం జరగుతుంది.

మంత్రణం సాధారణంగా వ్యక్తిగత సమస్యలకు కుటుంబ సమస్యలకు సాంఘిక సమస్యలకు విద్యా సమస్యలకు పరిష్కారం చూపుతుంది.

మంత్రణం రకాలు:-

1).నిర్దేశక – మంత్రణం:- ( Directive Counselling ):

దీనిని ఇజి. విలియమ్సన్, డార్లే. ప్రతిపాదించారు.నిర్దేశక మంత్రణానికి మరొక పేరు సమస్య కేంద్రీకృత మంత్రణం. (Problem Centered Counselling)

ఈ రకమైన మంత్రణంలో (Counselling) మంత్రకుడికి (Counseller) ఎక్కువ ప్రాధాన్యత ఉంటుంది. మంత్రకుడు తన అభిప్రాయాలను ఆలోచనలను, సలహాలను, స్వేచ్ఛగా బహిర్గతం చేస్తాడు.

మంత్రకుడు క్రియాశీలకుడుగా ఉంటాడు, సహమూర్తి స్థబ్దుడుగా : ఉంటాడు (Client) .సమస్యకు గల కారణాలు, సమస్య పరిష్కార మార్గాలు, మంత్రకుడే సూచిస్తాడు. తనంతటతాను సమస్యను పరిష్కరించుకోలేనపుడు ఈ రకమైన మంత్రణం వ్యక్తికి ఉపయోగపడుతుంది. 

2).అనిర్దేశక మంత్రణం: ( Non – Directive Counselling )::

అనిర్దేశక మంత్రణంను ప్రతిపాదించినది కార్ల్ రోజర్స్. దీనికి మరొక పేరు “సహాయార్థి కేంద్రీకృతమంత్రణం”(Client Centered Counselling) 

సహాయార్థి సమస్య పరిష్కారంలో తమ అభిప్రాయాలను స్వేచ్చగా బహిర్గతం చేస్తాడు.ఈ రకమైన మంత్రణంలో సహాయార్థి చురుకుగా, మంత్రకుడు స్థబ్దంగా ఉంటారు

సహాయార్థి ఏమి మాట్లాడుతున్నాడో మంతకుడు ప్రశ్నించాడు.సమస్యకు గల కారణాలు, సమస్య పరిష్కార మార్గాలు, సహాయార్థి తనంతట తానే తానే తెలుసుకుంటాడు. సహాయార్థి తన సమస్యను పరిష్కరించు కోనప్పుడు ఈ రకమైన మంత్రణం ఉప యోగపడుతుంది. 

దార్శనిక లేదా మిశ్రమ మంత్రణం:-దార్శనిక లేదా మిశ్రమ మంత్రణం ఎఫ్.సి. థార్న్ ప్రతిపాదించారు. దీనికి మరొక పేరు మిశ్రమ మంత్రణం.

ఈ రకమైన మంత్రణంలో సమస్యను బట్టి సహాయార్థి మూర్తిమత్వాన్ని బట్టి అనేక విధానాలను మంత్రకుడు ఉపయోగిస్తాడు.దార్శనిక మంత్రణంలో మంత్రకుడికి మంత్రణంలోని అనేక విధానాలు తెలిసి ఉండాలి.

దార్శనిక మంత్రణంలో ముఖ్యంగా పేర్కొన వలసిన విషయాలు

1. సూచన (Suggestion)

2. సలహా (Advices)

3.సమ్మతింపచేయడం (Persuation)

4. వ్యాఖ్యానించడం (Interpretation)

మార్గదర్శకత్వం 

మార్గదర్శకత్వం అనేది ఒక సహాయ చర్య (Helping process). అది వ్యక్తికి తనకై తాను సమస్యా పరిష్కార మార్గం తెలుసుకోవడానికి దోహదం చేస్తుంది. ఇంకో విధంగా చెప్పాలంటే అది వ్యక్తిని ఆత్మ నిర్దేశకుడుగా (Self directed person) తయారు చేస్తుంది. ప్రతివ్యక్తి తన జీవితంలో అనేక సమస్యలు ఎదుర్కొంటూ ఉంటాడు. పరిసరాలలో అనుగుణ్యాన్ని సాధించడానికి ప్రయత్నిస్తాడు. ఒక్కోసారి తాననుకున్నది సాధించలేకకుంఠనానికి (Frustration) లోనవుతాడు. అటువంటి పరిస్థితిలో మార్గదర్శకత్వం అవసరమవుతుంది. వ్యక్తి తన ప్రజ్ఞను, శక్తి సామర్థ్యాలను, మూర్తిమత్వాంశాలను, భావోద్రేకాలను మొదలై నవాటిని సరిగా అర్థం చేసుకొని వాటిని సక్రమంగా వినియోగించుకోవడంలో మార్గదర్శకత్వం తోడ్పడుతుంది. మార్గదర్శకత్వమనేది సరియైన నిర్ణయాలు తీసుకోవడానికి, సర్దుబాటు సక్రమంగా చేసుకోవడానికి దోహదం చేసే చర్య. ప్రతివ్యక్తికి తన సమస్యకు పరిష్కార మార్గం కనుక్కొని గమ్యాన్ని చేరడానికి అవసరమైన శక్తి సామర్థ్యాలుంటాయి. కాని కొన్ని కుంఠనాలు, అడ్డంకులవల్ల సరియైన నిర్ణయాలు తీసుకోలేకపోతాడు. అటువంటి పరిస్థితిలో మార్గదర్శకత్వంవల్ల వ్యక్తి తన సమస్యకు తానే పరిష్కారమార్గం కనుక్కొని, తన శక్తి సామర్థ్యాలకు తగినవిధంగా సర్దుబాటు చేసుకుంటాడు.

మార్గదర్శకత్వం ద్వారా రెండు విషయాలు సాధ్యమవుతాయి.

1. వ్యక్తి తన శక్తి సామర్థ్యాలను సక్రమ పరిస్థితిలో అవగాహన చేసికొని వాటిని సరియైన రీతిలో వినియోగించుకోవడం.

2. వ్యక్తి మూర్తిమత్వంలో మార్పు తీసుకొనివచ్చి అది సక్రమమైన సర్దుబాటుకు దారి తీసేటట్లు చూడటం.

మార్గదర్శకత్వం 3 రకాలు:-

1. విద్యావిషయక మార్గదర్శకత్వం:

దీని ముఖ్యోద్దేశం విద్యార్థుల అభిరుచులకు (Interests), ప్రజ్ఞకు (Intelligence), సహజసామర్థ్యాలకు (Aptitudes) సరిపోయే కోర్సులను, పాఠ్యాంశాలము (Subjects) ఎన్నుకోవడంలో సహాయపడటం. ఉదాహరణకు ఒక విద్యార్థి ఇంజినీరింగ్ కోర్భూముగాని, వైద్యశాస్త్రాన్నిగాని అభ్యసించాలనుకుంటే అతనికి ఆ రకమైన విద్య నేర్చుకోవడానికి కావలసిన ప్రజ్ఞ, సహజ సామర్థ్యం , మూర్తిమత్వాంశాలు మొదలైనవి ఉన్నాయా లేదా అని మార్గదర్శకత్వం ద్వారా అతనికి విశదపరచడం జరుగుతుంది. ఒకవేళ అతనికా సామర్థ్యాలు లేనప్పుడు అతని సామర్థ్యాలకు సరిపోయే కోర్సును ఎమ్మకోవడంలో మార్గదర్శకత్వం తోడ్పడుతుంది.

2. ఔద్యోగిక మార్గదర్శకత్వం:

విద్యార్థి దశ తరవాత యువతీయువకులు ఉద్యోగం కోసం ప్రయత్నిస్తారు. ఔద్యోగిక మార్గదర్శకత్వంలో వ్యక్తి విద్యార్హతలు, అభిరుచులు, సహజసామర్థ్యాలు, మూర్తిమత్వ లక్షణాంశాలు మొదలైనవాటినిబట్టి అతనికి సరియైన ఉద్యోగాన్ని ఎన్నుకోవడంలో మార్గదర్శకత్వం ఇవ్వడం జరుగుతుంది. వ్యక్తుల్లో ఎలా తేడాలుంటాయో ఉద్యోగార్హతల్లో నిర్వహణలో కూడా అనేక తేడాలుంటాయి. ప్రతివ్యక్తి ప్రతిపనిని చేయలేడు. ఉదాహరణకు అందరూ విమాన చోదకులు (Aeroplane pilots) కాలేరు. అదేవిధంగా ప్రతి ఒక్కరు ఇంజనీర్లు కాలేరు.ఔద్యోగిక మార్గదర్శకత్వంలో కొన్ని పరీక్షల ద్వారా వ్యక్తి సామర్థ్యాలను మాపనం చేస్తారు. అదేవిధంగా ఉద్యోగాన్ని విశ్లేషణం చేసి ఉద్యోగానికి కావలసిన అర్హతలు, లక్షణాంశాలు మొదలైన వాటిని విశ్లేషణ చేస్తారు. ఆ తరవాత సరియైన వ్యక్తిని సరియైన ఉద్యోగానికి జతపరుస్తారు.

ఔద్యోగిక మార్గదర్శకత్వంలో ఈ సమస్యలను పరిష్కరించవచ్చు.

1. వ్యక్తిలో ఉద్యోగ సంతృప్తి లోపించినప్పుడు.

2. వ్యక్తి ఉద్యోగంలో ఎక్కువగా నిలకడగా పనిచేయలేకపోయినప్పుడు.

3. సంస్థలోని ఇతర వ్యక్తులతో సరియైన సంబంధాలు నెలకొల్పుకోలేక పోయినప్పుడు.

4. విధి నిర్వహణలో సంఘర్షణలకు లోనవడం మొదలెనవి.

3. వ్యక్తిగత మార్గదర్శకత్వం:

ఈ మార్గదర్శకత్వం వ్యక్తిలోని అవసరాలకు, కోరికలకు, ఆశయాలకు, వాస్తవికాలకు మధ్య సరియైన సంబంధ బాంధవ్యాలు నెలకొల్పుకొనేట్లు చేస్తుంది.

a. వ్యక్తిగత సమస్యలు : చదువు మీద దృష్టి నిలపకపోవడం, మానసిక ప్రశాంతత లోపించడం, పాఠ్యాంశాల పై ఏకాగ్రత చూపలేకపోవడం మొదలైనవి.

b.కుటుంబ సమస్యలు : కుటుంబంలో సభ్యునిగా వ్యక్తి ఎన్నో సమస్యలను ఎదుర్కోవలసి ఉంటుంది. అవి ఆర్థిక సమస్యలు మొదలైనవి. వ్యక్తి ఆత్మ విశ్వాసాన్ని, మన సైర్యాన్ని దెబ్బతీయవచ్చు. దీనికి మార్గదర్శకత్వం కావలసి ఉంటుంది.

c.వైవాహిక సమస్యలు : ఇక్కడ వివాహం కానివారికి ఎటువంటి సహధర్మచారులను (Partners) ఎన్నుకోవాలనే విషయంలో మార్గదర్శకత్వం సహాయపడుతుంది. పెళ్ళైనవారికి వివాహజీవితం అన్యోన్యంగా జరిగి పోవడానికి మార్గదర్శకత్వం అవసరమవుతుంది.

Results

-
Please Share it


Please Share it
Please Share it


Please Share it

#1. A boy in your class always looks confused and indecisive. As a teacher you would... నీ తరగతిలో ఒక పిల్లవాడు ఎప్పుడూ తికమక పడుతూ నిర్ణయం తీసుకోలేని స్థితిలో ఉన్నాడు. ఒక ఉపాధ్యాయునిగా నీవు?

#2. A Headmaster takes decisions all by himself, this type of leadership ప్రదానోపాధ్యాయుడు తనంతట తానే నిర్ణయాలను తీసుకొనే నాయకత్వ లక్షణం?

#3. The basic objective of 'Guidance' is... మార్గదర్శకత్వం యొక్క ప్రాథమిక లక్ష్యం?

#4. In teaching EVS of class-V, a teacher during his teaching lerning process, encourages the students by participating himself and giving opportunities to express their thoughts, ideas and suggestions. This type of leadership is... ఐదవ తరగతి పరిసరాల విజ్ఞాన బోధనాబ్యాసన ప్రక్రియలో విధ్యార్థుల యొక్క ఆలోచనలు, బావాలు, సూచనలు వెలిబుచ్చుటకు, అవకాశమిస్తూ, ప్రేరేపిస్తూ, తానూ ప్రక్రియలో పాల్గొంటూ కొనసాగించినచో ఆ ఉపాధ్యాయునికి క్రింది నాయకత్వ లక్షణాలు కలవు?

#5. In this type of counselling, the counsellor plays a major role than the students in solving behavioural problems of students విధ్యార్థుల ప్రవర్తనా సమస్యలను పరిష్కరించుటలో వారికంటే ఎక్కువగా మాంత్రికుడి ప్రమేయము అధికంగా ఉండే మంత్రణం?

#6. This type of teacher loves and cares for her students and at the same time disciplines them. ఈ రకమైన ఉపాధ్యాయురాలు విధ్యార్థులను ప్రేమిస్తూ, జాగ్రత్తగా చూసుకోవటమే కాకుండా వారిని క్రమశిక్ష్నలో పెడుతుంది?

#7. Greeshma completed intermediate Now she is unable to choose a course to study. She needs.... ‘గ్రీష్మ’ ఇంటర్మీడియట్ పూర్తి చేసింది. ఇప్పుడు ఆమె చదవడానికి ఏ కోర్సునూ ఎన్నుకోలేకపోతున్నది. ఆమెకు కావనసినది?

#8. The first act to be made by a counsellor to provide good guidance to a counselee is.... కౌన్సిలీకి మంచి మార్గదర్శకత్వం అంధించుటకు కౌన్సిలర్ చేపట్టవలసిన మొదటి చర్య?

#9. School Headmaster is a.... పాఠశాల ప్రధానోపాధ్యాయుడు ?

#10. One of the following is not related to directive counselling ఈ కింది వాటిలో ఒకటి నిర్దేశిత మంత్రణమునకు సంబంధించనది కాదు?

#11. One of the following leadership styles of a teacher is appropriate for creating a nonthreatening learning environment బెదిరింపులుండని అభ్యసన వాతావర్ణాన్ని సృష్టించుటకు ఉపాధ్యాయునిలో ఇటువంటి నాయకత్వ శైలి సరయినది?

#12. The performance of a student is less than this aptitude in mathematics. he requires...... ఒక విధ్యార్థి గణిత నిష్పాదన అతని సహజ సామర్థ్యం కన్నా తక్కువ కలదు. అతనికి కావలసినది?

#13. Nondirective counseling is also known as... అనిర్దేశిత మంత్రణమును ఇలా కూడా అంటారు?

#14. The type of leadership in which the decisions are taken by a leader alone is...... ఈ విధమైన నాయకత్వంలో నాయకుడు ఒక్కడే నిర్ణయాలు తీసుకుంటాడు?

#15. No autonomy is granted under this child rearing practice ఈ రకమైన పిల్లలను పెంచే పద్దతిలో స్వయం ప్రతిపత్తి ఇవ్వబడదు?

#16. Counsellor centered method of counselling is మంత్రణకుడు కేంద్రంగా గల మంత్రణ పద్దతి?

#17. The type of counselling process proposed by Carl Rogers is కార్ల్ రోజర్స్ చే ప్రతిపాధించబడిన మంత్రణ విధానం?

#18. In this leadership style, the leader is nominal and the members enjoy complete freedom and take final decisions by themselves. ఈ నాయకత్వ శైలి యందు నాయకుడు నామమాత్రంగా ఉంటాడు. సభ్యులు పూర్తి స్వేచ్ఛను కలిగి వుండి, తుది నిర్ణయాలు తమకు తామే తీసుకుంటారు?

#19. Bharati approached her teacher for a family problem. The teacher ascertained complete information and also suggested a solution. The type of counseling provided by the teacher is భారతి తన కుటుంబ సమస్యను గూర్చి టీచర్ ను సంప్రధించగా, ఆమె పూర్తి సమాచారాన్ని రాబట్టి పరిష్కారాన్ని కూడా సూచిచారు. ఈ టీచర్ అంధించిన మంత్రణ రకం?

#20. The counselling in which counselee can find out the solution for his problem by analyzing it with the help of counsellor మంత్రణకుని సహాయంలో సహాయార్థి తనకు తానుగా తన సమస్యను విశ్లేషించుకుని, పరిష్కార మార్గాన్ని కనుగొనే మంత్రణం?

#21. Eclectic counseling was introduced by శ్రేష్టగ్రహణ (మిశ్రమ) కౌన్సిలింగ్ ను ప్రవేశ పెట్టినవారు?

#22. Pickup the correct statement సరియిన ప్రవచనాన్ని ఎంపిక చేయడం?

#23. Raju is a school Headmaster. He always insists teachers to follow his orders whether they like it or not. The leadership style of Raju is రాజు ఒక స్కూల్ ప్రధానోపాద్యాయుడు అతను ఎప్పుడూ ఉపాధ్యాయులకు ఇష్టం ఉన్నా లేకున్నా తన ఆదేశాలను తప్పనిసరిగా పాటించాలంటాడు. రాజు యొక్క నాయకత్వ శైలి?

#24. Non-Directive counseling was introduced by అనిర్దేశిక కౌన్సిలింగును ప్రవేశపెట్టిన వారు?

#25. The counseling method which was constructed on the basis of the presumption that the counselee has the capacity, reasoning and the counselee needs only support from the counselor to utilize them is సహాయర్థికి తన సమస్యను తానే పరిష్కరించుకునే సామర్థ్యం, వివేచన ఉన్నాయని వాటిని వినియోగించుకునేందుకు కావలసిన సహాయాన్ని మాత్రమే మంత్రణకుడు అందిస్తే సరిపోతుందనే ప్రతిపదికన నిర్మించబడిన మంత్రణ విధానం?

#26. The leadership style of a teacher who motivates the children by giving importance to their ideas and feelings and allowing them to participate in the school programmes along with him is, పిల్లల ఆలోచనలకు, భావాలను ప్రాధాన్యతనిస్తూ, వారిలో ప్రేరణ కలిగిస్తూ తనతో సమానంగా పాఠశాల కార్యక్రమాల్లో పాల్గొనేలా చేసే ఉపాధ్యాయుని నాయకత్వ శైలి?

#27. The type of leadership that provides equal opportunities to all the students and assists them to share their experience is. విధ్యార్థులందరికి సమాన అవకాశాలు కల్పించటం మరియు వారి అనుభవాలను పంచుకునే విధంగా సహాయం అందించడం జరిగీ నాయకత్వ రకం?

#28. The process that helps the individual to understand himself and his world is called వ్యక్తి తనని తాను, తన ప్రపంచాన్ని అర్థంచేసుకోవడానికి తోడ్పడే చర్యయే?

#29. In Directive leadership నిర్దేశిత నాయకత్వంలో?

Finish

Also read : సంజ్ఞానాత్మక వికాస సిద్ధాంతం


Please Share it

Leave a Comment

error: Content is protected !!