ap tet psychology – పెరుగుదల – వికాసం – పరిణితి

YouTube Subscribe
Please Share it

ap tet psychology – పెరుగుదల – వికాసం – పరిణితి

పెరుగుదలను ఇంగ్లీషులో growth అంటాము. వికాసాన్ని development అని, పరిణీతి ని Maturity అని, తెలుగులో పరిపక్వత అని పిలుస్తారు. పరిణితి అన్న పరిపక్వత అన్న రెండు ఒకటే, విద్యార్థులు ఇక్కడ  confuse అవ్వద్దు. 

పెరుగుదల :

జన్మించిన తర్వాత కాలక్రమంలో జివి శారీరక పరిమాణంలోనూ ఆకారంలో మార్పులను పెరుగుదల అంటాము. పెరుగుదల 2 రకములుగా ఉంటుంది.ap tet psychology

1 బాహ్య పెరుగుదల:

ఏ పెరుగుదల అయితే మన కంటికి స్పష్టంగా కనబడుతుందో బాహ్యంగా మనం గుర్తించగలుగుతామ అట్టి పెరుగుదలను మనము బాహ్య పెరుగుదల అంటాము. ఎవరైనా ఆ వ్యక్తిని చూడగానే అతను పొడవుగా ఉన్నా పొట్టిగా ఉన్నాడా అని మనం చూడగానే చెప్పగలం. అనగా బాహ్యంగా మనం కంటితో శారీరక మార్పులను చూసి చెప్పగలం. కాబట్టి ఇట్టి పెరుగుదలను బాహ్య పెరుగుదల అంటాం. 

2 అంతర్గత పెరుగుదల :

ఒక వ్యక్తి యొక్క శరీరం బాహ్యంగా పెరుగుతున్నప్పటికీ, మన కంటికి కనపడకుండా అంతర్గతంగా అవయవాలలో కూడా మార్పు సంభవిస్తుంది. శరీరంలోని నాడీ వ్యవస్థ, మెదడు పరిమాణంలోనూ మార్పు వస్తుంది, పేగులు, జననేంద్రియాలు, ఊపిరితిత్తులు, గుండె కాలయము, మూత్రపిండాలు, ఇవన్నీ అంతర్గతంగా ఒక వ్యక్తిలో శరీరంతో పాటుగా పెరుగుతుంటాయి ఇలాంటి పెరుగుదలను అంతర్గత పెరుగుదల అంటారు. మొత్తం మీద పెరుగుదల అనగా శారీరక పరిమాణంలో కలిగే మార్పులను, శరీరం యొక్క ఆకారంలో కలిగే మార్పులను పెరుగుదల అంటాము.

పెరుగుదలనుబహిర్గతంగా గుర్తించవచ్చు. పెరుగుదల కంటికి కనిపిస్తుంది.

పెరుగుదలను ఖచ్చితంగా కొలవవచ్చు. పెరుగుదల గణనాత్మక మైంది.

పెరుగుదల పరిమాణాత్మక మైనది.

పెరుగుదల ఒక దశలో ఆగిపోతుంది.

పెరుగుదల సంకుచితమైనది.

పెరుగుదల పై అనువంశిక ప్రభావం ఉంటుంది.

3. వికాసం:

శారీరక పెరుగుదల తో పాటుగా, మానసిక సాంఘిక నైతిక ఉద్వేగాల లక్షణాలలో గుణాత్మకనటువంటి అభివృద్ధి కనిపించడాన్ని వికాసము అని అంటాము. అనగా వికాసంలో శారీరక లక్షణాలు మానసిక లక్షణాలు సాంఘిక లక్షణాలు, నైతిక లక్షణాలు, ఉద్వేగ లక్షణాలు, అభివృద్ధి చెందుతాయి. వీటితో పాటు గా  భాషాపరమైన మార్పులు కూడా కలుగుతాయి.

గెసెల్ మరియు అండర్సన్ నిర్వచనం:-వికాసం అంటే ఆకారాలను ప్రాకార్యాలను సమైక్యం చేసి విశిధ పరిచే ప్రక్రియ.

4. పరిపక్వత/ పరిణితి: ap tet psychology

జన్మత వ్యక్తిలో ఉండే సహజ సామర్థ్యాలు వయసుతో పాటు క్రమంగా వికసించడం ని పరిణితి అంటాము.

ఎలాంటిశిక్షణ లేకుండానే శిశువు నాలుగు నెలలకు బోర్లా పడడం, ఆరు నెలలకు కూర్చోవడం, 12 నెలలకు నడవటం మొదలైనటువంటి మార్పులను. ఉదాహరణకు రెండు సంవత్సరాల పిల్లవాడికి మనం ఈత నేర్పించే లేము. ఎందుకనగా ఆ పిల్లవాడు లో ఈత కొట్టడానికి కావలసిన శారీరిక పరిణితి లేకపోవటమే కారణము. అదే విధంగా మూడు సంవత్సరాల పిల్లవాడికి మనం సైకిల్ నేర్పించలేము. ఎవరికైనా వారిలో పరిపక్వత లేదా పరిణితి ఉంటేనే మన నేర్పించగలము.ఐదవ తరగతి పిల్లవాడికి పదవ తరగతి లెక్కలు నేర్పిస్తే ఆ పిల్లవాడు నేర్చుకోలేడు. ఎందుకనగా అతనిలో పరిపక్వత లేదు. ఏదైనా అభ్యసించాలన్న పరిణీతి అనేది ఉంటేనే సాధ్యపడుతుంది.

వికాసం =f{ పరిపక్వత × అభ్యసనం} దీని అర్థం ఎవరైనా ఏదైనా అభ్యసించాలి అంటే వారిలో పరిపక్వత అనేది ఉండాలి. పరిపక్వత ఉంటేనే అభ్యసించి కలుపుతారు తద్వారా వికాసం అనేది వారిలో కలుగుతుంది అని దీని భావం .ఈ equation పరీక్షకు చాలా ముఖ్యం చాలా ముఖ్యం.

 

Results

#1. “Maturation refers to the emergence of an organism’s genetic potential. It consists of a series of programmed changes” –stated by ‘పరిపక్వత అంటే జన్యు సంభావ్యతతో జీవి ఆవిర్భావాన్ని తెలుపుతుంది. ఇది ముందుగా నిర్ణయంచినా ప్రణాళిక మార్పుతో కూడుకున్నది ‘ అన్నవారు’.?

#2. ‘Cephalocaudal development’ ‘శిరాపాదాభిముఖ వికాసం’ ?

#3. “Development is the complex process of integrating different structures and functions” – stated by?‘పరిపక్వత అంటే జన్యు సంభావ్యతతో జీవి ఆవిర్భావాన్ని తెలుపుతుంది. ఇది ముందుగా నిర్ణయంచినా ప్రణాళిక మార్పుతో కూడుకున్నది ‘ అన్నవారు’.?

#4. Wrongly matched pair is తప్పుగా జతపరచబడిన జత ?

#5. The environment affects a person during this period వ్యక్తిపై పరిసరాల ప్రభావం ఉండే కాలం?

#6. Developmental principle in the following కింది వానిలో వికాస సూత్రం?

#7. Number of processes that cause development in infants proceeds internally and on one day suddenly appears visually– Developmental principle involved in this is. వికాసానికి కారణమైన యెన్నో ప్రక్రియలు శిశువులో అంతర్గతంగా జరుగుతూ ఉండి, హటాత్తుగా ఒకరోజు బయటకి కనిపిస్తాయి-ఇందులోని వికాస సూత్రం?

#8. The psychological aspect of learner which affects learning. అభ్యసనను ప్రభావితం చేసే అభ్యాసకుని మానసిక అంశం?

#9. The aspect that shows the naturally occurring qualitative and quantitative changes in the hereditary characteristics of an individual is వ్యక్తి అనువంశిక లక్షణంశాల్లో సహజంగా సంభవించే పరిమాణాత్మక,గుణాత్మక మార్పును సూచించే అంశం?

#10. Development is high in Infancy and low in Childhood and it becomes high again when the child reaches Adolescence. The developmental principle involved here is వికాసం నవజాత దశలో వేగంగా, బాల్యదశలో తక్కువగా ఉండాలి తిరిగి కౌమారదశ చేరే నాటికి వేగవంతమవడంలోని వికాస సూత్రం?

#11. Physical factor that affects the development of a person is వ్యక్తి వికాసంపై ప్రభావం చూపే భౌతిక కారకం?

#12. The bodily changes in an organism is attributed to జీవిలో శారీరక సంబందమైన మార్పును దీనికి వర్తిస్తాయి?

#13. The cephalo-caudal changes in a child relates to శిశువులో జరిగే శిరఃపాదాభిముఖ మార్పులు దీనికి సంబందించినవి?

#14. Qualitative change is గుణాత్మకమైన మార్పు ?

#15. Unfolding of the inborn, innate abilities of a person జన్మత వ్యక్తిలో ఉన్న అంతర్గత సామర్థ్యాలు వయసుతో పాటు వికసించటమే?

#16. The process that is continuous and cumulative is ……….. అవిచ్చిన్నంగా, సంచితంగా జరిగే ప్రక్రియ?

#17. Quantitative change is … పరిమాణాత్మక మార్పు?

#18. Every aspect that effects an individual other than his genes is related to జన్యువులు తప్ప వ్యక్తిని ప్రభావితం చేసే ప్రతి అంశం దీనికి సంబందించినది?

#19. This indicates the changes that are rigid and happen in a particular pattern నిర్ధిష్టమైన క్రమానుగత పద్దతిలో జరిగే స్థిరమైన మార్పులను సూచించేది?

#20. Exactly measurable change in an organism is జీవిలో ఖచింతంగా కొలవగలిగే మార్పు?

#21. One of the following speaks about the social expectations for every stage of development ప్రతి వికాస దశలో సమాజం ఆశించే ప్రవర్తన గురుంచి క్రింది వానిలో ఒకటి ప్రస్తావిస్తుంది?

#22. ఈ క్రింది వాటిలో పెరుగుదలకు సంబంధించనిది?

#23. ఈ క్రింది వానిలో సరియైన ప్రవచనం కాని దానిని గుర్తించండి.?

#24. ఈ క్రింది వానిలో సరియైనది కానిది?

#25. ఈ క్రింది వానిలో ఎలిజబెత్‌ ‌హార్లాక్‌ ‌యొక్క వ్యాఖ్యను గుర్తించండి.?

#26. ఈ క్రింది వానిలో క్రైగ్‌ ‌యొక్క వ్యాఖ్యను గుర్తించండి.?

#27. పరిపక్వత …?

#28. ఈ క్రింది వానిని పరిశీలించండి.?ఎ : పెరుగుదల గణాత్మాక మార్పులను సూచిస్తుంది. బి : వికాసం గుణాత్మక మార్పులను సూచిస్తుంది.

#29. ఆరు నెలల వయస్సులో నడవడం చేతకాని ఐశ్వర్య ఏడాది వచ్చేసరికి కాళ్ళ కండరాలు పెరిగి పరిమాణాత్మకంగా మార్పు చెంది నడవడం ప్రారంభిస్తుంది. ఈ ప్రవచనం దీనిని తెలియజేస్తుంది.?

#30. ఒక శిశువు పదకొండు నెలల వయస్సులో శిశువు నడవడం అనేది మనోవిజ్ఞానశాస్త్ర పరిభాషలో దేనిని సూచిస్తుంది?

#31. స్వరపేటిక ఏర్పడకపోతే వయస్సు వచ్చినా మాట్లాడలేడు స్పష్టగా పలకలేడు. అయినా ఇక్కడ లోపించినది. ?

#32. పరిపక్వత వలన ?

#33. క్రింది వానిలో దీనిని మనము ఖచ్ఛితంగా మాపనం చేయగలము?

#34. ప్రత్యేక శిక్షణ అవసరం లేకుండా అంతర్గతంగా జరిగే గుణాత్మక స్వభావ చర్య అని దేనిని అంటారు?

#35. శిశువులో సంభవించే గుణాత్మక మార్పులు సూచించేది ?

#36. ‘‘వికాసం గుణాత్మక, పరిమాణాత్మక మార్పులను తెలుపుతుంది’’ అని నిర్వచించినవారు ఎవరు?

#37. ‌పరిపక్వం అంటే జన్యుపటిష్టాన్ని తెలుపుతుంది. ఇది ముందుగా నిర్ణయించిన ప్రణాళిక మార్పులతో జరుగుతుంది అని నిర్వచించినది?

#38. ఒక సూక్ష్మకణంగా మొదలయ్యే మనిషి జీవితం, కాలంతో పాటు, అనేక మార్పులు చెందుతూ, అవిచ్చిన్నంగా సాగుతుంది అని తెలియజేసే వికాస నియమం ఏది ?

#39. వికాసం అనేది పుట్టుకతో ప్రారంభమై, మరణం వరకు కొనసాగుతుంది అని తెలిపే ఏ వికాస నియమం?

#40. ‘శిశువు తల భాగంలో నిర్మాణం, విధులు ముందుగా వృద్ధి చెంది, తదుపరి నడుము భాగానికి జరిగి, చివరకు పాదాల వద్దకు వికాసం చెందుతుంది’ అని తెలియజేయు వికాసనియమంను గుర్తించండి. ?

#41. ‘‘మనిషి జీవితం ఒక సూక్ష్మ ఏకకణంగా ప్రారంభమై, దినందినం ఎన్నో మార్పులు చెందుతూ, వివిధ అంగాలు, అవయవాలతో శిశువుగా జన్మించి, తన ప్రయాణాన్ని నిర్విరామంగా కొనసాగిస్తుంది’’ అని తెలియజేయు వికాసనియమంను ఈ క్రింది వానిలో గుర్తించండి. ?

#42. ‘‘నవజాతదశలో వికాసం ఎక్కువ వేగంగా ఉండి, బాల్యదశలో తక్కువగా ఉండి, తిరిగి కౌమారదశలో ఎక్కువ వేగం పుంజుకుంటుంది’’ అని తెలియజేయు వికాసనియమం ను ఈ క్రింది వానిలో గుర్తించండి.?

#43. శాస్త్రీయ సంగీతంలో నిష్ణాతుడైన హృదయనాథ్‌ ‌మంగేష్కర్‌ ‌కుమార్తె లతామంగేష్కర్‌ల విషయంలో మనం ఏ వికాస నియమాన్ని గమనించవచ్చు ?

#44. చేతివేళ్ళ పట్టు సాధించిన తరువాత సూక్ష్మ చర్యలైన రాయడం, చేయగలగడం, ఈ క్రింది వానిలో ఏ వికాస సూత్రాన్ని సమర్థిస్తుంది?

#45. ‘‘వెంకట్‌ అను శిశువు 9 నెలలకు నడవడం ప్రారంభిస్తే, వేణు అను శిశువు సంవత్సరం వరకూ నడవలేదు’’ దీనిని తెలియజేయు వికాసనియమంను ఈ క్రింది వానిలో గుర్తించండి. ?

#46. ‘‘ఐశ్వర్య అను శిశువు ఒక సంవత్సరానికి మాట్లాడటం ప్రారంభిస్తే, మౌనిక అను శిశువు 2సంవత్సరాల వరకూ మాట్లాడలేదు’’ దీనిని తెలియజేయు వికాసనియమంను ఈ క్రింది వానిలో గుర్తించండి. ?

#47. సాయితేజ అను పిల్లవాడు మొదట మగవాళ్ళు అందరినీ నాన్న అని సంబోధించి పిదప ఆ పదాన్ని తన తండ్రికి మాత్రమే ఉపయోగించాడు. ఇందులో మనం గమనించదగిన వికాసనియమంను గుర్తించండి. ?

#48. ‘‘వికాసం శిశువు తలభాగంలో నిర్మాణం, విధులు ముందుగా వృద్ధి చెంది తదుపరి నడుము భాగానికి జరిగి చివరకు పాదాలకు చేరుతుంది’’ అనునది ఏ వికాస సూత్రాన్ని తెలియజేస్తుంది ?

#49. శిశువు వికాసం యొక్క నిర్దేశ పోకడలు ?

Previous
Finish
మూర్తిమత్వ వికాసం-సర్దుబాటు:-

మూర్తిమత్వాన్ని ఆంగ్లంలో పర్సనాలిటీ అంటారు. పర్సనాలిటి (Personality) అనే పదం ‘పర్సోనా’ (Persona) అనే లాటిన్ పదం నుంచి వచ్చింది. పర్సోనా అంటే ముసుగు (Mask) అని అర్థం. పూర్వం గ్రీకు నాటికల్లో పాత్రధారులు తమ పాత్రలకు తగిన ముసుగులను ముఖాలకు తగిలించుకొని నటించేవారు. కథాకళి అనే మన భారతనృత్య సంప్రదాయంలో కూడా ముసుగులు తగిలించుకొని, వాటికనుగుణంగా నాట్యం చేస్తారు.

పూర్వం మన తెలుగు ప్రాంతంలో బుట్టబొమ్మలుండేవి. అవి తగిలించుకొని వాటికి అనుగుణంగా వీధినాటకాలు ఆడేవారు.మూర్తిమత్వం అంటే శరీర సౌష్ఠవం, అందం అని సాధారణ వ్యక్తి అనుకొంటాడు. ఒక వ్యక్తి బాహ్య లక్షణాలను బట్టి అతని పర్సనాలిటి బాగుందని చెప్పడం సరియైంది కాదు. మనోవిజ్ఞాన శాస్త్రవేత్తల ప్రకారం మూర్తిమత్వం అంటే వ్యక్తి శరీర లక్షణాలే కాకుండా మానసిక, సాంఘిక, నైతిక లక్షణాలు కూడా ఉంటాయి. అంటే మూర్తిమత్వానికి విస్తృతార్థం ఉంది.

మూర్తిమత్వానికి అనేక నిర్వచనాలున్నాయి:- ఆల్ పోర్ట్ మూర్తిమత్వానికి సమంజసమైన నిర్వచనాన్ని ఇచ్చాడు. అతని ప్రకారం ‘ఏ మనోశారీరక విధానాలైతే ఒక విశిష్టమైన పద్ధతిలో వ్యక్తి పరిసరాలకు సర్దుబాటు చేసుకునేటట్లు చేస్తాయో ఆ శక్తుల చైతన్యపూరిత నిర్వహణే అతని మూర్తిమత్వం.మూర్తిమత్వం అనేది వ్యక్తి శారీరక, మానసిక విధానాలన్నింటికి సంబంధించి ఉంటుంది. మానసిక విధానం అనే పదంలో మానసిక పామూలు స్వహించబడే తీరు ఇమిడి ఉంది.

మూర్తిమత్వం అనే పదం వ్యక్తి లక్షణ సమగ్రస్వరూపాన్ని, అతని ప్రవర్తనా వివాదాన్ని సూచించి అవి వ్యక్తి తన పరిసరాలతో ఏవిధంగా సర్దుబాటు చేసుకుంటాడో అది మూర్ర్తిమత్వము.

కాంటర్ ఒక వ్యక్తి ప్రతి చర్యల మొత్తం, ఒక వ్యక్తి చేసే చేయగల కృత్యాల మొత్తం ఆ వ్యక్తి మూర్తిమత్వం అని నిర్వచించాడు.కాటిల్ మూర్తిమత్వాన్ని నిర్వచిస్తూ ‘ఒక సన్నివేశంలో ఒక వ్యక్తి దోహదం చేసేది చెప్పాడు.

వికర్ కేష్ – వ్యక్తి మరిమాలతో ప్రతిచర్యను పొందినప్పుడు ప్రస్పుటమయ్యే అతని శాశ్వత మానసిక లక్షణాల ప్రత్యేక వ్యవస్థాపనను సూచించేది – వ్యక్తి మూర్తిమత్వం – పేర్కొన్నారు.

మూర్తిమత్వపు మూలకాలు:- ఒక వ్యక్తి మూర్తిమత్వం దేవితో నిర్మాణమవుతుంది? అతని శరీరం, అతని బుద్ధి, కత చిత్తవృత్తి, అతని సామర్థ్యాలు, అతని అభిరుచులు, అతని అలవాట్లు, కౌశలాలు, మకాలు అన్నీ అతని మూర్తిమత్వ మూలకాలనిపించుకొంటాయి.

పీటర్ పాండ్వర్డ్ మూర్తిమత్వ మూలకాలమ ఈ కింది విధంగా గుర్తించాడు.

1. భౌతిక లేదా శారీరక కణాలు (Physical Traits) : ఒక వ్యక్తి బాహ్య లక్షణాలైన ఎత్త, జట్టురంగు, చర్మంరంగు శరీర నిర్మాణం, ఆరోగ్యం, అందం మూర్తిమత్వాన్ని అంచనా వేయడానికి దోహదపడతాయి.

2 శరీర నిర్మాణ లక్షణాలు (Physiological Traits) : వ్యక్తి జీవన క్రియలు, రక్తవర్గం, రక్తంలోని ఖనిజాల నిష్పత్తి, అంతఃప్రావ సమతుల్యం, రక్త ఒత్తిడి మొదలైనవి కూడా మూర్తిమత్వాన్ని నిర్దేశిస్తాయి.

౩.కొద్ది సామర్థ్యాలు (Intellectual Abilities) : వ్యక్తి మూర్తిమత్వాన్ని గుర్తించడానికి అతని  విద్యాకు కూడా తోడ్పడతాయి.

4.సహజ సామర్థ్యాలు (Aptitudes) అనుషంగికంగా ప్రాప్తింది. అక్ష ద్వారా సృష్టి ఉండే సంగీత, చిత్రలేఖన,  భాపా సామర్థ్యాలు కూడా వ్యక్తి ఆ మూర్తిమత్వ మూలకాలవుతాయి.

5. కౌశలాలు (Skills) : వివిధ శారీరక విషయాలలో సులభంగాను, నిర్దిష్టంగా చేయకలిగే క్రియలు – ఆటలాడడం, రాయటం, గీయడం మొదలైనవి కూడా మూర్తిమత్వంలోని అంశాలే.

6.అలవాట్లు (Hahits) : వ్యక్తి తన దైనందిన జీవితంలో చేసే ఆర్జిత ప్రతిస్పందనలైన అలవాట్లు అతని మూర్తిమత్వంలోని భాగమే.

7.శక్తులు (Abilities) 1 వ్యక్తి సంవేదనలు, వివేచన, విషయనిర్ణయం, ధారణశక్తి, భాషా శక్తి, పరిశీలన, స్మృతి, అవధానం మొదలైన అంశాలు కూడా మూర్తిమత్వంలో భాగమే.

8. లక్షణంశాలు (Traits) : విశిష్టమైన ప్రవర్తనా రీతులైన – సౌమ్యం, దౌర్జన్యశీలం, సరళం, కోపీలత, దురుసు స్వభావం, మందకొడి స్వభావం మొదలైనవి తాత్కాలికమైన, శాశ్వతమైన వ్యక్తికి సహజంగా ప్రాప్తించిన లేదా పరిస్థితులను బట్టి ఆర్జించినవి – ఇవి కూడా మూర్తిమత్వంలోని అంశాలే.

పైన పేర్కొన్న మూలకాలు వ్యక్తుల్లో స్వతంత్రంగా ఉండవలసిన పనిలేదు. ఇవి చాలావరకు పరస్పరం పరివ్యాప్తం (Overlapping), పై మూలకాలన్నీ అంతర్గతంగా పరస్పరం కలసి సమైక్యంగా ఉండేదే మూర్తిమత్వం.

మూర్తిమత్వాన్ని రూపొందించే కారకాలు:- మూర్తిమత్వంలోని అంశాలను తెలుసుకున్న తరవాత ఉపాధ్యాయులైన మనం అవి ఎట్లా రూపొందించుకొంటాయో వాటి కారకాలుగూర్చి తెలుసుకోవడం చాలా ముఖ్యం.సమస్త లక్షణాంశాల సమన్వితమైన వ్యక్తి పరిసరాలతో చేసే ప్రతిస్పందనలు అతని మూర్తిమత్వం అని తెలుసుకొన్న మనం వ్యక్తి మూర్తిమత్వాన్ని వికసింపజేసే 1, శారీరక కారకాలను, 2. సాంఘిక సాంస్కృతిక కారకాలను గురించి తెలుసుకోవడం ముఖ్యం.వ్యక్తి మూర్తిమత్వ వికాసం అతనికి ఆనువంశికంగా లభించే శరీర లక్షణాల మీద, వాటిని వికసింపచేసే భౌతిక పరిస్థితుల మీద, అతనిపై ప్రభావం చూపే సాంఘిక పరిసరాల మీద ఆధారపడి ఉంటుంది. వీటిలో వ్యక్తి మూర్తిమత్వానికి ఏది ఎక్కువ దోహదం చేస్తుందో చెప్పడం కష్టం. కాని తప్పని సరిగా ఇవి ఉమ్మడిగా వ్యక్తి మూర్తిమత్వ వికాసానికి దోహదం చేస్తాయి.

Also read : వైయుక్తిక భేదాలు


Please Share it

Leave a Comment

error: Content is protected !!