ap tet psychology Memory – స్మృతి – విస్మృతి

YouTube Subscribe
Please Share it

ap tet psychology Memory – స్మృతి – విస్మృతి

గతంలో నేర్చుకున్న విషయాలను తిరిగి జ్ఞాపకం తెచ్చుకోవడమే స్మృతి. స్మృతి గురించి శాస్త్రీయంగా ప్రయోగాలు చేసిన మనోవిజ్ఞాన శాస్త్రవేత్త ఎబ్బింగ్ హాస్.

ఎబ్బింగ్ హాస్ 1885 సంవత్సరంలో “On memory” అనే గ్రంథాన్ని ప్రచురించాడు.  ఇది ప్రయోగాత్మక మనోవిజ్ఞాన శాస్త్రంలో ఒక మైలురాయిగా నిలిచిపోయింది.

ap tet psychology Memory

స్మృతిప్రక్రియలోని సోపానాలు:-

1. ఎన్‌కోడింగ్ (సంకేతరూపంలోకి మార్చుట) :

ఒక విషయాన్ని నేర్చుకొనేటప్పుడు వివిధ జ్ఞానేంద్రియాల ద్వారా ఆ విషయం, మెదడును చేరుతుంది. అది నాడీ వ్యవస్థలో మార్పులు తెస్తుంది. ఈ మార్పులు మెదడు పై చిహ్నాలను ఏర్పరుస్తాయి. ఈ చిహ్నాలనే “ఎన్ గ్రామ్స్” ‘న్యూరోగ్రామ్స్ స్మృతి చిహ్నాలు అంటారు.  జ్ఞానేంద్రియాలు సమాచారాన్ని సంకేత రూపంలో అనువదించి మార్చి సులభంగా నిల్వచేయగలదిగా, అవసరమైనపుడు పునరుక్తికి ఉపయోగపడేటట్లు చేయగల ప్రక్రియనే ఎన్ కోడింగ్ అంటాం.

 మన అభ్యసన ఫలితాలు / అనుభవాలు మెదడులో స్మృతి చిహ్నాలుగా ఏర్పడటం అనేది మన సామర్థ్యాలు, శైలి, గతానుభవాలు, శిక్షణలు, ఆచరణ ఫలితం మీద ఆధారపడును.

2. ధారణ : (రిటెన్సన్) (Storage) (నిలుపుదల) :

అభ్యసించిన విషయాంశాలు, మన అనుభవాలు స్మృతి పథంలో కొంతకాలం నిల్వ ఉండటాన్ని “ధారణ” అంటారు, విషయం ధారణలో నిల్వ ఉండటం, భద్రపరచబడటం అనేది స్మృతి చిహ్నాల బలం, స్పష్టత, నాణ్యతలపై ఆధారపడి ఉంటుంది. ఎన్ గ్రామ్ ల రూపంలో ఉన్న సమాచారాన్ని ధారణ సురక్షితంగా వుంచి, అవసరమైనప్పుడు పునరుత్పత్తి చేస్తుంది.

3. జ్ఞప్తికి తెచ్చుకోవడం : (రిటైవల్) (Retrieval): 

సంకేత రూపంలో భద్రపరిచిన ఎన్ గ్రామ్ లలోని సమాచారాన్ని తిరిగి అసలు రూపంలో పునరుత్పత్తి చేయడాన్ని జ్ఞప్తికి తెచ్చుకోవడం రిటైవల్ అంటారు.ఈ ప్రక్రియలో, ఎన్ కోడ్ రూపంలో వున్న స్మృతి చిహ్నాలు డీకోడింగ్ ప్రక్రియ ద్వారా అసలు రూపాన్ని పొందుతాయి.

నోట్ : స్మృతి ప్రక్రియలో అభ్యసన అంశాలు “ఎన్ కోడ్” అయిన తర్వాత “రిటషన్”లోను “డీకోడ్” అయిన తర్వాత “రిటైవల్” కావడం జరుగుతుంది.

ఉదా : 1) ఒక తరగతిలో ఒక విద్యార్థి మన జీర్ణాశయం పటం, అందులోని భాగాల పేర్లను చదివి, తమ నోటు పుస్తకంలో పటాన్ని గీసి అందులోని భాగాలను గుర్తించాడు.

దీనిలో స్మృతి ప్రక్రియలోని

మొదటి దశలో మానవ జీర్ణాశయ పటం భాగాలు జ్ఞానేంద్రియాలు ద్వారా మెదడుకు చేరి, సంకేత రూపంలో స్మృతి చిహ్నాలుగా ఏర్పడడం – ఎన్‌కోడింగ్.

రెండవ దశలో : జీర్ణాశయంకుచెందిన స్మృతిచిహ్నాలు కొంతకాలం సంకేత రూపంలో నిల్వ ఉండటం – ధారణ

మూడవ దశలో : ఇంతకు ముందు అభ్యసించిన జీర్ణాశయం భాగాలను జ్ఞప్తికి తెచ్చుకొని పటాన్ని గీయడం – జ్ఞప్తికి తెచ్చుకోవడం. 

స్మృతిలోని అంశాలు:-

a). అభ్యసనం (Learning):-

స్కృతికి అభ్యసనం మొదటి మెట్టుగా చెప్పవచ్చు. స్మృతి ప్రక్రియలోని మొదటి సోపానం లేదా స్మృతి అంశం అయిన అభ్యసనంలో వ్యక్తి జీవిత అవసరాలకు అనువైన జ్ఞానం, నైపుణ్యాలు, వైఖరులు, అభిరుచులను రోజువారీ ప్రాపంచిక అనుభవం నుంచి పొందడం జరుగుతుంది. అభ్యసనం బాగా జరగాలంటే

1) అభ్యసనం అంశాలను అర్థవంతంగా అమర్చి నేర్చుకోవడం

2) మధ్య మధ్యలో విరామం తీసుకుంటూ పెద్ద భాగాన్ని చిన్న చిన్న భాగాలుగా విడగొట్టి, విషయాన్ని బట్టి విడివిడి  భాగాలను కలిపి నేర్చుకోవడం

3) ఏకాగ్రతతో నేర్చుకోవాలనే తపనతో నేర్చుకుంటే చక్కగా అభ్యసనం జరుగుతుంది.

b). ధారణ:-నేర్చుకున్న విషయాలను మనసులో కొంత కాలం నిలుపుకోవడాన్ని ధారణ అంటాము.

ధారణనుతెలుసుకునే పద్ధతులు:-

1). శాబ్దిక పునః స్మరణ:-(verbal recall):-అక్షర రూపంలోనూ అంకెల రూపంలోనూ ఉన్న సంకేతాలను పునః స్మరణ చేయడాన్ని  శాబ్దిక పునః స్మరణ అని అంటాము.

2).అశాబ్దిక పునః స్మరణ :-జంతువుల లోనూ అక్షరజ్ఞానం లేని పిల్లలలోనూ ధారణ ఎంతవరకు ఉంటుందో తెలుసుకోవడానికి అశాబ్దిక పునః స్మరణ ఉపయోగపడుతుంది.

అశాబ్దిక పునః స్మరణ మాపనం చేసే పరికరం “హంటర్స్ విలంబిత ప్రతిచర్య” పరికరం.

పునః స్మరణ మాపనం చేసే పద్ధతులు:-

1. స్మృతి – విస్తృతి :

 ఒకసారి చెప్పిన, విన్న విషయాన్ని వెంటనే తిరిగి జ్ఞప్తికి తెచ్చుకోవడం, అదే విషయాన్ని తప్పులు లేకుండా చెప్పడాన్ని స్మృతి విస్తృతి అంటారు. దీనిని గ్రహించుటకు టాచిస్టోస్కోప్ (హామిల్టన్) అనే పరికరాన్ని ఉపయోగిస్తారు.

2. ద్వంద్వ సంసర్గలు : ఒక పదం అర్థవంతమైన పదం, మరొకటి అర్థరహితమైన పదం – ఇలాంటి జంట పదాలను కొన్నింటిని ప్రయోజ్యునికి ఒకసారి చూపించి ఆ తరువాత ఆ జంట పదాలలో మొదటి పదాన్నిచ్చి, రెండో పదాన్ని చెప్పమంటారు.

3. కథనాలు; దీనిలో అనేకమంది వ్యక్తులు పాల్గొంటారు. మొదటి వ్యక్తి రెండో వ్యక్తికి ఒక కథ చెపుతాడు. రెండో వ్యక్తి ఆ కథను గుర్తుంచుకొని మూడో వ్యక్తికి చెపుతాడు. ఇలా ఒకరి దగ్గరి నుంచి విన్న విషయాన్ని వేరొకరికి చేరవేసేటప్పుడు అనేక మార్పులు జరగవచ్చు. చిన్న విషయం పెద్దది కావచ్చు. పెద్ద విషయం చిన్నది కావచ్చు. ముఖ్య విషయాలు లేకుండా పోవచ్చు. కథనాలపై ప్రయోగాలు చేసినవారు బార్ట్ లెట్, వీరు రచించిన గ్రంథం “The Remembering”

4. అకృతుల పునరుత్పాదనం : సాధారణంగా ప్రయోజ్యునికి ఒక చిత్రాన్ని చూపిన తరువాత, అతడు దానిని తిరిగి చిత్రంచవలసి ఉంటుంది. అసలు బొమ్మకు, నకలు బొమ్మకు ఎంత భేదముందో, ఎన్ని మార్పులు వచ్చాయో గమనించడం ద్వారా ధారణను అంచనా వేస్తారు.

5. శబ్ద ప్రమాణం : ఇందులో సంఘటనలను చూపే కొన్ని సన్నివేశాలను (ఉదా : ప్రమాదాలు, దెబ్బలాటలు, సామూహిక కార్యక్రమాలు) ప్రయోజ్యునికి చూపించడం జరుగుతుంది. తరువాత వాటిని ఆ ప్రయోజ్యుడు వివరించవలసి ఉంటుంది.

c).గుర్తించడం:-(Recognition):-పునః స్మరణ కంటే గుర్తింపు తేలిక, గుర్తించడం ఒక మానసిక అనుభవం. పరీక్షలు బహుళైచ్చిక ప్రశ్నలు తప్పొప్పుల ప్రశ్నలు జత పరిచే ప్రశ్నలు గుర్తించడానికి సంబంధించినవి.

డేజావు: డేజావు అనేది ఒక ఫ్రెంచ్ పదం అనగా దీని అర్థం మిథ్యా పరిచయ భావం. ఒక వస్తువు లేదా వ్యక్తిని మనం చూస్తున్న ప్రస్తుత విషయాన్ని ఇంతకు ముందు ఎప్పుడో చూసినట్లు భ్రమ పడటాన్ని డేజావూ అంటారు.

పునరభ్యసనం:-దీనిని పొదుపు పద్ధతి అని కూడా అంటారు. ఈ పద్ధతిని ప్రవేశపెట్టినది ఎబ్బింగ్ హాన్. ఏదైనా ఒక విషయాన్ని నేర్చుకున్న తర్వాత దానిలో కొంత భాగం మర్చి పోవడం జరుగుతుంది. ఆ మర్చిపోయిన అంశాలను తిరిగి అభ్యసించడాన్ని పునర అభ్యసనం అంటారు.

పునర్ అభ్యసనానికి వ్యక్తి ఎక్కువ సమయం తీసుకుంటే ధారణ తక్కువగా ఉంటుంది. తక్కువ సమయం తీసుకుంటే ధారణ ఎక్కువగా ఉంటుంది.

జైగార్నిక్ ప్రభావం:- జైగార్నిక్ ఒక జర్మన్ మనో విజ్ఞాన శాస్త్రజ్ఞురాలు. ఈమె చేసిన పరిశోధన వల్ల పూర్తి చేసిన పనుల కంటే, సగం మధ్యలో ఆపిన పనులు బాగా గుర్తు ఉంటాయి అని తెలియజేశారు.

స్మృతి లోని రకాలు;-

1. బట్టి వృతి : ఒక విషయాన్ని యధాతధంగా, సంబంధం లేకుండా, అవగాహన లేకుండా నేర్చుకోవడమే బట్టి శృతి. ఇది చిన్న పిల్లల్లో ఎక్కువగా కనిపించే స్మృతి,

ఉదా : చిన్న పిల్లలు ఎక్కములు, రైమ్స్ అర్థం కాకపోయినా చదివి అప్పచెప్పటం

2. తార్మిక స్మృతి : ఒక విషయాన్ని పూర్తిగా అవగాహన చేసుకొని, తార్కికంగా ఆలోచన చేసి నేర్చుకొని ఆజ్ఞాపకముంచుకోవడమే తార్కిక స్మృతి. ఇది అమూర్త ప్రచాలక దశలో కనిపించు స్మృతి,

ఉదా : పెద్ద పిల్లలు తార్కికంగా అంశములను గుర్తుంచుకొని తిరిగి ఒప్పచెప్పగలుగుట,

3. స్వల్పకాలిక స్మృతి : ఈ స్మృతిని తక్షణ స్మృతి అనికూడా అంటారు. మనం చూసిన/విన్న విషయాలు తక్కువ కాలం గుర్తు ఉంచుకుంటే,దానిని స్వల్పకాలిక స్మృతి అంటారు. దీని పరిధి 30 సెకన్లు మాత్రమే.

ఉదా : ఫోన్ నెంబర్లు, ఎనౌన్స్ చేసిన రైలు నెంబరు, ఎక్కే బస్సు నెంబరు చూసిన, విన్న కొన్ని సెకనులకే మర్చిపోవుట,

4. దీర్ఘకాలిక స్మృతి : మన అనుభవాలలో కొన్ని విషయాలు దీర్ఘకాలం అంటే జీవితాంతం జ్ఞాపకముంటాయి. దీనినే దీర్ఘకాలిక స్మృతి లేదా శాశ్వత స్మృతి అంటారు.

గమనిక : చలన కౌశలాలు అన్నీ దీర్ఘకాలిక స్మృతిలో ఉంటాయి.

ఉదా : సైకిలు తొక్కుట, ఈత కొట్టుట, వ్యక్తిగత విషయములు గుర్తు పెట్టుకొనుట.

5. క్రియాత్మక స్మృతి : వ్యక్తి కృత్య అనుభవంతో విషయాన్ని జ్ఞాపకం పెట్టుకోవడం. (లేదా) ప్రయోగపూర్వకంగా ఒక అంశమును గుర్తు పెట్టుకొనే స్మృతిని క్రియాత్మక స్మృతి అంటారు. దీనినే యత్నపూర్వక స్మృతి అనికూడా అంటారు.

ఉదా : పాస్కల్ సూత్రమును ప్రయోగము చేసి గుర్తు పెట్టుకొనుట.

6. నిష్క్రియాత్మక స్మృతి : ప్రయోగపూర్వకంగా కాకుండా తక్కువ ప్రయత్నాలలో చదవటం లేదా వినటం ద్వారా గుర్తుంచుకోవటం.

ఉదా : త్రిభుజములో మూడు కోణముల మొత్తము కొలవకుండానే ఉపాధ్యాయుడు చెప్పినది విని గుర్తు పెట్టుకొనుట.

7. సంసర్గ స్మృతి : ఒక విషయాన్ని నేర్చుకొనేటప్పుడు దానిని మరో అంశంతో సంధానం / సంసర్గం చేసి గుర్తు పెట్టుకున్నట్లయితే దానిని సంసర్గ స్మృతి అంటారు.

ఉదా : ఆగస్టు 15 అనగానే స్వతంత్ర దినోత్సవం గుర్తుకు వచ్చుట.

8. రెడెస్టిగేటివ్ స్మృతి :కొన్ని సంకేతాలు, ఉద్దీపనలు చూసినప్పుడు గతములో వాటి వెనక మనము పొందిన అనుభూతులు, అనుభవాలు,గుర్తుకు వచ్చుట.

ఉదా : ఇసుకను చూసినప్పుడు చిన్నతనములో కట్టిన గుజ్జనగూళ్ళు గుర్తుకు రావడం,

విస్మృతి (Forgetting): –

విస్మృతి అనగా మరచి పోవడం అని అర్థము. పుట్టింది మొదలు ప్రతివ్యక్తి అనేక అనుభవాలను చవిచూస్తాడు. అవన్నీ అతనికి గుర్తుండవు. కొన్ని విషయాలు మరచిపోతాడు. పాఠశాలలో నేర్చుకొన్న అనేక విషయాలను కూడా విద్యార్థులు మరచి పోతారు. నిత్యజీవితంలో కొన్ని విషయాలు మాత్రం జీవితాంతం జ్ఞాపకముంటాయి. అవి మరచి పోవాలన్నా మరచిపోలేం తెలుసా.

విస్మృతికి కారణాలు :-

a).అనుపయోగంవల్ల స్మృతి క్షయం (Passive decay through disuse):-

శరీర ధర్మశాస్త్రజ్ఞుల ప్రకారం స్మృతి జరిగినపుడు మెదడులో కొన్ని ఛిహ్నాలేర్పడతాయి. వీటిని స్మృతి చిహ్నాలంటారు. ఇలాంటి స్మృతి చిహ్నాలు కాలం గడిచే కొద్దీ క్షీణించి పోయి కొంతకాలానికి పూర్తిగా నశించి పోతాయి. కాని మనం ఒక విషయాన్ని మరచిపోయినా, తిరిగి కొన్ని సంకేతాలవల్ల ఆ విషయాన్ని గుర్తుకు తెచ్చుకోగలుగుతాం. కొన్ని విషయాలు వాడుకలో లేకపోయినా స్మృతిలో ఉంటాయి.

ఉదా:-ఒక వ్యక్తి ఈతకొట్టడం, సైకిల్ తొక్కడం, టైపు చేయడం మొదలైనవి నేర్చుకున్న తరవాత చాలాకాలం పాటు వాడుకలో లేకపోయినా తిరిగి ఆ కౌశలాలు ప్రదర్శించగలుగుతాడు,

ఒక్కొక్కసారి చిన్ననాటి అనుభవాల్ని, చిన్నతనంలో నేర్చుకొన్న పద్యాలు, పాటలు ముసలితనంలో కూడా జ్ఞాపకానికి రావచ్చు. కాని ఒక్కొక్కసారి రెండు మూడు వారాలు కిందట నేర్చుకొన్న విషయాలు పునఃస్మరణ చేయటం కష్టతరమవుతుంది. పై కారణాలవల్ల స్మృతి చిహ్నాలు అనుపయోగంవల్ల క్షీణిస్తాయనే సిద్ధాంతం సరియైనది కాదని చెప్పాచ్చు

b). అవరోధం:-(Inhibition):-

విస్మృతి అవరోధంవల్ల జరగవచ్చు. దీన్నే ‘జోక్య ప్రభావం’ (Interference effect) అంటారు.

అవరోధం రెండురకాలు:-

1) పురోగమన అవరోధం (Proactive inhibition) :పురోగమన అవరోధమంటే గతంలో చేర్చుకొన్న విషయాలు ఇప్పుడు నేర్చుకొన్న విషయాలను ఆటంకపరచడం. అంటే పాత అభ్యసనం కొత్త అభ్యసనానికి అవరోధంగా ఉండటం. 

2) తిరోగమన అవరోధం (Retroctive inhibition) : ఇందులో కొత్తగా నేర్చుకొన్న విషయాలు గతంలో నేరున్న విషయాల పునఃస్మరణకు అవరోధం కలిగిస్తాయి. అంటే కొత్త అభ్యసనం, పాత అభ్యసనానికి అవరోధంగా ఉండటం.

c).దమనం (Repression):-కొన్ని విషయాలను మనం కావాలని మర్చిపోతాం. దీన్ని దమనం అంటారు. దమనం ఒక రక్షణతంత్రం. దమనంలో మనకు ఇష్టం లేని విచారకరమైన విషయాలను, సంఘటనలను అచేతన మనసులోకి నెట్టివేస్తాం లేదా పంపించి వేస్తాం. అలా అచేతనంలో ఉండే అణచివేయబడ్డ విషయాలు, సంఘటనలు చేతన మనసులోకి రావాలని ప్రయత్నం చేస్తాయి. దమనం ఎక్కువయినప్పుడు ఆ విషయాలు, సంఘటనలు చేతన మనసులోకి కలల ద్వారా మానసిక రుగ్మతల (Mental disorders) ద్వారా బయటపడతాయి.

మనోవిశ్లేషణవాదులు (Psycho analysts) దమనం చేయబడ్డ విషయాలను, సంఘటనలు గూర్చి కలల విశ్లేషణ (Dream analysis) ద్వారా తెలుసుకొంటారు.

స్వేచ్ఛా సంసర్గం (Free association) ద్వారా దమనం చేయబడ్డ విషయాలు, సంఘటనలు, అనుభవాలు వెలికితీయడం జరుగుతుంది. స్వేచ్ఛా సంసర్గంలో వ్యక్తి తనకు తోచిన విషయాలను స్వేచ్చగా వ్యక్తపరుస్తాడు. వాటిని మనోవిజ్ఞాని (Psychologist) శ్రద్ధగా విని విశ్లేషణ చేస్తాడు.

4. అపసామాన్య విస్మృతి (Abnormal Forgetting):-

స్మృతి నాశనం (Amnesia) అనేది మానసిక ఆఘాతంవల్ల (Mental truma), శారీరక అఘాతంవల్ల (Physical truma) జరగవచ్చు. స్మృతి నాశనం అనేది ఒక అపసామాన్య విస్మృతి. ఇంకొక అపసామాన్య విస్మృతిని ఫ్యూడ్ (FEUD)గా పేర్కొనవచ్చు. ఇందులో ఒక వ్యక్తి గతజీవితం మరిచిపోయి వేరే ప్రదేశానికి వెళ్ళి కొత్త పేరుతో కొత్త జీవితం ప్రారంభించవచ్చు. తిరిగి ఏదైనా ఘాతం (Shock) సంభవించినపుడు పూర్వ జ్ఞాపకాలు తిరిగి రావచ్చు.

స్మృతిని పెంచేందుకు పద్ధతులు (Methods of improving memory):-

1. ప్రేరణ (Motivation) : సక్రమమైన ప్రేరణ స్మృతికి దోహదం చేస్తుంది. ప్రేరణ సరిగా ఉంటే ధారణ కూడా ఎక్కువగా ఉంటుంది. విద్యార్థులలో ధారణ సరిగా ఉండాలంటే ఉపాధ్యాయుడు వారిలో ప్రేరణ కలిగించాలి.

2. అభిరుచి, అవధానం (Interest, Attention) : అభిరుచి, అవధానం అనేవి స్మృతిని పెంచేందుకు దోహదం చేస్తాయి. సక్రమమైన అభిరుచి, క్రమమైన అవధానం కలిగి ఉన్నప్పుడు ధారణ కూడా సక్రమంగా ఉంటుంది. కాబట్టి విద్యార్థులు పాఠ్యాంశాలలో అభిరుచిని పెంచుకొని ఏకాగ్రత కలిగి, అవధానంతో విషయాన్ని నేర్చుకున్నప్పుడు వారి స్మృతి పెరుగుతుంది. అవధానానికి ఆటంకం కలిగించే విషయాలను తొలగించినప్పుడు స్మృతి అభివృద్ధి చెందుతుంది.

3. తక్కువ భావోద్రేకత (Less Emotional) : భావోద్రేకం ఎంత ఎక్కువగా ఉంటే స్మృతి అంత తక్కువగా ఉంటుంది. ఉద్రేకతతో నేర్చుకొన్న విషయాలు స్మృతిపధం నుంచి త్వరగా తొలగిపోతాయి. కాబట్టి విషయాలను నేర్చుకొనే టప్పుడు ప్రశాంతంగా ఉండాలి.

4.భావాల సంసర్గం (Association of ideas) : భావాల సంసర్గంవల్ల స్మృతిని పొందించవచ్చు.ఉదాహరణకు తాజ్మహలకు, షాజహాను సంసర్గం (Assoociation) ఏర్పరచినప్పుడు తాజ్ మహల్ పేరు చెప్పగానే షాజ్ హాన్ గుర్తుకు రావడం జరుగుతుంది.

ఒక్కొక్కసారి వైషమ్యం (Contrast) ద్వారా స్మృతి జరగవచ్చు. ఉదాహరణకు స్వర్గం గుర్తుకు రాగానే దానికి వ్యతిరేకమైన పదం నరకం కూడా గుర్తుకు వస్తుంది.

5.అతి అభ్యసనం (Over learning):

అతి అభ్యసనం అంటే ఒక విషయం నేర్చుకున్న తరవాత కూడా దాన్ని పదేపదే చదవడం. దీనివల్ల పునర్బలనం (Reinforcement) జరిగి ధారణ పెంపొందుతుంది.

6. వల్లెవేయడం (Recitation) :

వల్లె వేయడంవల్ల స్మృతి అభివృద్ధి ఏర్పడుతుంది. ధారణ పెరుగుతుంది. కాబట్టి విద్యార్థులు కొన్ని విషయాలను వల్లె వేయడం ద్వారా ధారణశక్తిని పెంపొందించుకోవచ్చు.

7. కొండగుర్తులు (Memoric devices): స్మృతిని పెంపొందించుకునేందుకు కొండగుర్తుల పద్ధతి చాలావరకు తోడ్పడుతుంది. ఉదాహరణకు VIBGYOR అనే కొండగుర్తు నేర్చుకుంటే ఇంద్రధనుస్సులోని రంగులన్నీ గుర్తుకు వస్తాయి. గణవిభజన చేయడానికి ‘యమాతారాజభానసలగం‘ అనే కొండగుర్తు తోడ్పడుతుంది.

Results

-
Please Share it


Please Share it
Please Share it


Please Share it

#1. మానవుని మనస్సులో లక్క ముద్దలాంటి పదార్థం ఉంటుందని అది స్మృతిని నిర్ణయిస్తుంది అని చెప్పిన వ్యక్తి?

#2. పుస్తక తయారీ కర్మాగారంలో కొంతమంది వ్యక్తులు పుస్తకాలను యంత్రంలాగా వేగంగా బైండింగ్ చేస్తుంటే ఇది ఏ లక్ష్యంగా చెప్పవచ్చు?

#3. హోదా, గౌరవం, పరపతి లాంటి అవసరాలు?

#4. సాధన ప్రేరణ అను భావనను ప్రవేశపెట్టింది ఎవరు?

#5. హన్సిక ఇంటర్మీడియట్ పరీక్షలో సంస్కృత పద్యాలన్నీ వ్రాసింది కానీ ఆమెకు అర్థం మాత్రం తెలియదు ఇది ఏ స్మృతి?

#6. విద్యార్థి పుస్తకాల ద్వారా, ఉపాధ్యాయుల ద్వారా, వార్తాపత్రికల ద్వారా సమాచారాన్ని తెలుసుకొనుట ఏ లక్ష్యంగా చెప్పవచ్చు

#7. రాము తను ఎంత ప్రయత్నించినా తన బాల్య మిత్రుల పేరు మర్చిపోలేకపోతున్నాడు ఇది ఏ స్మృతి?

#8. ఏదైనా నైపుణ్యాన్ని నేర్చుకునే క్రమంలో మనము ఉపయోగించే మొదటి లక్ష్యం ?

#9. అక్షయ్ ఆక్సిజన్ తయారీ, హైడ్రోజన్ తయారీ లాంటి అంశాలను ప్రయోగశాలలో ప్రయోగం చేయకుండానే గుర్తుపెట్టుకుంటే ఇది ఏ స్మృతి?

#10. డంకన్ అను శాస్త్రవేత్త వేటి పై ప్రయోగాలు చేశాడు?

#11. మునుపు అభ్యసించిన దానిలో దేనినైనా జ్ఞప్తికి తెచ్చుకోలేకపోవడం విస్మృతి అన్నది ఎవరు?

#12. డాక్టర్ దగ్గరికి వెళ్లి టోకెన్ తీసుకొని చూయించుకున్న చరణ్ కు ఇంటికి వచ్చాక వాళ్ళ అమ్మ టోకెన్ నెంబర్ ఎంత అని అడిగితే చెప్పలేకపోయాడు ఇది ఏ స్మృతి?

#13. ఇంక్వరీ ఇంటూ హ్యూమన్ ఫ్యాకల్టీ అండ్ ఇట్స్ డెవలప్మెంట్ గ్రంథ రచయిత?

#14. చిన్న కుటుంబం చింతలేని కుటుంబం అనే పాఠ్యాంశాన్ని విద్యార్థులు నాటకం వేసి గుర్తుపెట్టుకుంటే ఇది ఏ స్మృతి?

#15. స్మృతిని పెంచే పద్ధతి కానిది?

#16. రిమెంబరింగ్ గ్రంథ రచయిత?

#17. తన చిన్నప్పటి ఫోటోలు చూడగానే బాల్యమిత్రులు, చిన్నప్పుడు చదువుకున్న పాఠశాల, ఉపాధ్యాయులు ఇలా అనేక ఫోటోలో లేని అంశాలు గుర్తురావడం?

#18. పునరుత్పాదక పద్ధతి అని దేనికి పేరు?

#19. చిరంజీవి, నాగార్జున, బాలకృష్ణ, రమ్యకృష్ణలలో విద్యార్థులకు రమ్యకృష్ణ బాగా గుర్తుoడటం ఏ భావనకు సంబంధించింది?

#20. చిన్నపిల్లలు తన తల్లిదండ్రులు మందలించిన విషయాలను సాధారణంగానే ప్రయత్నం లేకుండానే మరిచిపోవడం?

#21. రాజకీయ నాయకులు వారి ఇచ్చిన నినాదాలను రవి 100 జతలుగా నేర్చుకున్నాడు.అతడు చదివి 24 గంటల తర్వాత గుర్తు తెచ్చుకోవడానికి ప్రయత్నిస్తే ఎన్నిజతలు అతడికి గుర్తువస్తాయి?

#22. దారణ అతిస్వల్ప కాలం ఉండే స్మృతి ?

#23. టాచిటోస్కోప్ ద్వారా అంచనా వేసేది?

#24. హంటర్ విలంబిత ప్రతిచర్యా పరికరం ద్వారా దేనిని అంచనా వేస్తారు?

#25. ప్రయోజ్యుడికి ముందుగా 50 మంది సినీనటులను తర్వాత 50 మంది క్రీడాకారులను చూపించి మొత్తం కల్పి 100 ని ఒకేసారి చూపిస్తూ వాటిలో సినీనటులను గుర్తించమని చెప్తే శిరీష 50 లో కేవలం 30 మందిని మాత్రమే గుర్తుపట్టింది అయితే గుర్తింపు గణన ఎంత?

#26. On Memory గ్రంథ రచయిత?

#27. క్రింది వానిలో స్మృతిని పెంపొందించే ప్రక్రియ ?

#28. సరిసంఖ్యలు నేర్చుకున్న తర్వాత బేసి సంఖ్యలు నేర్చుకుని బేసి సంఖ్యకు ఉదాహరణ చెప్పమంటే సరి సంఖ్యలు చెప్పడం ఏ అవరోధం

#29. అనిత అన్నమయ్య సినిమాను చూసిన తరువాత శ్రీ రామదాసు సినిమా చూస్తుంటె అన్నమయ్య సినిమా గుర్తుకు వచ్చి అడ్డు రావడం

#30. ఆర్కిమెడిస్ సూత్రాన్ని విద్యార్థి ప్రయోగాత్మకంగా నిరూపణ చేసి గుర్తించుకున్నాడు ఇది ఏ స్మృతి

#31. "డెజావు" అనునది ఏ భాష పదం ?

#32. స్మృతి ప్రక్రియ జరిగినప్పుడు మెదడులో ఏర్పడే స్మృతి చిహ్నాలకు గల మరో పేరు

#33. క్రొత్త విషయాలు మనం కావాలని మరిచి పోవడం.?

#34. ఎబ్బింగ్ హస్ స్మృతి ప్రక్రియను గూర్చి వివరించిన ఆన్ మెమొరీ గ్రంథము ప్రచురించబడిన సంవత్సరం ?

#35. చదివిన ప్రదేశం, జన్మించిన ప్రదేశం ఎక్కువ రోజులు గుర్తుoడడం ?

#36. స్మృతిని పెంపొందించే పద్ధతి కానిది ఏది ?

#37. ప్రయోగాలను చేసి అవగాహనతో విషయాలను గుర్తించుకోవడం ?

#38. ఎక్కాలు, పద్యాలు, శ్లోకాలు వల్లే వేయడం అనునది ?

#39. పొదుపు పద్ధతి లేదా పునరభ్యసనాన్ని ప్రవేశ పెట్టినది ?

#40. మనం నేర్చుకున్న విషయాన్ని మనసులో ఎంత కాలం నిలుపుకుంటామో ఆ శాతాన్ని తెలిపేది.

#41. (అసలు ప్రయత్నాలు - పునరభ్యసన ప్రయత్నాలు)/ అసలు ప్రయత్నాలు * 100

#42. టెట్ పరీక్షలో హాల్ టికెట్ నెంబర్ వేసిన విద్యార్థి పరీక్ష వ్రాసిన తర్వాత హాల్ టికెట్ నెంబర్ చెప్పలేక పోవడం ఏ స్మృతి ?

#43. కన్సాలిడేషన్ అనే ప్రక్రియను ప్రయోగాత్మకంగా నిరూపించిన సైకాలజిస్టు ?

#44. ఒక వ్యక్తి గత జీవితం మరిచిపోయి వేరే ప్రదేశానికి వెళ్లి క్రొత్త పేరుతో క్రొత్త జీవితం ప్రారంభించడం అనునది ఏ దశ ?

#45. ఈ స్మృతి టెక్నిక్ను ఉపయోగించి, పిల్లలు ఇంద్రదనస్సును 'VIBGYOR' గా గుర్తుంచుకుంటారు ?

#46. స్మృతి మరియు అభ్యసనమునకు సంబంధించి ఈ క్రింది వాక్యములలో సరియైనది ?

Finish

Also read : Psychology Grand Test – 1

శాస్త్రీయ నిబంధన సిద్ధాంతం

అభ్యసనం 

యత్నదోష అభ్యసన సిద్దాంతం 

అభ్యసన రంగాలు

అభ్యసన బదలాయింపు

ప్రేరణ

సాంఘిక-సాంసృతిక సిద్దాంతము

పరిశీలన అభ్యసన సిద్దాంతము 

అంతర్ దృష్టి అభ్యసనం 

కార్యసాధక నిబందనం

 


Please Share it

2 thoughts on “ap tet psychology Memory – స్మృతి – విస్మృతి”

  1. In memory topic,I get confusion about two words fugue which means loss of awareness of one’s identity. Another one is feud is also same meaning.

    Reply

Leave a Comment

error: Content is protected !!