Classical Conditioning Theory telugu – శాస్త్రీయ నిబంధన సిద్ధాంతం
రష్యా దేశానికి చెందిన ఇవాన్ పావ్లవ్ అనే జంతు శరీర ధర్మ శాస్త్ర వేత్త “శాస్త్రీయ నిబంధన సిద్ధాంతాన్ని“ ప్రతిపాదించారు. కుక్క జీర్ణ వ్యవస్థ పై పావ్ లవ్ చేసిన పరిశోధనలకు 1904 సంవత్సరంలో ఇతనికి సైన్స్ విభాగంలో నోబుల్ బహుమతి వచ్చింది.
2.ఈ సిద్ధాంతాన్ని గల ఇతర పేర్లు
A).నిబంధన అభ్యసనం ( Learning by Conditioned response)
B). నిబంధిత ప్రతిస్పందన సిద్ధాంతం (Theory of Conditioned response)
C).S-Type Theory (అనగా ఉద్దీపనకు ప్రాధాన్యతగల సిద్ధాంతము అని అర్థం) మరియు
Type -1 సిద్ధాంతము అని కూడా పిలుస్తారు.
D). సాంప్రదాయక నిబంధనము
E). సాంకేతిక నిబంధనా సిద్ధాంతం
F). ఉద్దీపన ప్రాధాన్యత సిద్ధాంతం
పావ్ లవ్ రచించిన గ్రంధాలు :-
1).The Conditioned reflex
2).The work of Digestive Glands
3.వీటిని గుర్తించుకోండి:-
సహజ ఉద్దీపన / ని ర్ని బందిత ఉద్దీపన:-( Un Conditioned Stimulus ) Short cut లో UCS అని గుర్తుపెట్టుకోండి.
సహజ ప్రతిస్పందన/ ని ర్ని బందిత ప్రతిస్పందన :- (Unconditioned Response) short cut లొ UCR అని గుర్తు పెట్టుకోండి.
ఆసహజ ఉద్దీపన/కుత్రిమ ఉద్దీపన/నిబంధిత ఉద్దీపన (Conditioned Stimulus ) short cut లొ CS అని గుర్తుపెట్టుకోండి.
ఆసహజ ప్రతిస్పందన/కుత్రిమ ప్రతిస్పందన/నిబంధిత ప్రతిస్పందన (Conditioned Response) short cut లొ CR అని గుర్తుపెట్టుకోండి.
డ్రైవర్:-ఒక ఉద్దీపనకు ఇంతకుముందు లేనటువంటి సహస సిద్ధము కానటువంటి ప్రతిస్పందనను కల్పించడాన్ని ‘నిబంధనం’ అంటారు.
4.పావ్ లావ్ ప్రయోగము:-
ఈయన ఆకలితో ఉన్న కుక్కను తీసుకొని దానిని ప్రయోగ పరికరాల మధ్య బంధించాడు. దాని నోటిలోని లాలాజల గ్రంథులకు ఒక రబ్బరు గొట్టాన్ని అమర్చి, రెండవ చివరి ను ఒక కొలత పాత్ర లో ఉంచాడు. ఈ విధంగా కుక్క నోటి నుంచి ఎంత లాలాజలం ఊరు తుందో తెలుసుకున్నాడు.
a).పావ్ లవ్ మొదట కుక్కకు ఆహారం చూపిస్తే దానికి లాలాజలం ఊరింది.
ఆహారం (సహజ ఉద్దీపన) (U.C.S)
లాలాజలం స్రవించడం (సహజ ప్రతిస్పందన) (U.C.R)
b). ఆ తరువాత ఏ సంబంధము లేని ఆ సహజ ఉద్దీపన అయినా గంట మోగించి, శబ్దం చేసి దానితో పాటుగా ఆహారం పెట్టడం జరిగింది. ఈ చర్య మూడు నాలుగు సార్లు మళ్లీ మళ్లీ చేసి తరువాత గంట మోగిస్తే ఆహారం లభిస్తుందన్న భావన ఏర్పడుతుంది.
గంట శబ్దం +ఆహారం (అసహజ ఉద్దీపన+సహజ ఉద్దీపన) (C.S+U C.S)
లాలాజలం ప్రవహించడం (సహజ ప్రతిస్పందన)(U.C.R)
c). ఆ తరువాత ఆహార సమకూర్చిన పోయినా కేవలం గంట మోత తోనే కుక్క లాలాజలం శ్రవించింది.
గంటశబ్దం (ఆ సహజ ఉద్దీపన) (C.S)
లాలాజలం ప్రవహించడం (ఆసహజ ప్రతిస్పందన)(C.R)
5.నియమాలు :-
1). పునర్బలన నియమము:-మొదట ఆహారానికే లాలాజలం స్రవించే కుక్క, చివరకు గంట శబ్దానికి కూడా లాలాజలం స్రవిస్తుంది. ఎందుకనగా ఆహారానికి ముందు ఎక్కువ సార్లు గంట శబ్దం జోడించడం వలన పునర్బలనం ఏర్పడింది.
2). సాధారణీకరణం:-గంట శబ్దాన్ని పోలిన మరి ఏ ఇతర శబ్దాల కూడా, లాలాజలం స్రవిస్తే ఈ భావనను సాధారణీకరణం అంటారు. అనగా ఒక ఉద్దీపనకు పోలిన మరే ఇతర ఉద్దీపన లకు కూడా అదే ప్రతిస్పందన ఇవ్వడాన్ని సాధారణీకరణం అంటాము.
3). విచక్షణ:-ఆ సహజ ఉద్దీపన ను పోలిన మరి ఏ ఇతర ఉద్దీపన లకు ప్రతిస్పందించకుండా, కేవలం ఆ ఉద్దీపనకు మాత్రమే ప్రతిస్పందిస్తే దానిని విచక్షణ అంటారు.
4). వీలుప్తీ కరణము:- (విరమణ):-ఆ సహజ ఉద్దీపన లకు సహజ ఉద్దీపనలను జోడించడం మానివేస్తే, ప్రతిస్పందన కూడా ఆగిపోతుంది. దీనిని విలుప్తి కరణము లేదా విరమణ అని అంటారు.
5). ఉన్నత క్రమ నిబంధనము:-ఒక అసహజ ఉద్దీపనకు మరొక అసహజ ఉద్దీపన జోడించి రెండవ సారి జోడించిన ఆ సహజ ఉద్దీపనకు కూడా, సహజ ప్రతిస్పందన లాంటి ప్రతిస్పందన రాబట్టగలిగారు. దీనినే ఉన్నత క్రమ నిబంధనను అంటారు.
6). ఆయత్న సిద్ధ స్వాస్థం:- ప్రయోగాన్ని విరమించిన ప్పటికీ, కొంతకాలం తర్వాత కుక్క గంట శబ్దానికి లాలాజలం స్రవించడం.
Results
#1. ఉపాధ్యాయుడి పట్ల ఉన్న భయాన్ని పాఠశాల పట్ల చూపడం ?
#2. సిరంజిని చూచి భయపడే పిల్లవాడు డాక్టర్ ని చూసి భయపడటం ?
#3. గణిత ఉపాధ్యాయుడి పట్ల ఏర్పరచుకున్న అభిమానాన్ని గణితశాస్త్రం పట్ల కూడా చూపడం ?
#4. గంటతో స్రవించిన లాలాజలం దీపానికి కూడా స్రవించడం ?
#5. నిబంధిత ఉద్దీపనకు జతపరచిన ఇతర ఉద్దీపనలు కూడా నిబంధిత ప్రతిస్పందనలు వ్యక్తం చేయడం?
#6. ఓక ఉపాధ్యాయుడి పట్ల భయాన్ని ఏర్పరచుకున్న విద్యార్థి ఆ ఉపాధ్యాయుడికి మాత్రమే భయపడటం ?
#7. గంటను పోలిన హారన్ శబ్దానికి కాకుండా గంట శబ్దానికి మాత్రమే లాలాజలం స్రవించడం?
#8. నిబంధన ఉద్దీపనలను పోలిన ఇతర ఉద్దీపనలకు కాకుండా నిబంధిత ఉద్దీపనకు మాత్రమే నిబంధిత ప్రతిస్పందనను వ్యక్తం చేయడం?
#9. ఒక ఉపాధ్యాయుడి పట్ల ఏర్పరచుకున్న భయాన్ని ఇతర ఉపాధ్యాయుల పట్ల కూడా చూపడం ?
#10. గంట శబ్దానికి లాలాజలం స్రవించడం మానివేసినప్పటికీ ఉన్నట్లుండీ గంట శబ్దానికి లాలాజలం స్రవించడం?
#11. ప్రయోగాత్మకంగా నిబంధన విరమణం జరిగినప్పటికీ ఉన్నట్లుండీ నిబంధిత ప్రతిస్పందన వ్యక్తం కావడం?
#12. ఈ నియమం ద్వారా అనవసర భయాలు, మూఢ నమ్మకాలు తోలగించవచ్చును?
#13. ఈ నియమం ద్వారా Thumb sucking, Bed wetting అలవాట్లు తోలగించవచ్చు?
#14. ఈ నియమం ద్వారా విద్యార్థులలో చెడు అలవాట్లు తోలగించవచ్చు ?
#15. గంట శబ్దానికి ఆహారాన్ని అందించడం మానివేస్తే గంట శబ్థానికి లాలాజలం స్రవించడం ఆగిపోతుంది?
#16. నిబంధనం జరిగిన తర్వాత నిబంధిత ఉద్దీపనకు నిర్నిబంధిత ఉద్దీపనను జోడించడాన్ని తగ్గిస్తే నిబంధిత ప్రతిస్పందన తగ్గిపోతుంది?
#17. బాగా మార్కులు వచ్చిన పిల్లలకి బహుమతులు ఇచ్చినట్లయితే ఆ పిల్లలు బాగా చదువుతారు?
#18. గంట మ్రోగించిన ప్రతిసారి ఆహారాన్ని అందించినట్లయితే గంట శబ్దం విన్న ప్రతిసారి లాలాజలం స్రవిస్తుంది?
#19. నిబంధిత ఉద్దీపన కు నిర్నిబంధిత ఉద్దీపన ను జతపరచడం ఎంత ఎక్కువ గా జరిగినట్లైతే నిబంధిత ప్రతిస్పందన అంత బలంగా ఏర్పడుతుంది?
#20. కార్యసాధక నిబంధన సిద్ధాంతం ?
#21. శాస్త్రీయ నిబంధన సిద్ధాంతం ?
#22. యత్నదోష సిద్ధాంతం ?
#23. గంట కోట్టినపుడు “లాలాజలం ఊరటం” అనేది ?
#24. ఆహారం ఇచ్చినపుడు “లాలాజలం ఊరటం” అనేది ?
#25. ఆహారం ఎలాంటి ఉద్దీపన ?
#26. పావ్ లోవ్ ఏ జంతువు మీద ప్రయోగం చేశారు ?
#27. 1 / 1 point శాస్త్రీయ నిబంధనంలో గంట కోట్టినపుడు లాలాజలం స్రవించడం అనే నిబంధిత ప్రతిస్పందన క్రమంగా మాయమవ్వడం?
#28. పావ్ లోవ్ ప్రయోగం లో కుక్క వలయాకార రింగు, అండాకార రింగు ఉద్దీపన ల మధ్య భేదాన్ని గ్రహించడం ?
#29. రాధను పాఠశాలలో ఒక ఉపాధ్యాయుడు తీవ్రంగా దండించడంతో ఆమె అతనంటే భయపడుతుంది. అయితే ఆమెకు మిగతా ఉపాధ్యాయులంటే భయం లేదు, ఇది దీనికి ఉదాహరణ ?
#30. సంతోష్ కి తనని అకారణంగా శిక్షించే తన తండ్రి అంటే భయం. ఎవరైనా స్నేహితులు తమ ఇంటికి పిలిచినపుడు , వాళ్ళ తండ్రులు కూడా శిక్షిస్తారనే ఆలోచనతో వెళ్ళటానికి నిరాకరిస్తాడు, దీనికి కారణం ?
#31. ట్రాఫిక్ లైట్లకు అనుగుణంగా వాహనాలు నడపటం అనేది దీనికి ఉదాహరణ ?
#32. అంతరదృష్టి సిద్ధాంతం insight learning theory శాస్త్రవేత్త ?
#33. పావ్ లోవ్ ప్రయోగం లో కుక్క గంట శబ్దం వినగానే లాలాజలం స్రవించింది, ఇక్కడ కుక్క లాలాజలం స్రవించడం అనేది?
#34. ఒక ఉపాధ్యాయుడు అంటే భయం ఏర్పడిన విద్యార్థి, ఆ ఉపాధ్యాయుని చూసినా, అతను ఉపయోగించే వస్తువులు చూసినా భయపడుతున్నాడు, దీనికి కారణం?
Also read :