Cognitive Development Theory telugu – సంజ్ఞానాత్మక వికాస సిద్ధాంతం
స్విట్జర్లాండ్ దేశానికి చెందిన జీన్ పియాజే సంజ్ఞానాత్మక వికాసము గురించి అనేక పరిశోధనలు చేశారు. జీవ శాస్త్రవేత్త ఐన ఈయన ఆగస్టు 9, 1896 లో జన్మించారు. ఈయన చిన్నతనము నుంచి జీవశాస్త్ర అంశాలపై ఎక్కువ అభిరుచిని చూపించేవారు. ఈయన Neuchatel University లో జీవ శాస్త్రంలో పట్టా పొంది, అదే విశ్వవిద్యాలయం నుంచి 1918 లో PhD. పట్టా తీసుకున్నారు. అప్పటికి ఆయన వయస్సు కేవలం 21 సంవత్సరాలు మాత్రమే.1925 నుంచి 1929 సంవత్సరం వరకు అదే విశ్వవిద్యాలయంలో మనోవిజ్ఞాన సామాజిక తత్వశాస్త్ర ఆచార్యుడిగా పనిచేశారు.
పిల్లల్లో సంజ్ఞాత్మక వికాసం పై సుమారు 50 సంవత్సరాల పాటు అధ్యయనం చేశారు. తన పరిశోధనలో తన జీవిత భాగస్వామిని కూడా భాగస్వామిని చేశారు. అంతేకాదు తన ముగ్గురు పిల్లల పైన పరిశోధనలు చేసి శిశు ఆలోచనా విధానంలో వయసు పెరిగే కొద్దీ ఎలాంటి మార్పులు వస్తాయో పేర్కొన్నాడు. ఈ పరిశోధనలు జీవిత పర్యంతము ఈయన కొనసాగించారు.
వ్యక్తి తన పరిసరాలతో ప్రభావవంతంగా సర్దుబాటు చేసుకుని అనుసరించే సామర్థ్యమే ప్రజ్ఞ అని పియాజె పేర్కొన్నాడు. పియాజే ప్రకారం పిల్లలు తమ ప్రపంచాన్ని అన్వేషించి అనుభవాల ద్వారా జ్ఞానాన్ని నిర్మించుకుంటారు. పిల్లలు తమ చుట్టూ ఉన్న ప్రపంచంలోని వస్తువులను సంఘటనలను ఎలా అర్థం చేసుకుని అనుసరించి అనుకూలంగా మలుచుకుంటారో తన సంజ్ఞానాత్మక వికాస సిద్ధాంతంలో సవివరంగా వివరించాడు.
పియాజే రచించిన గ్రంథాలు:-
1).The origin of intelligence
2).The growth of logical thinking
ఒక పిల్లవానికి ఏదైనా దృశ్యాన్ని చూపించినప్పుడు, ఆ దృశ్యం ఫలానాది అనే చెప్పే టువంటి వివేచనా జ్ఞానం ఆ పిల్లవాడికి ఎలా కలిగింది. ఆ దృశ్యం ఏదైనా కావచ్చు, అది పిల్లి కావచ్చు, కుక్క కావచ్చు లేదా ఒక ఆట వస్తువు కావచ్చు. ఈ జ్ఞానం ఎలా కలిగిందని జీన్ పియాజే ఆలోచించారు. అందువలన పిల్లల ప్రజ్ఞను మాపనం చేయడం కంటే, పిల్లల సమాధానాల వెనక దాగి ఉన్నటువంటి వివేచనను పరిశోధించేందుకు పూనుకున్నారు ఈయన.
సంజ్ఞానాత్మక వికాసం:–
వ్యక్తి తన గురించి, తన పరిసరాల గురించి, అవగాహన చేసుకోవడాన్ని మనం, సంజ్ఞాత్మకత అంటాము. అదేవిధంగా వ్యక్తి ప్రజ్ఞలొ వికాసం జరగడాన్ని సంజ్ఞానాత్మక వికాసం అంటాము.
పియాజే ప్రకారం మానవ మస్తిష్కంలో రెండు రకాల అంశాలు ఉంటాయి.
1).సంజ్ఞానాత్మక నిర్మాణం,
2).సంజ్ఞానాత్మక విదులు
ఒక పిల్లవాడు కుక్కను మొదటిసారిగా చూసినప్పుడు, ఆ అనుభవాన్ని ఒక స్కీమా రూపంలో మెదడులో భద్ర పరుచుకుంటాడు. ఇక్కడ స్కేమా అంటే కుక్క యొక్క ఆకారం. అది ఈ విధంగా ఉంటుంది అని తన మెదడులో ఒక భావన ఏర్పరుచుకుంటాడు. పియాజే ఈ భావననే స్కీమ అని చెప్పాడు.ఈ స్కీమాలనే మనం సంజ్ఞానాత్మక నిర్మాణాలు అని చెప్పవచ్చు.
మనిషి పుట్టుక తోనే స్కీమాటాలను పొంది ఉంటాడు. పిల్లవాడికి పుట్టుకతోనే పీల్చడం, తన్నటం, పట్టుకోవడం, హత్తుకోవడం లాంటి స్కీమాలు పుట్టుకతోనే ఏర్పడి ఉంటాయి.
శాంశీకరణము/స్వాయత్తికరణము :-పరిసరాల నుంచి అందిన సమాచారాన్ని అప్పటివరకు ఉన్న స్కీమాలతో కలిపే ప్రక్రియే శాంశీకరణము. అనగా పిల్లలు బాహ్య ప్రపంచాన్ని అర్థం చేసుకోవడానికి వారిలో ఉన్న ప్రస్తుత స్కీమాటాలను యుపయోగిస్తాడు. శాంశీకరణములో శిశువు తమ లో ముందే కలిగి ఉన్న గత అనుభవాలతో కూడుకొన్న స్కేమాటాలను ప్రస్తుత ఏర్పడే అనుభవాలతో పోల్చుకుంటారు. ఉదాహరణకు తనకు తెలిసిన కుక్క అనే జంతువు ద్వారా నక్కను కూడా కుక్క అని భావించి, దానిని తన స్కీమాట లో చేర్చుకుంటాడు. దీనినే మనము శాంశీకరణము అని చెప్పవచ్చు. అయితే కొద్ది అనుభవాల తరవాత నక్క చేసే అరుపు, దాని ఆకారంలోని మార్పులను గ్రహించి, దానిని వేరే జంతువు గా భావించి, దానిని వేరే స్కీమాటా గా ఏర్పాటు చేసుకుంటాడు, దీనినే మనం అనుగుణ్యత అని చెప్పవచ్చు. అనగా మనం అర్థం చేసుకోవాల్సింది అనుగుణ్యత అంటే వ్యక్తి పరిసరాలతో సర్దుబాటు చేసుకోవడం. అనగా అనుగుణ్యత లో వ్యక్తి కొత్త స్కీమాటాలను ఏర్పరచుకుంటాడు.
ఇక్కడ మనం గమనించాల్సింది, శాంశీకరణము పూర్వజ్ఞానం అయితే, ఈ అనుగుణ్యత లో ఆ పాత జ్ఞానానికి అనుబంధంగా ఒక క్రొత్త జ్ఞానాన్ని ఏర్పరచుకుంటారు ఈ పిల్లలు. అనగా బాహ్య ప్రపంచాన్ని గురించి తనకున్న మానసిక చిత్రాన్ని, పునః సమీక్షించుకుని, ప్రస్తుతం ఉన్న స్కీమాలో పరివర్తనం చేయడమే మనం అనుగుణ్యత అని చెప్పవచ్చు.
పీయాజే సంజ్ఞానాత్మక వికాస దశలు
పీయాజే సంజ్ఞానాత్మక వికాసం 4 దశలుగా పేర్కొన్నాడు:-
అవి:– 1). సంవేదన చాలక దశ (0-2 సంవత్సరాలు)
a).ఈ దశను ఇంద్రియ చాలక దశ లేదా జ్ఞానేంద్రియ చాలక దశ అని అంటారు.
b) ఈ దశ పుట్టినప్పుడు నుంచి 2 సంవత్సరాల దాకా ఉంటుంది.ఈ దశలో శిశువు తనకు ఇతర వస్తువులకు మధ్య తారతమ్యం తెలుసుకుంటాడు. ప్రపంచంలోని వస్తువుల గురించి అవగాహన చేసుకుంటాడు. వస్తువులు అందుకోవడం, పట్టుకోవడం చేస్తాడు.
c). ఈ దశలో శిశువుకు వస్తువు శాశ్వతమైనది అని తెలియదు. ఈ దశలో శిశువుకు అనుకరణ అధికంగా ఉంటుంది. 4 నుంచి 8 నెలల మధ్య శిశువుకు తన దృష్టి తన శరీరం నుంచి వస్తువులు పైకి వెళుతుంది.4 నుంచి 8 నెలల మధ్య శిశువు ఒక గిలకను ఆడించి దాని శబ్దాన్ని విని ఆనందిస్తాడు.
d) 8 నుంచి 12 నెలల మధ్య ఉన్న శిశువు, ప్రవర్తన ఉద్దేశపూర్వకంగా లక్ష్యం వైపు గా సాగుతుంది. ఈ దశలో వస్తు స్థిరత్వం అనే భావన శిశువుల్లో ఏర్పడుతుంది. వస్తు శాశ్వతము అనగా జ్ఞానేంద్రియాలకు వస్తువు కనపడ పోయినప్పటికీ అది ఎక్కడో ఒక చోట ఉంటుంది అనే భావనను అర్థం చేసుకుంటాడు.
e) 8 నుంచి 12 నెలల మధ్య తల్లి చేసే శబ్దాలను శిశువు అనుసరిస్తాడు. 12-18 నెలల శిశువు యత్నదోష పద్ధతి లో వస్తువుల మధ్య తారతమ్యాన్ని తెలుసుకుంటారు.
f) 18-24 నెలల మధ్య శిశువు యత్నదోష పద్ధతి నుంచి కొంతవరకు అంతర్దృష్టిని కూడా ఉపయోగిస్తాడు. ఇంద్రియ చాలక దశ పూర్తి అయ్యే నాటికి కేంద్రీయ నాడీ వ్యవస్థ శిశువులో భాగ అభివృద్ధి చెందుతుంది. శిశువు ఆటవస్తువులను కింద పడేసి మరీ ఆనందిస్తాడు.
2). పూర్వ ప్రచాలక దశ (2-7 సంవత్సరాలు):
a) ఈ దశలో భాషా వికాసం ఎక్కువగా జరుగుతుంది. ఈ దశలో పిల్లలు వస్తువులను గుర్తించి వాటి పోలికల ఆధారంగా వర్గీకరణను చేస్తారు ఈ దశనుంచి. ఈ దశలో సర్వాత్మ భావం కనబడుతుంది. రెండవది అహం కేంద్రీకృతము.
b). ప్రాణములేని వస్తువులకు శిశువు ప్రాణాన్ని ఆపాదించడంమే సర్వాత్మక వాదము అంటాము. అనగా పిల్లలు బొమ్మలకు స్నానం చేయించడం సీసాతో పాలు రాగింగ్ చేయడానికి ప్రయత్నం చేయడం, జోలపాట పాడి నిద్రపుచ్చటం లాంటివి మనం గమనించవచ్చు.
c). అహం కేంద్రీకృతం:-శిశువు ప్రపంచాన్ని తనవైపు నుంచి ఆలోచించడం, ఎదుటి వ్యక్తి వైపు నుంచి ఆలోచించకపోవడం చేస్తాడు. అనగా తను నడుస్తుంటే తనతోపాటే సూర్యుడు కూడా నడుస్తున్నారని శిశువు భ్రమ పడుతుంది. దీనినే మనం అహం కేంద్ర వాదమని అంటాం.
c).ఈ దశలో పిల్లలకు సమస్యను పరిష్కరించే సామర్థ్యం ఉన్నప్పటికీ, దానిని వివరించే వికాసం ఇంకా అభివృద్ధి చెంది ఉండదు.శిశువుకు ఈ దశలో కన్సర్వేషన్ అనే భావన ఏర్పడుతుంది. కన్సర్వేషన్ అనగా పదేళ్ల పరచుకునే భావన ఈ దశలో ఏర్పడి ఉండదు.ఉదాహరణకు నాలుగు సంవత్సరాల పిల్లవాడికి నీకు ఒక సోదరుడు ఉన్నాడా అని అడిగితే అవును అని చెప్తాడు, అతని పేరు ఏమి అని అడిగితే రాము అని చెప్తాడు, మరి రాముకు సోదరుడు ఉన్నాడా అని ప్రశ్నిస్తే ఎలాంటి సమాధానం ఇవ్వడు.
3). మూర్త ప్రచాలక దశ (7-11 సంవత్సరాలు)
ఈ దశలో పిల్లలు వాస్తవికత గురించి అవగాహన చేసుకుంటారు. వీరిలో తర్కంతో కూడినవంటి ఆలోచన విధానం ఉంటుంది.అయితే వీరి ఆలోచనలు మూర్త విషయాలకే పరిమితమై ఉంటాయి. అంటే తమ ముందు లేని విషయాల గురించి వీరు ఆలోచించలేరు. ఈ దశలోనే కూడటము, తీసివేయడం, హెచ్చించడం, అనే భావనలు నేర్చుకుంటాడు.
4). అమూర్త ప్రచాలక దశ (11-15 సంవత్సరాలు) :-
a ) ఈ దశలో అమూర్త భావనల పట్ల చింతన జరుగుతుంది. జ్ఞానం బాగా అభివృద్ధి చెందుతుంది. విచక్షణ వివేచన తో కూడినవంటి ఆలోచనలు చోటు చేసుకుంటాయి.
b) . ఒక సమస్యకు అనేక పరిష్కార మార్గాలు ఉంటాయని శిశువు తెలుసుకుంటాడు. అనగా శాస్త్రీయ చింతన ( ఆలోచన ) అభివృద్ధి చెందుతుంది.
c). ఈ దశలో ప్రకల్పన ( ఊహించని సమాధానము) నిగమాత్మక వివెచనము ( సాధారణ అంశాల నుండి ప్రత్యేకమైన అంశాలను ఆలోచించడం ).జరుగుతుంది.
Results
#1. Symbolic and Ego-cetric thinking are the major characteristics of……. ప్రతీకాత్మక’’ మరియు ‘’అహం కెంద్రీకృత’’ ఆలోచన అనేవి దీని యొక్క లక్షణాలు?
#2. Piaget’s theory of cognitive development is essentially about పియాజే యొక్క సంజ్ఞానాత్మక సిద్దాంతం ప్రధానంగా దీనికి సంబంధించనది?
#3. Midifications in the existing schema in response to new information and experience is called………. నూతన సమాచారం అనుభవాలకు ప్రతిస్పందనగా ప్రస్తుతమున్న స్కీమలో పరివర్తనాలు?
#4. The modification of existing knowledge structures as a result of exposure to new information or experiences is…….. నూతన సమాచారం లేదా అనుభవాల పరిచయం వలన ప్రస్తుత జ్ఞానా నిర్మాణాలలో జరిగే పరివర్తన?
#5. A child is playing, dressing and talking with the doll, thinking that it has life. The chils is in this stage of cognitive development ఒక శిశువు ఆట బొమ్మకు జీవుమున్నట్లు తలచి, దానితో ఆడుకొంటున్నది, అలంకరిస్తున్నది మరియు మాట్లాడుతున్నది. ఆ శిశువు ఉన్న సంజ్ఞానాత్మక వికాస దశ?
#6. According to Piaget theory, a child attributing life to inanimate objects is. పియాజే సంజ్ఞానాత్మక సిద్దాంతము ప్రకారం, శిశువు ఆటలాడేటపుడు జీవంలేని కొన్ని ఆటవస్తువులను జీవాన్నీ ఆపాదించుట?
#7. By watching the model of cone, Ramu is able to draw cone in different angles. But in the absence of the model of cone he is unable to draw the cone. According to Piaget he is an…….. శంఖువు యొక్క నమూనాను చూసి రాము శంఖువును వివిధ కోణాల్లో గీయగలిగాడు. కానీ శంఖువు నమూనా లేనప్పుడు శంఖువును గీయలేడు పియజే ప్రకారం అతను ఈ దశలో ఉన్నాడు?
#8. According to piaget, “object permanence” takes place during the period of…… పియాజే ప్రకారం, ‘’వస్తు స్థిరత్వం’’ ఈ క్రింది దశలో జరుగుతుంది?
#9. Piaget’s ‘make-believe play’ is associated with the………..stage.. పియాజే ‘మెక్-బిలీవ్ ప్లే’ ఈ దశకు సంబంధించింది?
#10. According to Piaget, the limitations of animism and egocentrism are observed in the following stage. పియాజే ప్రకారం జంతువాదం మరియు అహంకేంద్రవాదం ఈ దశలో కనబడతాయి?
#11. According to Piaget, language development occurs rapidly during this stage పియాజే ప్రకారం ఈ దశలో బాష వికాసం వేగవంతంగా ఉంటుంది?
#12. According to Piaget, children of this stage solve problem by testing hypothesis and thinking multidimensionally but not undimensionally. పియాజే ప్రకారం ఈ క్రింది పిల్లల సమస్య పరిష్కారం లో ఒకే కోణం లో కాకుండా బిన్న కోణాలలో ఆలోచించడం, మానసిక ప్రకల్పన పరీక్షించుట ద్వారా పరిష్కరిస్తారు?
#13. One of the following does not belong to the processes adaptation given by Piaget క్రింది వానిలో పియాజే తెలిపిన అనుకూలత ప్రక్రియకు చెందనిది?
#14. The important concept that the child learns during sensorimotor stage is ఇంద్రియ చాలక దశలో శిశువు నేర్చుకునే ఒక ముఖ్య భావన?
#15. The aspect which is not related to Mental Development ఇంద్రియ మానసిక వికాసానికి సంబంధించని అంశం?
#16. A child who has never seen an aeroplane, recognizes the aeroplane in the sky as a white bird as he sees it for the first time – This cognitive process is called ఎప్పుడూ విమానం చూడని పిల్లవాడు మొదటిసారి ఆకాశంలో విమానం చూసినపుడు దానిని పక్షిగా గుర్తించడంలోని సంజ్ఞానాత్మక ప్రక్రియ?
#17. Children explore the world around them and gain experiences and construct their knowledge – This was stated by పిల్లలు తమున్న ప్రపంచాన్ని అన్వేషించి ఆయా అనుభవాల ద్వారా జ్ఞానాన్ని నిర్మించుకొంటారు అని పేర్కొన్న మనోవిజ్ఞాన శాస్త్రవేత్త?
#18. In this stage of Piaget’s cognitive developmental stage ‘Animism’ is noticed ‘సర్వాత్మవాదం; పీయాజే యొక్క ఈ కింది సంజ్ఞానాత్మక వికాస దశలో కన్పిస్తుంది?
#19. A person attained good personality by developing socially accepted values is his వ్యక్తి సమాజం ఆమోదించే విలువతో కూడిన ఉన్నత వ్యక్తిత్వాన్ని సంతరించుకోవడం అనేది అతని యొక్క?
#20. The concept of ‘Object Permanence’ occurs in this stage of Piaget’s cognitive development వస్తు స్థిరత్వ భావన ఏర్పడే పీయాజే సంజ్ఞానాత్మక వికాస దశ?
#21. According to Piaget, children will learn the concept of object permanence during. పీయాజే ప్రకారం పిల్లల వాస్తు స్థిరత్వ భావన నేర్చుకునే దశ?
#22. This statement is not true with regard to the class room implications of Piaget’s cognitive development theory పీయాజే సంజ్ఞానాత్మక వికాస సిద్దాంతం తరగతి అన్వయానికి సంబంధించి సరికాని ప్రవచనం?
#23. ‘Intuitive thought period’ is a sub stage in Piaget’s cognitive developmental stages ‘అంతర్భుద్ది దశ’ అనేది పీయాజే సంజ్ఞానాత్మక వికాస దశల్లో క్రింది దానికి చెందినది?
#24. Lack of concept of irreversibility is related to this stage of Piaget’s Cognitive development పీయాజే సంజ్ఞానాత్మక వికాస దశల్లో ఆవిపర్యాత్మక భావన లోపం ఈ దశకు సంబంధించినది?
#25. A girl gives bath and feeds her toy with which she plays, according to Piaget the cognitive stage of this girl is ఒక అమ్మాయి తను ఆడుకునే బొమ్మకు స్నానం చేయించడం, అన్నం పెట్టడం చేస్తుంది, పీయాజే ప్రకారం ఈ అమ్మాయి సంజ్ఞానాత్మక దశ?
#26. In this cognitive developmental stage of Piaget the error ‘concentration of thought on a single dimension’ exists ‘ఒక విశేషకం పై ఆలోచన్నను కేంద్రీకరించడం అనే దోషం’ పీయాజే యొక్క ఈ సంజ్ఞానాత్మక వికాస దశలో ఉంటుంది?
#27. Piaget termed the cognitive structures responsible for person’s organised patterns of behavior as వ్యక్తి యొక్క సంఘటిత ప్రవర్తన నమునకు కరణబూతమైన సంజ్ఞానాత్మక నిర్మాణాలను పీయాజే ఇలా పిలిచారు?
#28. Ramesh listened to the description given by his teacher in the class about goat. Then he saw a black dog on his way and presumed it as a goat. This is due to రమేశ్ తన ఉపాధ్యాయుడు తరగతిలో మెక గురుంచి చెప్పిన వర్ణన విని తరువాత దారిలో కనబడిన నల్ల కుక్క కూడా మేక అనుకున్నాడు. దీనికి కారణం?
#29. The gradual increase in the capability of doing duties, increase in complexity and also skill development in the child as the child grows శిశువు జన్మించిన తరువాత ఆ శిశువు లో క్రమంగా విధులలో సమర్థత, క్లిష్టత, నైపుణ్యభివృద్ది, అధికమవడం అనేది?
#30. The learning which helps a person to acquire the knowledge about the World around him and to handle it is known as వ్యక్తి తన చుట్టూ ఉన్న ప్రపంచాన్ని జ్ఞానాన్ని పొంది, దానితో వ్యవహరించడానికి తోడ్పడే అభ్యసనం?
#31. Cognitive development is also called as సంజ్ఞానాత్మక వికసాన్ని ఇలా కూడా అంటారు?
#32. According to Piaget, “object performanence” takes places during the period of… పియాజే ప్రకారం, ‘’వస్తు స్థిరత్వం’’ ఈ క్రింది దశలో జరుగుతుంది?
#33. The cognitive process in which the child adjusts himself to the environment is పిల్లవాడు పరిసరాలతో సర్దుబాటు చేసుకోవడం అనే సంజ్ఞానాత్మక ప్రక్రియ?
#34. The Psychologist who explained about incorporation, accommodation and schemata సంశ్లేషణం, అనుగుణ్యం, స్కీమాట గురుంచి వివరించిన మనో విజ్ఞాన శాస్త్రవేత్త?
#35. The Piagets cognitive stage in which searching process starts in the child to find his mother when she was not seen తల్లి కనిపించకపోతే పిల్లవాడు తన తల్లిని వెదకడం ప్రారంభమయ్యే పియాజే సంజ్ఞానాత్మక దశ?
#36. Individual’s development is the result of his interactions with social environment – This is stated by వ్యక్తి వికాసం అతడు తన సాంఘీక పరిసరాలతో జరుపుకునే చర్య ఫలితమని తెలిపినవారు?
#37. The cognitive stage which contains pre-conceptual and intuitive phases is పూర్వభావనాత్మక, అంతర్బుద్ధి దశలను కలిగిన సంజ్ఞానాత్మక దశ?
#38. According to Piaget’s cognitive theory the stage in which children develop the concept of object permanence is పియాజే సంజ్ఞానాత్మక సిద్దాంతం ప్రకారం వస్తుస్థిరత్వ భావన ఏర్పడే దశ?
#39. Children invent new things with the help of previous knowledge is called పిల్లల పూర్వ జ్ఞానాన్ని వినియోగుంచికొని నూతన విషయాలను ఆవిష్కరించుకోవడం అనేది?
#40. According to Piaget changes occur in Schemata due to పియాజే ప్రకారం స్కీమాటలో మార్పులు రావడానికి కారణం?
Also read : ప్రజ్ఞా సిద్దాంతాలు
Thank you very much to making me good at preparation