CTET Telugu Material – కార్యసాధక నిబందనం
కార్యసాధక నిబంధనం సిద్ధాంతాన్ని అమెరికా దేశానికి చెందిన బి.ఎఫ్. స్కిన్నర్ ప్రతిపాదించారు. పావ్ లవ్ శాస్త్రీయ నిబంధన సిద్ధాంతాన్ని S- type సిద్ధాంతమని, స్కిన్నర్ కార్యసాధక నిబంధనం సిద్ధాంతమును R-type నిబంధన సిద్ధాంతము అని పిలుస్తారు.
2.దీని మారుపేర్లు:-
a).పరికరాత్మక నిబంధన
b).R-S నిబంధన సిద్ధాంతం
c).Type -II సిద్ధాంతము
d). ఉద్దీపనకు ప్రాముఖ్యత లేని సిద్ధాంతం.
B.F. స్కిన్నర్ ప్రతిపాదించిన ఈ నిబంధన సిద్ధాంతం కార్యసాధనకు సంబంధించినది. కార్య సాధన అనగా చుట్టూ ఉన్న పరిసరాల పై ప్రభావం చూపే బుద్ధి పూర్వక చర్యలు. స్కిన్నర్ ను కార్యసాధక నిబంధన పితామహుడిగా పిలుస్తారు.
స్కిన్నర్ ప్రతిపాదించిన కార్య సాధన నిబంధన సిద్ధాంతం Thorn dike ప్రతిపాదించిన యత్ననదోష అభ్యసన సిద్ధాంతం లోని ఫలిత నియమం మీద ఆధారపడి ఉంటుంది.
నిబంధన ప్రక్రియకు ఆద్యుడు గా పా వ్ లవ్ నీ పిలుస్తారు. అయితే కార్యసాధక నిబంధనం ఆద్యుడిగా స్కిన్నర్ ను పిలుస్తారు.
పావ్ లవ్ ప్రయోగాలు ఉద్దీపన ప్రాముఖ్యం తో ఉన్నవి. అందువల్ల దానిని S-Type, (Stimulus Oriented) ఉద్దీపన ప్రధాన నిబంధన మంటారు.
స్కిన్నర్ ప్రయోగాలలో ప్రతిస్పందనలు కి ప్రాముఖ్యత అధికం కావున R-Type (Response Oriented ) ప్రతిస్పందన ప్రధాన సిద్ధాంతం అంటారు.
3.స్కిన్నర్ ప్రయోగం:-
స్కిన్నర్ ఎలుకలు పావురాల మీద ప్రయోగాలు చేసి తన సిద్ధాంతాన్ని ప్రతిపాదించాడు.
స్కిన్నర్ తన ప్రయోగాలను నిర్వహించడానికి ఒక ప్రత్యేకమైన ఉపకరణాన్ని తయారుచేశాడు. దీనిని స్కిన్నర్ పేటిక అంటారు. ఈ పేటిక థారన్ డైక్ ఉపయోగించిన ఫజిల్ బాక్స్ కంటే అధునాతనమైనది. స్కిన్నర్ ఈ పేటికలో ఒక మీటను అమర్చాడు. ఈ మీట నొక్కితే సన్నని గొట్టం ద్వారా ఆహారపు గుళికలు కింద ఉన్న పళ్లెంలోకి వచ్చిపడేటట్లు ఏర్పాటు చేశాడు. ఇలా ఉన్న పేటికలో ఆకలిగా ఉన్న ఎలుకను పెట్టాడు. ఎలుక ఆకలి అయినప్పుడు ఆహారం కోసం అటూ ఇటూ తిరుగుతుంది. అలా తిరుగుతున్నప్పుడు యాదృచ్ఛికంగా మీట నొక్కితే, ఆహారపు గుళిక సన్నని గొట్టం ద్వారా కింద ఉన్న పళ్ళెంలో పడుతుంది. మొదట ఆహారపు గుళిక ఎక్కడి నుంచి ఎలా వచ్చిందో ఎలుకకు అర్థం కాదు. మరల అటూ ఇటూ తిరుగుతున్నప్పుడు మరొకసారి యాదృచ్ఛికంగా మీటను నొక్కడం జరుగుతుంది. వెంటనే ఆహారపు గుళిక పళ్ళెంలో పడుతుంది. మీట నొక్కిన ప్రతిసారి ఆహారపు గుళిక పళ్ళెంలో పడుతుంది. ఇలా అనేకసార్లు అయిన తరవాత మీట నొక్కడానికి ఆహార గుళిక రావడానికి మధ్య ఉన్న సంబంధం ఎలుక తెలుసుకుంటుంది.
ఆహారం కావలసినప్పుడల్లా మీటను నొక్కి ఆహారాన్ని పొందడాన్ని ఎలుక అభ్యసించింది. పై విధంగా ప్రతిస్పందనలు ఉద్దీపనల మధ్య సంసర్గం ఏర్పడుతుంది.
సరైన ప్రతిస్పందన (Response) లకు మాత్రమే పునర్బలనం ఉద్దీపనం (Stimulus) ఇవ్వబడుతుంది. అందుకే ఈ సంసర్గం R-S నిబంధనం.ప్రతిస్పందనలకు ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వడం వల్ల దీన్ని R-టైప్ నిబంధన అని అంటారు.
కార్యసాధక నిబంధన సిద్ధాంతంలో ముఖ్యమైన అంశం కావలసిన ప్రవర్తన ప్రదర్శించినప్పుడు పునర్బలనం ద్వారా ఆ ప్రవర్తనను బలపరచడం. ప్రతిస్పందన తీవ్రతను ప్రభావితం చేయడానికి, ప్రతిస్పందనకు పర్యవసానంగా ఇచ్చే ఏ పరిస్థితినైనా పునర్బలనం అనవచ్చు.
స్కిన్నర్ ప్రయోగం లోని కొన్ని ముఖ్య భావనలు:-
అభ్యాసకుడు – ఎలుక
అభ్యసన సన్నివేశం – స్కిన్నర్ బాక్స్
అభ్యసించే విషయం – ఎలుక మీటను నొక్కటం పునర్బలనం – ఆహారపు గుళిక తినడం.
4.స్కిన్నర్ ప్రయోగంలో నియమాలు:-
1). పునర్బలనం (Re-enforcement):-ఎలుక మీట నొక్కి నా వెంటనే ఆహారపు గుళికలు ఇవ్వడం. నిబంధన ప్రతిస్పందన ఇచ్చిన వెంటనే నిర్ని బందిత ఉద్దీపన ఇవ్వడం. ( CR ఇచ్చిన వెంటనే UCS ను ఇవ్వడం)
అనుకూల పునర్బలనం:(Positive Re-inforcement) : ఒక ప్రత్యేక ప్రవర్తన పునరావృతం చేసేలా ఉత్సాహపరిచే పర్యవసానాలను అనుకూల పునర్బలనం అంటారు.
ప్రతికూల పునర్బలనం: (Negative Re-inforcement) : ఒక ప్రత్యేక ప్రవర్తన పునరావృతం కాకుండా నిరుత్సాహపరిచే పర్యవసనాల్నును ప్రతికూల పునర్బలనం అంటారు.
పునర్బలన నియమాలు:-
a). నిరంతర పునర్బలనం:-(వెంటనే/అప్పటికప్పుడే):-అభ్యసనం జరిగేటప్పుడు విద్యార్థి సరైన ప్రతిస్పందన ఇచ్చినప్పుడల్లా ప్రతిసారీ ఏదో ఒక ఉద్దీపనను పునర్బలనం గా (బహుమానం గా) అందిస్తూ ఉండాలి. అని ఈ నియమం చెబుతుంది.
b). స్థిరకాల పునర్బలన నియమం:- అభ్యసన సన్నివేశం లో పాల్గొన్న విద్యార్థి సరైన ప్రతిస్పందన ఇచ్చినప్పుడల్లా కాకుండా నిర్ణీత కాల వ్యవధికి ఒక్క సారి ఏదో ఒక ఉద్దీపనకు పునర్బలనం అందిస్తూ ఉండాలని ఈ నియమం వివరిస్తుంది.
C). స్థిర నిష్పత్తి పునర్బలనం నియమము:-అభ్యసన సన్నివేశం లో పాల్గొన్న విద్యార్థికి, సరైన అన్ని ప్రతి స్పందనలకు కాకుండా, నిర్ణీత సంఖ్యలో చేసిన ప్రతిస్పందనకు ఏదో ఒక ఉద్దీపనను పునర్బలనం గా అందిస్తూ ఉండాలని ఈ నియమం వివరిస్తుంది.
d). చరశీల పునర్బలన నియమం:-అభ్యసన సన్నివేశం లో పాల్గొన్న విద్యార్థికి, అస్థిర కాలవ్యవధిలో అస్థిర ప్రతిస్పందనల సంఖ్యకు ఏదో ఒక ఉద్దీపనము పునర్బలనం గా అందిస్తూ ఉండాలని ఈ నియమం వివరిస్తుంది.
e). ధనాత్మక పునర్బలనం:-మంచి పనులు చేసినప్పుడు ఆ మంచి పనులు కొనసాగించడానికి, మనం పునర్బలనం ఇవ్వాలి.
e). రుణాత్మక పునర్బలనం:-ఇష్టంలేని పనులు చేసినప్పుడు, ఆ ప్రక్రియను తొలగించే ప్రక్రియను ఋణాత్మక పునర్బలనం అని అంటారు.
దండన:-అనవసర, వ్యర్థమైన ప్రతిస్పందన వచ్చిన తరువాత, బాధాకరమైన పునర్బలనం మనమే స్వతహాగా ఇవ్వడం.
5.కార్యక్రమయుత అభ్యసనం:- (Programmed Learning):
కార్యసాధక నిబంధన సిద్ధాంతం నుంచి విద్య పొందిన పెద్ద ప్రయోజనం కార్యక్రమయుత అభ్యసనం. కార్యక్రమయుత బోధన అంటే “వివిధ సోపానాల ద్వారా ప్రగతిశీలంగా, దశలవారీగా నియంత్రించిన స్వీయ అభ్యసన పద్ధతి”.
కార్యక్రమయుత అభ్యసనంలో బోధనాంశాలు చిన్న విభాగాలుగా విభజించడం జరుగుతుంది. ఒక్కొక్క భాగాన్ని చట్రం (Frame) అంటారు. ప్రతి చట్రం చివరలో ప్రశ్నలు ఉంటాయి. ఉపాధ్యాయుడు తను బోధించాలి అనుకున్న పాఠ్యాంశానికి ఎన్ని చట్రాలు అవసరమవుతాయో అన్నింటిని తయారుచేయాలి. అభ్యాసకుడు మొదటి చట్రంలోని విషయాన్ని చదివి అర్థం చేసుకోవాలి. తను ఆ చట్రంలోని విషయాంశం అభ్యసించిన తరువాత ఆ చట్రంలో చివర ఉన్న ప్రశ్నలకు జవాబులు రాసి అభ్యాసకుడై తాను రాసిన జవాబులు సరియైనవో లేదో చూసుకోవాలి. అన్నింటికి సరియైన సమాధానాలు రాస్తే తను రెండవ చట్రంలోని విషయాలను చదివి, ప్రశ్నలకు జవాబులు రాయాలి. అన్ని ప్రశ్నలకు జవాబులు రాసిన తరువాతనే మరొక చట్రం చదవాలి. అంటే అభ్యాసకుడు ఒక చట్రం పూర్తిగా చదివి, ప్రశ్నలకు జవాబులు రాసిన తరువాతనే మరొక చట్రంలోకి వెళుతూ అన్ని చట్రాలను పూరించవలసి ఉంటుంది. ఏదైనా ఒక చట్రంలోని ప్రశ్నలకు అన్ని జవాబులు సరిగా రాయకపోతే తిరిగి ఆ చట్రాన్ని అభ్యసించవలసి ఉంటుంది.
కార్యక్రమయుత అభ్యసనలోని ముఖ్యమైన సూత్రాలు
1. చిన్ని సోపానాల సూత్రం 2. చురుకైన ప్రతిస్పందనల సూత్రం 3. తక్షణ పునర్బలన సూత్రం 4. స్వీయ గమన సూత్రం.
5. స్వీయ మూల్యాంకన సూత్రం
కార్యక్రమయుత అభ్యసనం వల్ల ప్రయోజనాలు
a).ఉపాధ్యాయుడు చట్రాలను చాలా తేలికైన భాషలో తయారుచేయడంవల్ల తేలికగా అవగాహన చేసుకోగలుగుతాడు
b).అభ్యాసకులు అభ్యసనలో చురుకుగా పాల్గొంటారు. c).విద్యార్థి స్వీయ వేగంతో (Own pace) విషయాన్ని అభ్యసిస్తాడు.
d).అభ్యాసకుడు తాను రాసిన జవాబులు తప్పో ఒప్పో తెలుసుకోవడానికి తక్షణమే అవకాశం కలుగుతుంది. అభ్యాసకుడు ఇచ్చే సరైన సమాధానం పునర్బలనాన్ని ఇస్తుంది.
e).ఉపాధ్యాయుడు సహాయకారిగా ఉంటూ, విద్యార్థి అభ్యసనానికి తోడ్పడతాడు.
బోధన యంత్రం :
కార్యసాధక నిబంధన ఆధారంగా బోధనా యంత్రాలను రూపొందించడం జరిగింది. 1926 లో ఓహియో విశ్వవిద్యాలయానికి చెందిన ఎస్. ఎల్. ప్రెస్సి ఈ బోధనా యంత్రాన్ని మొదటిసారిగా రూపొందించాడు. బోధనా యంత్రంలోని బోధనాంశం చిన్న చిన్న భాగాలుగా విభజించబడి ప్రతిభాగం ఒక చట్రం రూపంలో ఉంటుంది. ఈ చట్రాన్ని చదివిన తరవాత దానిలో ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వవలసి ఉంటుంది. జవాబు సరిగా ఇస్తే, రెండవ చట్రం వస్తుంది. సమాధానం తప్పు అయినట్లయితే తరవాతి చట్రం రాదు మరలా బోధనాంశాన్ని క్షుణ్ణంగా నేర్చుకొని ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వాలి. సరైన సమాధానం ఇచ్చినప్పుడే అభ్యసనంలో ముందుకు పోవడానికి వీలవుతుంది. ఇది కార్యక్రమయుత అభ్యసనం లాంటిదే. అయితే ఇక్కడ బోధనాయంత్రం ఉంటుంది. ఈ యంత్రం విద్యార్థులకు స్వయంచాలక పరిపుష్టిని (Feedback) అందిస్తుంది.
ప్రతిస్పందనలు స్కిన్నర్ ప్రకారం 2 రకాలు:
1) నిర్గమాలు (రాబట్టిన బహిర్గత ప్రతిస్పందనలు) : ఇవి ఉద్దీపనకు ప్రతిగా వచ్చే ప్రతిస్పందనలు (తప్ప స్వతస్సిద్ధంగా రావు).
ఉదా : 1)పావ్ వ్ ప్రయోగం, 2)థార్నడైక్ ప్రయోగం, 3)బహుమతి కోసమే విద్యార్థి ప్రార్థనా సమయానికి రావడం
2) ఉద్గమాలు (బయటికి వదిలిన ప్రతిస్పందనలు) : ఇవి ఉద్దీపన లేకపోయిన జరిగే ప్రతిచర్యలు.
ఉదా : 1. స్కిన్నర్ ప్రయోగం, 2. ఎవరూ చెప్పకపోయినా విద్యార్థి ఉదయాన్నే లేచి చదువుకోవడం.
స్కిన్నర్ ప్రయోగంలో మీట (నిబంధిత ఉద్దీపన), మీటను నొక్కడం (నిబంధిత ప్రతిస్పందన), ఆహారం (నిర్నిబంధిత ఉద్దీపన), ఆహారాన్ని తినడం (నిర్నిబంధిత ప్రతిస్పందన).
Results
#1. అనుపమ అను విద్యార్ధికి ఉపాధ్యాయుడు ప్రతి 5 ని।।లకు ఒకసారి తాను ఇచ్చే సరైన సమాధానానికి బహుమతిని అందిస్తే అది స్కిన్నర్ ప్రకారం ఇట్టి పునర్భలన షెడ్యూల్?
#2. కరుణ శ్రీ ఉపాధ్యాయుడు అడిగే ప్రతీ ప్రశ్నకు సమాధానాన్ని ఇస్తుంది. ఇచ్చిన ప్రతీసారి పునర్భలనాన్ని పొందుతున్నది. ఇక్కడ జరిగే పునర్చనలము
#3. క్రింది పునర్భలనాలలో స్కిన్నర్ ప్రతిపాదించనది ?
#4. కార్యక్రమయుత అభ్యసనం లక్షణం కానిది ?
#5. స్వప్న Lab Activity ని నిర్వహిస్తున్నప్పుడు జీవశాస్త్ర ఉపాధ్యాయుడు బుజ్జి ప్రతి 2ని।। ఒకసారి పునర్బలనము ఇచ్చిన అది స్కిన్నర్ ప్రకారము?
#6. తరగతి గది సమస్యలను నివృత్తి చేయుటములో ముఖ్యమైన పాత్ర పోషించు కారకమే?
#7. ఒక సంక్లిష్టమైన భావనను వివరించటములో ఒక ఉపాధ్యాయుడు ‘A‘ అను బోధనా పద్ధతిని ఉపయోగించారు. దీని ద్వారా మంచి ఫలితాలు రాకపోవటముతో ‘B‘ అను బోధనా పద్ధతికి మారాడు. ఆశించిన ఫలితాలు రావటముతో దీనినే వినియోగిస్తున్నారు. ఇది ఈ అభ్యసనా పద్ధతికి దగ్గరగా ఉంది?
#8. కార్యక్రమయుత అభ్యసనమునకు సంబంధించి సరికానిది ?
#9. తరగతి గదికి ఉపాధ్యాయుడు రాగానే విద్యార్ధి లేచి నిలబడటము ఈ అభ్యసన సిద్ధాంతమును సూచిస్తుంది.?
#10. కాల వ్యవధితో కాని ప్రతిస్పందనలలో కాని సంబంధం లేకుండా పునర్భలనలను ఇవ్వటము స్కిన్నర్ ప్రకారము?
#11. విజ్ఞాన విహారయాత్రకు వెళ్ళినపుడు దారిలో ఎదురైన అనాధకు తన వద్ద గల ఆహారాన్నిచ్చిన అమృత ఉపాధ్యాయుడు మెచ్చుకోగా అప్పటి నుండి అమృత అనాధల పట్ల ఆదరణను కలిగి ఉండటము ఈ సిద్ధాంతమును సూచించును.?
#12. ఒక ఉపాధ్యాయుడు పాఠశాల మొక్కలకు నీళ్ళుపడుతున్న భావనకి penని బహుకరించెను. తనతో నీవు ఇలాగే కొనసాగించినచో నీకు Dress బహుకరిస్తానని తెలిపెను. ఇక్కడి ఉపాధ్యాయుడు ఉపయోగించిన పునర్బలనం?
#13. నూతన సంవత్సరము రోజున పాఠశాల ఆవరణలో అందంగా ముగ్గు వేసిన అమృతని ఉపాధ్యాయుడు మెచ్చుకోగా అప్పటి నుండి ఆ అమ్మాయి పాఠశాలలో జరిగే ప్రతి వేడుకకు కూడా అందంగా ముగ్గు వేయటము ఈ అభ్యసన సిద్ధాంతమును సూచిస్తుంది.?
Also read : శాస్త్రీయ నిబంధన సిద్ధాంతం