Defense Mechanisms – రక్షక తంత్రాలు
రక్షక తంత్రాలు ప్రతిపాదించినది సిగ్మండ్ ఫ్రాయిడ్. ఈ రక్షకతంత్రాలు వ్యక్తి అహం (Ego) ని దెబ్బ తినకుండా చేస్తాయి. ఒత్తిడి, వ్యాకులత, కుంటనము, సంఘర్షణలకు వ్యక్తి గురైనప్పుడు ఓటమిని అంగీకరించకుండా ఆ పరిస్థితి నుంచి పారి పోకుండా, మధ్య మార్గంగా వ్యక్తి చేతనంగా అచేతనంగా ఉపయోగించే పద్ధతులే రక్షక తంత్రాలు. ఇది ఒక రకంగా వ్యక్తి మూర్తిమత్వాన్ని చిన్నాభిన్నం కాకుండా కాపాడతాయని మనో విశ్లేషకుల నమ్మకము. ఇవి వ్యక్తి అహాన్ని అగౌరవము నుండి అపరాధ భావన నుండి తాత్కాలికంగా కాపాడుతాయి కానీ వాస్తవాన్ని మార్చలేవు.
1).దమనం:- వ్యాకులత కలిగించే విషయాలను వ్యక్తి చేతనం నుండి అచేతనం లోకి పంపించి బలవంతంగా మర్చిపోవడం.
ఉదాహరణకు: స్నేహితురాలి మరణం బలవంతంగా మరచిపోవడం.
2). ప్రతిగమనం:- ఒత్తిడికి గురైన వ్యక్తులు పెద్దవారు అయినప్పటికీ చిన్న పిల్లల వలె ప్రవర్తిస్తారు. ఉదాహరణకు ఉద్యోగం పోయిన వ్యక్తి చిన్నపిల్లాడిలా ఏడవడం.
3). పరిహారం:-ఒక రంగంలో రాణించి లేని వ్యక్తి ప్రత్యామ్నాయ రంగాన్ని ఎంచుకోవడం ఆ రంగంలో రాణించడం.
ఉదాహరణకు: చదువులో రాణించ లేని రాధ చెస్ క్రీడలో రాణించడం.
4). హెతుకీకరణము:-హేతువు అంటే కారణం. లక్ష్యసాధనలో విఫలం అయినప్పుడు దానిని ఇతర కారణాలతో తన లోపాన్ని సమర్థించుకుంటూ తన మనసును సర్దిపుచ్చుకోవటం
ఉదాహరణకు: a).అందని ద్రాక్ష పుల్లన అని చెప్పటం
b). టీచర్ ఉద్యోగం రాని వ్యక్తి ఉపాధ్యాయ ఉద్యోగానికి జీతం తక్కువ అని చెప్పడం.
5). ప్రక్షేపణం:– వ్యక్తి తన లోపాలను తప్పులను ఇతురుల పైకి నెట్టివేయడం.
ఉదాహరణకు:- ఆడలేక మద్దెల ఓటి.
పరీక్షల్లో తప్పిన విద్యార్థి ఉపాధ్యాయులు బోధన సరిగ్గా లేకపోవడం వల్ల పరీక్ష తప్పానని చెప్పటం.
6). విస్థాపణం:-వ్యక్తి తన కోపాన్ని అసలు వ్యక్తుల మీద కాకుండా తన కంటే తక్కువ స్థాయి వ్యక్తులను మీద వస్తువుల మీద చూపించడం.
ఉదాహరణకు:-ఉపాధ్యాయుడు ప్రధానోపాధ్యాయిని మీద కోపాన్ని విద్యార్థులం మీద చూపించడం.
7). తదాత్మికరణం:- తానుగా సాధించలేనిది లేనప్పుడు ఇతరుల విజయాన్ని తన విజయంగా భావించడం. ఉదాహరణకు:-ఇండియా క్రికెట్ ప్రపంచ కప్ సాధించినప్పుడు ఆ విజయం తన విజయంగా భావించి ఒక విద్యార్థి ఆనందించడం.
8). స్వైర కల్పన:-(Fantasy):-పగటి కలలు కనడం. వ్యక్తి నిజజీవితంలో సాధించలేని విషయాలను వాస్తవికత మరచి ఊహా ప్రపంచంలో తన తీరని కోరికలు తీర్చుకోవడం.
ఉదాహరణకు:-పోటీపరీక్షలకు ఏమాత్రం చదవని విద్యార్థి తాను ఐ. ఏ. ఎస్ సాధించినట్లు ఊహించుకోవడం.
9). ఉపసంహరణ:-వ్యాకులత కలిగించే సంఘటనలను నుంచి తప్పించుకోవడం.
ఉదాహరణకు:-పరీక్షలకు సరిగ్గా చదవని విద్యార్థి పరీక్ష రాయకుండా తప్పించుకోవడం.
10). ప్రతిచర్య నిర్మితి:-ఈ రక్షక తంత్రం లో వ్యక్తి వాంఛలు, దృక్పథాలు, బాహ్య ప్రవర్తన, అతడి అచేతన వాంఛలకు వ్యతిరేకంగా ఉంటాయి.
ఉదాహరణకు:-ఉపాధ్యాయుడు అంటే గౌరవం లేకపోయినా గౌరవం ఉంది అని చెప్పటం.
11). సానుభూతి:-ఒత్తిడివల్ల కలిగే బాధకు ఇతరుల నుంచి స్వాంతన పొందడం.
ఉదాహరణకు:-పాఠశాలకు హాజరు కాని విద్యార్థి తనకు ఆరోగ్యం బాగా లేదని ఉపాధ్యాయుని నుంచి సానుభూతి పొందడం.
12). నిరాకరణము:-అంగీకరించటానికి ఇష్టం లేని వాస్తవాలను ఒప్పుకోకుండా నిరాకరించడం. ఉదాహరణకు:-తప్పు చేసిన ఖైదీ కోర్టులో తాను నిరపరాధి అని వాదించడం.
13). బౌద్ధకీకరణము:-బాధ, భయం కలిగించే పరిస్థితుల నుంచి భౌతిక నిర్వచనాలతో వాని అనుభూతికి పూర్తిగా దూరమవ్వడం.
ఉదాహరణకు:-ఆప్తులు మరణించినప్పుడు జనన మరణాలు సహజమే అని వేదాంతధోరణిలో మాట్లాడడం.
14). ప్రాయశ్చిత్తం:(Undoing):-తన మనసు అంగీకరించలేని ఆలోచనలకు బహిరంగంగా క్షమాపణ అడగటం.
ఉదా:-తప్పులు చేసిన వ్యక్తి తన తప్పులను ఒప్పుకుని సమాజ సేవ చేయడం.
15). వ్యక్తీకరణం: (Acting out):-ఒత్తిడి కలిగించే విషయాలను బయటకు వ్యక్తపరచడం
ఉదా: ఉపాధ్యాయుడు దండిస్తున్నడని విద్యార్థి ఎదురు తిరగడం.
16). ఉదాత్తికరణం:-(Sublimation):-సమాజ ఆమోదయోగ్యం కాని విషయాలను నిర్మోహమాటంగా ఆమోదయోగ్యమైన రీతిలో ఉపయోగించడం.
ఊదా:-ప్రేమ లేఖలు రాసిన కాలేజీ విద్యార్థి ప్రేమ కథలు రాసి గొప్ప రచయితగా పేరు తెచ్చుకోవడం.
17). అంతర్లీనం:- సంఘర్షణలకు లోను చేసే విషయంలో గెలవలేక రాజీపడి మారిపోవడం.
ఊదా:-ఉదయాన్నే లేచి అలవాటు లేని విద్యార్థి కోచింగ్ కోసం తప్పనిసరి పరిస్థితుల్లో ఉదయాన్నే లేవడం.
సంఘర్షణలు (Conflicts)
రెండు లేదా అంతకంటే ఎక్కువ ప్రత్యామ్నాయాల్లో ఏదో ఒక దాన్ని ఎన్నుకోవలసి వచ్చినప్పుడు వ్యక్తిలో సంఘర్షణ ఏర్పడుతుంది.
డగ్లస్, హాలండ్లు :-రెండు విరుద్ధ కోర్కెల మధ్య ఏర్పడే తన్యత వల్ల కలిగే బాధాకర ఉద్వేగ స్థితి సంఘర్షణ
కేట్జ్ & లేహ్నర్ :- రెండు లేదా ఎక్కువ విరుద్ధమైన కోరికల ఫలితంగా వ్యక్తి ప్రవర్తనలో ఏర్పడిన ఉద్రిక్త స్థితి సంఘర్షణ .
కర్ట్లెవిన్ అనే శాస్త్రవేత్త వ్యక్తిలో ఏర్పడే సంఘర్షణలను నాలుగు రకాలుగా విభజించాడు.అవి-
1. ఉపగమ – ఉమగమ సంఘర్షణ:
రెండు ఆకర్షణీయమైన లక్ష్యాల మధ్య ఏదో ఒకటి ఎన్నిక చెయ్యాల్సి వచ్చినప్పుడు ఏర్పడే సంఘర్షణ.
ఉదా: 1) అవ్వ కావాలి – బువ్వ కావాలి. .
2) పరీక్షలో బాగా తెలిసిన రెండు జవాబుల మధ్య ఎన్నిక,
3) క్లాస్ వినాలని ఉంది – క్లాస్లోనే నిద్రపోవాలని ఉంది.
4) క్రికెట్ చూడాలని వుంది – పడుకోవాలని వుంది.
2. పరిహర – పరిహార సంఘర్షణ:-
రెండు వికర్షణీయ లక్ష్యాల మధ్య ఏదో ఒకటి ఎన్నిక జరగాల్సి వచ్చినప్పుడు ఏర్పడే సంఘర్షణ.
ఉదా: 1) జ్వరం వచ్చినప్పుడు ట్యాబ్లెట్ వేసుకోవాలని లేదు, ఇంజక్షన్ తీసుకోవాలని లేదు,
2) ముందునుయ్యి – వెనక గొయ్యి, DSC కి చదవడం ఇష్టం లేదు అలాగని ఉద్యోగం వదులుకోవడం ఇష్టం లేదు,
3) చెల్లెలు ఏడ్వడం ఇష్టం లేదు అలాగని బొమ్మను ఇవ్వడం ఇష్టం లేదు.
3. ఉపగమ-పరిహార సంఘర్షణ:-
ఒక ఆకర్షణీయమైన, మరొక ఆకర్షణీయం కాని లక్ష్యాల మధ్య ఏదో ఒకటి ఎన్నిక జరగవలసి వచ్చినపుడు ఏర్పడే సంఘర్షణ.
1). పెళ్ళి చేసుకోవాలని ఉంది – కానీ పోషిస్తానో, లేదో అని భయంగా ఉంది.
2). ఇంగ్లీష్ మాట్లాడాలని ఉంది – ఎవరైనా నవ్వుతారేమోనని భయంగా ఉంది.
3). స్వీటు తినాలని వుంది – కానీ షుగర్ పెరుగుతుందేమో అనే భయం.
4). పరీక్షలో కాపీ కొట్టాలని ఉంది. ఇన్విజిలేటర్ పట్టుకుంటే బయటకు పంపిస్తాడనే భయం ఉంది.
4. ద్విఉపగమ – ద్విపరిహార సంఘర్షణ: రెండు లేదా అనేక లక్ష్యాల మధ్య అనుకూల, ప్రతికూల విషయాలుండటం.
1). ఇంటికి ఆటోలో వెళ్లి త్వరగా విశ్రాంతి తీసుకోవాలని ఉంది కానీ ఓపిక లేకపోయినా నడిచివెళ్లి ఆటో డబ్బులు మిగిలించాలని ఉంది.
2). స్కూల్ అసిస్టెంట్ ఉద్యోగం నాన్ లోకల్ కోటాలో వేరే జిల్లాలో పోస్టింగ్, ఎస్.జి.టి. ఉద్యోగం సొంత జిల్లాలో దగ్గరి ప్రాంతంలో పోస్టింగ్.
3). అందమైన అమ్మాయి కానీ ప్రభుత్వ ఉద్యోగం లేదు – ప్రభుత్వ ఉద్యోగం ఉంది కానీ అందంగా లేదు.
Results
#1. క్లాసులకు హాజరు కాకుండా సినిమాకు ఎందుకు వెళ్ళావని ప్రశ్నించిన ఉపాధ్యాయుడితో, అందులో వైజ్ఞానిక విషయాలను ప్రత్యక్షంగా చూసి తెలుసుకోవడానికని విద్యార్థి సమాధానం చెప్పడం ?
#2. అప్పు తీసుకున్న వ్యక్తి తాను తీర్చలేనపుడు తీసుకున్న వ్యక్తి నుండి తప్పించుకుని తిరుగుతుంటాడు ?
#3. కళ్యాణ్ ప్రేమలో వైఫల్యం చెందాడు, తదుపరి అతను కవిత్వం రాయటంపై తన ఆలోచనలని లగ్నం చేసి గోప్ప కవి అయ్యాడు
#4. పరీక్షకు సరిగా చదవని విద్యార్థి పరీక్షలు వ్రాయకుండా తప్పించుకుంటాడు ?
#5. తల్లిదండ్రులు కించపరుస్తున్నారని భావిస్తున్న కుమారుడు తన బాధను వ్షక్తపరచటం, ఎదురుతిరగటం ?
#6. ఉపాధ్యాయుడు అంటే గౌరవం లేకపోయినా , గౌరవం ఉందని విద్యార్థి చెప్పడం ?
#7. ఇంటర్వ్యూకి వెళ్ళిన వ్యక్తి సమాధానాలు చెప్పలేక చిన్న పిల్లవాడిలా ఏడవడం ప్రారంభించాడు, ఈ రక్షకతంత్రం
#8. తండ్రి మరణిస్తే ఆ బాధను తగ్గించుకోవటానికి, అతను పూర్తి జీవితం సంతోషంగా గడిపాడు, ఏ బాధా లేకుండా సునాయాస మరణం అతని అదృష్టం అని చెప్పడం ?
#9. చెడు అలవాట్లకు బానిస అయిన కొడుకు తన మాట వినకపోవడంతో ఒక తండ్రి చిన్న పిల్లవాడిలా ఏడవటం
#10. తెలువితేటలు తక్కువ ఉన్న విద్యార్థి ఈ పోటీ ప్రపంచంలో చదవడం ఇష్టం లేదు అని చెప్పడం
#11. ఒక వ్యక్తికి ఒక రాజకీయ నాయకుడు అంటే ఇష్టం లేదు, అతను అందరికీ ఆ రాజకీయ నాయకుడు అంటే ఇష్టం లేదు అని అనడం ?
#12. ఒక వ్యక్తి తాను కలెక్టర్ కాలేకపోయినా , తన స్నేహితుడు కలెక్టర్ అయినందుకు తానే కలెక్టర్ అయినట్లుగా సంతోషపడటం ?
#13. ఆట సరిగా ఆడలేని వ్యక్తి బంతి సరిగా లేదని చెప్తాడు ?
#14. ఒక తండ్రి తాను సివిల్ సర్వీస్ నందు ఒకప్పుడు ఎంపిక కాలేకపోయినప్పటికీ , తన కుమారుడు ఎంపికైనందుకు తానే విజయం సాధించినట్లుగా భావించడంలోని రక్షకతంత్రం ?
#15. హోం వర్క్ చేయని విద్యార్థి తనకు ఆరోగ్యం సరిగా లేక చేయలేదని చెప్పుట ?
#16. ఇంజనీరింగ్ లో సీటురాని అమ్మాయి, ఇంజనీరింగ్ చేసిన వారికి ఉద్యోగాలు రావడం లేదు, దానికన్నా తాను చేరిన ఉపాధ్యాయ శిక్షణా కోర్సే మంచిదని సమర్ధించుకోవడం
#17. ‘చెడు అలవాట్లకు బానిస అయిన కొడుకు తన మాట వినక పోవటంతో ఒక తండ్రి చిన్నపిల్లవాడిలా ఏడవటం’ దీనికి ఉదాహరణ.
#18. సివిల్ సర్వీసెస్ పరీక్ష తప్పిన వ్యక్తి చిన్నపిల్లాడిలా ఏడవడంలోని రక్షకతంత్రం
#19. మనలోని అవాంఛనీయ లక్షణాలను ఇతరులకు ఆపాదించడం అనే రక్షక తంత్రం.
#20. ఒక తండ్రి తాను సివిల్ సర్వీసునందు ఒకప్పుడు ఎంపిక కాలేకపోయినప్పటికీ, తన కుమారుడు ఎంపికైనందుకు తానే విజయం సాధించినట్లుగా భావించడంలోని రక్షక తంత్రం ?
#21. ‘ఇంటర్వ్యూకి వెళ్ళిన వ్యక్తి సమాధానాలు చెప్పలేక చిన్న పిల్లవాడిలా ఏడవటం ప్రారంభించాడు’ ఇక్కడి రక్షక తంత్రం.
#22. ఉపాధ్యాయ నియామకం పరీక్షలో సెలక్ట్ కాని అభ్యర్థి పుస్తకాలను విసిరివేయడంలో ఇమిడి ఉన్న రక్షకతంత్రం ?
#23. అభిషేక్ ను తరగతి ఉపాధ్యాయుడు అకారణంగా దండించాడు. దానితో అభిషేకు తన ఉపాధ్యాయునిపై కోపం వచ్చింది. కానీ అతడు తన కోపాన్ని ఇంటివద్ద తమ్మునిపై చూపాడు. ఇక్కడ ఉపయోగించబడిన రక్షక తంత్రం
#24. పిల్లవానికి వ్యాసరచన పోటీలో పాల్గొనాలని ఉన్నప్పటికీ,సరిగా రాయలేనని, బహుమతి రాదని భయపడి పాల్గొనకపోవడంలోని రక్షక తంత్రం
#25. రక్షక తంత్రాలకు ఉదాహరణ ?
#26. రెండు విరుద్ధ కోరికల మధ్య ఏర్పడే తన్యత వలన కలిగే బాధాకర ఉద్వేగ స్థితిని ” సంఘర్షణ” అంటారు అని చెప్పింది ?
#27. సంఘర్షణ లోని రకాలను తెలిపినవారు ?
#28. రెండు ఆకర్షణీయమైన లక్ష్యాల మధ్య ఎన్నిక జరగవలసినపుడు ఇది ఏర్పడుతుంది ?
#29. ఒకేసారి ఒక వ్యక్తికి తనకు ఇష్టమైన IAS, IPS రావడం ?
#30. ఒకేసారి SA మరియు Grade-1 పండిట్ పోస్టులు రావడం ?
#31. పరీక్షలలో బాగా తెలిసిన రెండు జవాబులు రావడం ?
#32. రెండు ఆకర్షణీయం కాని లక్ష్యాల మధ్య ఎన్నిక తప్పనిసరి అవుతుంది ?
#33. ముందు నుయ్యి, వెనుక గోయ్యి ?
Also read : హోవార్డ్ గార్డినర్ బహుళ ప్రజ్ఞా సిద్ధాంతం