Individual differences – వైయుక్తిక భేదాలు
తరగతిలో ఉండే ఏం ఇద్దరు విద్యార్థులు ఒకేలా ఉండరు విద్యార్థికి విద్యార్థికి మధ్య ఎన్నో అంశాల్లో భేదాలుంటాయి. ఎవరి ప్రత్యేకత వారిది. ఒక్కొక్కప్పుడు సమరూప కవలల్లో కూడా గుణాత్మకమైన భేదాలు కనబడతాయి.
విద్యార్థుల ఎత్తులోను, బరువులోను, అవయవాల అమరికలోను, ఆలోచనలలోను, ప్రజ్ఞలోను, అభిరుచులు, వైఖరులు, చలన సామర్థ్యాల్లోను, బౌద్ధిక విషయాల్లోను భావోద్రేకాల్లోను, అభ్యసన సామర్థ్యంలోను, సాంఘిక, నైతిక, వికాసంలోను వైవిధ్యాలు ఉంటాయి. ఈ భిన్నత్వాన్నే వైయక్తిక భేదాలు (Individual Differences) అని వ్యవహరిస్తారు. ఒక వ్యక్తిని ఇతరుల నుంచి వేరు చేసి ప్రత్యేకించి చూపగల లక్షణాలను వ్యక్తిగత వైవిధ్యాలు అని చెప్పవచ్చు.ఐతే భిన్నత్వంలో కూడా ఏకత్వం గోచరిస్తుంది. వ్యక్తుల – మధ్య స్వరూపాల్లో, స్వభావాల్లో తేడాలున్నప్పటికీ ఆ తేడాల్లో ఒక క్రమం, ఒక పద్ధతి ఉంటాయి. మనుష్యుల్లో పోలికలు కనిపిస్తాయి. ప్రవర్తనలో ఒక పద్ధతి కనిపిస్తుంది. ఇట్లా అనేక మందిలో సామ్యం కనిపించినా ప్రతివ్యక్తికి విశిష్టత ఉంది. అందుకే ఈ భూమి పై జన్మించిన ప్రతి వ్యక్తి అద్వితీయుడు.
తరగతి గదిలో బోధనాభ్యసన విజయానికి అందులో పాల్గొనే ఉపాధ్యాయుడు, విద్యార్థుల మధ్య ఉండే వైయక్తిక భేదాల గురించి తెలుసుకోవడం అవసరం. విద్యార్థుల వైయక్తిక భేదాలకు దోహదం చేసే కారకాలను గుర్తించడం కూడా ఎంతో అవసరం.
వైయక్తిక భేదాలు మానవ లక్షణాలన్నింటిలో ఉంటాయి. ప్రధానంగా వైయక్తిక భేదాలు ఈ కింది అంశాలలో కనిపిస్తాయి. అవి :
1. ప్రజ్ఞాపాటవాలస్థాయి (Level of Intelligence) : తరగతిలో సాధారణంగా సగటు ప్రజ్ఞ గల విద్యార్థుల సంఖ్య ఎక్కువగా ఉన్నప్పటికీ ప్రజ్ఞావంతులు, తక్కువ ప్రతిభ గలవారు కూడా కనిపిస్తారు.
2. శారీరక లక్షణాలు (Physical Characteristics) : ఎత్తు, బరువు, అవయవాల పొందికలో, భేదాలు ఉంటాయి. కాబట్టి పాఠశాలలో నిర్వహించే శారీరక కృత్యాలలో విద్యార్థులను భాగస్వాములను చేసేటప్పుడు ఈ భేదాలను దృష్టిలో ఉంచుకోవాలి.
3. విద్యావిషయక సాధన (Academic Achievement) : విద్యార్థులందరికీ ఒకే విధంగా బోధన జరిగినప్పటికీ వారికి నిర్వహించిన వివిధ పరీక్షలలో వారు కనబరిచే సాధన విషయంలో గణనీయ వ్యత్యాసాలు కనిపిస్తుంది.కావున తరగతి గదిలో వివిధ స్థాయిలలో ఉండే విద్యార్థులకు తగిన రీతిలో లోపనివారణ బోధన, కఠినత్వ స్థాయిలో వైవిధ్యంగల పరీక్షల నిర్వహణ ఎంతైనా అవసరం.
4. దృక్పథాలు (Perspectives) : కొంతమంది పిల్లలు కుటుంబం, విద్య, సామాజిక అంశాలు పట్ల సానుకూల దృక్పథాన్ని మరికొంతమంది ప్రతికూల దృక్పథం, వైఖరిని, మరికొంత మంది మధ్యస్తంగా ఉండవచ్చు. అంతేగాక కొంతమంది కుటుంబం పట్ల సానుకూల దృక్పథాన్ని క మరొక దానిపై ప్రతికూల వైఖరిని కలిగి ఉండవచ్చు. సాధారణంగా విద్యార్థుల దృక్పథాలన్ని ఒక విధంగా ఉండవు. ఈ అంశాలు తరగతి గదిలో ప్రస్ఫుటంగా ప్రతిబింబిస్తాయి. ఈ విషయ పరిజ్ఞానం ఉన్న ఉపాధ్యాయులు తల్లిదండ్రులకు, విద్యార్థులకు తగిన సూచనలు ఇచ్చి విద్యపట్ల అనుకూల వైఖరి లేని వారికి కలిగేటట్లు చేయాలి.
5. మూర్తిమత్వ లక్షణాంశాలు (Personality Traits) : నిజాయితీ, సత్యసంధత (Truthfulness) అణకువ, సిగ్గు, చొరవ, సామర్థ్యం, అభిరుచి, వైఖరి మొదలైన మూర్తిమత్వ లక్షణాలకు సంబంధించి విద్యార్థుల్లో భేదాలుంటాయి. ప్రజ్ఞాపాటవాలు అధికంగా ఉన్న విద్యార్థి సిగ్గు, బిడియాలకు లోనైతే ఆ విద్యార్థి సాధన తక్కువగా ఉన్నట్లు కనిపించే అవకాశం ఉంది.
6. లైంగిక భేదాలు (Gender Differences) : శారీరక దారుఢ్యంలో బాలురు, బాలికలకు మధ్య వ్యత్యాసాలు ఉంటాయి. అయితే ఈ రకమైన లైంగిక విభేదాల ప్రభావం అభ్యసనస్థాయిపై అంతగా ఉండదు.
7. ఉద్వేగరీతులు (Emotionality) : కోపం, అసూయ, భయం, ఆనందం, ప్రేమ లాంటి ఉద్వేగాలు అందరిలోనూ ఉన్నప్పటికీ వాటి స్థాయిలోనూ, ప్రకటనలోనూ తేడాలుంటాయి.
8. సాంఘిక పరిస్థితులు (Social Aspects) : మురికివాడలలో నివసించే పిల్లల ప్రవర్తనా తీరులో, అభివృద్ధి చెందిన ప్రాంతాలలో నివసించే పిల్లల విషయంలో తేడాలుంటాయి. అదేవిధంగా గ్రామీణ ప్రాంతాలలో నివసించేవారికి, పట్టణ ప్రాంతాలలో నివసించేవారికి మధ్య తేడాలు కనిపిస్తాయి. తరచుగా కలహించే తల్లిదండ్రులు గల పిల్లల ప్రవర్తనా తీరు, అనుకూల ధోరణి ఉన్న తల్లిదండ్రులు గల పిల్లల ప్రవర్తనలోనూ వైవిధ్యముంటుంది.
9. ఆర్థిక పరిస్థితులు (Economic Aspects): దారిద్ర్యరేఖకు కింద ఉన్న కుటుంబాలకు చెందిన పిల్లలు పౌష్టికాహారలోపం వల్ల సరైన శారీరక పెరుగుదల లేకపోవడంవల్ల సగటు ఆదాయం గల కుటుంబాలకు, అధిక ఆదాయంగల కుటుంబాలకు చెందిన పిల్లలకంటే వెనకబడి ఉంటారు.
నిర్వచనాలు
1. చార్లెస్ డార్విన్ : ఒకే జాతికి చెందిన ఏ ఇద్దరు కూడా ఒకే విధంగా ఉండరు. మిలియన్ల కొద్ది వ్యక్తులను పోల్చిన వారి మధ్య బేధాలు చూడవచ్చు అని చార్లెస్ డార్విన్ పేర్కొన్నారు.
2. ప్లేటో : ప్రతివ్యక్తికీ ప్రకృతి సిద్ధంగా కొన్ని ప్రత్యేకతలు ఉంటాయి. ఆ ప్రకారంగానే విద్యా బోధన జరగాలని ప్లేటో సూచించాడు.
3. రూసో : ఫ్రాన్స్ దేశస్థుడైన రూసో వ్యక్తుల మధ్య గల భౌతిక బేధాలనే కాకుండా మానసిక బేధాలను కూడా పరిగణనలోకి తీసుకొని బోధన ప్రక్రియ కొనసాగించాలని తాను రచించిన “ఎమిలి” అనే గ్రంథంలో ప్రస్తావించాడు.
4. సర్ ఫ్రాన్సిస్ గాల్టన్ : సర్ ఫ్రాన్సిస్ గాల్టన్ 1883 లో An Inquiry into human faculty and its development అనే గ్రంథాన్ని రచించాడు.
5. చార్లెస్ ఇ స్కినర్ :మాపనం చేయగల ఏ మూర్తిమత్వ అంశం అయినా అది వైయుక్తిక భేదంగానే పరిగణించాలన్నాడు.
6.జాన్ డ్యూయి: విద్యా వ్యవస్థ విద్యార్థుల వైయుక్తిక భేదాలను పరిగణలోకి తీసుకొని నిర్మాణాత్మక పాత్ర పోషిస్తేనే ఆ దేశం బలోపేతం అవుతుంది.
వైయక్తిక భేదాలు – రకాలు (Individual Differences – Types):
వైయక్తిక భేదాలు రెండు రకాలు అవి :
(1) వ్యక్త్యంతర భేదాలు, (అంతర వ్యక్తి గత భేదాలు) (Inter Individual Differences)
(2) వ్యక్యంతర్గత భేదాలు (అంతర్గత వ్యక్తిగత భేదాలు) (Intra Individual Differences)
(1) వ్యక్త్యంతర భేదాలు:-
వ్యక్తుల మధ్య సామర్థ్యం, ప్రజ్ఞ, అభిరుచి, వైఖరి, సాధన, సృజనాత్మకత, నైపుణ్యాలలో వైవిధ్యతనే వ్యక్త్యంతర భేదాలు అంటారు.సృష్టిలో ఏ ఇద్దరు వ్యక్తులు సమానంగా ఉండరు. కారణాలు ఏవైనా, వ్యక్తుల మధ్య భేదం ఉంటే వాటిని వ్యక్త్యంతర భేదాలు అని అంటారు.
ఉదాహరణకు: రాము కంటే సోము ఉన్నత ప్రజ్ఞావంతుడు.
(2) వ్యక్యంతర్గత భేదాలు:
ఒకే వ్యక్తిలో వివిధ అంశాల మధ్యగల భేదం. అంటే ప్రజ్ఞ ఉండి, సృజనాత్మకత లేనివారు ఉన్నది ఉన్నట్లు వ్యక్తీకరిస్తారు. కానీ నూతన అంశాలను సృష్టించలేరు. ఆట పాటలంటే ఇష్టం, కానీ చదువు అంటే అయిష్టం. గణితంలో రాణిస్తాడు, కానీ భాషా సామర్థ్యలోపం ఉంటుంది.
ఉదాహరణకు: (a).శ్రీనివాస రామానుజన్ గణిత మేధావి, కానీ ఆంగ్లభాషా సామర్థ్యం అంతగా లేనివాడు. ఈ విధంగా ఒకే వ్యక్తిలో వివిధ అంశాలలో గల భేదాన్ని వ్యక్తంతర్గత భేదం అంటాం.
(b) సుధాకర్ బాగా చదవగలరు గాని ఆటలు ఆడలేడు.
Results
#1. When a teacher uses a particular method and finds that all students have not benefited or learnt equally; it may be attributed to the………. ఉపాద్యాయుడు ఒక ప్రత్యేక పద్దతిని ఉపయోగించుట ద్వారా విద్యార్థులుండరు సమానంగా లాభపడకున్న లేక అభ్యసించకున్న దానికి కారణం?
#2. The test constructed by Salove and Mayer measures the following సలోవే, మేయర్ లు తయారు చేసిన పరీక్ష క్రింది అంశాన్ని మాపనం చేస్తుంది?
#3. Individual differences in intelligence are due to ప్రజ్ఞ లో వైయుక్తిక భేదాలు యేర్పడడానికి గల కారణం?
#4. One of the following is an example for intraindividual differences ఈ కింది వానిలో వ్యక్తంతర్గత భేదాలకు ఒక ఉదాహరణ?
#5. The Intelligent Quotient of Educable Mentally Retarded persons ‘’ విద్యా నేర్వగల మానసిక వికలాంగుల’’ ప్రజ్ఞాలబ్ది?
#6. The first scientific book on Individual differences is వైయుక్తిక భేదాలు గురుంచి వచ్చిన మొదటి శాస్త్రీయ గ్రంథం?
#7. రాము చేతి రాత బాగుంటుంది. గణితం లో అతని నిష్పాదన సగటుగా ఉంది. అతని సహద్యాయులతో పోలిస్తే మొత్తం మీద అతని నిష్పాదన బాగుంది. ఈ ఉదాహరణ ఈ రకమైన వైయుక్తిక భేదాన్ని తెలుపుతుంది?
#8. Ramesh is highly creative with average intelligence. He is good in drawing but average in studies. This characteristics shows రమేశ్ ఉన్నత సృజనను కలిగిన సగటు ప్రజ్ఞావంతుడు. చిత్రలేఖనంలో దిట్ట. చదువులో సాధారణ ప్రగతిని సాధించగలడు, ఈ లక్షణాలు సూచించేవి?
#9. “Every person has some specialties by nature, accordingly teaching should be done” – This is quoted by ‘’ప్రతి వ్యక్తికీ ప్రకృతి సిద్దంగా కొన్ని ప్రత్యేకతలు వుంటాయి?
#10. Sumanth is efficient in doing Mathematics. But he is not efficient in playing chess. This is an example of……… సుమంత్ లెక్కలు బాగా చేస్తాడు. కానీ చదరంగం (చెస్) బాగా ఆడలేడు. ఇది దీనికి ఉదాహరణ?
#11. The knowledge of growth and development makes the teacher to understand పెరుగుదల వికసాల జ్ఞానం ఉపాద్యాయులకు దీని గురించిన అవగాహన కల్పిస్తుంది?
#12. ‘Social Smarts’ are ‘సాంఘీక నేర్పరులుగా’ పిలవబడేవారు?
#13. “A child with good speaking skills has very poor handwriting”. this is suitable for explaining one of the following concepts ‘’బాగా మాట్లాడే నైపుణ్యం కలిగి, చేతి రాత బాగా లేని శిశువు’’ ఇది క్రింది వానిలో ఒక భావనను వివరించుటకు సరైనది?
#14. One of the following is not the basis for formation of attitudes క్రింది వాటిలో వైకరులు ఏర్పడడానికి ఆధారం కానిది?
Also read : Psychology Grand Test – 5
Vey nice and tq