Jerome Bruner Learning Theory – బ్రూనర్ బోధనా సిద్దాంతము
జెర్రోం బ్రూనర్ హార్వార్డ్ విశ్వవిద్యాలయంలో మనో విజ్ఞానశాస్త్రంలో పిహెచ్.డి. పట్టాను పొందారు. ఇతడు ఆల్ పోర్ట్ పర్యవేక్షణలో అనేక పరిశోదక వ్యాసాలను ప్రచురించారు.
బ్రూనర్ రచించిన “The Process of Education” అనే గ్రంథం ఒక ఆదర్శగ్రంథంగా నిలిచింది. ఈ గ్రంథంలోని బోధన సిద్ధాంతం, పాఠ్య ప్రణాళిక రచనలకు, బోధన కార్యక్రమాలకు మూలం అయింది.
ప్రవర్తనావాదులు ప్రతిపాదించిన నిబంధనల ద్వారా వ్యక్తులలో అభ్యసనాన్ని ప్రోత్సహించవచ్చు అనే భావనలతో బ్రూనర్ ఏకీభవించలేదు. ప్రవర్తనావాదులు మానవుల వివేచన సామర్థ్యాన్ని బ్రూనర్ గుర్తించకపోవడాన్ని పెద్ద తప్పిదంగా పేర్కొన్నాడు. అభ్యసన ప్రక్రియలో విద్యార్థులు ఏ విధంగా ఆలోచిస్తున్నారన్న విషయం పట్ల దృష్టి కేంద్రీకరించారని, అభ్యసన అంశాల పట్ల కాదని, విద్యా విధానానికి అదే ప్రాతిపదిక కావాలని పేర్కొన్నారు. అభ్యసనం అంటే జ్ఞాన నిర్మాణం అని, జ్ఞానం వ్యక్తి అనుభవాలకు అతీతం కాదన్నాడు.
పై అంశాలను బ్రూనర్ ప్రతిపాదించడంతో బ్రూనర్ ను జీన్ పియాజె, వైట్ స్కీలతో సరిపోల్చారు. అభ్యసన అంశాలను చిన్న చిన్న బాగాలుగా విభజించే వాటిని అభ్యాసకుడు అభ్యసించుకొంటూ ముందుకు సాగాలని, అప్పుడే అభ్యసనం అర్ధవంతంగా ప్రయోజనకరంగా, సమర్థవంతంగా ఉంటుందని భావించాడు.
బ్రూనర్ ప్రతిపాదించిన సిద్ధాంతాన్ని ఆవిష్కరణ అభ్యసనం (Discovery Learning) అని, బోధన/శిక్షణ సిద్ధాంతం (Theory of Instruction) అని అంటారు.ఈ సిద్ధాంతాన్ని ప్రవర్తనావాదులు వ్యతిరేకిస్తే సంజ్ఞానాత్మక వాదులు ప్రశంసించారు. పియాజె, బ్రూనర్లు విభేదించిన అంశం- బోధన, పరిపక్వతల మధ్య సంబంధం. అనగా పిల్లల యొక్క పరిపక్వతకు సంబంధం లేకుండా బోధనా పద్ధతికే ఎక్కువ అవకాశం ఉన్నదని వీరి భావన.
బ్రూనర్ సిద్ధాంతంలోని ముఖ్య అంశాలు:
1. ఏ అంశం/ఎంతటి మూలసూత్రాలైనా, ఎంతటి కఠిన అంశమైన ఏ వయస్సులో వారికైనా ఏదో ఒక రూపంలో బోధించవచ్చు
2. విద్యార్థి (వ్యక్తి)లో ఆసక్తి, కుతూహలం ఉంటుంది. అవి అభ్యసనానికి ప్రధాన అంశాలు అవుతాయి.
3. విద్యార్థికి స్వీయ అభ్యసనానికి ఎక్కువ ప్రాముఖ్యం కల్పించాలి.
4. ఉపాధ్యాయుడు పర్యవేక్షకుడై, సలహా పూర్వకమైన పాత్రను మాత్రమే చేపట్టాలి.
5. బోధన విషయాలకంటే బోధన పద్ధతికి ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వాలి.
6. విద్యార్థులలో ఉన్నటువంటి అంతర బుద్ధి చింతన, అన్వేషణ అభ్యసనం విద్యార్థి జ్ఞాన నిర్మాణానికి ఎంతగానో ఉపయోగపడతాయి.
ఈ సిద్ధాంతాన్ని వ్యతిరేకించిన వారు : ప్రవర్తనావాదులు (థార్నడైక్, వాట్సన్, పావ్లోవ్, స్కిన్నర్)
ఈ సిద్ధాంతాన్ని సమర్థించినవారు : సంజ్ఞానాత్మకవాదులు (పియాజె, వైగాట్ స్కి)
బ్రూనర్ బోధన అంశంలోని సోపానాలు: –
1. ప్రేరణ పునర్బలనం : బ్రూనర్ బహిర్గత ప్రేరణ కంటే అంతర్గత ప్రేరణలు చాలా ముఖ్యమని తెలిపాడు. అంతర్గత ప్రేరణలో కుతూహలం ముఖ్యమైనది. అదే విధంగా సాధించాలనే ఉత్సాహం విద్యార్థుల్లో అభ్యసనం పట్ల ఆసక్తి పెంచుతుంది. ఒక కృత్యాన్ని పూర్తిచేసినప్పుడు, ఒక సమస్యకు పరిష్కార మార్గం కనుగొన్నప్పుడు ఏర్పడే ఆనందం, ఆత్మతృప్తి అంతర్గత ప్రేరణగా పనిచేస్తుంది.
2. బోధన క్రమం : విద్యార్థులు అభ్యసించవలసిన అంశాలను దశలవారీగా ప్రవేశపెట్టాలని బ్రూనర్ అభిప్రాయపడ్డాడు. అభ్యసన అంశానికి సంబంధించిన విషయాన్ని మూడు క్రమశ్రేణి పద్ధతిలో అందించాలి.
అవి- ఎ. క్రియాత్మక పద్ధతి బి. చిత్ర-ప్రతిమ పద్ధతి సి. ప్రతీకాత్మక పద్ధతి,
ఎ. క్రియాత్మక పద్ధతి :- అభ్యసన అంశాలకు సంబంధించిన విషయాలను క్రియల ద్వారా పరిచయం చేయాలి. అభ్యసన అంశాలకు పరిసరాలకు సంబంధించిన వస్తువులతో, సామాగ్రితో పరస్పర ప్రతిచర్యల ద్వారా బోధన జరపాలి ఈ పద్ధతిలో పదాలను గాని చిత్రాలను గాని ప్రతిమలను గాని ఉపయోగించకూడదు. తనచుట్టూ ఉన్న సామాగ్రితో వస్తువులతో కృత్యాలను నిర్వహించడం ముఖ్యం. ఈ పద్ధతి బోధనలో ఆట పాటలకు ప్రాధాన్యం ఇచ్చి పని కేంద్రంగా ఉండాలనేదే బ్రూనర్ అభిప్రాయం “చేయడం ద్వారా అభ్యసనం” “Learning by doing” అనే సూత్రం ఇందులో ఇమిడి ఉంది.
బి. చిత్ర ప్రతిమ పద్ధతి : ఈ పద్ధతిలో ఉపాధ్యాయుడు బోధన ఉపకరణాలను, నమూనాలను, గ్లోబు, మ్యాపులు, చారులను ఉపయోగించి బోధించాలి. విద్యార్థులు ఈ పద్ధతిలో స్వహస్థాలతో బొమ్మలు చేయుడం, చిత్రాలు గీయడం, సమూనాలను తయారు చేయడం ద్వారా విషయాంశాలను అవగాహన చేసుకుంటారు. ఈ పద్ధతి వల్ల విద్యార్థులలో “దృశ్య స్మృతి” వికసించడం ప్రారంభమవుతుంది. విద్యార్థులు తమరు లాముగానే చిత్ర-ప్రతిమలను తయారుచేసుకుంటారు. కాబట్టి విషయ అవగాహన పటిష్టంగా జరుగుతుంది.
సి. ప్రతీకాత్మక పద్ధతి : అభ్యసన అంశాలను సంకేతాలతో, సూత్రాలతో నేర్చుకుంటాడు. నేర్చుకున్న విషయాలను గత అభ్యసన అంశాలతో అన్వయించుకుంటాడు. ఇది భాషా అభివృద్ధికి సహకరించే పద్ధతి. ఇది “దశ శాబ్దిక స్మృతి”కి దోహదం చేస్తుంది.
3. ఆవిష్కరణ అభ్యసనం:- బోధన ప్రక్రియలో ఉపాధ్యాయుడు విద్యార్థులకు కొన్ని ప్రశ్నలు ఇచ్చి, వాటి సమాధానం కోసం లేదా సమస్యను ఇచ్చి పరిష్కారం అవసరమైన పరికల్పన, పరిశీలన మార్గాలను తెలుసుకోవడానికి ప్రయత్నించడాన్ని ప్రోత్సహిస్తారు. ఈ రకం ఆవిష్కరణ అభ్యసనంలో, ఉపాధ్యాయుడు సహాయకుడిగా పునర్బలనాన్ని అందించే స్నేహితుడిగా మాత్రమే పని విద్యార్థుల్లో అంతర్బుద్ధిగల చింతన, విశ్లేషణాత్మక చింతన అవసరం.
4. అంతర్బుద్ధి చింతన : ఆవిష్కరణ అభ్యసనంలో కొత్త విషయాన్ని కనుక్కోవడం అంతర్బుద్ధిగల చింతనపై ఆధారపడుతుందని ముందే తెలుసుకున్నాం. అంతర్బుద్ధి చింతన అంటే ఒక సమస్యకు ఆధారం లేకుండా హఠాత్తుగా వచ్చే పరిష్కారం. ఈ పరిష్కారాలు తరువాత పరికల్పనలుగా మారుతాయి. ఈ పరికల్పనలను పరీక్షించడానికి విశ్లేషణాత్మక చింతనను ఉపయోగించవలసి ఉంటుంది. కాబట్టి ఉపాధ్యాయులు ఆవిష్కరణ అభ్యసనాన్ని ప్రోత్సహించాలి. విద్యార్థుల్లో అంతర్బుద్ధి చింతన, విశ్లేషణాత్మక చింతనలను పెంపొందించాలి. తద్వారా విద్యార్థుల్లో జ్ఞాన నిర్మాణానికి తోడ్పడాలి.
విద్యా అనుప్రయుక్తాలు : –
అభ్యసనంలో అవసరమైనప్పుడు విద్యార్థికి సహాయం అందించాలి. అభిరుచులకు, మానసిక వికాస స్థాయిలకు అనుగుణంగా బోధన చేయాలి. బోధనలో పొగడ్తలు, ప్రశంసలు, బహుమతులు, పారితోషకాలను అందించి అభ్యసనానికి పునర్బలనం కలిగించాలి.
1. అభ్యసన అంశాలను వరుస క్రమంలో అమర్చి విద్యార్థి స్వయంగా అభ్యసించి విషయ జ్ఞానాన్ని పొందేలా చేసినట్లయితే అభ్యసించిన జ్ఞానం ఎక్కువ కాలం ధారణలో ఉంటుందన్నదే బ్రూనర్ ఆవిష్కరణ అభ్యసనలోని మూల భావం
2. ప్రేరణ కల్పించడం, ప్రేరణ కొనసాగించేటట్లు చేయడం, అధిక ప్రేరణ ఏర్పడేటట్లు చేయడం వల్ల ఉపాధ్యాయులు సులభంగా బోధన అభ్యాసన ప్రక్రియ జరిగేటట్లు చేయవచ్చు.
3. ఉపాధ్యాయుని పాత్ర సాధ్యమైనంత వరకు తక్కువగా ఉండి, అభ్యాసకుడికే అభ్యసన ప్రక్రియలో ఎక్కువ స్వేచ్ఛ ఇవ్వాలి.
బ్రూనర్ బోధనలోని అంశాలు/సోపానాలు డైట్ పుస్తకం ఆధారంగా.
అవి- 1. సన్నద్ధత 2. విషయ నిర్మాణం 3. వరుస క్రమం 4. పునర్బలనం
#1. బ్రూనర్ గ్రంథం ?
#2. పాఠ్య ప్రణాళికల రచనలకు, బోధనా కార్యక్రమాలకు సంబంధించిన గ్రంథం ?
#3. ఎవరి పర్యవేక్షణలో బ్రూనర్ పరిశోధనా వ్యాసాలు వ్రాశాడు ?
#4. బ్రూనర్ ని ఎవరితో సరిపోల్చారు ?
#5. పిల్లలు పరిపక్వతకు చేరినపుడు మాత్రమే బోధించాలని చెప్పిన వారు ?
#6. పరిపక్వతకు , బోధనకు సంబంధం లేదు, ఏ వయస్సు లోనైనా విద్య నేర్చుకోవచ్చు అని చెప్పినవారు ?
#7. ప్రవర్తనావాదులు మానవుల ఈ సామర్థ్యాన్ని గుర్తించలేకపోవటాన్ని బ్రూనర్ పెద్ద తప్పిదంగా గుర్తించాడు?
#8. బ్రూనర్ ప్రకారం అభ్యసనా అంశాలను ఇలా విభజించి వాటిని అభ్యాసకుడు అభ్యసించుకుంటూ ముందుకు సాగాలి ?
#9. క్రింది వాటిలో బ్రూనర్ సిద్ధాంతానికి లేని పేరు ?
#10. క్రింది వాటిలో బ్రూనర్ సిద్ధాంతం ముఖ్యాంశాలులో లేనిది ?
#11. బ్రూనర్ ప్రకారం దీనికి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలి ?
#12. బ్రూనర్ ప్రకారం ఎటువంటి ప్రేరణ ముఖ్యం?
#13. చేయడం ద్వారా నేర్పించే పద్ధతి ?
#14. పని కేంద్రకం work centered ?
#15. చిత్రాలు , నమూనాలు TLM ఉపయోగించే పద్ధతి ?
#16. బోధనా ప్రక్రియలో ఉపాధ్యాయుడు కోన్ని ప్రశ్నలు ఇచ్చి, వాటి సమాధానం కోసం అవసరమైన పరికల్పన , పరిశీలన మార్గాలను తెలుసుకోవడానికి ప్రయత్నించడాన్ని పోత్సహిస్తారు?
#17. ఈ అభ్యసనం లో ఉపాధ్యాయుడు సహాయకుడిగా పునర్బలనాన్ని అందించే స్నేహితుడిగా మాత్రమే పనిచేస్తాడు?
#18. దీనికి అంతర్బుద్ధి గల చింతన విశ్లేషణాత్మక చింతన అవసరం ?
#19. ఇది గెస్టాల్ట్ వాదుల సమగ్రాకృతిని పోలి ఉంటుంది ?
#20. బ్రూనర్ ప్రకారం బోధనోపకరణాలను, మ్యాపులను ఉపయోగించే పద్ధతి ?
#21. పియాజే మరియు బ్రూనర్ లు బోధనా ప్రక్రియలో విభేదించిన ప్రధాన అంశం ?
#22. బ్రూనర్ ఏ విశ్వ విద్యాలయంలో మనో విజ్ఞాన శాస్త్రంలో Phd పట్టాను పోందాడు ?
#23. ఒక సమస్యకు ఆధారం లేకుండా హఠాత్తుగా వచ్చే పరిష్కారం ?
#24. సాంఘిక నిర్మాణాత్మక బోధనాభ్యసన సిద్ధాంతము ప్రకారము తరగతి గదిలో ఉపాధ్యాయుని పాత్ర?
#25. బ్రూనర్ ప్రతిపాదించిన సంజ్ఞానాత్మక వికాస సిద్ధాంతం ప్రకారం పిల్లలు సంఘటనలు మరియు వస్తువులను అశాబ్దిక చర్యల ద్వారా వ్యక్తపరిచే దశ ?
#26. ఏ విషయ మూలాలైన ఎవరికైనా ఏ వికాసదశలోనైనా ఫలవంతంగా బోధించవచ్చు అని తెలిపినవారు?
#27. బ్రూనర్ ప్రకారం ఉపాధ్యాయుడు తరగతిలోని విషయాన్ని ప్రభావవంతంగా బోధించవలెనన్న సన్నద్ధత, విషయ నిర్మాణం, వరుస క్రమాలతో పాటు ఈ అంశాన్ని పరిగణలోనికి తీసుకోవాలి ?
#28. బ్రూనర్ తన సిద్ధాంతములో ఏ ప్రేరణకు అధిక ప్రాధాన్యతనిచ్చెను ?
#29. ఒక ఉపాధ్యాయుడు విద్యార్ధి ప్రజ్ఞాస్థాయికి మించిన విషయాలను బోధిస్తున్నాడు అయిన ఆ ఉపాధ్యాయుడు క్రింది నియమాన్ని పరిగణలోనికి తీసుకోలేదు?
#30. ‘‘చదరంగంను’’ ఆడుట తోడ్పడు అభ్యసన సిద్ధాంతము?
#31. పియాజె మరియు బ్రూనర్‌లు బోధనా పక్రియలే విభేదించిన ప్రధాన అంశం?
#32. బ్రూనర్ సిద్ధాంతాలలో బోధనా క్రమానికి సంబంధించి విషయాన్ని అందించే పద్ధతులకు చెందనిది?
#33. విద్యార్ధులలోని అంతర్భుద్ధి చింతన, అన్వేషణ అభ్యసనం విద్యార్ధి జ్ఞాన నిర్మాణానికి తోడ్పడతాయని తెలిపిన సిద్ధాంతము?
#34. ఆవిష్కరణ అభ్యసనంగా పేర్కొనబడినది ?
#35. Instructional Scaffolding అను పదమును ఉపయోగించినది ?
#36. బ్రూనర్ ప్రకారం సరి అయిన బోధనా క్రమం ?
#37. బ్రూనర్ ప్రతిపాదించిన అభ్యసన విధానం ?
#38. బ్రూనర్ ప్రకారం అభ్యసన అంశానికి సంబంధించిన విషయాన్ని అందించే క్రమ శ్రేణి పద్ధతులకు సంబంధించినది?
Also read : వైయుక్తిక భేదాలు