Moral Development Theory- కోల్బర్గ్ నైతిక వికాస సిద్హాంతము
అమెరికా దేశంలోని హార్వర్డ్ విశ్వవిద్యాలయం చెందిన లారెన్స్ కోల్బర్గ్ అనే మనో విజ్ఞాన శాస్త్రవేత్త వివిధ సంస్కృతులకు సంబంధించిన పిల్లలపై అధ్యయనము చేసి నైతిక వికాస సిద్హాంతము ప్రతిపాదించాడు. ఈ సిద్ధాంతము అత్యంత ప్రాచుర్యం పొందింది.
నైతికత అనగా ఏది మంచి, ఏది చెడు, ఏది తప్పు, ఏది ఒప్పు, తెలుసుకోవడం.
Moral అనే ఆంగ్ల పదం Mores అనే లాటిన్ పదము నుంచి గ్రహించబడినది. Mores అనగా ఆచారాలు, సాంప్రదాయాలు, మరియు కట్టుబాట్లు.
ఒక ఇవ్వబడిన సన్నివేశంలో, ఏ నిర్ణయం తీసుకోలేని స్థితిలో, ఒక వ్యక్తి ఎలా ఆలోచిస్తాడు, ఎలా ప్రవర్తిస్తాడు అనే అంశమే నైతిక సందిగ్ధావస్థ ( Moral Dilemma) ఈ నైతిక సందిగ్ధావస్థ ఆధారంగా లారెన్స్ కోల్బర్గ్ తను అనేక సంస్కృతులకు సంబంధించిన, పిల్లలను పరిశీలించి, ఈ సిద్ధాంతాన్ని ప్రతిపాదించడం జరిగింది కోల్బర్గ్ ప్రకారం నైతిక వికాసాన్ని ప్రభావితం చేయడంలో, 3 ముఖ్యమైన కారకాలు ఉన్నాయి.
1). సంగ్రహణాత్మక వికాసం:- వ్యక్తుల యొక్క ఆలోచనా శక్తి పెరిగే కొలది, ఏది మంచి ఏది చెడు అని నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.
2). తల్లిదండ్రుల పెంపకం
3). సాంఘిక అనుభవాలు:-అనగా తాను పెరిగిన టువంటి పరిసరాల ప్రభావం కూడా, నైతికత పైన ఆధారపడి ఉంటుంది.
కోల్బర్గ్ నైతిక వికాసంలో 3 స్థాయిలు 6 దశలుగా గుర్తించాడు.
కోల్బర్గ్ నైతిక వికాసంలో 3 స్థాయిలు
1). పూర్వ సంప్రదాయ స్థాయి:-(pre-Convention Level )
పూర్వ సంప్రదాయ స్థాయి 4 నుంచి 10 సంవత్సరాల దాకా ఉంటుంది. సాంప్రదాయాలు అంటే ఒక సమాజంలో ఉన్న నియమాలు.
సాంప్రదాయాలు మారుతూ ఉంటాయి కాలాన్ని బట్టి, స్థలాన్ని బట్టి, అంటే మన దేశంంలో ఉన్నటువంటి ఒక నియమం మరో దేశంలో ఉండకపోవచ్చు. అనగా సాంప్రదాయాలు ( Conventions) అంటే ఒక సమాజము అంగీకరించిన ప్రమాణాలు.
పూర్వసంప్రదాయ స్థాయిలో ఏది తప్పు ఏది ఒప్పు అనేది ఇది వారి భౌతిక పరిణామాలను బట్టి ఆలోచించడం జరుగుతుంది. ఈ దశలో రెండు దశలు ఉంటాయి.
ఒకటవ దశ:- దండనకు భయపడి నైతిక విలువలు పాటించు దశ;- (Morality of Constructs)
మొదటి దశలో శిశువు ఏది మంచి, ఏది చెడు, ఏది తప్పు, ఏది ఒప్పు, అనేది పెద్దల విధించు శిక్షకు భయపడి పాటించడం జరుగుతుంది. ఈ దశలో శిశువు దొరికి పోతాననే ఉద్దేశంతో దొంగతనం చేయడం తప్పు అని చెబుతాడు
రెండవ దశ:- అవసరాలను తీర్చుకునే దశ (Morality of Satisfying needs):- రెండవ దశలో తల్లిదండ్రులు పెద్దలు ఉపాధ్యాయులు ఇచ్చే బహుమతులకు, ఆశించి ఏది మంచి, ఏది చెడు, ఏది తప్పు, ఏది ఒప్పు అనేది నిర్ణయించుకుంటాడు.
2.సాంప్రదాయ స్థాయి:- (Convention Level)
సాంప్రదాయ స్థాయి 11 సంవత్సరాల నుండి 13 సంవత్సరాల వరకు ఉంటుంది.
ఈ స్థాయిలో శిశువు సమాజం కొరకు నైతిక విలువలు పాటించడం జరుగుతుంది. దీనిలో రెండు దశలు ఉన్నాయి.
మూడవ దశ:- మంచి బాలుడు మంచి బాలిక గా గుర్తింపు పొందాలనుకునే దశ:-(ఇతరుల సంతృప్తి కోసము నైతిక విలువలు పాటించడం).
మూడవదశలో మంచి ప్రవర్తన అంటే ఇతరులను సంతోష పెట్టేది. తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల పెద్దలను సంతృప్తిపరచడానికి, ఈ మూడవ దశలో శిశువు నైతిక విలువలు పాటించడం జరుగుతుంది.
నాలుగవ దశ:-అధికారానికి విధేయత చూపించే దశ.
ఈ నాలుగో దశలో సరైన ప్రవర్తన అంటే ఎవరి బాధ్యతలు వారు నిర్వర్తించడం. సాంఘిక క్రమబద్ధత నెలకొల్పడం కోసం శిశువు నైతిక విలువలు పాటిస్తాడు అనగా వ్యక్తిగతంగా ఇష్టం ఉన్నా లేకున్నా అధికారానికి విధేయత చూపించే ప్రయత్నం చేస్తాడు.
3). ఉత్తర సంప్రదాయ స్థాయి:-(Post Conventional Level)
ఉత్తర సంప్రదాయ స్థాయి 14 సంవత్సరాల నుండి వయోజన దశ వరకు ఉంటుంది. ఈ దశలో వ్యక్తి స్వీయ ఇష్టం అఇష్టాలకు అనుగుణంగా నైతిక విలువలు పాటించడం జరుగుతుంది.
ఉత్తరసంప్రదాయ స్థాయి లో 2 దశలు ఉంటాయి.
ఐదవ దశ:- సాంఘిక ఒడంబడిక దశ:-(లేదా) హేతుబద్ధంగా ఆలోచించి సమాజ ప్రమాణాలు అంగీకరించు దశ):-
ఈ ఐదవ దశలో వ్యక్తి ఇతరుల కోసం, సాంప్రదాయాల కోసము, కట్టుబాట్ల కోసము నైతిక నిర్ణయాలు తీసుకోవడం జరుగుతుంది.
వ్యక్తి తన ప్రవర్తనను తాను నియంత్రించుకునీ తాను నిర్ధారించుకున్న నైతిక నియమాలు హేతుబద్ధంగా ఆలోచించి, పాటించడం జరుగుతుంది.
ఆరవ దశ:- విశ్వవ్యాప్త నైతిక విలువలు పాటించు దశ:- కోల్బర్గ్ అభిప్రాయం ప్రకారం ఈ దశకు చేరుకోవడం చాలా కష్టము.
ఈ దశలో విశ్వజనీన నైతిక నియమాలు అయిన సత్యము ,సమానత్వము, మానవత్వం, న్యాయము, కరుణ, జాలి, మొదలైన విలువలు పాటిస్తారు.
వ్యక్తి నైతిక వికాసము సిగ్మండ్ ఫ్రాయిడ్ తన మూర్తిమత్వ వికాసం లో పేర్కొన్న సూపర్ ఇగో పై ఆధారపడి ఉంటుంది.
Results
#1. Krishna is studing intermediate. He wants to shout in the class. But the college rules do not permit him to do so. So, he kept quiet in the class. According to Kohlberg he is in…… ఇంటర్ మీడియట్ చదువుతున్న కృష్ణకు తరగతిలో గట్టిగా అరవాలని ఉంది. కానీ కళాశాల నిబందనను అందుకు అనుమతించవు కనుక తరగతి లో నిశబ్దంగా ఉన్నాడు. కోల్ బర్గ్ ప్రకారం అతను ఈ దశలో ఉన్నాడు?
#2. The moral stage of a person whoexpresses “with due respect to human rights mercy killing shall be left to the option of the sufferer, if necessary relevant laws shall be amended for the welfare of society” ‘’మానవ హక్కులను గౌరవించి, మోరికిల్లింగ్ అనారోగ్యంతో బాదపడుతున్న వ్యక్తి నిర్ణయానికి వదిలివేయాలి. అవసరమైతే సమాజ సంక్షేమ కోసం సంబధిత చట్టాలను సవరించాలి’’ అనే వ్యక్తి నైతిక స్థాయి?
#3. The stage of ‘morality of individual principles and conscience’ comes under this level of Kholberg’s moral development వ్యక్తిగత సూత్రాలు, అంతరాత్మ కోల్ బర్గ్ నైతిక వికాస సిద్దాంతంలో ఈ కింది స్థాయికి చెందును?
#4. The last stage of Kohlberg’s moral development is కోల్ బర్గ్ నైతిక వికాస కోల్ బర్గ్ ప్రకారం వ్యక్తి నైతిక వికాసంలో చివర దశ?
#5. According to Kohlberg the reason for moral behaviour of the child during the stage of conventional morality కోల్ బర్గ్ ప్రకారం సాంప్రదాయ నైతిక స్థాయి కి చెందిన పిల్లవాని నైతిక ప్రవర్తనకు కారణం?
#6. A student of class V asked his classmate not to copy in the examination as he will be punished if caught by the invigilator. This demonstrates the following level of moral judgement of Kohlberg. 5 వ తరగతి విద్యార్థి ఇన్విజ్ లేటర్ పట్టుకుంటే శిక్షిస్తారు కాబట్టి పరీక్షలో కాపీ కొత్తవాడని తన సహద్యైయికి చెప్పారు. ఇది కోల్ బర్గ్ నైతిక నిర్ణయానికి సంబంధించిన ఈ స్థాయిని సూచిస్తుంది?
#7. Moral stage of a child who says that he will study if given an ice cream ఐస్ క్రీమ్ ఇస్తానంటే చదువుకుంటాననే పిల్లవాడు నైతిక దశ?
#8. teacher who attends Flag hoisting on August 15th with a feeling that it is his responsibility to attend National festival but not to escape from being blamed by his Headmaster, the moral stage of the teacher here is. ఆగష్టు 15 రోజున ప్రధానోపాధ్యాయుని నుండి నిందను తప్పించుకోవడానికి కాకుండా, జాతీయ పండుగకు హాజరుకావడం తన కర్తవ్యంగా తలచి పతాకావిష్కరణకు హాజరైన ఉపాద్యాయుని నైతిక దశ?
#9. The stage of ‘authority and social order maintaining morality’ is in this level of Kohlberg’s moral development కోల్ బర్గ్ నైతిక వికాస సిద్దాంతంలోని ‘అధికారం, సాంఘీక క్రమాన్ని నిర్వహించే నీతి’ ఈ స్థాయికి చెందును?
#10. Moral stage of a child who is drinking milk out of fear that his mother will scold him if he didn’t drink milk. పాలుతాగకపోతే తల్లి తిడుతుందని భయంతో పాలు తాగే పిల్లవాడు నైతిక దశ?
#11. A child of class I obeys the orders of the elders avoid punishment. the child is in this stage of the Kohlberg’s moral development. ఒకటవ తరగతిలోని శిశువు శిక్షను తప్పించుకొనుటకు పెద్దలు ఆదేశాలను పాటిస్తాడు. ఈ శిశువు కోల్ బర్గ్ నైతిక వికాసంలోని ఈ దశలో ఉన్నాడు?
#12. Even though Kumar is not interested in watering plants, to get the appreciation of parents he watered the plants. According to Kohelberg he is in. కుమార్ మొక్కకు నీళ్లుపోయడం ఇష్టం లేక పోయినప్పటికీ, తల్లిదండ్రుల మొప్పుకోసం మొక్కకు నీళ్ళు పోసాడు. కోల్ బర్గ్ ప్రకారం ఇతను ఈ స్థాయిలో ఉన్నాడు……?
#13. The moral developmental stage in which, behaviour of the children is controlled by the rewards they secure పిల్లల ప్రవర్తన వారు పొందే బహుమతులచే నిర్దేశించబడే నైతిక వికాస దశ?
#14. At this level of Kohlberg’s moral development, the morality will be assessed in terms of physical punishment శారీరక శిక్షపరంగా నైతికత అంచనావేయబడు కోల్ బర్గ్ నైతిక వికాస స్థాయి?
#15. The moral stage of a girl who says that “If you give your toy to me, then I will allow you to play with me” భౌతిక పర్యవసానల ఆధారంగా చర్య నైతికతను అంచనావేసే దశ?
#16. According to Kohlberg, the moral development in most percentages of individuals does not develop above this level. కోల్ బర్గ్ ప్రకారం ఎక్కువ శాతం వ్యక్తులు నైతికంగా ఈ స్థాయికి మింఛి పెరగరు?
#17. Students, to behave in accordance with the morals and ideals of teachers, teachers behaviour should be in this level Kohelberg’s Moral Development theory. విద్యార్థులు, ఉపాద్యాయులను నైతికంగా ఆదర్శంగా తీసుకొని ప్రవర్తించాలంటే ఉపాద్యాయుల ప్రవర్తన కోల్ బర్గ్ ‘నైతిక వికాస సిద్దాంతము’ లోని ఈ స్థాయిలో ఉండాలి?
#18. In this stage of Kohlberg’s moral development one feels that confining to social systems is important సాంఘిక నియమాలకు కట్టుబడి ఉండటం ముక్యమని భావించే కోల్బర్గ్ నైతిక వికాస స్థాయి?
#19. “Naive hedonistic and instrumental orientation” stage belongs to this level of Kohlberg’s moral development ‘’సహజ సంతోష అనుసరణ, సాధనోపయోగ దశ’’ క్రింది కోల్ బర్గ్ నైతిక వికాస స్థాయికి చెందును?
#20. Moral stage in which morality is estimated depending on physical consequences భౌతిక పర్యవసానల ఆధారంగా చర్య నైతికతను అంచనావేసే దశ?
#21. Lawrence Kohlberg explained his theory of Moral development in the following number of levels and stages లారెన్ కోల్ బర్గ్ తన నైతికవికాస ప్రతిపాదించిన స్థాయి – దశలు?
#22. According to Kohlberg child’s morality is controlled by the ‘fear of punishment’ at this stage…. కోల్ బర్గ్ ప్రకారం ఏ దశలో పిల్లవాడు యొక్క నైతిక భయంతో కూడిన ‘fear of punishment’ నియంత్రించబడును?
#23. According to Kohelberg, a child shows respect for authority and follows the rules during. కోల్ బర్గ్ ప్రకారం పిల్లవాడు స్థాయిలో అధికారులను గౌరవించి నియమాలను పాటిస్తాడు?
#24. According to Kohlberg children’s moral development happens through కోల్ బర్గ్ ప్రకారం నైతిక వికాసం ఈ విధంగా జరుగుతుంది?
#25. The stage of ‘obedience for avoiding punishment’ is in this level of Kohlberg’s moral development ‘’శిక్షలు తప్పించుకోవడానికి విధేయత’ దశ క్రింది కోల్ బర్గ్ నైతిక వికాస స్థాయికి చెందును?
#26. According to Kohlberg’s, stages of moral development morality of individual principles and conscience relates to కోల్ బర్గ్ నైతిక వికాస సిద్దాంతం ప్రకారం, వ్యక్తిగత సూత్రాలు, అంతరాత్మ నీతి అనేవి దీనికి సంబంధించినవి?
#27. A person’s thinking, reasoning and competency processes plays an important role in moral development – This was stated by this Psychologist వ్యక్తి ఆలోచన, వివేచన, సమర్థత వంటి ప్రక్రియలు నైతిక వికాసంలో ముఖ్య వహిస్తాయని పేర్కొన్న మనోవిజ్ఞాన శాస్త్రవేత్త?
Also read : మనో సాంఘిక వికాశ సిద్దాంతము