Multiple Intelligence theory – హోవార్డ్ గార్డినర్ బహుళ  ప్రజ్ఞా సిద్ధాంతం

YouTube Subscribe
Please Share it

Multiple Intelligence theory – హోవార్డ్ గార్డినర్ బహుళ  ప్రజ్ఞా సిద్ధాంతం

హోవార్డ్ గార్డినర్ 11జూలై 1943 లో జన్మించాడు. ఇతను అమెరికన్ డెవలప్మెంట్ సైకాలజిస్ట్, హార్వార్ గ్రాడ్యుయేట్ స్కూల్ ఆఫ్ ఎడ్యుకేషన్లో సంజ్ఞానం విద్యావిభాగంలో ప్రొఫెసర్ గా పనిచేశాడు. హార్వార్డ్ ప్రాజెక్ట్ జీరోలో సీనియర్ డైరెక్టర్ గా ఉన్నాడు. ఇతని రచనలు 20 కి పైగా ఉన్నాయి. 1995 నుంచి గుడ్ వర్క్ ప్రాజెక్టు కో ఆర్డినేటర్ గా వ్యవహరిస్తున్నాడు. బహుళ ప్రజ్ఞా సిద్ధాంతం తో ప్రాచుర్యం పొందాడు. ఇందులోని అంశాలను “Framer of Mind The – Theory of Intelligence” గా 1983 లో గ్రంథస్థం చేశాడు.ఈ సిద్ధాంత అభివృద్ధికి కృషిచేసినందుకు గాను 2011 లో సోషల్ సైన్సెలో ప్రిన్స్ ఆఫ్ ఆస్ట్రియా అవార్డును పొందాడు.ఇతను జీన్ పియాజె, జెరోమ్ బ్రూనర్, నెల్సన్ గుడ్మైన్లతో ప్రభావితుడయ్యాడు. గుడ్ వర్క్ ప్రాజెక్టు ప్రారంభించింది నెలసన్ గుడ్ మెన్. ప్రస్తుతం గార్డ్నర్ గుడిమెతో కలిసి ఈ ప్రాజెక్ట్ లో పనిచేస్తున్నాడు. ఈ ప్రాజెక్టు జీరో అభ్యసనను, ఆలోచనను, కళలలో సృజనాత్మకతను అదేవిధంగా శాస్త్రీయ మానవతా విలువలను, వ్యక్తికి లేదా వ్యక్తులకు అవగాహనపరిచి, పెంపొందించడానికి ఉద్దేశించింది. Multiple Intelligence theory

గార్డినర్ ప్రకారము ప్రజ్ఞ ఎనిమిది రకాలు:

1). భాషాపరమైన ప్రజ్ఞ:పదాలను అర్థాలను వాటి క్రమాన్ని సులభంగా గ్రహించ గలిగే సామర్థ్యం అయితే ఇది సంభాషణ లేదా లిఖిత రూపంలో ఉంటుంది. విషయాలను గుర్తించుకోవడానికి మనల్ని మనం వ్యక్తపరచు కోవడానికి ఉపయోగపడుతుంది..

వీరు రాయడంలో, పదాలు సృష్టించడంలో, ఇతరులను ఒప్పించడంలో అమిత ఆనందాన్ని పొందుతారు.

ఉదా :- రచయితలు, ఉపన్యాసకులు, వక్తలు, కవులు..

2. శారీరక గతి సంవేదన ప్రజ్ఞ : –శరీరమును లయబద్ధంగా ఉపయోగించగలిగే సామర్థ్యము. శరీరాన్ని నేర్పుగా భావ వ్యక్తీకరణకు గానీ లేదా లక్ష్యం వైపుకు గానీ తీసుకెళ్ళడానికి ఉపయోగపడే సామర్థ్యం. వీరు శరీర కదలికలను నియంత్రిచుకోగలిగిన నేర్పరులు.

ఉదా :- నాట్యకారులు, వృత్తి నిపుణులు, అప్డేట్స్, స్పోర్ట్స్ పర్సన్స్, జిమ్నా, యోగా చేసేవారు.

3. ప్రాదేశిక ప్రజ్ఞ :- (చిత్ర నేర్పరులు (Picture Smart)) – చిత్రాల ద్వారా ఆలోచించడం, చుట్టూ ఉన్న ప్రపంచాన్ని యదార్థంగా గ్రహించి తిరిగి సృష్టించగల సామర్థ్యమే ప్రాదేశిక ప్రజ్ఞ, గణితం ప్రకారం 3Dకి చెందిక జ్ఞానం కల్గివుంటారు.  వీరు చిత్రాలను సృష్టించడానికి ఇష్టపడతారు. చిత్రాల ద్వారా ఆలోచిస్తారు.

ఉదా :- కళాకారులు, శిల్పులు, డిజైనర్స్, భవన నిర్మాణ కారులు, చిత్రకారులు

4. సంగీత సంబంధ ప్రజ్ఞ :- (సంగీత నేర్పరులు (Music Smart) – సంగీతాన్ని అవగాహన చేసుకొని, సంగీతాన్ని సృష్టించగల సామర్థ్యమే ప్రజ్ఞ.

వీరు శృతి, లయ, రాగం మొదలైన వాటిని గుర్తించి సృష్టించగల సమర్థులు. గాయకులలో ఈ రకమైన ప్రజ్ఞ ఎక్కువగా వుంటుంది.

ఉదా : – యమ్. ఎస్. సుబ్బలక్ష్మీ, లతా మంగేష్కర్,

5. పరస్పర వ్యక్తిత్వ ప్రజ్ఞ :- (సాంఘిక నేర్పరులు (Social Smart)) –ఇతరుల మనోభావాలు, కోరికలు, ప్రేరణలు మొదలగు వాటిని గ్రహించి అర్థం చేసుకోగలిగే సామర్థ్యమే, పరస్పర వ్యక్తిత్వ ప్రజ్ఞ. 

ఉదా :- మతబోధకులు, రాజకీయ నాయకులు, సంఘ సంక్షేమ కార్యకర్తలు,సైకాలజిస్టులు 

6. వ్యక్త్యంతర్గత ప్రజ్ఞ :- (స్వీయ నేర్పరులు (Self Smart)) –మన భావాలను మనమే సరిగా అర్థం చేసుకొని తద్వారా మన జీవితాన్ని సరైన పద్ధతిలో నడిపించుకోగలిగే సామర్థ్యం.

ఉదా :- స్వామి వివేకానంద, రామకృష్ణ పరమహంస

7. తార్కిక – గణిత ప్రజ్ఞ :- (సంఖ్యా నేర్పరులు (Number Smart)) –నమూనాలు గుర్తించడంలో, తార్కిక ఆలోచన, నిగమాత్మక వివేచన, గణిత ప్రక్రియలు చేయగల సామర్ధ్యమే ఆ తార్కిక గణితప్రజ్ఞ. గణిత శాస్త్రవేత్తలకు ఈ రకమైన ప్రజ్ఞ ఎక్కువగా వుంటుంది.

ఉదా :- శాస్త్రవేత్తలు, జ్యోతిష్యులు, గణిత మేథావులు, సామాజిక దార్శినికులు, గణాంక నిపుణులు

8. సహజ ప్రజ్ఞ :- (ప్రకృతి నేర్పరులు (Nature Smart)) –మనచుట్టూ ఉన్న జంతు, వృక్ష జాలాలలో రకాలను గుర్తించి, వర్గీకరించగలిగే సామర్థ్యం సహజ ప్రజ్ఞ.

వీరు ప్రకృతి లోని విషయాలను సూక్ష్మంగా అర్థం చేసుకుని ప్రకృతికి అనుగుణంగా నడుచుకుంటారు. 

ఉదా :- పక్షులు, జంతువులు ప్రేమికులు, వృక్షశాస్త్రవేత్తాలు మొదలైన వారు

ఉద్వేగ ప్రజ్ఞ : Emotional Intelligence

1986వ సవంత్సరంలో వేయిన్ లియోన్ పెయిన్ అనే విద్యార్థి తన Ph.D., గ్రంథంలో ఉద్వేగ ప్రజ్ఞ అనే పదాన్ని మొదటిసారిగా ఉపయోగించాడు.

1990వ సంవత్సరంలో జాన్ మేయర్, పీటర్ సలోనే అనే అమెరికా ప్రొఫెసర్లు తాము ప్రచురించిన ఒక వ్యాసానికి Emotional Intelligence అనే పేరు నిచ్చారు.

1995వ సంవత్సరంలో జాన్ మేయర్, పీటర్ సలోనే సమ్మతితో Daniel Goleman అనే అమెరికా శాస్త్రవేత్త తాను రచించిన పుస్తకానికి “Emotional Intelligence why it can matter more than I.Q.”అని పేరు పెట్టారు

ఉద్వేగ ప్రజ్ఞ అనే పదాన్ని ప్రాచుర్యంలోకి తీసుకొచ్చిన శాస్త్రవేత్త డానియల్ గోల్ మెన్.

డానియల్ గోల్ మెన్ ప్రకారము వ్యక్తి సఫలతలో ఉద్వేగ ప్రజ్ఞ 80% కారణము అయితే అతని సాధారణ ప్రజ్ఞ

20% మాత్రమే అని పేర్కొన్నాడు.

ఉద్వేగ ప్రజ్ఞ నమూనాలు (Models of Emotional Intelligence):-

1).సామర్థ్య నమూనా (Ability mode):- పీటర్ సలోవె, జాన్ మేయర్లు ఉద్వేగ ప్రజ్ఞను సామర్థ్య నమూనా ఆధారంగా వివరించారు.వీరు ఉద్వేగ ప్రజ్ఞన నాలుగు రకాల సామర్థ్యాలపై ఆధారపడుతుందని తెలిపారు. అవి-

1. ఉద్వేగాలను గ్రహించడం / ప్రత్యక్షీక్తీకరించడం

2. ఉద్వేగాలు ఉపయోగించడం.

3. ఉద్వేగాలను అవగాహన చేసుకోవడం

4. ఉద్వేగాలను నిర్వహించడం: 

2).లక్షణ నమూనా (Trait Mode):- కాన్ స్పాటిన్ వాసిలి పెటైడ్స్, లక్షణ నమూనాను ప్రతిపాదించాడు. ఇతను సోవియెట్ పుట్టిన బ్రిటీష్ మనోవిజ్ఞాన శాస్త్రవేత్త. ఈ నమూనా వ్యక్తి మూర్తిమత్వానికి చెందింది. ఉద్వేగ ప్రజ్ఞ మూర్తిమత్వ అంతర్గత లక్షణాల సమూహం అనేక ఉద్వేగాంశాల స్వీయ ప్రత్యక్షీకరణకు సంబంధించింది.

3).మిశ్రమ నమూనా (Mixed Model); డానియెల్ గోల్మన్, మిశ్రమ నమూనాను ప్రతిపాదించాడు. “వ్యక్తులు తమ సామాన్య లక్ష్యాల వైపు సాగడంలో కలిసి పనిచేయడానికి ఉపయోగపడే భావాలను ప్రభావవంతంగా నిర్వహించే సామర్థ్యమే ఉద్వేగ ప్రజ్ఞ” అని అన్నాడు డానియెల్ గోల మన్. వీరి ప్రకారం ఉద్వేగాత్మక ప్రజ్ఞలో 25 నైపుణ్యాలను ప్రతిబింబించే 5 విశేషకాలు ఉన్నాయి.

1. స్వీయ అవగాహన

2. స్వీయ నియంత్రణ

3. సాంఘిక నైపుణ్యాలు

4. సహానుభూతి

5. స్వీయ ప్రేరణ 

ఉద్వేగ లబ్ధి (Emotional Quotient

ప్రజ్ఞ వ్యక్తి సాధారణ ప్రజ్ఞను తెలియజేస్తుంది. ఉద్వేగాత్మక లబ్ది వ్యక్తి ఉద్వేగ వికాసాన్ని తెలుపుతుంది. E.Q. ను కొలవడానికి I.Q. వలే ఎటువంటి ప్రమాణాలు లేవు. ప్రస్తుతము జాన్ మేయర్, పీటర్ సలోనే నిర్మించిన సాధనంతో ఉద్వేగాత్మక లబ్దిని (E.C.) కొలవడం జరుగుతుంది. వీరి సాధనాలలో ఈ క్రింది అంశాలు పరిశీలించడం జరుగుతుంది.

1. వ్యక్తులు ఒత్తిడిలో ఎలా పని చేస్తారు

2.సంఘర్షణ ఎలా పరిష్కరిస్తారు.

3. సవాళ్ళు ఎలా ఎదుర్కొంటారు

4.వ్యక్తీకరణ నైపుణ్యం మరియు సాంఘిక సంబంధాలను అర్థం చేసుకోవడం.

 

Results

#1. ‘స్వీయ నేర్పరులు’‌ కలిగివుండే ప్రజ్ఞ ?

#2. ‘సాంఘిక నేర్పరులు’గా పిలువబడేవారు ?

#3. క్రింది ప్రజ్ఞ కలవారు ‘చిత్ర నేర్పరులు’ ?

#4. గార్డనర్ బహుళ ప్రజలకు సంబంధించని ప్రజ్ఞ ?

#5. గార్డెనర్ ప్రకారం క్రీడాకారులు కలిగి ఉండే ప్రజ్ఞ ?

#6. గార్డెనర్ ప్రకారం చిత్రకారులు కలిగే ఉండే ప్రజ్ఞ. ?

#7. హెూవార్డ్ గార్డెనర్ ప్రతిపాదించిన సిద్ధాంతం ?

#8. గార్డెనర్ ప్రకారం క్రిందిరకపు ప్రజ్ఞ కలవారిని ‘స్వీయ నేర్పరులు’ అంటారు ?

#9. ప్రశాంత్ తన చుట్టూ ఉన్న దృశ్య ప్రపంచాన్ని అంతటినీ గ్రహించి తిరిగి తన మనస్సులో సృష్టించగలిగే సామర్థ్యాన్ని కలిగి ఉన్నాడు. అయిన గార్డినర్ బహుళ కారక ప్రజ్ఞసిద్ధాంతం ప్రకారం తను కల్గి ఉండే సామర్థ్యం ?

#10. వినయ్ ఒక వైపు ఉద్యోగం చేస్తూనే అటు సహ ఉద్యోగులు ఎలాంటి వారితోనైనా చక్కటి సంబంధాలు మరియు తన పెద్ద కుటుంబంలోని వ్యక్తులందరి భావాలను, కోరికలను అర్థం చేసుకొని వారిని సంతోష పెట్టగల్గుతున్నాడు ఇతడు గార్డినర్ ప్రకారం ఏ ప్రజ్ఞారకం?

#11. మైకెల్ జాక్సన్ ఎలాంటి పాటలకైనా చక్కని నృత్యాన్ని ప్రదర్శించగల్గుతాడు. అంతేగాక తన శరీరాన్ని ఎలా కావాలంటే పాటకు తగ్గట్లుగా నేర్పుగా ఉపయోగించ‌ గల్గుతాడు. అయితే గార్డినర్ప్రకారం అతడికి గల ప్రజ్ఞ ?

#12. గార్డెనర్ ప్రకారం ఫాషన్ డిజైనర్‌లోని ప్రజ్ఞ ?

#13. “Frames of mind : The theory of multiple Intelligences” పుస్తక రచయిత ?

#14. చిత్ర రూపంలో సమర్పించిన విషయాలను చక్కగా గ్రహించగల్గుతూ చిత్రాలు లేదా దృశ్యాల ద్వారా చక్కగా నేర్చుకొనగల్లే వారిలో గల ప్రజ్ఞ?

#15. క్రీడాకారులు, వృత్తిపని వారు, నాట్యకళాకారులు, శస్త్ర చికిత్స చేయు డాక్టర్లలో అమితంగా కన్పించు ప్రజ్ఞ ?

#16. హ్యూమన్ కంప్యూటర్ గా పిలువబడే శకుంతలాదేవి వేగంగా గుణకారాలు చేయగల నిశ్చల్ నారాయణ వారందరు హోనార్డ్ గార్డినర్ ప్రజ్ఞా రకాల ప్రకారం వీరు ఏ వర్గం ?

Previous
Finish

Also read : శాస్త్రీయ నిబంధన సిద్ధాంతం

అభ్యసనం 

యత్నదోష అభ్యసన సిద్దాంతం 

అభ్యసన రంగాలు

అభ్యసన బదలాయింపు

ప్రేరణ

సాంఘిక-సాంసృతిక సిద్దాంతము

పరిశీలన అభ్యసన సిద్దాంతము 

అంతర్ దృష్టి అభ్యసనం 

కార్యసాధక నిబందనం


Please Share it

1 thought on “Multiple Intelligence theory – హోవార్డ్ గార్డినర్ బహుళ  ప్రజ్ఞా సిద్ధాంతం”

Leave a Comment

error: Content is protected !!