Principal of development – వికాస సూత్రాలు

YouTube Subscribe
Please Share it

Principal of development వికాస సూత్రాలు 

1.వికాస అవిచ్చిన్న నియమము/ వికాస నిరంతర నియమము : పెరుగుదల కొంత వయసు తర్వాత ఆగిపోతుంది. అయితే మనం తల్లి గర్భంలో ఉన్నప్పుడు నుంచి చనిపోయేంతవరకు వికాసం అనేది అవిచ్ఛిన్నంగా కొనసాగుతూనే ఉంటుంది. 

2.వికాస దిశా నియమము/వికాసం 2 నిర్దేశిక పోకడల నియమము / వికాసము ఖచ్చితమైన దిశగా సాగుతుంది.

(a) శిరో పాదాభి ముఖ నియమము: ( Caphalocandal) :-అనుదైర్ఘ్య పద్ధతిలో వికాసం తల నుండి ప్రారంభమై పాదాభి ముఖంగా సాగుతుంది. అనగా తలనుండి ఆరంభమై దేహము దిగువ భాగానికి పాదాల వైపుగా వ్యాపిస్తుంది అని అర్థం. 

(b) సమీప దూరాస్త నియమము:- ( Praximodistal):-వికాసము దేహము మధ్యభాగం నుండి ప్రారంభమై ఇతర భాగాలకు వ్యాపిస్తుంది ఈ నియమం చెప్తుంది.అనగా శిశువు చలాన వికాసం లో భాగంగా ఏదైనా వస్తువును అందుకునేందుకు మొదట భుజాలు, మోచేతులు ఉపయోగించిన తర్వాత నే మణికట్టు, చేతివేళ్లు ఉపయోగిస్తారు. 

3.వికాశ క్రమానుగత నియమము/వికాసం ఒక ఖచ్చిత నమూనాను పాటిస్తుంది:-

వికాసము ఒక ఖచ్చితమైన వరుసక్రమాన్ని పాటిస్తుంది.వికాసము నిర్దిష్టంగా ఒక దాని తర్వాత మరొక అంశాలతో ఒక క్రమపద్ధతను పాటిస్తూ కొనసాగుతుంది. Principal of development

Example: – a) ముందుగా శిశువు తలపై పట్టు సాధిస్తాడు, తరువాత బోర్లా పడడం, పాకడం, ఆధారాన్ని పట్టుకొని నిలబడడం, తరువాత  నడవటం నేర్చుకున్నాడు.

Example :- b) ముందుగా ఉపాధ్యాయుడు వృతం గీయటం నేర్పించాడు, తరువాత సరళరేఖ నేర్పించాడు, తరవాత సమాంతర రేఖలు నేర్పించాడు, తర్వాత మూడు భుజాల గల  త్రిభుజాన్ని నేర్పించాడు, మరలా నాలుగు భుజాల  చతుర్భుజాన్ని నేర్పించాడు.

Example: –  BODMAS  ( గణిత ఉపాద్యాయుడు ఇలా నేర్పుతాడు)

Example: – LSRW          ( భాషా ఉపాద్యాడుడు ఇలా నేర్పు తాడు)

4.వికాసంలో వైయుక్తిక బేధాలు ఉంటాయి :-

వికాసము ఒక క్రమపద్ధతిలో జరిగినప్పటికీ అది అందరిలో ఒకే వేగంతో ఒకే గుణాత్మకంగా జరగదు అని ఈ నియమము చెప్తుంది.

ఉదాహరణకు కొందరు పిల్లలు త్వరగా మాట్లాడ గలుగుతారు.

Also Watch videos : వికాశ దశలు (జననాంతర దశలు)

5.వికాసం ప్రాగృక్తికరణ నియమము /వికాసం అంచనా నియమము:-

శిశువు యొక్క ప్రస్తుత వికాస వేగం ఆధారంగా ఆ శిశువు ఆ వికాసములో ఎంత అభివృద్ధి చెందుతాడు ఊహించి అంచనా వేయవచ్చు.

ఒక ఐదవ తరగతి పిల్లవాడు ప్రస్తుతం గీస్తున్న బొమ్మలను బట్టి అతడు భవిష్యత్తులో మంచి చిత్రకారుడిగా రాణించే అవకాశం ఉంది అని ముందుగానే ఊహించి అంచనా వేయవచ్చు

6.వికాసం పరస్పర సంబంధం నియమము/ వికాసం ఏకీకృత మొత్తంగా జరుగుతుంది:-

వ్యక్తిలోని వివిధ వికాసాలన్ని విడివిడిగా కాక అన్ని కలిసి సమైక్యంగా పనిచేస్తేనే వ్యక్తి యొక్క సంపూర్ణ వికాసం జరుగుతుంది అని ఈ నియమం తెలుపుతుంది

7.వికాసము సాధారణం నుండి నిర్దిష్టం వైపుకు కొనసాగుతుంది:-

ఏ వికాసానికి సంబంధించి అయినా శిశువు మొదట సాధారణ  ప్రతిస్పందనలను కనపరిచి తరువాతనే నిర్దిష్టమైన లేక ప్రత్యేకమయిన ప్రతిస్పందనలు కనబరుస్తాడు అని ఈ నియమం చెబుతుంది. 

8.వికాసం సంచితమైనది:-

శిశువు ప్రవర్తనలో ఏర్పడే కొత్త మార్పులు అకస్మాత్తుగా జరగవు ప్రతి ప్రవర్తన మార్పు గతంలోని అనుభవాల ఆధారంగా ఏర్పడుతుంది.

ఉదాహరణకు శిశువుల్లో భాషా వికాసము అకస్మాత్తుగా ఏర్పడదు ముద్దు పలుకుల ఆధారంగా పదాలు నేర్చుకోవడం, పదాల ఆధారంగా వాక్యాలు నేర్చుకోవడం, వాక్యాలు ఆధారంగా భాషను నేర్చుకోవడం జరుగుతుంది.

9.వికాసం అన్ని దశలలో ఒకే విధంగా జరగదు:

వికాసము జీవిత పర్యంతము కొనసాగినప్పటికీ అన్ని దశలలో ఒకేరకంగా జరగదు కొన్ని దశలలో ఎక్కువ వేగంతో మరి కొన్ని దశలలో తక్కువ వేగంతో ను జరుగుతుంది.

ఉదాహరణకు శైశవ దశలో మిగిలిన అన్ని దిశల కంటే పెరుగుదల వేగంగా జరుగుతుంది. అలాగే ఉత్తర బాల్య దశ లో పెరుగుదల మిగిలిన అన్ని దశల కంటే నెమ్మదిగా జరుగుతుంది.

 

Results

#1. Identify the correct statement with regard to the growth and development పెరుగుదల మరియు వికాసానికి సంబంధించిన సరైన దానిని గుర్తించడం?

#2. The unfolding of biologically inherited potentialities as a function of time or in an age related sequence is called…. వ్యక్తిలోని అంతర్గతంగా ఉన్న జీవ సంబందమైన శక్తులను సమాయనుసారంగా లేదా వయసు సంబంధిత క్రమంలో వికసింపజేయడమనేది?

#3. Cephalocaudal development indicates that the development proceeds from….. వికాసం ఈ దిశగా సాగుతుందని శిరఃపాదాభిముఖ వికాసం సూచిస్తుంది?

#4. One of the following is not a principle of Development ఈ కింది వాటిలో వికాసం కానిది?

#5. A Child who uses both its hands to hold a toy, gradually holds the toy with its fingers. this can be best explained by this developmental principle రెండు చేతులతో బొమ్మను పట్టుకొనే శిశువు క్రమేపి తన చేతివ్రేళ్లతో బొమ్మను పట్టుకోగలుగుతుంది. దీనిని ఈ వికాస సూత్రం ద్వారా సరిగా వివరించవచ్చు?

#6. Development of a three-year-old child is delayed due to lack of nutritious food. The factor responsible for this developmental delay is…….. పోషకాహారలోపంవల్ల మూడు సంవత్సరాల వయసున్న శిశువు వికాసంలో జాప్యం జరిగింది?

#7. Most human characteristics are the result of many genes working in combination. this is referred to as చాలావరకు మానవ లక్షణాలు అనేక జన్యువులు కలిసి పనిచేయుట ద్వారా ఏర్పడుతాయి. దీనిని ఈ విధంగా అంటారు?

#8. The direction of the development of A child Is శిశువు వికాస దశ?

#9. Development of the individual depends upon the interrelationship of the following:వ్యక్తి యొక్క వికాసము, ఈ క్రింది అంశాల పరస్పర సంబందం పై ఆధారపడి వుంటుంది?a.Physical b. Cognitive c. Emotional (ఎ. భౌతిక బి. జ్ఞానత్మక సి. వుద్వేగాత్మక}

#10. Development follows the………. వికాసము………?

#11. The ‘general excitement’ of an infant getting differentiated into responses of ‘distress’ and ‘delight’ can be explained by this development is unified నవజాత శిశువు యొక్క ‘సాధారణ వుత్తేజం’, ‘ఆర్తి’, ‘ఆహ్లాదం’ ప్రతిస్పందనలుగా విడవిడడం ఈ వికాస సూత్రం ద్వారా వివరించవచ్చు?

#12. The mental development of a child is slow. So his moral development also become slow. The principle of development related to this is…. ఒక పిల్లవాని మానసిక వికాసం వెమ్మదిగా వుండటం వలన అతని నైతిక వికాసం కూడా నెమ్మదిగా జరుగుతున్నది. దీనికి సంబందించిన వికాస సూత్రం?

#13. An infant holds a toy intially using his palm, as he grows holds it with fingers. The development principle that explains this…. ఒక శిశువు బొమ్మను మొదట తన పిడికిలిని వుపయోగించి పట్టుకుంటాడు. పెరుగుతున్న కొద్ది దానిని వేళ్ళతో పట్టుకుంటాడు. దీనిని వివరించే సూత్రం?

#14. The physical factor that effects the development of an individual వ్యక్తి వికాసం పై ప్రభావం చూపించే శారీరక కారకం?

#15. The bodily changes in an organism is attributed to జీవిలో శారీరక సంబందమైన మార్పులను దీనికి వర్తిస్తాయి?

#16. One of the following helps a 10 year old girl to ride a bicycle efficiently ఈ క్రింద పేర్కోన్న వాటిలో 10 సంవత్సరాల బాలిక సైకిల్ ను సమర్థవంతముగా తొక్కడానికి సహాయపడేది?

#17. One of the following is not a principle of development క్రింద వానిలో అభివృద్ధి సూత్రం కానిది?

#18. One of the following is an example of fine motor skills క్రింది వానిలో సూక్ష్మ చలనాత్మక నైపుణ్యమునకు ఉదాహరణ?

#19. Choose the correct statement in respect of growth and development of an individual వ్యక్తి పెరుగుదల, వికాసాలకు సంబంధించిన సరైన దానిని గుర్తించడం?

#20. One of the following is not the characteristic feature of development కింది వానిలో వికాసలక్షణం కానిది?

#21. The continuous change that occur in an Individual వ్యక్తిలో అవిచ్చిన్నంగా జరిగే మార్పు?

#22. At first child uses his hand to hold the things, later he manages to hold them with his fingers. The developmental principle here is శిశువు వస్తువును పట్టుకోవడానికి మొదట చేతిని మొత్తం ఉపయెగించి తర్వాత చేతివేళ్ళతో వస్తువును పట్టుకోగలగడంలోని వికాస సూత్రం?

#23. The socio-cultural factor that affects human development is వ్యక్తి వికాసం పై ప్రభావం చూపే సాంఘిక సాంస్కృతిక కారకం?

#24. Everything that affects an individual other than genes is related to జన్యువులు తప్ప వ్యక్తిపై ప్రభావం చూపే ప్రతి అంశం దీనికి సంబంధించినది?

#25. One among the following is referred as Heriditist (Anuvamsikataavadi) కింది వానిలో అనువంశికతవాది గా పేర్కొనబడిన వారు?

#26. One of the following statements is true క్రిందివాటిలో సరైన ప్రవచనం ?

#27. The study that supports the influence of Heredity on development of an individual వ్యక్తి వికాసం పై అనువంశికత ప్రభావాన్ని సమర్థించే అధ్యాయనం?

#28. According to instincts and its corresponding emotions the following is a right pair సహజాతలు వాటి ఉద్వేగాలకు సంబంధించి సరియైన జత?

#29. The following statement is not true with regard to principles of development ఒక శిశువును మొదట తన పిడికిలిని ఉపయోగించి పట్టుకుంటాడు. పెరుగుతున్న కొద్ది దానిని వేళ్ళతో పట్టుకుండాడు. దీనిని వివరించే సూత్రం?

#30. “Maturation refers to the emergence of an organism’s genetic potential. It consists of a series of programmed changes” –stated by ‘పరిపక్వత అంటే జన్యు సంభావ్యతతో జీవి ఆవిర్భావాన్ని తెలుపుతుంది. ఇది ముందుగా నిర్ణయంచినా ప్రణాళిక మార్పుతో కూడుకున్నది ‘ అన్నవారు’.?

#31. ఐశ్వర్య చతురస్రం గీయడంలో ఇబ్బందిని గమనించిన ఉపాధ్యాయుడు డైమండ్‌ని గీయటంలో కూడా ఎదుర్కొంటుందని ఉపాధ్యాయుడు ఊహిస్తున్నాడు. అయిన ఉపాధ్యాయుని ఊహకు మూలమైన వికాస నియమం ఏది ?

#32. క్రింది వాటిలో వికాసానికి సంబంధించి సరియైనది ?

#33. జీవిలోని శారీరక, మానసిక లక్షణాలు, సహజ అభివృద్ధిని ఈ విధంగా పిలుస్తారు.?

#34. ఈ క్రింది వాటిలో వికాసం యొక్క లక్షణము కానిది ?

#35. క్రింది వాటిలో పరిణతిని సూచించనిది ?

#36. వ్యక్తి వికాసంపై అనువంశికత ప్రభావం నిరూపించుటకు గోడార్డ్ ‌వీరిపై ప్రయోగాలు చేసారు.?

#37. క్రింది వాటిలో ఖచ్చితంగా కొలవగలిగినది.?

#38. ‌పెరుగుదలకు సంబంధించి సరికానిది ?

#39. పరిపక్వత అనునది జన్యుప్రభావాల సంకలన స్వీయ పరిమితితో కూడిన జీవిత వలయంలో ఇది కార్యక్రమయుతంగా పనిచేస్తుంది. అని తెలిపినవారు?

#40. పెరుగుదల మరియు వికాసానికి సంబంధించి సరియైనది ?

#41. ఒకే తల్లిదండ్రులకు జన్మించిన ఐశ్వర్య మరియు మౌక్తికలలో ఐశ్వర్య కాస్త తెల్లగా, పొడవుగా ఉండటం, మౌక్తిక పొడవుగా ఉండటం మెండల్‌ ఈ అనువంశిక నియమాన్ని సూచిస్తుంది.?

#42. పెరుగుదల – వికాసంల జ్ఞానం ఉపాధ్యాయులకు దీని గురించిన అవగాహన కల్పిస్తుంది.?

#43. వ్యక్తి సంరచన, ఆలోచన, ప్రవర్తనలో మార్పు రావటం ఇది జీవ సంబంధిత పరిసరాల ప్రభావం వలన సంభవిస్తుంది.?

#44. క్రింది వారిలో అనువంశికతావాది.?

#45. ‌పోషకాహార లోపం వలన క్రిష్ణారావులోని వికాసంలో జాప్యం జరిగినది. ఈ వికాస జాప్యానికి కారణమైన కారకం ఏది ?

#46. శశికాంత్‌ ‌మొదట తలను నిలిపిన తరువాత నడుము నిలిపి కూర్చోవటం, ఆ తరువాత కాళ్ళను నిలిపి నడవడం చేస్తున్నాడు. అయిన ఇందులో వికాస సూత్రం?

#47. శశికాంత్‌, ‌లావణ్య దంపతులు అందంగాను, తెల్లగా, ప్రజ్ఞావంతులు అయినప్పటికీ వారికి జన్మించిన పిల్లలు అందహీనంగాను, మందబుద్ధులు అయిన దీనిని తెలుపు మెండల్‌ ‌నియమం?

#48. శశికాంత్‌ అను పిల్లవాడు 9 నెలల్లో నిలబడగలిగితే తన తమ్ముడు సూర్య 12 నెలల్లోను, తన మరో తమ్ముడు లక్ష్మణ్‌ 13 ‌నెలల వయస్సులో నిలబడగలిగాడు. అయిన దీనిని తెలియజేయు వికాస నియమం?

#49. శశికాంత్‌ ‌తన తరగతిలో విద్యార్థిని లావణ్య యొక్క అప్పటి ప్రవర్తనను పరిశీలించి భవిష్యత్తులో ఆమె మంచి పోలీస్‌ ఆఫీసర్‌గా రాణిస్తుందని ఆ ఉపాధ్యాయుడు తెలియజేయటం?

#50. తన తరగతిలోని తనతోపాటు ఇతర విద్యార్థుల సాంఘికమితి స్థితిని గూర్చి అవగాహనను కూడా ఏర్పరచుకున్న మౌక్తిక ఈ దశకు చెందును.?

#51. భాషా వికాసం జరిగే క్రమంలో చివరి దశ ?

#52. క్రింది వానిలో కౌమార దశలో ఉద్వేగవికాసానికి సంబంధించని లక్షణము ?

#53. లక్ష్మణ్‌ ‌సమస్యలకు ప్రయోగాత్మకంగా పరిష్కార మార్గాలను కనుక్కొని నిరూపించే ప్రయత్నం చేస్తాడు. కానీ అనాలోచిత పరిష్కార మార్గాలు ఒప్పుకొనుటకు ఇష్టపడడు. అయిన లక్ష్మణ్‌కు గల మానవ వికాస దశ?

#54. శైశవదశలోని ఉద్వేగ వికాసానికి సంబంధించని లక్షణము ?

#55. సంజ్ఞానాత్మక వికాస సిద్ధాంతాన్ని అనుసరించి ఈ దశలో శిశువు ఒక ప్రతిక్రియా జీవి నుండి ప్రాథమిక ప్రతికాత్మక ఆలోచన చేయు పర్యాలోచక జీవిగా మార్పుచెందుతాడు.?

#56. ప్రశాంత్‌ ‌సమస్యాపరిష్కారంలో ఒకే కోణంలో కాకుండా భిన్న కోణాలలో ఆలోచించడము, మానసిక పరికల్పనలను పరీక్షించటము ద్వారా సమస్యలు పరిష్కరిస్తున్నాడు. అయిన ప్రశాంత్‌లోగల సంజ్ఞానాత్మాక వికాస దశ?

#57. వెంకట్‌ ఆటలు ఆడేటపుడు జీవంలేని ఆటవస్తువులకు జీవాన్ని ఆపాదిస్తూ ఆడుకోవటం, పియాజే సంజ్ఞానాత్మక వికాస సిద్ధాంతం ప్రకారం వెంకట్‌ ‌యొక్క లక్షణము?

#58. ఎప్పుడూ విమానాన్ని చూడని ఐశ్వర్య ఆకాశంలో మొదటిసారి విమానం చూసినపుడు దానిని తెల్లపక్షిగా గుర్తించిన అందులోని సంజ్ఞానాత్మక పక్రియ?

#59. వ్యాకరణ సహితంగా ఉండి ఎలాంటి అర్థం ఇవ్వని వాక్యాలను తన సిద్ధాంత నిరూపణలో ఉపయోగించిన మనో విజ్ఞాన శాస్త్రవేత్త?

Previous
Finish

Also read : రక్షక తంత్రాలు


Please Share it

3 thoughts on “Principal of development – వికాస సూత్రాలు”

Leave a Comment

error: Content is protected !!