Psychology Online Classes in Telugu – యత్నదోష అభ్యసన సిద్దాంతం 

YouTube Subscribe
Please Share it

Psychology Online Classes in Telugu – యత్నదోష అభ్యసన సిద్దాంతం 

ఉద్దీపన ప్రతిస్పందన ల మధ్య బంధం ఏర్పడటంవల్ల అభ్యసనం జరుగుతుందని తెలిపేదే సంసర్గ వాద సిద్ధాంతాలు. ఇక్కడ సంసర్గం అనగా బంధం ఏర్పడడం. సంసర్గ వాద సిద్దంతము అన్నా ప్రవర్తనా వాద సిద్దంతము అన్నా ఒకటే.

యత్న దోష అభ్యసన పద్ధతి (Trial and Error Leaning) year 1913

యత్నదోష అభ్యసనం సిద్ధాంతాన్ని అమెరికాకు చెందిన థారన్ డైక్ ప్రతిపాదించాడు.ఈయన  William James పర్య వేక్షణలో అన్ని ప్రయోగాలు చేసాడు.

William James రచించిన గ్రధం Principles of Psychology 

1.థారన్ డైక్ రచించిన గ్రంధాలు:-

1). Animal Intelligence: Experimental Studies

2). The Measurement of Intelligence

3). The principal of Teaching

4). Educational Psychology

5). Psychology of Algebra

6). Psychology of Arithmetic

2.థారన్ డైక్ చేసన ప్రయోగం : –

యత్న దోష అభ్యసనంలో ప్రయత్నాలు చేసి తప్పులు చేయడం, వాటిని దిద్దుకోవడం ద్వారా అభ్యసనం ఏర్పడుతుంది. యత్నదోష అభ్యసనం మీద పరిశోధన చేసిన వారిలో ముఖ్యమైన వ్యక్తి ఎడ్వర్డ్ లి థారన్ డై క్ (E.L. Thorn-dike). పజిల్ బాక్స్ ఉపయోగించి ప్రయోగాలు జరిపాడు. ఆ పజిల్ పెట్టెలో ఆకలిగా ఉండే ఒక పిల్లినుంచాడు. పజిల్ పెట్టెకు బయట పిల్లికి కనబడేవిధంగా ఆహారాన్ని ఏర్పాటు చేశాడు. పజిల్ పెట్టెలో పిల్లి ఒక మీటను నొక్కాలి. తలుపు తీయడానికి పిల్లి అనేక ప్రయత్నాలు చేసింది. ఆఖరుకు యాదృచ్చికంగా మీటను నొక్కినపుడు తలుపు తెరుచుకుంది. పిల్లి పజిల్ పెట్టెలో నుంచి బయటకు వచ్చి ఆహారం తీసుకొంది.

            అంటే పిల్లి అనేక ప్రయత్నాలు చేసి, అనేక తప్పులు చేసి చివరకు సరియైన ప్రయత్నం చేసింది. ఆ తరవాత మళ్ళీ అదే పిల్లిని అదే పజిల్ పెట్టెలో ఉంచినపుడు, మళ్ళీ కొన్ని ప్రయత్నాలు చేసి మీటను నొక్కింది. కానీ రెండోసారి చేసిన తప్పుల సంఖ్య తగ్గిపోయింది. అభ్యసనానికి పట్టినకాలం కూడా తగ్గిపోయింది. ఈ విధంగా యత్నదోష అభ్యసనంలో కొన్ని ప్రయత్నాలు చేసి, దోషాలు చేసి చివరకు అభ్యసనం చేయడం జరుగుతుంది. 

3.యత్నదోష అభ్యసనంకి గల ఇతర పేర్లు:-

1). S-R  టైప్ సిద్ధాంతం

2). సంసర్గ వాద సిద్ధాంతం

3). ఉద్దీపన- ప్రతిస్పందన సిద్ధాంతం

4). బంధ సిద్ధాంతం

5). విజయ పథ వరుణ రీతి అభ్యసనం  ఇలా అనేక పేర్లతో పిలుస్తారు ఇవి పరీక్షకు చాలా ముఖ్యం.

Psychology Online Classes in Telugu

4.థారన్‌డైక్ అభ్యసన సూత్రాలు :

థారన్ డై క్ పజిల్ పెట్టెలో పిల్లిని ఉంచి చేసిన ప్రయోగాల ద్వారా కొన్ని అభ్యసన సూత్రాలను రూపొందించాడు. థారన్ డైక్ ప్రకారం అభ్యసనం ఒక సంధానం (Connection) ద్వారా ఏర్పడుతుంది. కాబట్టి థారన్ డైక్ ఈ సిద్ధాంతాన్ని సంధాన సిద్ధాంతం (Connectionism)  అని పేర్కొన్నాడు. 

థారన్ డైక్ అభ్యసన సూత్రాలలో మూడు సూత్రాలు ముఖ్యమైనవి. అవి ఏవంటే

1). సంసిద్ధతా నియమం : -( Law of Read) :-

a). అభ్యాసకుడు ఏదైనా అభ్యసించేటప్పుడు మానసికంగా, శారీరకంగా సిద్ధంగా ఉన్నప్పుడు మాత్రమే అనుమతించాలి.

b). అభ్యాసకుడు అభ్యసించే విషయంలో శారీరకంగా, మానసికంగా సిద్ధంగా లేనప్పుడు అభ్యాసానికి అంగీకరించకూడదు.

c). తరగతి గదిలో బోధించే విషయాలు విద్యార్థి అవసరాలకు తగినట్లుగా ఉన్నప్పుడు, అభ్యసించడానికి సన్సిద్దుడు అవుతాడు. గుర్రాన్ని తోట్టి వరకు తీసుకెళ్లవచ్చు గాని దానిచేత నీళ్ళు తాగిన లేరు అనే సామెత తో ఈ నియమాన్ని పోల్చవచ్చు.

2) అభ్యాస నియమము:-

ఏదైనా ఒక విషయాన్ని పదే పదే అభ్యసించి నట్లయితే ఆ విషయంలో ప్రావీణ్యత కలుగుతుంది అనేది ఈ నియమము సారాంశము. ఈ నియమం లో రెండు చిన్న నియమాలు ఉన్నాయి.

a). ఉపయోగ నియమము:-ఏదైనా కౌశలాన్ని అభ్యసించే టప్పుడు పదే పదే చర్య పునరావృతం అయితే ఉద్దీపనకు ప్రతిస్పందనకు మధ్య బంధం బలపడుతుంది అభ్యాసకుడు సరైన ప్రతిస్పందన చేయగలుగుతాడు.

b). నిరుపయోగ నియమం:-చర్య పునరావృతం కాకపోతే అభ్యాసకుడు అది మరచిపోయి నిరుపయోగం అవుతుంది.

ఉదాహరణకు:- అనగననగా రాగ మతిశయిల్లు, తినగ తినగ వేము తియ్యనుండు, సాధనమున పనులు సమకూరు ధరలోన అని పద్యము తోనూ practice makes a man perfect అనే సామెత తోను అభ్యసన నియమమును పోల్చవచ్చు.

అందువలన :-a). విద్యార్థికి ఇంటి పని ఇవ్వాలి b). విద్యార్థి చేత డ్రిల్ చేయించాలి c). విద్యార్థి చేత పునశ్చరణ చేయించాలి.

3). ఫలితం నియమము:-

అభ్యసన నియమాలు అన్నింటిలో అతి ప్రాధాన్యం అయినటువంటి నియమము. ఫలిత నియమం లో రెండు ఉప నియమాలు ఉంటాయి. “విజయానికి మించి ఏది విజయాన్ని ఇవ్వదు.” (Nothing succeeds like success) అనే సామెత తో ఫలిత నియమము పోల్చవచ్చు.

ఉదాహరణకు :- లాటరీ కొన్న వ్యక్తికి లాటరీ తగిలితే ప్రతినెల లాటరీ కొనటం

a). సంతృప్తికర నియమం:- అభ్యాసకుడు అభ్యసించి నప్పుడు సంతృప్తికర అనుభవాలు ఉద్దీపన,ప్రతిస్పందన మధ్య బంధాన్ని పెంచుతాయి.

b).  అసంతృప్తికర నియమం:-అభ్యాసకుడు అభ్యసించే టప్పుడు అసంతృప్తికర అనుభవాలు, ఉద్దీపన చేసే ప్రతిస్పందనల మధ్య బంధాన్ని తగ్గిస్తాయి.

ఫలిత నియమం యొక్క విద్య ప్రాముఖ్యత:-

a). ఫలితం నియమం ప్రకారం తరగతిగదిలో ఏర్పరిచే అనుభవాలు సంతృప్తికరంగా ఉండాలి.

b). విద్యార్థులు అభ్యసించడానికి తగిన ప్రేరణ ఉండాలి ప్రేరణ లేనిదే సక్రమమైన అభ్యసనం జరగదు.

c). విద్యార్థుల అవసరాలకు తగినట్లు బోధనాంశాలు సవరించాలి. తాము నేర్చుకునే విషయాలు జీవితంలో తమకు ఉపయోగపడతాయని విద్యార్థులు తెలుసుకున్నప్పుడు అభ్యసనం సక్రమంగా జరుగుతుంది

d) .విద్యార్థులుకు విజయం తో కూడిన కార్యక్రమాలు ఏర్పాటు చేసినప్పుడు అభ్యసనం సక్రమంగా జరుగుతుంది.

e) . విద్యార్థులు సక్రమమైన అభ్యసనం చేసినప్పుడు బహుమతులు ప్రశంసలు ఏర్పాటు చేయాలి.

f). విద్యార్థులకు ఇచ్చే నియోజనాలు ( Assignments) వారు సాధించగలిగే లాగా ఉండాలి.

 

Also read : శాస్త్రీయ నిబంధన సిద్ధాంతం

అభ్యసనం 

స్మృతి – విస్మృతి

అభ్యసన రంగాలు

అభ్యసన బదలాయింపు

ప్రేరణ

సాంఘిక-సాంసృతిక సిద్దాంతము

పరిశీలన అభ్యసన సిద్దాంతము 

అంతర్ దృష్టి అభ్యసనం 

కార్యసాధక నిబందనం

Results

-
Please Share it


Please Share it
Please Share it


Please Share it

#1. ‌ప్రభావవంతమైన శిక్షణ, ఇతర సదుపాయాలు కల్పించినప్పటికి పరిపక్వత లేని కారణంగా మురళి అను విద్యార్థిలో అభ్యసన జరుగలేదు. దీనిని వివరించు అభ్యసన సూత్రము ?

#2. మనోహర్ ‌తన పాఠశాలలో ఆహ్లాదకరమైన అనుభవాలు లేనందున పాఠశాల వదలి వెళ్ళినాడు. ఇది ఈ క్రింది నియమానికి చెందును?

#3. ఈ అభ్యసన సూత్రం ప్రకారము ఒక ప్రవర్తనకు సంతృప్తి పొందటము వలన కలిగిన అనుభూతి వలన ప్రవర్తనా క్రమాన్ని మళ్ళీ ప్రదర్శించుటకు పెంపొందించును?

#4. సంధాన సిద్ధాంతము (Bondtheory) అని దీనికి పేరు ?

#5. ‘‘విజయానికి మించిన సంతృప్తి మరేదీలేదు’’ (Nothing succeed like success) అనునది దీనిని సమర్ధించును.?

#6. అమీబాలో జరుగు ప్రత్యుత్పత్తి పాఠాన్ని బోధించిన తర్వాత జీవశాస్త్ర ఉపాధ్యాయుడైన బుజ్జి విద్యార్ధులకు ఆ విషయాన్ని ఫ్లోచార్ట్ ‌రూపంలోనూ, నమూనా రూపంలోనూ, కార్టూన్‌ ‌రూపంలోనూ వ్రాయమని సూచించాడు. అయిన ఆ ఉపాధ్యాయుడు థారన్‌డైక్‌ ఈ ‌నియమానికి ప్రాధాన్యత నిచ్చాడు.?

#7. విద్యార్ధులలోని వైయుక్తిక బేధాలను గుర్తించి వారి అంతర్గత శక్తులు, సహజ సామర్ధ్యాలు, అభిరుచులకు అనుగుణంగా బోధనాభ్యసన కృత్యాలు ఏర్పరచాలి అను దానిని సమర్ధించు థారన్‌డైక్‌ ‌నియమము ?

#8. టైప్‌ ‌రైటింగ్‌ ‌నైపుణ్యాలు నేర్చుకోవటము ఈ అభ్యసనంనకు ఉదాహరణ ?

#9. బొమ్మలు గీయుటలో తోడ్పడు అభ్యసన సిద్ధాంతము ?

#10. 8వ తరగతి చదువుచున్న లావణ్య మూలకాలు వాటి సంకేతాలు వల్లెవేస్తూ నేర్చుకోవటమే థారన్‌డైక్‌ ఈ ‌నియమమును సూచిస్తాయి.?

#11. చలన కౌశలాలు నేర్చుకొనుటకు అనువైన సిద్ధాంతము ?

#12. ఒక ఉపాధ్యాయుడు విద్యార్ధి యొక్క వయసుకు మించిన విషయాలను బోధిస్తున్నాడు అయిన అతను థారన్‌డైక్‌ ‌యొక్క ఈ నియమమును పరిగణలోనికి తీసుకోలేదు.?

#13. పాఠశాలలో తరగతిగదిలో అనుభవాలు, ఉపాధ్యాయుని బోధన ఆకర్షణీయంగా సంతృప్తికరంగా ఉన్నందున పిల్లవాడు పాఠశాలకు వెళ్ళటాన్ని కొనసాగించటము థారన్‌డైక్‌ ‌ప్రకారము ఈ నియమమును సూచించును?

#14. రాష్ట్రస్థాయి క్రికెట్‌ ‌జట్టుకు ఎంపిక కాబడిన సాయికి బాగా ఉపయోగపడిన అభ్యసన సిద్ధాంతము?

#15. ఎంపిక ప్రతిస్పందన సిద్ధాంతముగా పిలువబడే యత్నదోష సిద్ధాంతములో ఎంపిక చేసుకోవలసిన అంశము?

#16. శిశుకేంద్రీకృత విద్యకు ప్రాధాన్యతనిస్తున్న ఉపాధ్యాయుడు థారన్‌డైక్‌ ఈ ‌నియమానికి ప్రాధాన్యతనిచ్చినట్లుగా చెప్పవచ్చును.?

#17. ‘గుర్రాన్ని నీటి వరకు తీసుకువెళ్ళగలరు కాని దానిచే నీటిని త్రాగించలేము’ అను నానుడి ఈ థారన్‌డైక్‌ ‌నియమమును సమర్థిస్తుంది.?

#18. పాఠశాల స్థాయి పాటల పోటీలో ప్రథమ స్థానం పొందిన సిరి జిల్లా స్థాయి పాటల పోటీలో పాల్గొనటమును సమర్థించు నియమము?

#19. 6వ తరగతి చదువుచున్న రమేష్‌ 6 ‌సమస్యలు సాధించ లేకపోయేసరికి 7వ సమస్య సాధించగలిగేదైనా సరే ప్రయత్నించక పోవటము దీనిని సమర్థించు నియమము?

#20. హెర్బార్ట్ ‌పాఠ్య ప్రణాళిక సోపానాలలోని మొదటి సోపానము ఈ నియమమును సమర్ధిస్తుంది.?

Finish

Please Share it

2 thoughts on “Psychology Online Classes in Telugu – యత్నదోష అభ్యసన సిద్దాంతం ”

  1. Sir miru psychology gurinchi chala baga explain chestunaru kani telugu words dagara english words kuda unte gurthundadanki bagundedi examples kuda ivandi each and every one danki

    Reply

Leave a Comment

error: Content is protected !!