quiz tet psychology notes – వ్యక్తి అధ్యయన పద్ధతులు
1. అంతః పరిశీలన లేదా అంతః పరీక్ష పద్ధతి:- ( Introspection Method ) :
ఈ పద్ధతిని తత్వశాస్త్రంలో భాగంగా ఎక్కువగా ఉపయోగించేవారు. మనోవిజ్ఞాన శాస్త్రం లో అత్యంత ప్రాచీనమైన వ్యక్తిని అధ్యయనం చేసే పద్ధతి. దీనికి మూలమైన వాదం సంచరనాత్మకవాదం. ఈ అంతః పరిశీలన పద్ధతిని సెయింట్ ఆగస్టీన్ ప్రతిపాదించాడు. మరియు ఈ పద్ధతిని విల్ హెల్మ్ ఉంట్ విరివిరిగా ఉపయోగించారు.
వ్యక్తి చేతన అనుభవాలు తెలుసుకోవడానికి, అంతః పరిశీలన పద్ధతిని ఎక్కువగా ఉపయోగిస్తారు. అయితే ఈ పద్ధతిలో విశేషం ఏమంటే పరిశీలించే వ్యక్తి, పరిశీలించ బడే వ్యక్తి ఇద్దరూ ఒక్కరే. ఒక వ్యక్తి తన మానసిక శారీరక అనుభవాలను అనుభూతులను స్వీయ పరిశీలన చేసుకొని బయటకు వ్యక్తం చేయడాన్ని అంతః పరిశీలన అంటారు.
ప్రయోజనాలు:-అంతః పరీక్షణ పద్ధతి ఎక్కడైనా , ఎప్పుడైనా ఉపయోగించవచ్చు. ఖర్చుతో కూడుకున్న పద్ధతి కాదు.ఒక వ్యక్తి తన లోపాలను తెలుసుకొని మూర్తిమత్వాన్ని అభివృద్ధి చేసుకోవచ్చు. ఐతే ఇది కాల యాపనతో కూడుకున్నది కాదు.విద్యార్థులకు పాఠ్యాంశాలు అర్థం అయినది లేనిది తెలుసుకోవచ్చు.
పరిమితులు:వ్యక్తి నిష్టతతో కూడుకున్నది. దీనిని చిన్న పిల్లలకు ఉపయోగించలేము.
ఉదా : 4 నెలల పాపను అధ్యయనం చేయలేం. జంతువుల ప్రవర్తనాంశాలను తెలుసుకోలేం. అపసవ్యమైన ప్రవర్తన కలవారిని, పిచ్చి వారి ప్రవర్తనను తెలుసుకోలేము.
అంతః పరిశీలన పద్ధతిలో పరిశీలించబడే వ్యక్తి, పరిశీలించే వ్యక్తి ఒకరే కావడం వలన వ్యక్తి తన మనస్సును పరీక్షించలేడు.
ఈ పద్ధతి ద్వారా అచేతన మనసును అధ్యయనం చేయలేము. తమ అనుభవాలను వివరించడం కొంతమందికి సాధ్యం కాకుండా పోవచ్చు.
2.పరిశీలన పద్ధతి:- ( Observation Method ):-
ప్రవర్తనను ఉన్నదిఉన్నట్టుగా గ్రహించడమే పరిశీలన అని చెప్పవచ్చు.పరిశీలనలో ఒక వ్యక్తి ఏదో ఒక స్పందిస్తున్నప్పుడు అతడు వ్యక్తం చేసే బాహ్య ప్రవర్తనను ప్రవర్తినాంశాలను పరిశీలిస్తారు. ఇక్కడ పరిశీలించడం అంటే మాములుగా చూడటం కాదు. ముందే నిర్ణయించుకున్న పరిశీలనా అంశాలను నిశితంగా, స్పష్టంగా చూడటము.
పరిశీలనలు 4 రకాలు:-
1. సహజ పరిశీలన:-(అనియంత్రిత పరిశీలన) :
పరిశీలనాంశాలు సహజపరిస్థితులలో పరిశీలించడాన్ని ‘సహజ పరిశీలన’ అంటారు.
ఉదాహరణకు :-
a).విద్యార్థులు ఆటలాడేటప్పుడు వారి ప్రవర్తన వారు సహజంగా ఆటస్థలంలో ఆడుకొనేటప్పుడు పరిశీలించడాన్ని సహజ పరిశీలన’ అంటారు.
b). కోహ్లేర్ చింపాంజీలను అడవులలో పరిశీలించడం.
2. కుత్రిమ పరిశీలన (నియంత్రిత పరిశీలన) :
కృత్రిమంగా పరిశీలనా సన్నివేశాలు కల్పించి, ఆయా సన్నివేశాలలో ప్రవర్తనను గమనించడం జరుగుతుంది. దీనిని నియంత్రిత పరిశీలన అంటారు.
ఉదాహరణకు:-
a).చేపను అక్వేరియంలో పరిశీలించడం.
b). సర్కస్లో జంతువులను పరిశీలించడం.
c) ఉపాధ్యాయుడు విద్యార్థులను ప్రయోగశాలలో పరిశీలించడం.
d). కోహ్లేర్, సుల్తాన్ అనే చింపాంజీని బోనులో పరిశీలించడం.
3. సంచరిత పరిశీలన :
ఈ రకమైన పరిశీలనలో పరిశీలకుడు పరిశీలనా సన్నివేశంలో తాను కూడా పాల్గొని ముందుగా నిర్ణయించుకొన్న పరిశీలనాంశాలను సన్నద్ధతతో నిశితంగా చూడటాన్ని సంచరిత పరిశీలన అంటారు.
ఉదాహరణకు :ఒక ఉపాధ్యాయుడు విద్యార్థులు ఆటలాడేటప్పుడు వారితో కలిసి ఆటలాడుతూ ఉద్వేగ లక్షణాంశాలను పరిశీలించడం.
4. అసంచరిత పరిశీలన :
ఈ పరిశీలనలో పరిశీలకుడు పరిశీలనా సన్నివేశంలో ప్రత్యక్షంగా పాల్గొనకుండా దూరంగా ఉండి తాను ముందుగా నిర్ణయించుకున్న పరిశీలనాంశాలను వారికి తెలియకుండా పరిశీలించడాన్ని అసంచరిత పరిశీలన అంటారు. ముఖ్యంగా పసిపిల్లల, జంతువుల, పక్షుల ప్రవర్తనాంశాలను అధ్యయనం చేయాలనుకున్నప్పుడు ఈ పద్ధతి బాగా ఉపయోగపడుతుంది.
గెసెల్ అనే మనోవిజ్ఞానశాస్త్రజ్ఞుడు బాలల వివిధ వికాసాలను అధ్యయనం చేయడానికి అబ్జర్వేషన్ డోమ్ అమర్చాడు. ఈ డోమ్ కు చుట్టూ వన్-వే-విజన్-స్క్రీన్ ఉంటుంది.
ఉదాహరణకు: విద్యార్థులు ఆటస్థలంలో ఆడేటప్పుడు, ఉపాధ్యాయుడు దూరంనుంచి పరిశీలించడం.
లోపాలు :
a). పరిశీలనాంశాలలో కచ్చితంగా వస్తు నిష్ఠత లేకపోవచ్చు.
b). నియంత్రిత పరిస్థితులవల్ల సహజత్వం కోల్పోయే అవకాశం ఉంది.
c). పరిశీలకునికి తగిన శిక్షణ లేకుంటే పరిశీలనాంశాలు కొన్ని తప్పిపోవచ్చు. అన్ని విషయాలను గమనించడం కష్టమవుతుంది.
d). ప్రమాదాలు మొదలైన వాటి విషయంలో నియంత్రిక సన్నివేశాలు కల్పించి ఫలితాలను పరిశీలించడం సాధ్యపడదు.
ఉపయోగాలు :
a). పరిశీలకుడు పరిశీలనాంశాలను నేరుగా తెలుసుకోవడానికి వీలుంది.
b). జరిగిన విషయాలను సులభంగా అవగాహన చేసుకోవచ్చు. చేయవచ్చు.
c). నియంత్రిత పరిశీలనవల్ల అరుదైన పరిస్థితులను కల్పించి కాలయాపన లేకుండా పరిశీలనాంశాలను అధ్యయనం చేయవచ్చు.
d). పరిశీలనా పద్ధతిని ఉపయోగించి చిన్న పిల్లల, అసాధారణ వ్యక్తుల, జంతువుల ప్రవర్తనను అధ్యయనం చేయవచ్చు.
3.ప్రయోగ పద్ధతి:-ప్రవర్తనను అధ్యయనం చేయడంలో ప్రయోగ పద్ధతిని అత్యంత వస్తు నిష్ఠత కలిగిన శాస్త్రీయ పద్ధతిగా చెప్పవచ్చు. ఎవరి ప్రవర్తనా లక్షణాలను అధ్యయనం చేయదలిచామో వారిని లేదా వాటిని శాస్త్రీయంగా పరీక్షించడానికి చేసే ప్రయత్నమే ప్రయోగం అనీ చెప్పవచ్చు. లేదా ఏదైనా ఒక దృగ్విషయాన్ని నియంత్రిత పరిస్థితులలో అధ్యయనం చేయడాన్ని ప్రయోగ పద్ధతి అని చెప్పవచ్చు. దీని ద్వారా కార్యకారక సంబంధాలు గుర్తించవచ్చు.
1).ప్రయోక్త: ప్రయోగం నిర్వహించే వ్యక్తి
2).ప్రయోజ్యుడు:-ప్రయోగంలో పాల్గొనే వ్యక్తి.
3).ఉద్దీపన :–వ్యక్తి ప్రవర్తన అంశాలను ప్రభావితం చేయు కారకాలు.
4).ప్రతిస్పందన:-ఉద్దీపనలకు జీవి వ్యక్తంచేసే ప్రతి క్రియలే ప్రతిస్పందన.
5).చరాలు: చరములు అంటే మార్చడానికి వీలుగా ఉన్నది లేదా తనంతటతానే మారేది అని అర్థం.
సాధారణంగా ప్రయోగంలో రెండు చరాలుంటాయి. కాని కొన్ని సందర్భాలలో మూడోచరం కూడా తటస్థపడుతుంది.
a). స్వతంత్ర చరం
b). పరతంత్ర చరం
c). మధ్యస్థ చరం లేదా జోక్యం చేసుకునే చరాలు
a). స్వతంత్ర చరం :-(ఉద్దీపన చరాలు):-ఒక ప్రయోగం చేసేటప్పుడు ప్రయోక్త ఉద్దీపనలను తాను పరీక్షించదలుచుకున్న పద్ధతిలో మలచుకోవడాన్ని స్వతంత్రచరం అంటారు. స్వతంత్ర చరాలు ఎప్పుడూ ప్రయోక్త ఆధీనంలో ఉంటాయి,ఉద్దీపనలను స్వతంత్ర చరాలు అనవచ్చు.
b). పరతంత్ర చరం :(ప్రతిస్పందన చరాలు):-పరిశోధకుని అదుపులో ఉన్న చరాన్ని స్వతంత్రచరమనీ దాని ప్రభావానికి లోనయ్యే చరాన్ని పరతంత్ర చరమ అంటారు. స్వతంత్ర చరాలకు ప్రయోజ్యుని ప్రతిస్పందనే పరతంత్ర చరం.
ఉదా:-పావలవ్ ప్రయోగంలో ఆహారం స్వతంత్ర చరం, లాలాజలం పరతంత్ర చరం.
c).మధ్యస్థ చరం 🙁 జోక్యం చేసుకునే చరాలు) :ఉద్దీపనకు, ప్రతిస్పందనకు మధ్యలో వచ్చి ప్రయోజ్యుని పరతంత్ర చరంపై ప్రభావాన్ని చూపే విషయాన్నిగాని పరిస్థితినిగాని మధ్యస్థచరం అంటారు. ఇది ప్రయోక్త అధీనంలో ఉండదు.
ఉదా : ప్రయోజ్యునిలోని అలసట, మానసిక సమస్యలు మొదలైనవి.
సమూహాలు : ఇవి 2 రకాలు
a) నియంత్రిత సమూహం : ఏ విధమైన ప్రయోగాత్మక పరిస్థితుల ప్రభావానికి గురికాని పరిస్థితిని నియంత్రిత స్థితి అంటారు. నియంత్రిత స్థితికి లోనయ్యే సమూహాన్ని నియంత్రిత సమూహం అంటారు.
b). ప్రయోగాత్మక సమూహం : ప్రయోగస్థితికి లోనయ్యే సమూహాన్ని ప్రయోగ సమూహమంటారు.
లోపాలు :
1.సామాన్యంగా ప్రయోగాలను జంతువులమీద చేసి వాటి ఫలితాలను మానవ ప్రవర్తనకు అన్వయిస్తారు. ఇది సరైన పద్ధతి కాదు.
2.ఒక్కొక్కసారి ప్రయోగాత్మక పద్ధతిలో కృత్రిమ వాతావరణం నెలకొంటుంది.
3.కొన్ని రకాల ప్రవర్తనలను మనం ప్రయోగశాలలో ప్రవేశపెట్టి పరిశీలించలేం.
ఉదా: సమ్మెలు, యుద్ధాలు, విప్లవాలు మొదలైనవి. జోక్యం చేసుకొనే చరాలను అదుపుచేయడం కష్టతరమైన విషయం.
ఉపయోగాలు :
1.కార్యకారక సంబంధాన్ని ఏర్పరచవచ్చు.
2.ఫలితాలను కచ్చితంగా విశ్లేషించి నమోదు చేయవచ్చు.
3.ఈ పద్ధతిలో విశ్వనీయత, సప్రమాణతలు ఎక్కువ.
4.ఫలితాలను కచ్చితంగా విశ్లేషించి నమోదు చేయవచ్చు
5.ప్రయోగాత్మక పద్ధతి శాస్త్రబద్ధమైనది. వస్తు నిష్ఠత కలిగింది.
6.క్రమబద్ధంగా కొన్ని కారకాలను నియంత్రణ చేయడం జరుగుతుంది.
4 వ్యక్తి అధ్యయన పద్ధతి:-దీనిని క్లినికల్ పద్ధతి , కేస్ స్టడీ పద్ధతి అని కూడా అంటారు. కేసు స్టడీ వైద్య శాస్త్రం నుంచి గ్రహించబడింది. కేస్ స్టడీని మానసిక ఆరోగ్య కేంద్రాలలో శిశు మార్గదర్శక కేంద్రాలలో సైకాలజిస్టులు, సైక్రియాటిస్టులు ఎక్కువగా ఉపయోగిస్తున్నారు.
ఒక వ్యక్తి గురించి సమగ్ర పరిశీలన చేసి అధ్యయనం చేస్తే వ్యక్తి అధ్యయన పద్ధతి అంటారు.ఒక రోగి డాక్టరు కేస్ కావచ్చు, ఒక నేరస్థుడు పోలీస్ అధికారికి కేస్ కావచ్చు.ఒక క్లైంట్ లాయర్ కి కేస్ కావచ్చు.పాఠశాల వాతావరణంలో సమస్యాత్మక విద్యార్థి ఉపాధ్యాయునికి కేస్ కావచ్చు.
సమస్యాత్మక విద్యార్థికి సంబంధించిన సమగ్ర అధ్యయనాన్ని వ్యక్తి అధ్యయన పద్ధతి అంటారు.
సమస్యాత్మక విద్యార్థికి ఉదాహరణ :
1. విద్యా సమస్యలు:
పాఠశాలకు హాజరు కాకపోవడం పాఠశాలకు రోజు ఆలస్యంగా రావడం.
వెనుకబడిన విద్యార్థులు,తక్కువ సాధన గల విద్యార్థులు.
అభ్యసన వైకల్యత గలవారు.బుద్ధిమాంద్యులు.
ప్రతిభావంతులు.బదిరులు (Deaf and Dum)
నిర్దిష్ట పాఠ్యాంశాల అధ్యయన లోపం కలవారు.ఉదా: గణితంలో వెనుకబడుట.
2. ఉద్వేగ సమస్యలు:-a. దౌర్జన్యం. b. సిగ్గుపడడం.c. హటము వేయడం d.వ్యాకులత
3. సాంఘిక సమస్యలు :a బాల కార్మికులు b అనాథలు.c. ఏకాకులు. d. అబద్దాలు చెప్పేవారు.e. దొంగతనం చేసేవారు.
వ్యక్తి అధ్యయన పద్ధతిలోని దశలు –
1. సమస్య నిర్ధారణ దశ.
2. సమస్య నివారణ దశ:-
వ్యక్తి అధ్యయన పద్ధతిలో ఉపాధ్యాయుడు సమస్యాత్మక విద్యార్థికి సంబంధించిన విషయాలను, సమస్యలను తల్లిదండ్రులు ఉపాధ్యాయులు సమ వయస్సుబృందం ద్వారా సేకరించి, విశ్లేషించి సమస్యను నివారిస్తారు.
వ్యక్తి అధ్యయన పద్ధతి ప్రయోజనములు :
1. సమస్యాత్మక విద్యార్థిని గుర్తించవచ్చు.
2. విద్యార్థుల సమస్యలను పరిష్కరించవచ్చు.
3. వ్యక్తి స్వభావాలను, మూర్తిమత్వ లక్షణాలను సమగ్రంగా అవగాహన చేసుకోవచ్చు.
పరిమితులు:-
1. వ్యక్తి నిష్టతతో కూడుకున్నది.
2.కాలయాపనతో కూడుకున్నది.
3.ప్రవర్తనా సమస్యగల శిశువులను గుర్తించడం కష్టం.
Results
#1. ఇంటర్వ్యూ పద్ధతి ద్వారా సేకరించిన సమాచారము సరియైనది కాదని అనుకున్నప్పుడు ఉపాధ్యాయుడు ఈ క్రింది పద్దతిని ఉపయోగించవచ్చును. ?
#2. బడిలో ఒక అమ్మాయి గురించి ఒక ఉపాద్యాయుడితో కొందరు విద్యార్థులు దురుద్దేశం తో చెడుగా చెప్పినప్పుడు ఆ ఉపాద్యాయుడు ఆ ఆమ్మాయిని నేను చిన్నప్పడి నుండి చూస్తున్నాను ఆమె అలాంటి అమ్మాయి కాదు అని అతడు చెప్తే అతడు సర్వే పద్దతిలో బాగంగా ఏ పద్దతిని ఉపయోగించి చెప్పినట్లు?
#3. పోలీసులు సివిల్ దుస్తులలో ఉండి అసాంఘిక కార్యక్రమాలను అరికట్టుటకు ప్రజల మధ్యలో తెలియకుండా సంచరించడం?
#4. పావలోవ్ ప్రయోగంలో ఆహారం స్వతంత్ర చరం కాగా మరి లాలాజలం ?
#5. పులి ని జూ పార్క్ లో,సర్కస్ లో కాకుండా ఒక్కొకసారి వాటిని ఆడవులలో లేదా జనావాసాల మద్యలోకి వచిన్నప్పుడు పరిశీలించడం?
#6. సమూహాల పై ప్రయోగం నిర్వహిస్తున్నప్పుడు సమూహంలో ఏదయినా అంశం ఫలితాలను తారుమారు చేస్తుంది అని ముందుగానే పసిగట్టినప్పుడు తేడాగా ఉన్నవారిని తీసివేసి తర్వాతనే ప్రయోగం నిర్వహిస్తే ఇది ఏ పద్ధతి?
#7. ఒక ప్రత్యేక వికాస దశ వద్ద వేర్వేరు వ్యక్తులపై భేదాన్ని పరిశీలించడం ఏ పద్ధతి?
#8. పసిపిల్లలు, జంతువులు, పక్షుల ప్రవర్తనను అధ్యయనం చేయడానికి శ్రేష్ఠమైన పద్ధతి?
#9. ఒక ప్రత్యేక వికాస దశ వద్ద వేర్వేరు వ్యక్తులపై భేదాన్ని పరిశీలించడం ఏ పద్ధతి ?
#10. 14 రోజులు హాస్పిటల్ లో చికిత్సలో బాగంగా ఉన్న కరోనా వ్యాధి బాధితుడు బయటికి వచ్చిన తర్వాత అతడు అనుబవించిన మానసిక సంగర్షణ ను ఇంట్లో వాళ్ళతో చెప్పడంలో అతడు ఉపయోగించిన పద్ధతి?
#11. ఈ పద్ధతి ద్వారా పాఠశాలలకు, గృహానికి వారధి నిర్మించి విద్యార్థుల సమస్యను అదుపులో ఉంచవచ్చు?
#12. మధ్యాహ్నం భోజనం యొక్క ప్రభావం విద్యార్థుల హాజరుపై తెలుసుకునే ప్రయోగంలో మధ్యాహ్న భోజనం?
#13. విద్యార్థుల జీవితంలో పాఠశాలలో ప్రత్యక్షంగా గమనించిన సన్నివేశాల సంపుటి ?
#14. విద్యార్థుల ప్రవర్తనా తీరు, మాట్లాడే తీరు, వస్త్రాధారణ సెల్ ఫోనులో ఉండే టిక్ టాక్ యాప్ ప్రభావంలో టిక్ టాక్ వీడియోలు ఏ చరం గా పిలుస్తారు?
#15. ఒక అమ్మాయికి కావాలని గాయాలు తగిలేటట్లు చేసి తన ఏడుపును ఉద్వేగాన్ని పరిశీలిస్తే ఇది ఏ పరిశీలన??
#16. ఒక ప్రయోగం చేసేటప్పుడు ప్రయోక్త ఉద్దీపనలనుగానీ, ఉద్దీపింపచేసే పరిస్థితులనుగాని తాను పరీక్షించదలచుకున్న పద్ధతిలో మలచుకునే చరం?
#17. ప్రయోగంలో హఠాత్తుగా వచ్చే అలసట ఒక ?
#18. అబ్జర్వేషన్ డోమ్ ను కనుగొన్నదెవరు ?
#19. In this method, to understand the child, teacher observes child in natural settings, records its behaviour and maintains it. ఈ పద్దతిలో ఉపాద్యాయుడు శిశువును సహజ సందర్భాలలో పరిశీలించి, ప్రవర్తనను రికార్డు చేసి, నిర్వహిస్తాడు?
#20. Observing of students in a specific controlled situation to study their helping and cooperative nature is.. విద్యార్థులలో సహాయ, సహాకార ప్రవృత్తులను అధ్యయనం చేయుటకై ఒక నిర్ధిష్ట, నియంత్రిత సన్నివేశంలో గమనించుట?
#21. Among the following methods, the method that have high ‘subjectivity’. కింది అధ్యయన పద్దతులలో ‘వ్యక్తి నిష్టత’ అధికంగా గల పద్దతి?
#22. A psychologist studies the impact of parental literacy on the achievement of students in language skills. Here parental literacy is a… మనో విజ్ఞాన శాస్త్రవేత్త విద్యార్థుల బాషానైపుణ్యాల సాధనపై తల్లిదండ్రుల అక్షరాస్యత యొక్క ప్రభావమును అధ్యయనం చేశాడు. ఇందులో తల్లిదండ్రుల అక్షరాస్యత అనేది.?
#23. To study the developmental patterns of the primary school children, a psyhologist has children the students of Classes I to V ….a mandal and conducted the study in a year. The Research method adopted by the psychologist is….. ప్రాథమిక పాఠశాలలోని పిల్లలు వికాసరీతులను అధ్యయనం వేయడానికి మనో విజ్ఞానవేత ఒక మండలంలోని 1 నుండి 5 తరగతుల పిల్లలను ఎంచుకున్నాము, మనో విజ్ఞానవేత్త ఎంచుకొన్నది ఈ పరిశోధనా పద్దతి?
#24. A teacher studied the influence of glucose on the activeness of students. Here the activeness of students is ఒక ఉపాధ్యాయుడు విధ్యార్థుల చురుకుదనంపై గ్లూకోజ్ ప్రభావాన్ని అధ్యయనం చేశారు. ఇక్కడ విధ్యార్థుల చురుకుదనం అనేది?
#25. Experimental design in which a single group acts as both an experimental group and control group ఒకే సమూహం ప్రయోగ, సమూహంగా, నియంత్రిత సమూహంగా వ్యవహరించే ప్రయోగ నమూనా?
#26. While dividing the subjects for groups, experimenter choosed two persons of same level of intelligence and allotted one person to the control group and another to the experimental group – This type of selection is called ప్రయోక్త ప్రయోజ్యులను సమూహాలకు ఎంపిక చేసేటపుడు ఓకేస్థాయి ప్రజ్ఞ కలిగిన ఇద్దరు వ్యక్తలను తీసుకుని ఒకరిని నియంత్రిత సమూహానికి మరొకరిని ప్రయోగ సమూహానికి కేటాయించే పద్దతి?
#27. A teacher wants to find out the relation between the time spent by the children to study and the marks they secured. But due to differences in concentration of the children he is not able to get correct result – Here concentration of children is. ఒక ఉపాధ్యాయుడు పిల్లలు చదివే సమయానికి మరియు వారు పొందే మార్కులకు మధ్యగాల సంబంధాన్ని కనుక్కోవాలనుకొంటున్నాడు, కానీ, పిల్లలు ఏకాగ్రతలో తేడాల వల్ల సరైన ఫలితాన్ని సాధించలేకపోయాడు – ఇక్కడ పిల్లల ఏకాగ్రత అనేది?
#28. The method in which information is obtained from the same person selected for study is, ఏ వ్యక్తిని అధ్యయనం చేయాలనుకుంటున్నామో వ్యక్తి నుంచే సమాచారం సేకరించే పద్దతి?
#29. A classroom teacher would like to know the opinion of class X students on certain issues. the appropriate method to know the opinion is…. ఒక తరగతి గది ఉపాద్యాయుడు కొన్ని నిశ్చితాంశాలపై పదవ తరగతి విద్యార్థుల అభిప్రాయాలను తెలుసుకోవాలనుకుంటాడు. ఇందుకోసం ఉపయోగించిన సరయిన పద్దతి?
#30. Teacher can understand whether the students are understanding the lesson or not by ఉపాద్యాయుడు విద్యార్థులు పాఠాన్ని అర్థం చేసుకున్నారా లేదా అన్న విషయాన్ని దీని ద్వారా గ్రహిస్తాడు?
#31. A school teacher planned to study the development of children over a period of 5 years from class I to V. the appropriate method for conducting this study is…….. ఒక పాఠశాల ఉపాద్యాయుడు పిల్లల వికాసంను 5 సంవత్సరాలపాటు 1వ తరగతి నుండి 5వ తరగతి వరకు అధ్యయనము చేయుటకు ప్రణాళికను రూపొందించుకోనెను. ఈ అధ్యయనానికి తగిన అధ్యయన పద్దతి?
#32. In experimental method ‘controlled group’ means…….. ఒక తరగతి ఉపాద్యాయురాలు ‘’పిల్లల అభ్యసన అలవాట్లు – వారి సాధనపై చూపే ప్రభావము’’ అధ్యయనం చేయుటకు ఆసక్తి కనబరిచినారు. ఈ అధ్యయనములో ‘’పిల్లల సాధన’’?
#33. The following is more objective in nature క్రింది వాటిలో లక్ష్యాత్మక స్వభావం ఎక్కువగా గలది?
#34. In an experiment the variable that plays the role of ‘effect’ is ప్రయోగంలో ‘ఫలితం’ పాత్రను పోషించే చరం?
#35. Objectivity is more in this method వస్తునిష్టత అధికంగా ఉండే పద్దతి ?
#36. In the experiment ‘The influence of memory on student’s achievement’ the dependent variable is ‘విధ్యార్థుల సాధనపై స్మృతి ప్రభావం’ అనే ప్రయోగంలో పరతంత్ర చరం?
#37. In an experiment this variable plays the role of ‘cause’ ఒక ప్రయోగంలో ‘కారణం’ పాత్రను పోషించే చరం?
#38. The appropriate method to study the behaviour of animals and mental patients. జంతువుల, మానసిక రోగుల ప్రవర్తనను అధ్యయనం చేయడానికి అనువైన పద్దతి?
#39. The method through which a person reports his experiences, internal feelings and thoughts after analysis is. వ్యక్తి తన అనుభవాలను, అంతర్గత భావాలను, ఆలోచనలను విశ్లేషించుకొని నివేదించే పద్దతి?
#40. The method that has high objectivity is కింది పద్దతులలో వస్తునిష్టత అధికంగా ఉండేది?
#41. తన విధ్యార్థుల ప్రవర్తనను పరిశీలించాలనుకున్న ఉపాద్యాయుడు, విధ్యార్థులు ఆడుతున్న ఒక ఆటగాడుగా పాల్గొన్నాడు. ఈ పరిశీలనా రకం?
#42. ‘సమస్యాపూరిత విద్యార్థికి సంబంధించి సమగ్ర విచారణ జరిపి, ఆ వ్యక్తి యొక్క సమస్యను నివారించేందుకు ఉపయోగపడు పద్ధతిని వ్యక్తి చరిత్ర పద్ధతి అంటారు’ అని నిర్వచించిన వారిని ఈ క్రింది వారిలో గుర్తించండి.?
#43. ‘‘పరిశీలన అంటే ఒక సమయం లో జరిగేటటువంటి సంఘటనలను ఒక క్రమ పద్ధతిలో అధ్యయనం చేయడం అని నిర్వచించిన వారిని ఈ క్రింది వారిలో గుర్తించండి.?
#44. ఈ క్రింది వానిలో అత్యంత వ్యక్తి నిష్టత కల్గిన పద్ధతి?
#45. ఈ క్రింది వానిలో విలియం ఊంట్ తన ప్రయోగశాలలో ఉపయోగించిన అధ్యయనపద్ధతి ఏది?
#46. పిల్లలలో కనిపించే ప్రవర్తనా సమస్యలను అధ్యయనం చేయడానికి ఉపయోగించే పద్ధతి ?
#47. ఇతరులతో చెప్పుకోలేని మానసిక పక్రియలను అధ్యయనం చేయడానికి ఉపయోగించే వికాస అధ్యయన పద్ధతిని ఈ క్రింది వానిలో గుర్తించండి ?
#48. ఒక వ్యక్తి తన లోటుపాట్లను సవరించుకొని, తన మూర్తిమత్వాన్ని అభివృద్ధిపరచుకోవడానికి ఉపయోగపడు వికాస అధ్యయన పద్ధతిని ఈ క్రింది వానిలో గుర్తించండి. ?
#49. విద్యార్థి పాఠ్యాంశాలలో సాధన గురించిన సమాచారమును తెలుసుకొని, ఒక పిల్లవాడిని గురించి అధ్యయనం చేయడానికి ఉపయోగపడు వికాస అధ్యయనపద్ధతి ?
#50. సమవయస్కులైన పిల్లవాడి స్నేహితుల నుండి, స్నేహితుల గురించిన సమాచారమును తెలుసుకొని, ఒక పిల్లవాడిని గురించి అధ్యయనం చేయడానికి ఉపయోగపడు వికాస అధ్యయనపద్ధతి ?
#51. రోగిని డాక్టర్ పరిశీలించడానికి ఉపయోగించదగిన వికాస అధ్యయన పద్దతిని ఈ క్రింది వానిలో గుర్తించండి. ?
#52. రసాయన శాస్త్రజ్ఞుడు ప్రయోగశాలలో ప్రతిచర్యలను గమనించడానికి ఉపయోగించదగిన వికాస అధ్యయన పద్దతిని ఈ క్రింది వానిలో గుర్తించండి. ?
#53. తల్లిదండ్రులు, కుటుంబసభ్యులు గురించిన సమాచారమును తెలుసుకొని, ఒక పిల్లవాడిని గురించి అధ్యయనం చేయడానికి ఉపయోగపడు వికాస అధ్యయనపద్ధతి ?
#54. పరిపృచ్చలో ……….. ? ఎ) ప్రశ్నలు అడిగే వ్యక్తిని పరిపృచ్చకుడు అంటారు బి) సమాధానాలు చెప్పే వ్యక్తిని పరిపృచ్చితుడు అంటారు
#55. ఒక తరగతి ఉపాధ్యాయుడు కొన్ని నిశ్చితాంశాలపై పదవ తరగతి విద్యార్థుల అభిప్రాయాలను తెలుసుకోవాలనుకుంటాడు. ఇందుకోసం ఉపయోగించవలసిన సరయిన పద్ధతి?
#56. ప్రజ్ఞావంతుల ప్రవర్తనను గమనించడానికి ఉపయోగించదగిన వికాస అధ్యయన పద్ధతిని ఈ క్రింది వానిలో గుర్తించండి. ?
#57. వసంత్ అనే విద్యార్థి దౌర్జన్య ప్రవర్తనను కనబరుస్తునాడు, దానిని నివారించడానికి ఉపాధ్యాయుడిగా నీవు అనుసరించే పద్ధతి ?
#58. వర్ణనాత్మక పరిశోధనలో పిల్లవాడి యొక్క మానసికవికాసం మరియు నైతికవికాసం గురించి పరిశీలించడానికి తోడ్పడు సాధనాలను ఈ క్రింది వానిలో గుర్తించండి.?ఎ) బాలల వ్యక్తిగత చరిత్ర బి) పరిపృచ్చ సి) పరిశీలనాపద్ధతి
#59. ఒక విద్యావేత్త సిసిఈ విధానం పట్ల సందర్భానుసారంగా ప్రశ్నలు వేస్తూ సిసిఈ పట్ల అభిప్రాయం సేకరించడంకు సరైన అధ్యయన పద్ధతిని గుర్తించండి.?
#60. ఒక విద్యార్థి ప్రతిరోజు పాఠశాలకు ఆలస్యంగా వస్తున్నాడు. దీనిని అరికట్టడానికి ఉపాధ్యాయుడు?
#61. ఉపాధ్యాయుడు పాఠాన్ని బోధించే క్రమంలో విద్యార్థి తనకు పాఠం ఎంత బాగా అర్థమైనదో తెలుసుకోవడానికి ఉపయోగపడు అధ్యయనపద్ధతి ?
#62. క్రింది వానిలో ప్రత్యేక అవసరాలు గల పిల్లలను అధ్యయనం చేయుటకు దోహదపడే పద్ధతి?
#63. వ్యక్తిగత పద్ధతి ద్వారా సేకరించిన సమాచారం సరైనది కాదని అనిపిస్తే ఉపయోగించదగిన వికాస అధ్యయన పద్ధతిని క్రింది వానిలో గుర్తించండి.?
#64. నాల్గవ తరగతి చదువుతున్న రమేష్ అనే విద్యార్థి చదువులో వెనుకబడుచున్నట్లయితే దానికి గల కారణాలను తెలుసుకోవడానికి ఉపయోగపడేది ?
#65. శరీరానికి దెబ్బలు తగిలితే శిశువు ఎలా ప్రవర్తిస్తాడు అనే విషయం తెలుసుకోవడానికి, అతడిని సైకిల్ మీద నుండి కిందపడేలా చేసి పరిశీలించడం అనేది ఏ రకమైన పరిశీలన అవుతుంది ?
#66. షిర్లే అధ్యయనం ఏ అధ్యయన పద్ధతికి ఉదాహరణగా చెప్పవచ్చు ?
#67. పరివేష ప్రభావం, ఔదార్యదోషం, కేంద్రీయ ప్రవృత్తి దోషం కనిపించే పద్ధతి ?
#68. ప్రయోక్త ఆధీనంలో ఉండే చరం ?
#69. స్వతంత్ర చరం యొక్క లక్షణం ను ఈ క్రింది వానిలో గుర్తించండి ?
#70. జోక్యచరం యొక్క లక్షణంను ఈ క్రింది వానిలో గుర్తించండి. ?
Also read : హోవార్డ్ గార్డినర్ బహుళ ప్రజ్ఞా సిద్ధాంతం