tet dsc psychology – Learning by observation

YouTube Subscribe
Please Share it

tet dsc psychology – పరిశీలన అభ్యసన సిద్దాంతము

ఆల్బర్ట్ బండోరా డిసెంబర్ 4 , 1925 లో కెనడా దేశంలో జన్మించారు. పరిశీలన ద్వారా కూడా అభ్యసించవచ్చు నని పరిశీలన అభ్యసనం ను ప్రతిపాదించారు.

నవ్యత గల అంశాలను నిశితంగా పరిశీలిస్తూ, అనుకరిస్తూ అభ్యసించడానికి మనం పరిశీలనా అభ్యసనం అని చెప్పవచ్చు.

దీనికిగల మారు పేర్లు:

సాంఘిక అభ్యసనం:– పరిశీలనా అభ్యసనం సాంఘిక పరిస్థితులలో జరుగుతుంది.

అనుకరణ అభ్యసనం:- పరిశీలనలో విద్యార్థులు ఎవరినైనా అనుకరించి అభ్యసిస్తారు. (ఈ అనుకరణ ఉన్నత స్థాయి వ్యక్తుల నుంచి నిమ్న స్థాయి వ్యక్తులకు దారితీస్తుంది).

నమూనా అభ్యసనం:- విద్యార్థులు ఎవరో ఒక గొప్ప వ్యక్తి ని ఆదర్శంగా తీసుకుని వారిని అనుసరించడం నమూనా అభ్యసనం అంటారు.

ఉదాహరణకు:-తల్లిదండ్రులు, సమవయస్కులు బృందం, క్రీడాకారులు, సంఘ సేవకులు, శాస్త్రవేత్తలు, స్వతంత్ర సమరయోధులు, ఉపాధ్యాయులు, సినిమా తారలు.

యత్న రహిత అభ్యసనం:- ఏదైనా ఒక విషయాన్ని విద్యార్థులు మొదటి ప్రయత్నంలోనే నేర్చుకుంటే దానిని యత్న రహిత అభ్యసనం అంటారు. పరిశీలనా అభ్యసనం అభ్యసన పద్ధతి మాత్రమే కాక బోధన పద్ధతి కూడా , ఎలాగంటే ఆ శిక్షకుడు ని అనుసరించి తొలి ప్రయత్నంలోనే క్రీడాకారుడు నిష్ణాతులు కావచ్చు కనుక దీనిని యత్న రహిత అభ్యసనం అంటారు. ఉదాహరణకు మొదటి ప్రయత్నం లోనే ఒక అమ్మాయి చెస్ క్రీడ నేర్చుకుని బహుమతి సాధించడం.

పరిశీలన అభ్యసనానికి ఆధ్యులుమిల్లార్డ్ , డిలార్డ్ (అమెరికా),

tet dsc psychology

వీరు రాసిన గ్రంథం (సాంఘిక అభ్యసన అనుకరణ) Social learning and Imitations వీరిచే ప్రభావితమయ్యారు  బండురా.

3.ఆల్బర్ట్ బండురా రచించిన రచనలు:-

1).Social learning and personality development.

2). Psychological modelling.

4.పరిశీలనా అభ్యసనం లో 4 సోపానాలు

1). అవధానం : అవధానం సక్రమంగా అర్థవంతంగా ఉంటే విషయాలను ఆర్జించే ప్రక్రియ సులభతరం అవుతుంది. కావున పరిశీలించిన విషయములును అనుకరించాలని అంటే ఆ ప్రవర్తన పై జ్ఞానేంద్రియములు తోపాటు మనసును కూడా లగ్నం చేసి పరిశీలించాలి.

2). ధారణ:-పరిశీలించిన ప్రవర్తనను సృమితి ఉంచుకుని జ్ఞప్తికి తెచ్చుకోవడమే ధారణ. అంటే పరిశీలనా అభ్యసనం మనకు ధారణ శక్తి కూడా ఉండాలి.

3).విష్పాదన / పునరుత్పాదన (Performance) : వ్యక్తి తాను నిశిత పరిశీలన ద్వారా నేర్చిన ప్రవర్తనాంశాలను స్మృతి ప నుండి జ్ఞప్తికి తెచ్చుకొని తాను నమూనా ప్రవర్తన లాగా ప్రదర్శన చూపుతాడు. పరిశీలించిన ప్రవర్తనను వెంటనే పునరుత్పాదక చేయడానికి వీలు లేనప్పుడు పునరుత్పాదకం చేయడానికి కావలసిన పరిపక్వత, శిక్షణ, అభ్యసనాన్ని సమకూర్చుకొని తరువాత ప్రదర్శిస్తారు.

4. పునర్బలనం (Reinforcement) : బండూరా ప్రకారం పునర్బలనం 3 రకాలు.

a) ప్రత్యక్ష పునర్బలనం : పరిశీలించిన ప్రవర్తనను పునరుత్పాదన చేసినపుడు బహుమతి లేదా దండనను ప్రత్యక్షంగా పునర్బలనంను సాధించడం.

b) పరోక్ష ప్రత్యామ్నాయ పునర్బలనం : పరిశీలింపబడే వ్యక్తి పొందిన పునర్బలనాన్నే తాను కూడా పొందగలననే భావనతి పునరుత్పాదన చేయడం.

c).స్వీయ పునర్బలనం : ఎలాంటి పునర్బలనంను ఆశించకుండా వ్యక్తి తాను స్వీయ ప్రమాణాలను పొంది సంతృప్తి చెందుటకై ప్రవర్తనాంశాలను పునరుత్పాదన చేయడం.

1).ధనాత్మక పునర్బలనం : వ్యక్తి తాను అనుకరణ ద్వారా ప్రదర్శించిన ప్రవర్తనకు బహుమతులు, పొగడ్తలు, ప్రశంసలు, లభించడము.

2).ఋణాత్మక పునర్బలనం : వ్యక్తి తాను అనుకరించిన ప్రవర్తనలకు దండ, నిందలు, అపవాదులను పొందడము.  ఋణాత్మక పునర్జలనము అనుకరణ అభ్యసనముకు అవరోధం కాగా ధనాత్మక పునర్బలనం ప్రోత్సా హరంగా పనిచేస్తుంది.

వైకారియస్ మోడలింగ్/ప్రతిరూప నమూనా:- (Vicarious Modelling)

అభ్యాసకుడు నేరుగా నమూనా వ్యక్తిని టీవీలో, సినిమాలోనో చూసి వారి ప్రవర్తనలను, ఆలోచనా సరళిని, నడవడిక, వైఖరులు, అభిరుచులు, అభిప్రాయాలు, చలన కౌశలాలు, వస్త్రధారణ, ఇంగితాలను అనుకరించి అభ్యసిస్తాడు

ఆల్బర్ట్ బండురా – బో బో డాల్ స్టడీ (Bobo Doll Study) :

బోబో డాల్ అనేది ఒక ఆటబొమ్మ. ఈ బొమ్మ గాలితో నింపబడి ఉంటుంది. బొమ్మ అడుగు భాగం బంకమట్టి, ప్లాస్టర్ ఆఫ్ పారిస్తో నింపబడి ఉండటం వల్ల ఈ బొమ్మను ఎటు వైపు కదిలించిన అది తిరిగి యథావిధిగా నిటారుగా నిలబడుతుంది. 

5.ప్రయోగం :-

ఒక పిల్లవాడు బోబో బొమ్మను ఇష్టం వచ్చినట్లు కొట్టడాన్ని చూపే ఒక వీడియో క్లిప్పింగ్ ను నర్సరీ చదివే పిల్లలకు బండూరా చూపించాడు.

పై వీడియోను చూసిన పిల్లలను నిండుగా, వివిధ రకాల ఆటవస్తువులున్న గదిలో కూర్చోమని, ఆటవస్తువులను ఎవరు తాకకూడదని ఆదేశించాడు.కదలకుండా నిశ్శబ్దంగా కూర్చోబెట్టడం, ఆటవస్తువలను తాకనీయకపోవడం లాంటి చర్యలతో పిల్లలను ఒక విధమైన నిరాశ, నిస్మృహకు (Frustration) లోను చేశాడు. కొంత సేపు అయిన తరువాత పిల్లలందరి నీ బోబో బొమ్మలున్న గదిల కూర్చోమన్నాడు. చాలామంది పిల్లలు దూకుడుగా, బోబో బొమ్మలను కొట్టడం గమనించాడు. అంటే పిల్లలు తాము చూసి క్లిప్పింగ్ లోని విద్యార్థిలాగా దౌర్జన్యంగా, దూకుడుగా బోబో బొమ్మను కొట్టడాన్ని అనుకరణతో నేర్చుకొన్నారని బండూరా అభిప్రాయపడ్డాడు.

నిశితమైన పరిశీలనను దృష్టి వల్లనే, ఈ అభ్యసనం సిద్ధిస్తుంది కాబట్టి ఈ అభ్యసనాన్ని పరిశీలనా అభ్యసనం అని అంటాము.

అనుకరణ అభ్యసనం రెండు రకాల మానసిక ప్రక్రియల ద్వారా జరుగుతుంది.

1).తాదాత్మీకరణం (Identification) : తాదాత్మీకరణం ప్రక్రియల్లో వ్యక్తి, నమూనా (Model) వ్యక్తితో మమేకమైన అతని ప్రవర్తనాంశాలను ఉద్దేశపూర్వకంగా స్వీకరించడం జరుగుతుంది. ఉదాహరణకు సచిన్ టెండూల్కర్ తన కోచ్ రమాకాంత్ అచ్రేకర్ తో కలిసి ఉండి క్రికెట్ లో మెలుకవలు నేర్చుకోవడం.

2).అంతర్గీకరణం :- (Internalization) : అంతర్గీకరణ ప్రక్రియలో వ్యక్తి, నమూనా వ్యక్తిగత (Model) ప్రవర్తనాంశాలను తన మానసిక వ్యవస్థలోకి సంగ్రహించుకోవడం జరుగుతుంది.

ఉదాహరణకు ఏకలవ్యుడు ద్రోణాచార్యుడు లేకపోయినా ఊహించు కొని నేర్చుకోవడం.

6.పరిశీలనాఅభ్యసనం విద్య ప్రాధాన్యత:-

1).విద్యార్థులు మంచి అభిరుచులూ వైఖరులు నేర్చుకోవడానికి పరిశీలనా అభ్యసనం దోహదపడుతుంది.

2). జీవిత చరిత్రను బోధించడం ద్వారా గొప్ప వారి వ్యక్తిత్వాలు మూర్తిమత్వ లక్షణాలను విద్యార్థులు అలంకరించవచ్చు.

3). తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు,  విద్యార్థులకు ఆదర్శంగా ఉంటూ ప్రవర్తనలో మార్పు తీసుకురావచ్చు.

Results

-
Please Share it


Please Share it
Please Share it


Please Share it

#1. బంధూరా పరిశీలన అభ్యసనాకి క్రింది వాటిలో లేని పేరు ?

#2. ఆల్బర్ట్ బంధూరా దేశం ?

#3. మిల్లర్ & డిల్లార్డ్ దేశం ?

#4. ఆల్బర్ట్ బంధూరా గ్రంథం ?

#5. బంధూరా నర్సరీ చదివే పిల్లలపై ఈ బోమ్మలతో ప్రయోగాలు చేశాడు ?

#6. ఏ వ్యక్తి ప్రవర్తన ను అనుసరిస్తారో ఆ వ్యక్తిని ఏమంటారు ?

#7. ఒక వ్యక్తిని అనుకరించటం ద్వారా నేర్చుకోవడాన్ని ఏమంటారు ?

#8. ఒక వ్యక్తిని అనుకరించేటపుడు అతనికి తెలుసేటట్లు అనుకరించటం ?

#9. ఒక వ్యక్తిని అనుకరించేటపుడు ఆ వ్యక్తికి తెలియకుండా అనుకరించటం ?

#10. పరిశీలన అభ్యసనం లో లేని సోపానం ?

#11. "పునర్బలనం" రకాలలో క్రింది వాటిలో లేనిది ?

#12. పరిశీలకుడు తను పరిశీలించే వ్యక్తులలో విభిన్నమైన వ్యక్తుల యోక్క ప్రవర్తనను నిశితంగా గమనించటం?

#13. క్రికెట్ పట్ల ఆసక్తి గల విద్యార్థి టివిలో కోహ్లీ ఆట తీరును గమనించటం ?

#14. అభ్యసనం ద్వారా గ్రహించబడిన విషయాన్ని క్రమబద్ధంగా మెదడులో నిలిపి ఉంచుకునుటనే ఏమంటారు?

#15. కోహ్లీ ఆట తీరును మనసులో నిలిపి ఉంచుకోవటం ?

#16. ధారణలో ఉన్నటువంటి విషయాలను బయటికి వ్యక్తం చేయటాన్నే ఏమంటారు ?

#17. తాను క్రికెట్ ఆడేటపుడు కోహ్లీ ఆట తీరు వలె ఆడటానికి ప్రయత్నించటం ?

#18. పరిశీలించిన ప్రవర్తన ను పునర్బలనం చేయడం ద్వారా మెప్పు లేదా దండన పోందడం ?

#19. 10వ తరగతి ఫలితాలలో 10 పాయింట్లు సాధించిన విద్యార్థి ని ఒక ఉపాధ్యాయుడు పాఠశాలకి పిలిపించి ఆ పిల్లవాడి అనుభవాల ను తమ విద్యార్థులకు తెలియచెప్పడం?

#20. 5వ తరగతి పాఠ్య పుస్తకంలో వివేకానందస్వామి జీవిత చరిత్ర ను ప్రవేశపెట్టడంలో జరిగే అభ్యసనం?

#21. పరిశీలన అభ్యసనం లో, వ్యక్తి నమూనా మరోక వ్యక్తి తో మమేకమై అతని ప్రవర్తనాంశాలను ఉద్దేశపూర్వకంగా స్వీకరించే మానసిక ప్రక్రియ?

#22. శంకర్ ఒక సినిమా నటుడి నటనను పరిశీలించి, కళాశాల వార్షికోత్సవంలో అదే విధంగా ప్రవర్తించాడు, అందరూ శంకర్ ను మెచ్చుకున్నారు, బంధూరా ప్రకారం శంకర్ కు లభించిన పునర్బలనం?

#23. తను పాటించాలనుకున్న ప్రమాణాల కోసం పరిశీలించిన ప్రవర్తన ను పునరుత్పాదన చేయడం?

#24. పరిళీలించిన ప్రవర్తనను పునరుత్పాదన చేసినపుడు ఏ వ్యక్తి ప్రవర్తనను పునరుత్పాదన చేశామో ఆ వ్యక్తి పోందిన దానిని పోందాలనుకోవడం?

Finish

Also read : శాస్త్రీయ నిబంధన సిద్ధాంతం

అభ్యసనం 

యత్నదోష అభ్యసన సిద్దాంతం 

స్మృతి – విస్మృతి

అభ్యసన రంగాలు

అభ్యసన బదలాయింపు

ప్రేరణ

సాంఘిక-సాంసృతిక సిద్దాంతము

అంతర్ దృష్టి అభ్యసనం 

కార్యసాధక నిబందనం


Please Share it

Leave a Comment

error: Content is protected !!