tet exam psychology – అభ్యసన రంగాలు

YouTube Subscribe
Please Share it

tet exam psychology – అభ్యసన రంగాలు

అభ్యసనము మరియు దాని ఫలితం ప్రధానంగా మూడు రంగాలకు అన్వయించబడి ఉంటుంది. 1956 సంవత్సరంలో అమెరికాలోని చికాగో విశ్వవిద్యాలయానికి చెందిన బెంజిమెన్ ఎస్ బ్లూమ్స్ “The Taxonomy of Educational objectives” అనే గ్రంథాన్ని రాశారు.Taxonomy అనగా మొక్కల జంతువుల వర్గీకరణ కు సంబంధించిన శాస్త్రం.

బ్లూమ్స్ ప్రవర్తన అంశాల ఆధారంగా విద్యా లక్ష్యాలను మూడు రంగాలకు వర్గీకరించారు.

tet exam psychology

1). జ్ఞానాత్మక రంగం (Cognitive Domain):-జ్ఞానాత్మక రంగం లో ఎక్కువ కృషి చేసినది బెంజిమన్ ఎస్ బ్లూమ్స్. జ్ఞానాత్మక రంగం వ్యక్తి మెదడు లోని ప్రతిస్పందనలకు సంబంధించినది.

జ్ఞానాత్మక రంగంలోని లక్ష్యాలు వరుసక్రమం:-

1). జ్ఞానం (knowledge):-తెలియనిది తెలుసుకోవడమే జ్ఞానం. మెదడులో దాచిన విషయం యథాతథంగా బయటకు వస్తే జ్ఞానం.

పునః స్మరణ చేసుకోవడం గుర్తించడం జ్ఞానానికి సంబంధించిన లక్ష్యాలు. ఒక విషయంపై జ్ఞానం వచ్చింది అని అనుకోవాలి అంటే ఆ విషయాన్ని చూసినప్పుడు గుర్తించాలి అడిగినప్పుడు జ్ఞాపకం చేసుకోవాలి.

ఉదాహరణకు: నిర్వచనాలు, సూత్రాలు, ఎక్కాలు, సిద్ధాంతాలు, శ్లోకాలు, ఇంగ్లీష్ పద్యాలు.

 2).అవగాహన (Understanding):-ఒక విషయాన్ని ఉన్నది ఉన్నట్లుగా గాక ఎక్కువ చేసి గానీ తక్కువ చేసి గానీ నేర్చుకుని బయటకు చెప్పడం, సంక్షిప్తంగా చెప్పడం, సొంత మాటల్లో చెప్పడం,

ఉదాహరణకు :ఒక సారి పుస్తకాన్ని చదివితే అది జ్ఞానం రెండవసారి పుస్తకాన్నీ చదివితే అది అవగాహన అవుతుంది. అనగా బాగా అర్థం అయ్యింది అని అర్థం.

3),వినియోగము:-(Application) అవగాహన చేసుకున్న జ్ఞానాన్ని నూతన పరిస్థితుల్లో వినియోగించడం.

4). విశ్లేషణ (Analysis):- కొంత క్లిష్టమైన అంశాన్ని వివిధ కోణాల్లో విడగొట్టి అర్థం చేసుకోవడానికి ప్రయత్నించడం.

ఉదాహరణకు జనాభా పేదరికం సమస్యలను నియంత్రించ లేక పోవడానికి గల కారణాలు.

5). సంశ్లేషణ:-విడివిడిగా ఉన్న అంశాలను కలిపి సమస్యలను సాధించడం. లేదా చిన్న అంశాలను కలిపి మొత్తంగా నేర్చుకోవడం.

6). మూల్యాంకనము:-ఏదైనా విషయాన్ని అంచెలంచెలగా నిర్ణయించి తుది నిర్ణయానికి రావడం. అనగా నేర్చుకునేది ఎంతవరకు గుర్తుందో పరీక్షించుకోవడం.

ఉదాహరణకు ఉపాధ్యాయుడు పరీక్షలు పెట్టి, వారి యొక్క అభ్యసన స్థాయిలను అంచనా వేయడం.

2). భావావేశ రంగము:- ఇది వ్యక్తుల అనుభూతులకు ఉద్వేగాలకు సంబంధించినది. అభిరుచులు వైఖరులు ప్రశంసా భావావేశ రంగానికి సంబంధించినవి.

భావావేశ రంగము రంగంలోని లక్ష్యాలు వరుసక్రమం:-

1). గ్రహించడం:-ఉపాధ్యాయుడు మహాత్మాగాంధి, మదర్ థెరిసా గురించి బోధించేటప్పుడు వారి జీవితంలో పాటించిన సత్యము, అహింస, సంఘసేవ అనే విషయాలను గ్రహించడం.

2. ప్రతిస్పందిచడం (Responding) : విద్యార్థి ఉపాధ్యాయుడు బోధించిన అంశాల గురించి ఆలోచించడం.

3. విలువకట్టడం (Valuing) : విద్యార్థి అహింస, సత్యం, సంఘసేవ మొదలగు అంశాలకు విలువకట్టడం. అవి శాశ్వత విలువగా గుర్తించడం.

4. వ్యవస్థాపనం (Organisation) : విద్యార్థి విలువను నిత్యజీవితంలో ఉపయోగించడం.

5. శీలస్థాపనం ()characterization): విద్యార్థి ప్రవర్తనలో సత్యము, అహింసభాగం,  సంఘసేవ భాగం.

3). మానసిక చలనాత్మక రంగం:-ఇది విద్యార్థుల చలన నైపుణ్యాలకు సంబంధించినది. నైపుణ్యం అనగా ఒక పనిని నేర్చుకున్నది నేర్చుకున్నట్లే, అలాగే చేయగలగటం. ఇది విద్యార్థుల చలన నైపుణ్యాలకు సంబంధించినది.

a) అనుకరణ: నేర్చుకునేటప్పుడు ఇతరులను బాగా పరిశీలించడం. ఒక నైపుణ్యం అనూ (చిత్రలేఖనం, ఆటలు, కంప్యూటర్, బైక్ రిపేర్, కారు నడపటం) లాంటివి.

ఉదా :- కారు రాని వ్యక్తి ఇతరులు కారు నడిపేటప్పుడు గమనించడం.

b). హస్తలాఘవం:-

పరిశీలించిన నైపుణ్యాన్ని మొదటిసారి ఉపయోగించడం

ఉదా :బైక్ డ్రైవింగ్, ఆటలు, కంప్యూటర్.

c) సునిశితత్వం:- తప్పులు చేస్తూ అనగా ఇబ్బందులు పడుతూ ఇతరుల సహాయంతో నేర్చుకోవడం.

డి) సమన్వయం/ఉచ్ఛారణ : నేర్చుకున్న తర్వాత ఇబ్బందులు లేకుండా మరియు అంత ఖచ్చితమైన నైపుణ్యాన్ని 

ప్రదర్శించకుండా చేయడం, తప్పులు లేకుండా చేయడం.

ఉదా: 1) చిత్రలేఖన నైపుణ్యంలో గ్రాఫ్ ను ఉపయోగించి, వాటిని గీసేటప్పుడు చక్కగా అన్ని సమపాళ్లలో ఉండేటట్లు గీయడం.

ఇ) సహజత్వం/సహజీకరణం:-ఏదైనా ఒక కృత్యాన్ని తడబాటు లేకుండా సహజంగా చేయడాన్ని సహజ కారణమంటారు.

ఉదాహరణకు:- విద్యార్థి ప్రయోగశాలలో పరికరాలను వేగంగా కచ్చితంగా ఎటువంటి తడబాటు లేకుండా ఉపయోగించడం.

Results

-
Please Share it


Please Share it
Please Share it


Please Share it

#1. మానసిక చలనాత్మకరంగానికి సంబంధించిన లక్ష్యం ?

#2. జ్ఞానాత్మక రంగమునకు చెందినది ?

#3. క్రింది కారకాలలో అభ్యసనను సానుకూలంగా ప్రభావితం చేసే అంశము ?

#4. క్రింది వానిలో భావావేశ రంగమునకు చెందనది ?

#5. క్రిందివానిలో జ్ఞానాత్మకరంగానికి చెందనిది ?

#6. క్రిందివానిలో మానసిక చలనాత్మక రంగమునకు చెందినది ?

#7. ‘‘ఉచ్ఛారణ’’ దీనికి చెందినది ?

#8. కిరణజన్య సంయోగక్రియ పాఠ్యాంశాన్ని అభ్యసించిన తర్వాత సిరి శాస్త్రవేత్తలపట్ల గొప్ప వైఖరిని అలవరచు కోవటము ఈ అభ్యసన రంగమును సూచిస్తుంది.?

#9. సరైన వయస్సురానందున ఒక శిశువు కృత్యాన్ని సరిగా చేయలేకపోతున్నది ఇందులో ఇమిడియున్న అభ్యసన కారకము?

#10. ఉద్వేగాల ప్రకటన మరియు భావాల నిర్వహణ అభ్యసనమునకు సంబంధించిన ఈ రంగము?

#11. క్రిందివానిలో మానసిక చలనాత్మక రంగమునకు సంబంధించనది?

#12. క్రిందివానిలో జ్ఞానాత్మక రంగమునకు చెందనిది ?

#13. చేయడం అనునది అభ్యసన రంగంలో దీనికి సంబంధించినది ?

#14. 5వ తరగతి చదువుచున్న రాము ‌నిరంతరం తన సహచరులతో గొడవపడుతుంటాడు. పాఠశాల నియమా లను సరిగ్గా పాటించడు. అయిన రాముకు ఈ రంగంలో సహాయం అవసరం?

#15. క్రిందివానిలో అభ్యసనా రంగం ?

#16. జ్ఞానాత్మక రంగంలో అత్యున్నత లక్ష్యం ?

#17. మానసిక చలనాత్మక రంగమునకు చెందినది ?

#18. మానసిక చలనాత్మక రంగమునకు చెందినది?

Finish

Also read : శాస్త్రీయ నిబంధన సిద్ధాంతం

అభ్యసనం 

యత్నదోష అభ్యసన సిద్దాంతం 

స్మృతి – విస్మృతి

అభ్యసన బదలాయింపు

ప్రేరణ

సాంఘిక-సాంసృతిక సిద్దాంతము

పరిశీలన అభ్యసన సిద్దాంతము 

అంతర్ దృష్టి అభ్యసనం 

కార్యసాధక నిబందనం


Please Share it

Leave a Comment

error: Content is protected !!