Transfer of Learning – అభ్యసన బదలాయింపు

YouTube Subscribe
Please Share it

Transfer of Learning – అభ్యసన బదలాయింపు

గతంలో అభ్యసించిన అంశాలు నూతనంగా ఒక విషయాన్ని అభ్యసించేటప్పుడు ఏదో విధంగా వాటిపై ప్రభావాన్ని చూపిస్తాయనే బావనే “అభ్యసన బదలాయింపు”.

 గతంలో ఒక రంగంలో నేర్చుకున్న శిక్షణ, జ్ఞానం, నైపుణ్యాలు నూతనంగా నేర్చుకోబోయే ప్రక్రియపై ప్రభావం చూపడమే “అభ్యసన బదలాయింపు”.

నిర్వచనాలు :- 

క్రో అండ్ క్రో :-“ఒక అభ్యసన రంగంలో ఏర్పడిన ఆలోచనా విధానం, అనుభూతులు, జ్ఞానం, నైపుణ్యాలు, అలవాట్లను వేరొక రంగం అభ్యసనానికి తీసుకెళ్ళడమే అభ్యసన బదలాయింపు”

సోరెన్ సన్ :- ఒక అభ్యసన స్థితిలో ఆర్జించిన జ్ఞానం, శిక్షణ, అలవాట్లు మరో అభ్యసనస్థితికి అన్వయించి అభ్యసించడమే అభ్యసన బదలాయింపు.

గారెట్ :-ఒక స్థితిలో జరిగిన అభ్యసన ఫలితాలు పూర్తిగా కాని, పాక్షికంగా గాని ఇతర స్థితులకు అనుప్రయుక్తం కాగలగడమే, అభ్యసన బదలాయింపు.

అభ్యసన బదలాయింపు రకాలు:-

అభ్యసన బదలాయింపు నాలుగు రకాలుగా జరుగుతుంది.

Transfer of Learning

1).అనుకూల బదలాయింపు (Positive transfer of Learning): గతంలో నేర్చుకొన్న అభ్యసన విషయాలు, ప్రస్తుతం నేర్చుకొనే విషయాలకు సహకరిస్తే దానిని అనుకూల బదలాయింపు అంటారు.

ఉదాహరణకు:-

1. సైకిల్ నేర్చుకొన్న తర్వాత మోటారు సైకిల్ నేర్చుకోవడం.

2. సంస్కృతం నేర్చుకున్న తర్వాత హింది నేర్చుకోవడం.

3. టైప్ నేర్చుకున్న తర్వాత కంప్యూటర్ కీబోర్డు ఉపయోగించడం. 

4.హార్మోనియం నేర్చుకున్న తర్వాత కీబోర్డు నేర్చుకోవడం,

5. ఇంగ్లీషు నేర్చుకున్న తర్వాత లాటిన్ నేర్చుకోవడం.

6.,గణితం నేర్చుకున్న తర్వాత భౌతిక శాస్త్రంలో సంఖ్యా సమస్యలను పరిష్కరించడం.

7.రాజనీతి శాస్త్రం నేర్చుకున్న తర్వాత ప్రభుత్వ పాలన శాస్త్రం నేర్చుకోవడం.

8.ఆంత్రోపాలజీ నేర్చుకున్న తర్వాత సోషియాలజి నేర్చుకోవడం.

9. జంతుశాస్త్రం నేర్చుకున్న తర్వాత వృక్షశాస్త్రంలో కొన్ని భావనలు నేర్చుకోవడము.

10.బాల్ బ్యాట్మింటన్ నేర్చుకున్న తర్వాత టెన్నిస్ నేర్చుకోవడం.

2).ప్రతికూల బదలాయింపు (Negative Transfer of Learning) : ఒక విషయాన్ని అభ్యసించిన తర్వాత వేరొక విషయాన్ని అభ్యసించేటపుడు అవరోధం కలిగితే ప్రతికూల బదలాయింత అంటారు. గతంలో నేర్చుకొన్న విషయాలు ప్రస్తుతం నేర్చుకొనే విషయాలకు ఆటంకం కలిగించటం. 

1.కుడిచేతి స్టీరింగు ఉన్న కారు నడిపే వ్యక్తి, ఎడమచేతి వైపు ఉన్న స్టీరింగు కారును నడపడం కష్టమవుతుంది

2.తెలుగులో రాసే వ్యక్తి ఉర్దులో రాయడానికి ఇబ్బందిపడటం,

3.PITMAN పద్ధతిలో Shorthand నేర్చుకున్న వ్యక్తి ‘డాంటన్’ పద్ధతిలో నేర్చుకోవడం కష్టం. 4.మాతృభాషలోని ఉచ్చారణ ఆంగ్లభాషలో ఉచ్చారణకు అవరోధం కలిగించడం.

5.Student అనే పదానికి బహువచనం Students అని నేర్చుకున్న విద్యార్థి Child అనే పదానికి బహువచనం Children అన్ని కాకుండా Childs అని పలకడం.

6.Book అనే పదానికి బహువచనం Books అని నేర్చుకున్న విద్యార్థి Tooth అనే పదానికి బహువచనం Teeth అని కాకుండా tooths అని పలకడం.

7.Pen అనే పదానికి బహువచనం Pens అని నేర్చుకున్న విద్యార్థి Foot అనే పదానికి బహువచనం Feet అని కాకుండా Foots అని పలకడం.

8.But అనే పదాన్ని బట్ అని పలికిన విద్యార్థి Put అనే పదాన్ని పట్ అని పలకడం.

3.శూన్య బదలాయింపు (Zero Transfer of Learning) : 

గతంలో నేర్చుకున్న అంశాలు ప్రస్తుతం నేర్చుకునే విషయాలను ఏ మాత్రం ప్రభావితం చేయకపోతే “శూన్యబదలాయింపు” అంటారు.

1.గణితం నేర్చుకొన్న తర్వాత క్రికెట్ నేర్చుకోవడం

2. క్రికెట్ నేర్చుకొన్న తర్వాత సంస్కృతం నేర్చుకోవడం 1

3.సంస్కృతం నేర్చుకున్న తర్వాత ఇంగ్లీషు నేర్చుకోవడం

4.ఇంగ్లీషు నేర్చుకొన్న తర్వాత గిటారు నేర్చుకోవడం

 5. కుడిచేతితో బౌలింగ్ చేసిన తర్వాత ఎడమ చేతితో బ్యాటింగ్ చేయడం.

4.ద్విపార్శ్వ బదలాయింపు (Bi-lateral Transfer of Learning) : ఒకే నైపుణ్యాన్ని శరీగంలోని రెండు వ్యతిరేక భాగాలతో సమర్థవంతంగా చేయటాన్ని “ద్విపార్శ్వ బదలాయింపు” అంటారు.

1.కుడిచేతితో రాసే వ్యక్తి, ఎడమ చేతితో రాయడం. 2.కుడిచేతితో బంతిని విసిరే వ్యక్తి ఎడమ చేతితో కూడా బంతిని విసరటం.

3.కుడి చేతితో పెయింట్ చేసే వ్యక్తి ఎడమ చేతితో కూడా పేయింటింగ్ చేయటం.

4.కుడి కాలితో బంతిని తన్నే వ్యక్తి ఎడమ కాలుతో కూడా బంతిని తన్నటం.

అభ్యసనబదలాయింపు సిద్ధాంతాలు:-

1). సమరూప మూలకాల సిద్ధాంతం (Theory of Identical Elements) :- సమరూప మూలకాల సిద్ధాంతాన్ని అమెరికా దేశానికి చెందిన E.L థారన్ డైక్ ప్రతిపాదించారు.

సమరూప మూలకాల సిద్ధాంతం యత్నదోష అభ్యసన సిద్ధాంతంలోని సాదృశ్య నియమము ఆధారంగా ధారన్ డైక్ ప్రతిపాదించాడు.  సమరూప మూలకాల సిద్ధాంతాన్ని ఉడ్ వర్త బలపరిచాడు.

నేర్చుకునే రెండు అంశాల మధ్య సారూప్యత, సాదృశ్యము పోలికలు ఉన్నప్పుడు అభ్యసన బదలాయింపు జరుగుతుందని థారన్ డైక్ పేర్కొన్నాడు.

రెండు కృత్యాలు నేర్చుకునేటప్పుడు అభ్యాసకుడి వైఖరులలో కూడా సారూప్యత ఉండాలి.

న్యూటన్ గమన సూత్రాల ఆధారంగా క్రికెట్ లో ఫీల్డర్ బంతిని నేర్పుతో పట్టుకోవడం,

ఉదా : – ఒక విద్యార్థి టైపు కొట్టడం నేర్చుకున్న తర్వాత కంప్యూటర్ కీ బోర్డ్ ను సులభంగా ఉపయోగించగలుగుతాడు. దీనికి కారణం రెండు కీ బోర్డులలో ఉండే సారూప్యత,

2. సాధారణీకరణ సిద్ధాంతం Theory of Generalization :- సాధారణీకరణ సిద్ధాంతాన్ని చార్లెస్ జడ్ ప్రతిపాదించారు.

సాధారణీకరణ సిద్ధాంతం ప్రకారం ఒకచోట నేర్చుకున్న నియమాన్ని, సిద్ధాంతాన్ని, సూత్రాన్ని అవగాహన చేసుకొని నూతన పరిస్థితులలో ఉపయోగించడం వల్ల అభ్యసన బదలాయింపు జరుగుతుందని పేర్కొంటుంది.

చార్లెస్ జడ్, హెండ్రిక్ సన్ రెండు సమాన లక్షణాలున్న విద్యార్థుల సమూహాన్ని తీసికొని మొదటి సమూహానికి పరావర్తన సూత్రాలు నేర్పించారు. రెండవ సమూహానికి వివరించలేదు, నీటి అడుగుభాగాన ఉన్న లక్ష్యాన్ని ఛేదించే టప్పుడు పరావర్తన సూత్రాలు అభ్యసించిన సమూహం దక్షత చూపించింది.

ఉదాహరణకు :-కారు రిపేరు నేర్చుకున్న వ్యక్తి అన్ని రకాల కార్ల తో పాటు లారీ జీపు లను కూడా రిపేరు చేయడం

3.ఆదర్శాల సిద్ధాంతం (Theory of Idols) :- అమెరికా దేశానికి చెందిన డబ్ల్యూ. సి. బాగ్లో ఆదర్శాల సిద్ధాంతాన్ని ప్రతిపాదించారు. 

ఒకచోట నేర్చుకున్న విలువ లేక ఆదర్శం వేరొక చోట నూతన పరిస్థితులలో అభ్యసించడానికి దోహదపడడం. ఉదా:

1. కుటుంబాలలో నైతిక విలువలు నేర్చుకున్న విద్యార్థి పాఠశాలలో, సమాజంలో కూడా నైతిక విలువలు పాటించడం.

2. సమయపాలన నేర్చుకున్న ఒక సైనికోద్యోగి మరొక నూతన ఉద్యోగంలో కూడా సమయపాలన పాటించడం.

3. ఇంట్లో పరిశుభ్రత పాటించే వ్యక్తి ఆఫీస్ లో కూడా పరిశుభ్రత పాటించడం.

4.. సమగ్రాకృతి సిద్ధాంతం (Theory of Transposition):- సమగ్రాకృతి సిద్ధాంతాన్ని ప్రతిపాదించినది గెస్టాల్టు వాదులైన వర్గీమర్, కోకా, కోహెలర్. 

సమగ్రాకృతి సిద్ధాంతానికి మరియొక పేరు ట్రాన్స్ పొజీషి యన్ సిద్ధాంతం’

గెస్టాల్టు వాదుల ప్రకారం సంపూర్ణ అంశానికి వాటిలోని అంతర్భాగాలకు మధ్య సంబంధం అర్థం చేసుకొని అటువంటి సంబంధాన్ని వేరొక అంశాన్ని అభ్యసించేటప్పుడు అన్వయించుకుంటే అభ్యసనము బదలాయించబడుతుంది.

ఉదా:-a). ఒక విద్యార్థి భారతదేశ భూగోళశాస్త్రం అనే అంశాన్ని అభ్యసించేటప్పుడు భారతదేశ భూగోళ పరిస్థితులను మొత్తం సమీక్షించుకున్న తర్వాత దానిలోని అంతర్భాగాలైన నైసర్గిక స్వరూపం-శీతోష్ణస్థితి-వర్షపాతం-అడవులు-మృత్తికలు పంటలు -పరిశ్రమలు-వీటి మధ్య పరస్పర సంబంధం గుర్తించడం.

b).ఎక్కాలు మొత్తం నేర్చుకున్న విద్యార్థి మధ్యలో ఎక్కడ అడిగిన ఆలోచించకుండా చెప్పడం.
c).జనగణమన మొత్తంగా నేర్చుకున్న విద్యార్థి ఎక్కడ ఏ చరణం నుంచి పాడమని అడిగితే అక్కడ నుంచి పాడగలగడం.

 

Results

#1. Proactive inhibition is related to this type of transfer of learning పురోగమన అవరోధం ఈ రకమైన అభ్యసన బదలాయింపునకు సంబంధించినది?

#2. An individual’s proficiency in Hindi language does not help him in learning swimming. Type of transfer here is ఒక వ్యక్తి కి హిందీ బాషలో గల ప్రావీణ్యం అతను ఈత నేర్చుకోవడానికి దోహదపడలేదు ఇక్కడ బదలాయింపు రకం?

#3. An individual who has learnt cycling, easily learns to ride a motor cycle. It is సైకిల్ తొక్కడం నేర్చినవాడు సులభంగా మోటార్ సైకిల్ ను నడపడం నేర్చుకోగలిగినాడు ఇది?

#4. A person who can read and write Telugu trying to learn Kannada – the transfer of learning here is తెలుగు రాయడం, చదవడం తెలిసిన వ్యక్తి కన్నడ లిపిని నేర్చుకునేటప్పుడు జరిగే అభ్యసన బదలాయింపు?

#5. Latha’s knowledge about music doesn’t help her to drive a car, the transfer of learning here is లత యొక్క సంగీత జ్ఞానం ఆమె కారు నడపడానికి ఉపయోగపడకపోవడంలోని అభ్యసన బదలాయింపు?

#6. Nisanth learnt Mathematics. Now he wants to learn Economics. Then the transfer of learning will be. నిశాంత్ లెక్కలు నేర్చుకున్నాడు. ఇప్పుడు అతను ఆర్థికశాస్త్రం నేర్చుకోవాలని అనుకుంటున్నాడు. ఇక్కడ జరిగే అభ్యసన బదలాయిపు?

#7. The theory of identical elements was proposed by సమరూప మూలకాల సిద్దాంతమును ప్రతిపాధించినవారు?

#8. A person who learnt to speak the word ‘walk’ want to learn to speak the word ‘Talk’. Now the transfer of learning will be. ‘walk’ అనే పదాన్ని పలకడం నేర్చుకున్న వ్యక్తి ‘Talk’ అనే పదం నేర్చుకోదలిచాడు అప్పుడు అభ్యసన బదలాయింపు?

#9. The stage where learning becomes stagnant without any progress is అభ్యసనం స్తంభించి ఎటువంటి పురోగమనం లేకుండా నిలిచి పోయే దశ?

#10. The person who is habituated to drive a car with right hand steering is driving a car with left hand steering – The type of transfer of learning here is కుడి వైపు స్టీరింగ్ ఉన్న కారు నడపడానికి అలవాటుపడిన వ్యక్తి ఎడమవైపు స్టీరింగ్ ఉన్న కారు నడిపేటపుడు జరిగే అభ్యసన బదలాయింపు రకం?

#11. According to this theory a person who repairs the engine of a motor car is able to repair a motor boat also, ఈ సిద్దాంతం ప్రకారం మోటారు కారు ఇంజన్ను బాగుచేయగల వ్యక్తి మోటారు బోటును కూడ బాగు చేయగలుగుతాడు?

#12. A girl stopped using wrist watch after buying a cell phone, but now and then looking at her wrist to know the time is called సెల్ ఫోన్ కొన్న తర్వాత రిస్ట్ వాచీ వాడడం మానేసిన అమ్మాయి, ఇప్పటికీ అప్పుడప్పుడు సమయం కోసం తన చేతి మనికట్టువైపు చూడడం అనేది?

#13. The theory of transfer of learning proposed by Charles Judd is చార్లెస్ జడ్ ప్రతిపాధించిన బదలాయింపు సిద్దాంతం?

#14. When learning in one situation hinders or weakens the learning in another situation. This is ఒక పరిస్థితిలో నేర్చుకున్న విషయం వేరొక పరిస్థితిలోని అభ్యసనాన్ని అవరోధిస్తే లేక తగ్గిస్తే దానిని యిలా పిలుస్తారు?

#15. The knowledge of balancing in cycling helps in learning of scooter driving. The type of transfer of learning here is సైకిల్ తొక్కడంలో బ్యాలెన్స్ చేయడం, స్కూటర్ నడపడంనందు ఉపయోగంలో ఇమిడియున్న అభ్యసన బదలాయింపు రకం?

#16. Ramu learnt Russian language. Now he wants to learn cycling. Here the transfer of learning would be. రాము రష్యన్ బాషను నేర్చుకున్నాడు. ఇప్పుడు అతను సైకిల్ తొక్కటం నేర్చుకోదలిచాడు. ఇక్కడ అభ్యసన బదలాయింపు రకం?

#17. A driver with a habit of driving vehicle with right side steering was given a vehicle with left side steering suddenly.The type of transfer of training in this case is ‘కుడి వైపు స్టీరింగ్ గల వాహనాన్ని నడిపే అలవాటు గల అలవాటు డ్రైవర్ కు హఠాత్తుగా ఎడమవైపు స్టీరింగ్ గల వాహానం ఇవ్వబడింది. ఇక్కడ జరిగే అభ్యసన బదలాయింపు రకం?

#18. A student who has learnt cycling tries to learn picture drawing – the kind of transfer of learning in this situation is ‘సైకిల్ త్రొక్కడం నేర్చుకున్న విద్యార్థి చిత్రాలు గీయడం నేర్చుకునే సందర్బంలోని అభ్యసన బదలాయింపు?

#19. In terms of transfer of learning ‘the effect of mother tongue in learning correct pronunciation of a foreign language’ can be termed as ‘విదేశీ బాషను ఉచ్చరించడం నేర్చుకోవడంలో ‘మాతృబాషా ప్రభావాన్ని’ అభ్యసన బదలాయింపు దృష్ట్యా క్రింది రాకమియా చెప్పవచ్చు?

#20. A student who has learnt cycling tries to learn picture drawing – the kind of transfer of learning in this situation is ‘సైకిల్ త్రొక్కడం నేర్చుకున్న విద్యార్థి చిత్రాలు గీయడం నేర్చుకునే సందర్బంలోని అభ్యసన బదలాయింపు?

#21. In terms of transfer of learning ‘the effect of mother tongue in learning correct pronunciation of a foreign language’ can be termed as ‘విదేశీ బాషను ఉచ్చరించడం నేర్చుకోవడంలో ‘మాతృబాషా ప్రభావాన్ని’ అభ్యసన బదలాయింపు దృష్ట్యా క్రింది రాకమియా చెప్పవచ్చు?

#22. At first a person learnt to release the arrow by looking at the target and later he learnt to shoot the bullet from the gun, here the type of transfer of learning is ఒక వ్యక్తి మొదట లక్ష్యం చూసి బాణాన్ని వదలడం నేర్చుకున్నాడు, తర్వాత తుపాకి నుండి బుల్లెట్ పేల్చడం నేర్చుకున్నాడు, ఇక్కడ అభ్యసన బదలాయింపు రకం?

#23. Raghu learnt type writing in English. Now he wants to learn how to operate a computer key board. Here the transfer of learning will be, రఘు ఇంగ్లీష్ టైపు రైటింగ్ నేర్చుకున్నాడు. ఇప్పుడు అతను కంప్యూటర్ కీబోర్డును ఉపయోగించటం నేర్చుకోదలిచాడు. ఇక్కడ జరిగే అభ్యసన బదలాయింపు రకం?

#24. The transfer of learning of a person who is skilled in driving a bullock cart also learning to climb a tree ఎండ్లబండిని నడపటంలో నైపుణ్యం కలిగిన వ్యక్తి చెట్లను ఎక్కడం నేర్చుకోవటంలో జరిగే అభ్యసన బదలాయింపు రకం?

#25. The oldest theory that explains transfer of learning is అభ్యసన బదలాయింపును వివరించే అతి ప్రాచీన సిద్దాంతం?

#26. Mastering in Hindi Language doesn’t influence learning of swimming. This is an example for హింది భాషా ప్రావీణ్యం ఈత నేర్చుకోవడంపై ఏ ప్రభావం చూపదు. ఇది ఈ రకపు బదలాయింపుకు ఉదాహరణ?

#27. Ravi learnt to write Urdu with right hand. But without practice he can write with left hand also. This is. రవి కుడిచేతితో ఉర్దూ జయతాం నేర్చుకున్నాడు. కానీ ఎటువంటి అభ్యాసం లేకపోయినా అతను ఎడమచేతితో గూడా రాయగలదు. ఇది?

#28. A person who learnt Sanskrit, wants to learn Hindi. Here the type of transfer of learning is సంస్కృతం నేర్చుకున్న వ్యక్తి, హిందీ నేర్చుకోదలిచాడు. ఇక్కడ జరిగే అభ్యసన బదలాయింపు?

#29. Sumanth learnt to play cricket, now he wants to learn computer. The type of transfer of learning in this context is సుమంత్ క్రికెట్ ఆడటం నేర్చుకున్నాడు. ఇపుడు అతను కంప్యూటర్ నేర్చుకోవాలనుకున్నాడు. ఈ సందర్బంలో అభ్యసన బదలాయింపు రకం?

#30. Habit interference is an example of….. ‘అలవాట్లో పొరపాటు’ – దీనికి ఉదాహరణ?

#31. A child who learner to pronounce ‘but’ has later on pronounced ‘put’ in the same way. The type of transfer of learning here is…. ‘బట్’, ‘but’ ని ఉచ్చరించడం నేర్చుకున్న పిల్లవాడు తరువాత అదేరీతిలో ‘పుట్’ ‘put’ ని ఉచ్చరించాడు?

#32. One of the following do not facilitate maximum transfer of learning ఈ క్రింది వానిలో ఒకటి గరిష్ట అభ్యసన బదలాయింపును ప్రోత్సహించుట?

#33. A student learnt the plural of ‘book’ as ‘books’. When he was asked to tell the plural of ‘foot’ he said ‘foots’. Here the transfer of learning is… ఒక విధ్యార్థి ‘book’ అనే పదం యొక్క బహువచనం ‘books’ గా జరిగిన అభ్యసన నేర్చుకున్నాడు. అతన్ని’foot’ యొక్క బహువచనం చెప్పమనగా ‘foots’ అని చెప్పాడు ఇక్కడ జరిగిన అభ్యసన బదలాయింపు?

#34. A person observing his friend failing in playing cricket , helped him by supporting required skills to excel. The transfer of learning that occured… క్రికెట్ ఆడటంలో విఫలమవుతున్న మిత్రున్ని గమనించిన ఒక వ్యక్తి అతనికి తగిన మెలకువలను సూచించి రాణించునట్లుగా సహాయం చేసినాడు. ఇచ్చట జరిగిన బదలాయింపు?

#35. Application of bitter agents on thumb to discontinue thumb sucking a child is…. పిల్లలలో బొటనవేలు చీకే అలవాటును మాన్పించడానికి బొటనవేలుకు చెడు పదార్థాలను పూయడాన్ని…?

#36. A class VIII student helped her classmate in learning English. The transfer of learning that has taken place is… ఒక ఎనిమిదవ తరగతి విధ్యార్థిని, తన తోటి విధ్యార్థినికి ఆంగ్లము అభ్యసించుటలో సహాయపడునది. ఇక్కడ జరిగిన అభ్యసన బదలాయింపు?

Previous
Finish

Also read : Psychology Grand Test – 4

శాస్త్రీయ నిబంధన సిద్ధాంతం

అభ్యసనం 

యత్నదోష అభ్యసన సిద్దాంతం 

స్మృతి – విస్మృతి

అభ్యసన రంగాలు

ప్రేరణ

సాంఘిక-సాంసృతిక సిద్దాంతము

పరిశీలన అభ్యసన సిద్దాంతము 

అంతర్ దృష్టి అభ్యసనం 

కార్యసాధక నిబందనం


Please Share it

Leave a Comment

error: Content is protected !!