ts tet psychology classes – మనో సాంఘిక వికాశ సిద్దాంతము
ఎరిక్ సన్ (1902-1994) ప్రఖ్యాత మనోవిశ్లేషణ వాది. వ్యక్తి వికాసాన్నీ అధ్యయనం చేసిన ఫ్రాయిడ్ అనుచరులలో ఎరిక్సన్ ముఖ్యుడు. వ్యక్తి జీవితంలో జరిగే వికాసాన్ని తన సాంఘిక సిద్ధాంతం ద్వారా ఏరిక్ సన్ తెలియజేశారు. ఫ్రాయిడ్ సిద్ధాంతాన్ని కొంతవరకు ఆధారంగా చేసుకొని ఎరిక్సన్ ఈ సిద్ధాంతాన్ని ప్రతిపాదించారు.
వ్యక్తి యొక్క మూర్తిమత్వాన్ని, మనో సాంఘిక వికాసాన్ని సమగ్రంగా వివరించిన నిర్మితి సిద్ధాంతాలలో ఒక ప్రముఖ సిద్ధాంతంగా దీనిని చెప్పుకుంటారు.
ఫ్రాయిడ్ అచిత్తు మనో విజ్ఞాన శాస్త్రవేత్త ( Id Psychologist ) అని అంటే, ఎరిక్ సన్ ను అహం మనో విజ్ఞాన శాస్త్రవేత్త (Ego Psychologist) అని అంటారు.
ఫ్రాయిడ్ అచిత్తు లోనీ LIBEDO కు ప్రాధాన్యత ఇచ్చారు ఐతే ఎరిక్ సన్ అహం (Ego) కు ప్రాధాన్యత ఇచ్చాడు.
సిగ్మండ్ ఫ్రాయిడ్ లైంగిక వికాసానికి ప్రాధాన్యత ఇచ్చాడు, ఐతే ఎరిక్ సన్ మనో సాంఘిక వికాసానికి ప్రాధాన్యత ఇచ్చాడు.
ఫ్రాయిడ్ లైంగిక వికాసంలో ఐదు దశలు పేర్కొన్నాడు. ఐతే ఎరిక్ సన్ సాంఘిక వికాసం లో ఎనిమిది దశలను పేర్కొన్నాడు.
సిగ్మండ్ ఫ్రాయిడ్ బాల్య అనుభవాలకు ప్రాధాన్యత ఇచ్చాడు. ఐతే ఎరిక్ సన్ జీవితాంతం జరిగే సాంఘిక అనుభవాలకు ప్రాధాన్యత ఇచ్చాడు.
ఎరిక్ ఎరిక్సన్ రచించిన గ్రంధాలు
1). Childhood and society
2).The stages of psychological development
ఎరిక్ సన్ ప్రకారం వ్యక్తి యొక్క అహం (Ego) జీవిత కాలంలో, 8 మనో సాంఘిక వికాస దశలలో ఒక్కొక్క సంక్షోభాన్ని లేదా పిస్తా పరిస్థితిని ఎదుర్కొని, దానిలో విజయాన్ని పొందడం ద్వారా, చక్కని మూర్తిమత్వ వికాసం జరుగుతుందని, మరియు అలాగే అపజయాన్ని పొందటం ద్వారా ప్రతికూల మూర్తిమత్వం ఏర్పడుతుందనీ, తెలియజేశాడు.
వ్యక్తి యొక్క ప్రవర్తన యొక్క మంచి లేదా చెడు అనేది అహం ఎదుర్కొనే సంక్షోభాల పై అది సాధించే విజయం లేదా అపజయం పై ఆధారపడి ఉంటుందని వీరి అభిప్రాయం.
అనగా వ్యక్తి యొక్క సాంఘిక వికాసం అభివృద్ధి, వారి సాంస్కృతిక జీవన శైలి మరియు పరిసరాల అనుభవాలపై ఆధారపడి ఉంటుందని ఎరిక్ సన్ తెలియజేశారు.
ఎరిక్ సన్ ప్రకారము 8 మనో సాంఘిక వికాస దశలు.
దశలు | వయసు | మనో సాంఘిక క్లిష్ట పరిస్టితులు |
1). పూర్వ శైశవ దశ | 0 – 1 1/2 సంవత్సరాలు | నమ్మకం Vs అపనమ్మకం |
2). ఉత్తర శైశవ దశ | 1 1/2 – 3 సంవత్సరాలు | స్యయం ప్రతిపత్తిVs సందేహం |
3). క్రీడా దశ | 3 – 5 సంవత్సరాలు | చొరవ Vs తప్పు చేసానన్న బావన |
4).పాటశాల దశ | 6 – 12 సంవత్సరాలు | శ్రమించడం Vs న్యూనత |
5).కొమార దశ | 12 – 20 సంవత్సరాలు | పాత్ర గుర్తింపు Vs పాత్ర సంక్షోబం |
6). పూర్వ వయోజన దశ | 20-30 సంవత్సరాలు | సన్నిహితం Vs ఏకాంతం |
7). మద్య వయోజన దశ | 30-60 సంవత్సరాలు | ఉత్పదకం Vs స్తబ్దత |
8).పరిపక్వత దశ | 60 సంవత్సరాలు పైబడిన | సమర్థత Vs నిరాశ |
1. నమ్మకం VS అపనమ్మకం (Trust Vs Mistrust)
ఈ దశలోని శిశువు తన అవసరాలు తీర్చుకోవడానికి పూర్తిగా తల్లి లేదా సంరక్షకులపై ఆధారపడుతాడు. శిశువులలో ప్రధానంగా నమ్మకం ఈ మౌఖిక – సంవేదన దశలోనే ఏర్పడుతుంది. ఈ దశలో శిశువుకు లభించిన పోషణ, సంరక్షణల నాణ్యత ఆధారంగా వారిలో నమ్మకం అపనమ్మకం అనే భావం ఏర్పడటం మొదలవుతుంది. శిశువుకు కలిగే తొలి అనుభవాలు నమ్మకం లేదా అపనమ్మకం ఏర్పడటంలో చాలా ప్రాముఖ్యాన్ని వహిస్తాయి. తల్లి చూపించే ప్రేమ, వాత్సల్యం, జాగరూకత (Alertness) వల్ల ఈ ప్రపంచంపై ఆధారపడవచ్చని వారి జ్ఞానేంద్రియాల ద్వారా తెలుసుకొంటారు. ఈ దశలో తల్లే వారి ప్రపంచం, కొద్దిపాటి సమయం తల్లి కనబడకపోయినప్పటికీ తిరిగి కనబడి వారి ఆలనా పాలనా చూడటం వల్ల కొద్దిపాటి సమయం కనబడక పోయినా తిరిగి కనబడతారు అనే విషయాన్ని నేర్చుకొంటారు. తల్లిదండ్రులు, ఇతర సంరక్షకులతో వారికి కలిగే అనుభవాల వల్ల వారిలో ఇతరులపట్ల నమ్మకమే కాకుండా వారిపట్ల వారికి కూడా నమ్మకం ఏర్పడుతుంది.శిశువులకు సరైన పోషణ లభించకపోయినా వారిపట్ల శ్రద్ధ వహించకపోయినా, కఠినత్వం చూపించినా, అవసరాలు తీర్చడంలో జాప్యం జరిగినా వారికి భాధ కలిగి వారిలో అపనమ్మకం అనే భావన ఏర్పడుతుంది. అందువల్ల పిల్లలకు మంచి పోషణ, ప్రోత్సాహకరమైన అనుభవాలు కలిగించాలి. అనుభవాలలోని నాణ్యత, నియమబద్ధత వల్ల జీవితంపట్ల సానుకూల దృక్పథం ఏర్పడి, తదుపరి దశలోకి అడుగుపెడతారు. ఈ దశలో పిల్లలకు సంరక్షణను ఇచ్చేవారు వారికి సున్నితమైన, తగిన పోషణ పరిసరాలను అందించినట్లయితే, పిల్లలలో నమ్మకం, అపనమ్మకాల మధ్య కలిగే వ్యతిరేక సంఘర్షణలను అధిగమించడానికి అవకాశం ఉంటుంది. ఈ దశలో ఏర్పడే నమ్మకం లేదా అపనమ్మకం తదుపరి దశలోకి అనుసరించి, మూర్తిమత్వ వికాసంలో ప్రతిబింబిస్తుంది. నమ్మకం, అపనమ్మకం మధ్య ఉండే నిష్పత్తి ఆధారంగా వారిలో ‘ఆశ’ అనే సద్గుణం ఏర్పడుతుందని ఎరిక్సన్ తెలిపారు.
2. స్వయం ప్రతిపత్తి Vs సిగ్గు, సంశయం (Autonomy Vs Shame and Doubt)
ఈ దశలో పిల్లలు వారిలో అభివృద్ధి చెందిన శారీరక, చలనాత్మక, మానసిక నైపుణ్యాలు, భాషాసామర్థ్యాలను ఉపయోగించి స్వతంత్రంగా పనిచేసుకొనే దిశగా సాగుతారు. స్వయం ప్రతిపత్తిని, సాధించడానికి వారు తమ పరిసరాలను శోధించి, తమ శక్తి సామర్థ్యాలను తెలుసుకోవడానికి ప్రయోగాలు చేస్తారు. ఈ దశలో పిల్లల అనుభవాల నాణ్యత పై వ్యక్తిగత స్వయంప్రతిపత్తి ఆధారపడుతుంది. అందువల్ల స్వయం ప్రతిపత్తిని సాధించడానికి సరిపోయేంత అవకాశాలు కల్పించాలి. ఈ దశలో పిల్లలకు అతీగా శౌచాలయ శిక్షణ (Toilet training) ఇచ్చినా, అతిగా సంరక్షణ ఇచ్చినా వారిలో సిగ్గు, సంశయం ఏర్పడే అవకాశం ఉంటుంది. పిల్లలలో ఎక్కువ సిగ్గు, సంశయం కలిగించకుండా, వారికి అవసరమైనంత స్వేచ్ఛను, స్వతంత్రతను అందించినట్లయితే వారిలో స్వయంప్రతిపత్తి ఏర్పడుతుంది. ఈ దశలో ‘మనోబలం’ అనే సద్గుణం ఏర్పడుతుందని ఎరిక్సన్ తెలిపారు,
3. చొరవ Vs అపరాధ భావం (Intiative Vs Guilt)
ముందు దశలలో నమ్మకం, స్వయంప్రతిపత్తి సమకూరిన పిల్లలు ఈ దశలో వారి పరిసరాలతో పరస్పర చర్యలు చేయడానికి చొరవ తీసుకోవడం ప్రారంభమవుతుంది. దీనివల్ల వారిలో అనుసరించడం, ప్రణాళికలను ఏర్పరచుకోవడం, కృత్యాలు, లక్ష్యాలను సాధించడంలో గుణాత్మకత ఏర్పడుతుంది. ప్రతి విషయాన్ని గురించిన ప్రశ్నలను అడగడం, నిరంతరం పరిసరాలను శోధించడం, ప్రణాళికలను ఏర్పరచుకోవడంలో నిమగ్నమవడం, వివిధ కృత్యాలను చేయడం లాంటి లక్షణాలను ఈ దశలోని పిల్లలలో గమనించవచ్చు. భౌతిక, మానసిక శోధన చేపట్టే చొరవకు తల్లిదండ్రులు, సాంఘిక పరిసరాల నుంచి లభించిన ప్రోత్సాహం వల్ల భవిష్యత్తులో పిల్లలకు ప్రణాళికలను ఏర్పరచుకోవడం, కృత్యాలు చేపట్టడం లాంటి సామర్థ్యాలు పెరుగుతాయి.తల్లిదండ్రులు, ఇతర సంరక్షకులు పిల్లలపట్ల నమ్మకం లేదా చొరవ తీసుకోవడాన్ని నిరుత్సాహపరచినా లేదా అర్థంలేని విమర్శలు చేసినా, చిన్న వైఫల్యాలకు తిట్టినా, శిక్షించినా, పిల్లలలో అపరాధభావన ఏర్పడి, తద్వారా ప్రణాళిక ఏర్పరచుకొని, కృత్యాలను నిర్వహించుకోవడంలో సందేహం, నిర్ణయాలు తీసుకోలేకపోవడం, చొరవ తీసుకోలేకపోవడం లాంటివి కనబడతాయి. అందువల్ల ఈ దశలో పిల్లలలో అపరాధ భావన ఏర్పడకుండా తల్లిదండ్రులు, పెద్దలు జాగ్రత్త పడాలి. అందుకోసం వారిని చొరవతో ప్రయోగాలు చేయడానికి అనుమతించాలి. సరైన పర్యవేక్షణ, మార్గదర్శనం అందించాలి. కృత్యాలను చేయడానికి ప్రోత్సహించాలి. ఈ దశలో ‘లక్ష్యం’ అనే సద్గుణం ఏర్పడుతుందని ఎరిక్సన్ తెలిపారు.
4. శ్రమశీలత Vs న్యూనత (Industry Vs Inferiority:- ఈ దశలో పిల్లలు ఎలిమెంటరీ పాఠశాలకు హాజరవుతారు. వారు వివిధ నైపుణ్యాలను నేర్చుకొంటారు. మంచి నిష్పాదనను సాధించడానికి ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు, పాఠశాల వాతావరణం పిల్లలలో ఒత్తిడిని పెంచుతాయి. అంతేకాకుండా, వారు సమవయస్కులతో పోటీ పడవలసి ఉంటుంది. ఈ దశలో పిల్లలు గృహంలో, పాఠశాలలో మంచి నిష్పాదనను కనబరిచినా లేదా వారి మానసిక నైపుణ్యాలను గుర్తించి పోగడితే మంచి పలితాలు ఉంటాయి.
5. పాత్ర సందిగ్ధత Vs గుర్తింపు (Indentity Vs Role confusion):- కౌమారదశలో వ్యక్తులు తాదాత్మ్య భావన (Indentification) కు గురవుతారు. నమ్మకం, స్వయంప్రతిపత్తి, చొరవ, శ్రమశీలత భావనలు సమకూర్చబడిన కౌమారులు వారి స్వయం వ్యక్తిత్వ , గుర్తింపు అన్వేషణను ప్రారంభిస్తారు. వారి శరీరంలో సంభవించే ఆకస్మిక మార్పులు, మానసిక విధులు, సంఘం వారి నుంచి ఆశించే డిమాండ్లు తమకు తామే ప్రశ్నించుకొనేటట్లుగా చేస్తాయి. నేనెవరు? సంఘంలో నా స్థానమేంటి? నేనేమిచేయాలి? ఎలా ప్రవర్తించాలి? లాంటి ప్రశ్నలతో సతమతమవుతారు. కౌమారులలో మొదలయ్యే ప్రశ్నల అన్వేషణ, పూర్వదశలో ఏర్పడిన సాంఘిక, మానసిక గుర్తింపుల పునర్ నిర్వచనం వారి ఆకస్మిక, వేగవంతమైన శారీరక మార్పులు, భవిష్యత్తు విద్య, ఉద్యోగాల గురించి తీసుకోవాల్సిన నిర్ణయాల వల్ల కలిగే ఒత్తిడి, వ్యాకులతలకు సంబంధించి ఉంటాయని ఎరిక్సన్ ఉద్ఘాటించారు. తద్వారా, కౌమారులు వారి నూతన పాత్ర, గుర్తింపును గురించి ప్రయత్నం చేస్తారు.వ్యక్తిలో తాదాత్మ్యభావన ఏర్పడటం వారు పూర్వదశలలోని సంక్షోభాలను నిర్మూలించు కోవడంలోని విజయంపై ఆధారపడుతుంది. పూర్వదశలలోని సంక్షోభాలను నిర్మూలించడంలో విఫలమైతే, వ్యక్తిలో కలవరం (Confusion) ఏర్పడి సరైన పాత్ర గుర్తింపు చేసుకోలేరు. ఏమి చేయాలి? ఎలా ప్రవర్తించాలనే గందరగోళానికి లోనవుతారు. దానివల్ల వారి విద్య, ఉద్యోగ సంబంధ విషయాల నిర్ణయాలను తీసుకోలేకపోవచ్చు. అలాకాకుండా, వ్యక్తిలో సరైన తాదాత్మ్య భావన ఏర్పడితే, పనులను చేయడం, సాధించడానికి అవసరమయ్యే విశ్వాసం ఏర్పడి, ఉద్వేగాలలో సమతుల్యతను చూపి, పరిసరాలతో సామరస్యంగా సర్దుబాటు చేసుకొంటారు. తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు కౌమారులలో సరైన తాదాత్మ్యత కలగడానికి తోడ్పడి వారు పాత్ర సందిగ్ధతకు గురికాకుండా చూడాలి. ఇతరులు, సమవయస్కుల ముందు వారిని అగౌరవించక, వారు చేయగలిగే బాధ్యతలను అప్పగించి, వారు చెప్పే విషయాలను నమ్మి, వారిలో సరైన తాదాత్మ్యత ఏర్పడటానికి తోడ్పడాలి. 6. సన్నిహితత్వం Vs ఏకాంతం (Intimacy Vs Isolation): – వయోజన దశలోకి అడుగుపెట్టే వ్యక్తులు ఇతరులతో అన్యోన్య ఇది పూర్వ వయోజనదశ. సంబంధాలు ఏర్పరచుకొనే ప్రయత్నాలు చేస్తారు. కొన్నిసార్లు వారి వ్యక్తిత్వాలను కూడా కోల్పోయి ఇతరులతో సాన్నిహిత్యం పెంచుకొంటారు. కుటుంబసభ్యుల కోసం లేదా మిత్రులు, బంధువుల కోసం చేసే త్యాగాల ద్వారా వ్యక్తిలో సన్నిహితత్వ భావన ఏర్పడుతుంది.ఇతరులతో వారి గుర్తింపును విలీనం చేసి తగినంత సాన్నిహిత్యాన్ని పెంపొందించుకోవడంలో విఫలమైనా లేదా ఏవైనా కారణాల వల్ల ఇరువురి మధ్య సంబంధాలు చెడిపోయినా వ్యక్తిలో ఒంటరితనం ఏర్పడుతుంది. అలాంటి పరిస్థితి ఏర్పడకుండా ఉండటానికి, సంతోషకరమైన జీవనాన్ని సాగించడానికి సాన్నిహిత్యాన్ని పాటించాల్సిన అవసరం ఉంది. ప్రతిసారి ఒంటరితనం సరైంది కాదని చెప్పలేం. వ్యక్తి మూర్తిమత్వ వికాసం, స్వీయ భావనలను నిర్వహించుకోవడానికి కొద్దిస్థాయి గల ఒంటరితనం అవసరం. కాని అవసరమైన దానికంటే ఎక్కువ ఒంటరితనం ఏర్పడితే, ఇతరులతో సంబంధాలను ఏర్పరచుకొని నిర్వహించడంలో సమస్యలెదురైతే తీవ్ర ప్రతిబంధకంగా తయారవుతుంది. వ్యక్తి ఇతరులతో సర్దుబాటు చేసుకోవడం, సంక్షోభాలను ఎలా పరిష్కరించుకోగలుగుతారు అనే విషయంపై ఆధారపడుతుంది. ఈ దశలో ‘ప్రేమ’ అనే సద్గుణం ఏర్పడుతుందని ఎరిక్సన్ తెలిపారు.
7. ఉత్పాదకత Vs స్తబ్ధత (Generativity Vs Stagnation) :–ఇది మధ్య వయోజన దశ. ఈ దశలోనివారు ఉత్పాదకత అవసరాన్ని తృప్తి పరచుకోవలసి ఉంటుంది. ఈ దశలోని వ్యక్తులు, వారి పిల్లలను పెంచడం, ఇతర వయోజనులకు, వారి దగ్గర పని చేసేవారికి మార్గదర్శకత్వం అందించడం, సంఘానికి ఉపయోగపడే కృత్యాలను చేయడం వల్ల తృప్తిని పొందుతారు. లేనిపక్షంలో వ్యక్తులలో స్తబ్దత ఏర్పడుతుంది. వ్యక్తి వారి పిల్లలకు, ఇతరులకు బోధించి తృప్తి చెందడమే కాకుండా, వాస్తవాలు కొన్ని తరాలుగా సంరక్షించబడటానికి కారణం కూడా ఉత్పాదకత లక్షణమే. ఈ దశలో ‘సంరక్షణ’ అనే సద్గుణం ఏర్పడుతుందని ఎరిక్సన్ తెలిపారు.
8. చిత్తశుద్ధి Vs నిరాశ (Integrity Vs Dispair):-సాంఘిక వికాసంలోని ఈ చివరి దశలో వ్యక్తి జీవితానికి చెందిన అంతిమ సంక్షోభం చిత్తశుద్ధి, నిరాశను ఎదుర్కొంటారు. ఈ దశలోని వ్యక్తులు తమ పూర్వ జీవితం గురించిన ఆలోచనలో ఉంటారు. ఏడు దశలలోని సంక్షోభాలను విజయవంతంగా పరిష్కరించుకోగలిగితే వ్యక్తి సంతృప్తి చెంది ప్రపంచం పట్ల, తమపట్ల సానుకూల దృష్టి కలుగుతుంది. పూర్వ దశలలోని సంక్షోభాలను సరిగ్గా పరిష్కరించుకోలేకపోవడంవల్ల వ్యక్తులలో నిరాశ, నిస్పృహ ఏర్పడి జీవితంపట్ల అసంతృప్తితో ఉంటారు. జీవన మార్గాన్ని మార్చుకోవడానికి సమయం లేదు అనే ఆలోచన వారిలో దుఃఖాన్ని, పరితాపాన్ని కలిగిస్తుంది. తద్వారా వారిలో నిరాశ ఏర్పడుతుంది, చావు అంటే విపరీతమైన భయం ఏర్పడుతుంది. జీవితంపట్ల ఎలాంటి పశ్చాత్తాపం, దుఃఖం లేకుండా మంచి జీవితాన్ని గడిపాం అనే సంతృప్తితో ఉన్న వ్యక్తులు ఎవరికైనా చావు తప్పదని భావించి చివరి శ్వాస వరకు కూడా సంతోషంగా ఉంటారు. ఈ దశలో ‘సూక్ష్మబుద్ధి’ (Wisdon) అనే సద్గుణం ఏర్పడుతుందని ఎరిక్సన్ తెలిపారు. వ్యక్తి తన జీవితంలో జరిగిన అప్పులు, లోటుపాట్లను గురించి పశ్చాత్తాపం చెందుతూ ఎప్పుడూ అదే ధ్యాసలో ఉండి వారి అహాన్ని అసంతృప్తికి గురిచేసుకొని తమను తామే నిందించుకోవడం వల్ల నిరాశ, నిస్పృహలకు లోనయ్యే ప్రమాదం ఉంది. అందువల్ల చిత్తశుద్ధి, నిరాశల పట్ల సమతుల్యతతో వ్యవహరించి, జీవితంలోని చివరి సంక్షోభాన్ని ఫలవంతంగా పరిష్కరించుకోవాలి. ఫలితంగా ప్రపంచంపట్ల ఆశావాద దృష్టి కలిగి మిగిలిన జీవితకాలాన్ని సంతోషంగా గడుపుతారు.
#1. According to Erickson, the period of adolescene is marked with this crisis ఎరిక్ సన్ ప్రకారం కౌమారం ఈ సంక్షోభంతో కూడుకున్నది?
#2. Chomsky proposed a theory for..... చామ్ స్కీ ప్రతిపాదించిన సిద్దాంతం?
#3. One of the following perspectives proposes that all children have an innate language acquisition devices which is responsible for language acquisition called the...... క్రింది దృక్పథాలలో ఒకటి భాష సముపార్జనకు కారణమైన సహజ భాష సముపార్జన సాధనం శిశివులందరిలో ఉంటుందని?
#4. This perspective focuses on free will and self- actualization స్వేచ్చా పూరిత ఇచ్చ, ఆత్మ ప్రస్తావన పై కేంద్రీకరించే ఉపగమము?
#5. 'Universal Grammar' as narrated by Chomsky is..... చామ్ స్కీ ప్రకారం ‘సార్వత్రిక వ్యాకరణం’ అనగా?
#6. Sudhakar, an 8th class student, frequently experiences the following critical situation in respect of personality development.8వా తరగతి చదువుతున్న సుధాకర్ మూర్తిమత్వ వికాసపరంగా తరుచుగా ఈ కింది సంక్లిష్ట పరిస్థితిని అనుభవించును?
#7. 'Universal Grammer' as narrated by Chomsky is చామ్ స్కీ ప్రకారం ‘సార్వత్రిక వ్యాకరణం’ అనగా?
#8. When a baby cries out of hunger or discomfort and the parents responding immediately every time, makes it learn that the parents will meet all its needs. As a result one of the following begins to develop in the baby. అసౌకర్యంగా లేదా ఆకలిగా ఉన్నప్పుడు శిశువు ఏడ్చిన ప్రతిసారి తల్లిదండ్రులు స్పదించినచో, శిశువు తన అవసరాలు తీర్చుటకు తల్లిదండ్రులు హాజరవుతారని అభ్యసిస్తాడు. తత్ఫలితంగా శిశువులో అభివృద్ది చెందేది?
#9. The school of Psychology to which Carl Rogers belongs to is......... కార్ల్ రోజర్స్ ఈ మనో విజ్ఞాన శాస్త్రవాదానికి చెందినవాడు?
#10. For the development of languages, nativist perspective was proposed by బాషాభివృద్దికి ‘నేటివిటీని’ ప్రతిపాదించిన వారు?
#11. According to Erickson High School children face this psycho social critical situation. ఎరిక్ సన్ ప్రకారం ఉన్నత పాటశాలల్లోని పిల్లలు ఈ మనో సాంఘిక క్లిష్ట పరిస్థితిని ఎదుర్కొంటారు?
#12. According to Erickson the Psycho Social critical situation of a person who engaged in some kind of creative, productive activities which are beneficial to society is. ఎరిక్ సన్ ప్రకారం సమాజనికి ఉపయోగపడే సృజనాత్మక, ఉత్పాదక కృత్యాలలో పాల్గొనే వ్యక్తుల మనొసాంఘిక క్లిష్ట పరిస్థితి?
#13. According to Erickson the Psycho Social critical situation faced by Adolescent children is ఎరిక్ సన్ ప్రకారం కౌమార దశలోని పిల్లలు ఎదుర్కొనే మనోసాంఘీక క్లిష్ట పరిస్థితి?
#14. The theory that advocates the developmental activities like making plans and doing activities by the children are the effect of Initiative vs Guilt is పిల్లల ప్రణాళికను ఏర్పరుచుకోవడం, కృత్యాలు చేపట్టడంలాంటి వికాస కృత్యాలు చొరవ vs అపరాదం (Initiative vs Guilt) దశ ఫలితంగా జరుగుతాయని పేర్కొనే సిద్దాంతం?
#15. According to Erickson, the virtue called ‘Reliability’ forms at this Psycho social critical situation is ఎరిక్ సన్ ప్రకారం ‘విశ్వసనీయత’ అనే సద్గుణం ఏర్పడే మనోసాంఘీక క్లిష్ట పరిస్థితి?
#16. According to Erickson the psychosocial stage of a person in the age group of 12 to 20 is ఎరిక్ సన్ ప్రకారం 12 నుండి 20 సంవత్సరాల వయస్సు గలవారికి చెందిన మనోసాంఘీక దశ?
#17. The virtue called “Care” is to be achieved by the person in this Psycho social critical situation. వ్యక్తి ‘సంరక్షణ’ అనే సద్గుణాన్ని సాధించుకునే మనో సాంఘీక క్లిష్ట పరిస్థితి?
#18. According to Erickson, providing adequate training, sufficient education and good models to the children of age group between 6 to 12 years develops this feature in them ఎరిక్ సన్ ప్రకారం 6 నుండి 12 సంవత్సరాల వయస్సు గల పిల్లలకు సరైన శిక్షణ తగిన విద్యా మరియు మంచి ఆదర్శాలను అందించడం వల్ల వారిలో పెంపొందే క్షణం?
#19. The theory proposed by Carl Rogers is కార్ల్ రోజర్స్ ప్రతిపాదించిన సిద్దాంతం?
#20. A person attained good personality by developing socially accepted values is his వ్యక్తి సమాజం ఆమోదించే విలువలతో కూడిన ఉన్నత వ్యక్తిత్వాన్ని సంతరించుకోవడం అనేది అతని యొక్క?
#21. According to Erickson the Psychosocial critical situation faced by the children during Adolescence is ఎరిక్ సన్ ప్రకారం ‘కౌమారం’ లో పిల్లలు ఎదుర్కొనే మనోసాంఘీక క్లిష్ట పరిస్థితి?
#22. .“The moral development of a person depends on the person’s cognitive abiliti es” opined by వ్యక్తి నైతిక వికాసం అతని సంజ్ఞానాత్మక సామర్థ్యాలపై ఆధారపడి ఉంటుంది’ అని అభిప్రాయపడినవారు?
#23. According to Erickson the Psychosocial critical situation, ‘Initiative Vs Guilt’ is present in the children of this age group. ఎరిక్ సన్ ప్రకారం ‘చొరవ Vs అపరాదం’ అనే సాంఘీక క్లిష్ట పరిస్థితి ఈ వయసు పిల్లలలో ఉంటుంది?
#24. The third stage in the order of language development is బాషా వికాస దశల వరుస క్రమంలో మూడవ దశ?
#25. The learning theory proposed by Carl Rogers is కార్ల్ రోజర్స్ ప్రతిపాదించిన అభ్యసన సిద్దాంతం?
#26. A person knowing what am I and what type of person I am – is called his వ్యక్తి తానేమిటి, తను ఏరకమైన వ్యక్తి అని తెలుసుకోవడం అనేది ఆ వ్యక్తి యొక్క?
#27. Psycho Social Development theory was proposed by మనో సాంఘీక వికాస సిద్దాంతన్ని ప్రతిపాదించినవారు?
#28. One of the following statement is wrong according to Noam Chomsky నోమ్ చామ్ స్కీ ప్రకారం కింది వానిలో సారికాని ప్రవచనం?
#29. This was not stated by Erickson with regard to Psycho Social Critical situation ఎరిక్ పేర్కొనిన మనో సాంఘీక క్లిష్ట పరిస్థితికి సంబంధించినది?
#30. According to Erickson, the psychosocial critical situation faced by the children during play age is ఎరిక్ సన్ ప్రకారం ‘క్రీడా దశలో’ పిల్లలు ఎదుర్కొనే మనోసాంఘీక క్లిష్ట పరిస్థితి?
#31. Main aspect of Chomsky’s theory చామ్ స్కీ సిద్దాంతం యొక్క ముఖ్య అంశం?
#32. Name the Psychologist who proposed language acquisition theory ‘బాషా గ్రహణ సిద్దాంతంను’ ప్రతిపాదించిన మనోవిజ్ఞాన శాస్త్రవేత్త?
#33. Main aspect of Chomsky’s theory చామ్ స్కీ సిద్దాంతం యొక్క ముఖ్య అంశం?
#34. Individual’s ability to understand his own strengths and weaknesses is known as వ్యక్తి తన బాలలను, బలహీనతలను గురుంచి తెలుసుకొనే సామర్థ్యం కలిగి ఉండటం?
#35. Erickson has developed his theory basing on this Psychologist’s theory ఈ మనోవిజ్ఞాన శాస్త్రవేత్త సిద్దాంతం ఆధారంగా ఎరిక్ సన్ తన సిద్దాంతాన్ని ప్రతిపాదించాడు?
#36. In order to develop the social development among the learners, teachers should know the.. అభ్యాసకులలో సాంఘికాభివృద్దిని పెంపొందించుటకు ఉపాధ్యాయుడికి తెలిసి ఉండవలసినది?
#37. This type of environment is suitable for emotional development of children... పిల్లల ఉద్వేగ వికాసంను పెంపొందించుతకు ఇది సరైన పరిసరం?
#38. Traditional way of teaching grammar was opposed by సాంప్రదాయ పద్దతిలో వ్యాకరణ బొదనను వ్యతేరికించిన వారు?
Also read : రక్షక తంత్రాలు