Universal Grammar Theory – సార్వత్రిక వ్యాకరణ సిద్దాంతము

YouTube Subscribe
Please Share it

Universal Grammar Theory – సార్వత్రిక వ్యాకరణ సిద్దాంతము

నోమ్ చొమస్కీ అమెరికాకు చెందిన యూదుల కుటుంబంలో 1928 లో జన్మించాడు. పెన్సిల్వేనియా విశ్వవిద్యాలయంలో ఆధునిక భాషా బోధన పై పరిశోధనలు చేశాడు. 1960 దశకంలో Developmental Psycho-Linguistics  అనే అంశంపై అనేక పరిశోధనలు నిర్వర్తించారు. 1964 సంవత్సరంలో Aspects of theory of syntax అనే గ్రంధాన్ని రచించారు.

సాంప్రదాయ భాషా బోధనా పద్ధతులను ఖండించి, పిల్లలలో భాషా వికాసం ఏవిధంగా కలుగుతుందో తెలుసుకునే ప్రయత్నంలో, భాషా వికాస సిద్ధాంతాన్ని ప్రతిపాదించారు.  చొమస్కీ పేర్కొన్న సార్వత్రిక వ్యాకరణ సిద్ధాంతము చాలా ప్రాచుర్యం పొందింది.

శిశువు పుట్టిన తర్వాత భాషను అనుకరణ ద్వారా నేర్చుకుంటానని బండురా వంటి వారు, నిబంధన ద్వారా నేర్చుకుంటానని స్కిన్నర్ లాంటివారు, చెప్పిన సాంప్రదాయ భాషా సిద్ధాంతాలు అన్నిటినీ వ్యతిరేకిస్తూ, శిశువు పుట్టుకతోనే అంతర్గతంగా భాషా సామర్థ్యాన్ని అనువంశికంగా కలిగి ఉంటాడు అని, మిగిలిన సామర్థ్యాల వలె తగిన వయస్సు వచ్చేసరికి సహజ వివర్తనం ద్వారా భాషా వికాసము జరిగిపోతుందని చొమస్కీ కొత్త నూతన భాష సిద్ధాంతమును ప్రతిపాదించారు. Universal Grammar Theory

ఈయనను ఆధునిక భాషా శాస్త్ర పితామహుడిగా (Father of Modern linguistics) పిలుస్తారు. భాష అభ్యసించే సామర్థ్యము శిశువుకు స్వాభావికంగానే వస్తుంది.

చొమస్కీ ప్రకారము శిశువుకు జన్మతః భాష ఆర్జిత సామర్థ్యము, (Language Acquisition Device ) కలిగి ఉంటాడు. మానవ మెదడులో అనేక సామర్థ్యాలు ఉన్నాయి. వాటిలో భాష ఆర్జిత సామర్థ్యం ఒకటీ.

శిశువు ఏ భాషా పరిసరంలో లో పెరుగుతాడో, ఆ భాషను ఆర్జించే విధంగా అతని పెరుగుదల వికాసం రూపుదిద్దుకుంటుంది.

భాష అనేది ఒక ఆర్జించే ప్రక్రియ అంతేకానీ భాష అనేది అభ్యసన ప్రక్రియ కాదు.

చొమస్కీ ప్రకారము గణితము, డ్రైవింగ్ మొదలైనవి అభ్యసించాలి అంటే శిక్షణ బోధన అవసరము కానీ భాష శిశువుకు స్వాభావికంగా అభ్యసించి గలుగుతాడు.

శిశువు కూర్చోవడం, నిలబడడం, నడవటం, జన్మత సిద్ధిస్తుంది. అదేవిధంగా భాషకు సంబంధించి వినడం మాట్లాడడం అనే  సామర్థ్యాలు కూడా స్వాభావికంగానే వస్తాయి.

వినడం మాట్లాడడం అనువంశికత ద్వారా వస్తే చదవడము, వ్రాయడము అభ్యాసము ద్వారా వస్తాయి.

చొమస్కీ తన సార్వత్రిక వ్యాకరణ సిద్ధాంతంలో ప్రతిపాదించిన మరొక అంశం, మాతృ భాషకు సంబంధించి శిశువు పుట్టుకతోనే సార్వత్రిక వ్యాకరణ అంశాలు ఆర్జించే సామర్థ్యము పొందగలుగుతాడు. ఉదాహరణకు మొదటి నాలుగు నెలలలో శిశువు తనకు ఇష్టం వచ్చిన రీతిలో శబ్దాలు చేస్తాడు.

4-12 నెలల మధ్యలో శిశువు ముద్దు పలుకులు  పలుకుతాడు. ఆ పలుకులను మొదట హల్లులు ఆ తర్వాత అచ్చులు ఉపయోగిస్తాడు.

ఒక సంవత్సరం నుండి ఒకటిన్నర సంవత్సరం మధ్యలో శిశువు తల్లి తండ్రులను అనుకరించడం ద్వారా పదాలు అనుకరిస్తాడు. శిశువు పదాలలో మొదట నామవాచకాలు ఆ తర్వాత భాషా విభాగాలు ఉపయోగిస్తాడు. ఒకటిన్నర సంవత్సరం తర్వాత శిశువు శబ్దాలను గ్రహించి వినడం, మాట్లాడడం, జరుగుతుంది. పాఠశాల వాతావరణంలో చదవడము వ్రాయడము అభ్యసించ గల్గుతాడు.

ప్రతి శిశువు యొక్క భాష అర్జన కు కారణం పుట్టుకతోనే తన మెదడు లో LAD ను అనువంశికంగా కలిగి ఉండటమే అని చొమస్కీ తెలిపారు.

LAD అనగా Language Acquisition Device అనగా భాష ఆర్జిత పరికరము లేదా, భాషా గ్రహణ పరికరము. ఇది మానవ మెదడు లో మాత్రమే ఉంటుంది. ఇతర ఏ జీవి మెదడులోనూ ఉండదని అందుకే ఇతర ఏ జీవులు కూడా భాషను నేర్చుకోలేక పోతున్నాయని భావించాడు. 

LAD  యొక్క సామర్థ్యమునుబట్టి ఒక వ్యక్తి వివిధ రకాలైన భాషలను నేర్చుకోగలుగుతాడని చొమస్కీ భావించాడు

చొమస్కీ నాలుగు రకాల వ్యాకరణముు లనుప్రవేశపెట్టాడు.

Universal grammar/ సార్వత్రిక వ్యాకరణం

Transformational grammar/ రూపాంతర వ్యాకరణం

Formal grammar/నియత వ్యాకరణం

Generative grammar./ఉత్పాదక వ్యాకరణం 

 

Results

#1. భాషా వికాసం జరిగే క్రమంలో చివరి దశ ?

#2. పిల్లల మేధస్సులో భాషా గ్రహణ పరికరం ఉంటుంది’ అని అభిప్రాయ పడినవారు ?

#3. భాషా వికాసంలో మొదటి దశ ?

#4. భాషా వికాసం దశలో వరుస క్రమంలో మూడవ దశ ?

#5. ‘శిశువు భాషా గ్రహణ ఉపకరణం'(LAD) తో జన్మిస్తాడని వ్యక్తీకరించిన మనోవిజ్ఞాన శాస్త్ర వేత్త

#6. నోమ్ చామ్ స్కీ ప్రకారం ప్రతి వ్యక్తిలో ఉండే భాగము ?

#7. చోమస్కీ సిద్ధాంతం యొక్క ముఖ్య అంశం ?

#8. భాషా వికాసంలో తొలి దశ ?

#9. మనం ఉచ్చరించే శబ్దాలు క్రమాన్ని నిర్ణయించేది ?

#10. “Father of modern linguistics” అని ఎవరిని పిలుస్తారు ?

#11. ఎవరి ప్రకారం 10 సంవత్సరాల నాటికి శిశువు సుమారు 34,000 పాదాలు నేర్చుకోగల్గుతాడు ?

#12. చోమస్కీ ప్రకారం శిశువులలో భాషార్జన సామర్ధ్యం గరిష్టంగా జరిగే కాలము ?

#13. భాషాభ్యసనంలో నమూనాలకు అధిక ప్రాధాన్యత ఇచ్చిన మనోవిజ్ఞానవేత్త ?

#14. భాషా వికాసం లో సకరాత్మక,నకారాత్మక పునర్బలనాలను ముఖ్యమైన ఉద్దీపనలుగా పేర్కొన్న వారు ?

#15. భాషను శిశువు నేర్చుకోవటంలో పునర్బలనం లేకుండా అనుకరణం సాధ్యపడదని పేర్కొన్నవారు ?

#16. ఈ క్రింది వానిలో సరికానిది ?

#17. చామస్కీ భాషార్జాన చేసే యంత్రాలుగా పిల్లల్లో ఏ అవయవానికి పోల్చాడు?

#18. అప్పుడే పుట్టిన శిశువు లో కనిపించని స్కిమాట?

#19. సాంశీకరణంలో శిశువు పరిసరాలను తనకు అనుకూలంగా మలచుకుంటే కాని ఈ క్రింది సందర్భంలో శిశువు పరిసరాలకు తగ్గట్టుగా మారుతాడు?

#20. వ్యక్తిలో నైతిక వికాసం బాగా అభివృద్ధి చెందే కొద్ది ఈ స్వభావంలో మార్పు జరుగుతుంది?

#21. TET కోచింగ్ లో భాగంగా సైకాలజీ ఉపాధ్యాయుడు విద్యార్థులను ఒక ప్రశ్న అడిగితే విద్యార్థులందరు ఒక్కసారిగా మాకు ఆప్షన్ ఇవ్వండి వాటిని చూసి గుర్తు పడతాము అని చెప్పగా ఆ విద్యార్థులను పియాజే ప్రకారం ఏ దశలోని వారిగా మనం చెప్పవచ్చు?

#22. బైక్ పై బాగా అల్లరి చేస్తున్న అజయ్ కు వాళ్ళ నాన్న తన ముందు వెళ్తున్న కారులో వెనుకభాగంలో టెడీబేర్ లాంటి సింహం బొమ్మను చూపి అదిగో అక్కడ సింహం ఉంది చూడు అనగానే భయపడి నిశ్శబ్దంగా బైక్ పై కూర్చుంటే ఇది ఏ భావనగా చెప్పవచ్చు?

#23. అప్పుడే పుట్టిన శిశువు లో కనిపించని స్కిమాట?

Previous
Finish

 Also read : మనో సాంఘిక వికాశ సిద్దాంతము

రక్షక తంత్రాలు

ప్రజ్ఞా సిద్దాంతాలు

వైయుక్తిక భేదాలు


Please Share it

Leave a Comment

error: Content is protected !!